ప్రవాసాంధ్రునితో ప్రేమ | an NRI youth's love story | Sakshi
Sakshi News home page

ప్రవాసాంధ్రునితో ప్రేమ

Published Sat, Sep 7 2013 11:13 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ప్రవాసాంధ్రునితో ప్రేమ - Sakshi

ప్రవాసాంధ్రునితో ప్రేమ

ఓ లక్ష్యంతో హైదరాబాద్‌కి వచ్చిన ప్రవాసాంధ్ర యువకుడు ప్రేమలో ఎలా పడ్డాడు? చివరకు తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన అవరోధాలేంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూ పొందుతోన్న చిత్రం ‘నువ్వలా... నేనిలా’. వరుణ్‌సందేశ్, పూర్ణ జంటగా నటిస్తున్నారు. ‘మేం వయసుకు వచ్చాం’ఫేం త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు.
 
  ఇందూరి రాజశేఖరరెడ్డి నిర్మాత. ఒక పాట మినహా ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను అక్టోబర్ తొలివారంలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ఇదొక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరి. వేదం, కృష్ణం వందేజగద్గురుమ్ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన జ్ఞానశేఖర్ కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన బలం.
 
  వరుణ్‌సందేశ్, పూర్ణ ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఓ దృశ్యకావ్యంగా త్రినాథరావు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు’’అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఉదయ్ భాగవతుల, నిర్మాణ నిర్వహణ: పాలకుర్తి శ్రీధర్‌గౌడ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement