Actress Poorna Gives Clarity About Her Marriage News, Deets Inside - Sakshi
Sakshi News home page

జూన్‌లోనే పెళ్లి అయిపోయింది.. ఆ కారణంతో ఎవరూ రాలేకపోయారు!

Oct 23 2022 3:43 AM | Updated on Oct 23 2022 12:58 PM

Actress Poorna Gives Clarity About Marriage News - Sakshi

బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి పూర్ణ. ఇంతకుముందు మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా నటించిన ఈ కేరళ భామ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తోంది. పలు టీవీ కార్యక్రమంల్లోనూ పాల్గొంటున్న పూర్ణ ప్రేమ, పెళ్లి గురించి రకరకాల ప్రచారం చాలా కాలంగానే జరుగుతూ వచ్చింది. ప్రేమ పేరుతో ఒక ముఠా తనను మోసం చేసిందని ఆ మధ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది.

అదేవిధంగా ఈమె ప్రేమలో పడిందని త్వరలో పెళ్లికి సిద్ధమవుతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. అలాంటిది ఎట్టకేలకు ఇటీవల తనకు ప్రియుడు ఉన్నాడనే విషయాన్ని ఇద్దరూ దిగిన పొటోలతో సహా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఈమె ప్రియుడు పేరు ఆసీఫ్‌ అలీ. ఇతను అరబ్‌ దేశానికి చెందిన వ్యాపారవేత్త. అయితే పూర్ణ, ఆసిఫ్‌ అలీ ప్రేమ బ్రేకప్‌ అయిందనే ప్రచారం కూడా ఇటీవల జరిగింది.

ఏదేమైనా ప్రస్తుతం పూర్ణ, ఆసీఫ్‌ అలీ దుబాయ్‌లో ఉన్నారు. దీని గురించి నటి పూర్ణ ఓ భేటీలో పేర్కొంటూ తమ వివాహ నిశ్చితార్థం ఈ ఏడాది మే నెల 31న జరిగిందని జూన్‌ నెల 12వ తేదీన దుబాయ్‌లో పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిందని చెప్పింది. దేశ సమస్య కారణంగా పలువురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేక పోయారని, దీంతో త్వరలో కేరళలో వివాహ రిసెప్షన్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దుబాయ్‌లో ఓ నాట్య పాఠశాలను ప్రారంభించనున్నట్లు చెప్పింది. ఇది తన చిరకాల కోరిక అని నటి పూర్ణ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement