
పూర్ణ
పూర్ణ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరి’. ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ యాన్ ఇన్నోసెంట్ లేడీ’ అన్నది ఉపశీర్షిక. కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్‌టై¯Œ మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న ‘సూపర్ మచ్చి’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘నాటకం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహిస్తున్న ‘సుందరి’ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. అర్జున్ అంబటి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఖుషి, కె. రాంరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీవల్లి చైతన్య, సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: బాల్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment