
నితిన్
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో నితిన్ ఉంటారు. ప్రస్తుతం ‘భీష్మ: ది బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక తన బ్యాచిలర్ స్టేటస్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలిసింది. మే నెలలో నితిన్ వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలిసింది. నితిన్ చేసుకోబోయే అమ్మాయి పేరు షాలినీ అని, ఇది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అని భోగట్టా. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించారట ఇరు కుటుంబ సభ్యులు.
Comments
Please login to add a commentAdd a comment