Magnet
-
కుకింగ్ చేస్తే రైస్‘పుల్లింగ్’!
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్–3 పేరుతో హైదరాబాద్‌లో ఒకరిని బురిడీ కొట్టించి రూ. 3 కోట్లు కొల్లగొట్టిన రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ కేటుగాళ్ల మోడస్ ఆపరెండీని సీసీఎస్ పోలీసులు వివరించారు. సాధారణ చెంబు, బిందెలకు అతీంద్రియశక్తులు ఉన్నాయంటూ నమ్మించి నిండా ముంచడం వారి శైలి అని... సాధారణ చెంబు/బిందెను ‘రైస్‌పుల్లర్’గా మార్చడానికి ‘కుకింగ్’ చేస్తుంటారని పేర్కొన్నారు. అమోఘ శక్తులంటూ... రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్లు అందినకాడికి దండుకుంటుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటికి చేజిక్కించుకుంటే అమోఘ మైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. సాధారణంగా కేటుగాళ్లు కస్టమర్లకు రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలనే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న పాత్రలను చూసే అవకాశం కొనే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించాలని కోరితే మాత్రం చూపిస్తారు. ఇలాంటి ముఠాలు బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్లీ బియ్యంలా కనిపించేలాగా చేస్తారు. అనంతరం రైస్‌పుల్లర్‌గా పేర్కొనే పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచంకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో కూడిన బియాన్ని ఉంచితే అది దానికి అతుక్కుంటుంది. ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకుంటుంటారని పోలీసులు వివరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారేనని పోలీసులు చెబుతున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటకతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్, డబుల్ ఇంజిన్‌గా పిలిచే రెండు తలల పాములతో మోసాలు చేసే ముఠాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దొంగ సర్టిఫికేషన్లు రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. వాటి కేంద్రంగానే కొన్ని ఉపకరణాలను కలిగి ఉండి ఆయా రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్లు నటిస్తూ ఆయా ఉపకరణాలు నిజమైనవనేలా సర్టిఫికేషన్ ఇచ్చేస్తుంటారు. ఇదంతా దాన్ని కొనే వారి ఎదురుగానే జరుగుతుంది. ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇకపై ఇంకెవరూ మోసపోకుండా అప్రమత్తం చేసిన వాళ్లవుతారని చెబుతున్నారు. కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం పోలీసులు అరెస్టు చేసిన విజయ్‌కుమార్, సాయి భరద్వాజ్, సంతోష్, సురేందర్‌లను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులు నిర్ణయించారు. -
దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? ఒక సారి మీ సబ్బు సంగతి తేల్చండి
సువాసన అంటే కేవలం మనుషులు మాత్రమే ఇష్టపడతారు అనుకుంటే పొరపాటే!. ఎందుకంటే దోమలు కూడా వివిధ రకాల సువాసన గల పువ్వులను ఇష్టపడతాయట. అందువల్ల మనం ఉపయోగించే సువాసన గల సబ్బులే దోమలు కుట్టడానికి ప్రధాన కారణం అంటున్నారు పరిశోధకులు. ఈ మేరకు వర్జీనియా టెక్ పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని రకాల సువాసన గల సబ్బులు దోమలను బాగా ఆకర్షిస్తే.. కొన్ని సబ్బుల వాసనకు దోమలు దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడవని చెబుతున్నారు. It may have something to do with your body's natural odor, your diet, and even your choice of soap. https://t.co/zpf9WuWZUS — @wideopenspaces (@wideopenspaces) June 9, 2023 పరిశోధకుల బృందం ఈ విషయమై వాలంటీర్ల సహాయంతో సబ్బులు, దోమల ఆకర్షణ గురించి అధ్యయనం చేసింది. ఈ పరిశోధనల్లో కొన్ని రకాల సబ్బులు దోమల ఆకర్షణని పెంచితే మరికొన్ని తగ్గించాయి. మన శరీరం నుంచి వచ్చే సహజ వాసనలు, ఈ సబ్బుల నుంచి వచ్చే సువాసనల మధ్య జరిగే చర్య ఫలితంగా మరింతగా మన శరీరం నుంచి వాసన వెదజల్లుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో దోమలు ఈ వాసనకు ఆకర్షించబడి కుడుతున్నట్లు తేల్చారు. Research Revealed Scented Soaps Attract Mosquitoes Learn more: https://t.co/P7t1krTH6e Credit: @virginia_tech @USDA @USDA_NIFA #mosquitobites #ScentedSoaps #soapchemicals #healthcare #meded #eMednews — eMedEvents (@eMedEvents) June 12, 2023 ఈ మేరకు పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో పువ్వులు, పండ్ల వాసనతో కూడిన సోప్‌లకు దోమల ఎక్కువగా ఆకర్షించబడుతున్నట్లు తేలింది. వాటికి ఆహారమైన రక్తం లభించనప్పుడు మొక్కల్లో ఉండే తేనెతో ఆకలిని భర్తీ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో మనం వాడే సబ్బుల కారణంగా వాటి నుంచి వచ్చే సువాసనకు దోమలు ఎట్రాక్ట్ అయ్యి కుడుతున్నట్లు వెల్లడించారు. ఐతే కొబ్బరి సువాసన గల సబ్బుని దోమలు ఇష్టపడవని, అందువల్ల వాటితో స్నానం చేస్తే దోమలకు దూరంగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు. అదీగాక కొబ్బరినూనె సహజ నిరోదకం లాంటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరి సువాసన వచ్చే నూనె లేదా సబ్బులను ఉపయోగించవచ్చునని పరిశోధకులు అధ్యయనంలో వెల్లడించారు. (చదవండి: నిత్యం వంటింట్లో ఉపయోగించే వాటితో..గుండెలో బ్లాక్స్‌కి చెక్‌పెట్టండి ఇలా..) -
చిన్న సినిమా బతకాలి
‘‘ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు ఒకప్పుడు చిన్న చిత్రాలు తీసినవారే. చిన్న సినిమా బతకాలి. ప్రేక్షకులు చిన్న సినిమాలను సపోర్ట్ చేయాలి. ప్రతి ఆర్టిస్ట్ ప్రచారంలో భాగం అయితేనే ఆ సినిమా స్థాయి ఏంటో ప్రేక్షకుడికి అర్థమవుతుంది’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. సాక్షీ చౌదరి, అభినవ్ సర్దార్ జంటగా ఆది శేషసాయి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాగ్నెట్’. లార్డ్ శివ క్రియేషన్స్‌పై ఎం.శివారెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఆది శేషసాయి రెడ్డి మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రులు పట్టించుకోకపోతే పిల్లల జీవితాలు ఎలా నాశనం అవుతాయి? అనేది ముఖ్యకథ’’ అన్నారు. సంగీత దర్శకుడు కిషన్ కావాడియా, కెమెరామేన్ తోట వి. రమణ, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్, రచయిత వెలిగొండ శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టు కట్టు
కంచి పట్టుచీర కట్టుకున్నప్పుడు... మెరుపు జరీతో మేనిని చుట్టుకున్నప్పుడు కళ్లు రంజించేలా కంజీవరం శారీ చేసే, మ్యాజిక్కు మంత్రముగ్ధులైపోవాల్సిందే. కట్టుకుంటే మాగ్నిఫిసెంట్! ఆకట్టుకోవడంలో మ్యాగ్నెట్!! ఇంతకు మంచి ఏదైనా చెప్పాలా... కంచి కథే వేరు... ఆ పట్టు కనికట్టే వేరు! రాణీ పింక్ చీరకు బంగారు రంగు పెద్ద అంచు ప్రధాన ఆకర్షణ. చీరంతా బంగారు వర్ణపు చెక్స్ రావడంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సింపుల్ డిజైన్ అనిపిస్తూ గ్రాండ్‌గా లుక్‌తో వెలిగిపోతున్న పల్లూ ఈ చీరకు అదనపు హంగుగా చేరింది. మస్టర్డ్, పచ్చ రంగులతో చూపు తిప్పుకోనివ్వని విధంగా ఉన్న ఈ పట్టుచీర కట్టుకుంటే మాటల్లో చెప్పలేని సౌందర్యంతో మెరిసిపోవాల్సిందే! రెండు రంగుల అంచులు, మామిడిపిందెల సెల్ఫ్ డిజైన్, చిన్న చిన్న బుటా ఈ చీర వైభవాన్ని వెయ్యింతలు చేస్తున్నాయి. వివాహ వేడుకలకు కళను తీసుకువచ్చేవి పట్టుచీరల రెపరెపలే! బంగారు రంగులో మెరిసిపోతున్న పెద్ద అంచు ముదురు ఎరుపు రంగు కంజీవరం పట్టుచీర పెళ్లికి ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. చీరంతా బంగారు జరీ బుటీ, అంచు మీద సంప్రదాయ డిజైన్ చూపరుల కళ్లను కట్టిపడేస్తాయి. కలల్లో సాక్షాత్కరించిన మహాలక్ష్మి కళ్లముందు కనిపిస్తే మన ఇంటి అమ్మాయిగా ఇలా రూపుకడుతుంది. బంగారు, పచ్చ రంగు అంచులతో గంధం రంగు పట్టుచీర.. దానిపైన మెజెంటా రంగు పువ్వుల సెల్ఫ్ డిజైన్... వర్ణించనలవి కాని సౌందర్యం వివాహవేడుకలో ప్రత్యేకం.