కెమెరామన్ కస్టడీలో ఉన్నానా? | Actress Poorna love with Bharani | Sakshi
Sakshi News home page

కెమెరామన్ కస్టడీలో ఉన్నానా?

Published Fri, Dec 5 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

కెమెరామన్ కస్టడీలో ఉన్నానా?

కెమెరామన్ కస్టడీలో ఉన్నానా?

 సాధారణంగా వదంతుల నుంచి ఏ నటి తప్పించుకోలేరేమో. ప్రేమ, పెళ్లి, రొమాన్స్ లాంటి ప్రచారాల్లో హీరోయిన్ల పేర్లు దొర్లుతునే ఉంటాయి. నిజాలు నిలకడ మీద తెలియక మానవు. వదంతులను సదరు నటీమణులు ఖండిస్తుండడం అనేది కూడా మామూలైపోయింది. నటి పూర్ణ విషయానికొస్తే ఇప్పటికే ఈ భామపై పలు రకాల వదంతులు హల్‌చల్ చేశాయి. తాజాగా ఈ మలయాళీ బ్యూటీ టాలీవుడ్ ఛాయాగ్రాహకుడు భరణితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్టు వీరిద్దరూ త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.
 
 పూర్ణ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిస్తూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందారు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెమెరామన్ కస్టడీలో ఉన్నట్లు సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పూర్ణ కాల్‌షీట్స్ పారితోషికం వ్యవహారాలను ఈ కెమెరా మన్ చూసుకుంటున్నారని టాక్. అయితే అందరూ హీరోయిన్ల మాదిరిగానే పూర్ణ కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. ఈ వ్యవహారంపై ఈ బ్యూటీ స్పందిస్తూ తాను కెమెరా మన్ భరణి కలిసి ఇప్పటి వరకు ఒక చిత్రం కూడా చేయలేదన్నారు. ఆయన్ను ఒకటి రెండు సార్లు మాత్రమే కలుసుకున్నానని అంది.
 
 అదీ ఒక చిత్రం గురించిన చర్చల్లో భాగంగానేనని తెలిపారు. తాను తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించడం వలన హైదరాబాదులోనే ఎక్కువ కాలం గడుపుతున్నానని చెప్పారు. ఇటీవల చెన్నైకి వచ్చిన మరుసటి రోజే హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయానన్నారు. స్టార్ హోటళ్లకు కూడా వెళ్లడం లేదని అలాంటిది భరణితో షికార్లు అని ప్రచారం చేయడం అన్యాయం అని వాపోయారు. తాను భరణిని ప్రేమిస్తున్నాననడం ఎంత అసత్యమో తన కాల్‌షీట్స్ వ్యవహారాలు తను చూస్తున్నారనడం కూడా అంతే అవాస్తవం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement