ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Bhari Taraganam And Suvarna Sundari 2023 Movies Released In OTT, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

OTT Movies Telugu: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి రెండు మూవీస్.. కాకపోతే అదే విచిత్రం!

Published Tue, Mar 12 2024 8:34 AM | Last Updated on Tue, Mar 12 2024 10:32 AM

 Bhari Taraganam And Suvarna Sundari 2023 Movie OTT Streaming Details - Sakshi

ఓటీటీలు వచ్చిన తర్వాత మూవీ లవర్స్‌కి సినిమాలు చూడటం చాలా సులభమైపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా సినిమాల్ని ఆదరిస్తున్నారు. ఇందకు తగ్గట్లే ఓటీటీలు కూడా స్టార్ హీరోల మూవీస్‌తో పాటు చోటామోటా చిత్రాల్ని కూడా కొనేస్తున్నాయి. కాకపోతే స్ట్రీమింగ్‌‌లోకి మాత్రం చాలా ఆలస్యంగా తీసుకొస్తున్నాయి. అలా గతేడాది థియేటర్లలోకి వచ్చిన రెండు సినిమాలు ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి రిలీజైపోయాయి.

(ఇదీ చదవండి: 'మళ్లీ చూస్తానో లేదో'.. కన్నీళ్లు పెట్టిస్తున్న నటి పావలా శ్యామల మాటలు!)

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సువర్ణ సుందరి'. దాదాపు నాలుగైదేళ్లుగా షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం.. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథని సరిగా డీల్ చేయలేదు. దీంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు దీన్ని అమెజాన్ ప్రైమ్‪‌లోకి తీసుకొచ్చేశారు.

గతేడాది జూన్‌లో రిలీజైన 'భారీ తారాగణం' సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోక వచ్చేసింది. ఐదుగురు వేర్వేరు అమ్మాయిల జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీశారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాల్ని దీన్ని లైట్ తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ రెండింటిని దాదాపు ఏడాది తర్వాత ప్రైమ్‌లోకి తీసుకొచ్చారు. కానీ రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుండటమే విచిత్రంగా అనిపించింది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement