చిన్న సినిమా బతకాలి | magnet movie pre release event | Sakshi
Sakshi News home page

చిన్న సినిమా బతకాలి

Published Thu, Mar 14 2019 5:44 AM | Last Updated on Thu, Mar 14 2019 5:44 AM

magnet movie pre release event - Sakshi

సాక్షీ చౌదరి, అభినవ్‌

‘‘ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు ఒకప్పుడు చిన్న చిత్రాలు తీసినవారే. చిన్న సినిమా బతకాలి. ప్రేక్షకులు చిన్న సినిమాలను సపోర్ట్‌ చేయాలి. ప్రతి ఆర్టిస్ట్‌ ప్రచారంలో భాగం అయితేనే ఆ సినిమా స్థాయి ఏంటో ప్రేక్షకుడికి అర్థమవుతుంది’’ అన్నారు  నిర్మాత సి.కల్యాణ్‌. సాక్షీ చౌదరి, అభినవ్‌ సర్దార్‌ జంటగా ఆది శేషసాయి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాగ్నెట్‌’. లార్డ్‌ శివ క్రియేషన్స్‌పై ఎం.శివారెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆది శేషసాయి రెడ్డి మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రులు పట్టించుకోకపోతే పిల్లల జీవితాలు ఎలా నాశనం అవుతాయి? అనేది ముఖ్యకథ’’ అన్నారు. సంగీత దర్శకుడు కిషన్‌ కావాడియా, కెమెరామేన్‌ తోట వి. రమణ, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్, రచయిత వెలిగొండ శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement