Your Soap Could Make You More Attractive To Mosquitoes - Sakshi
Sakshi News home page

దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? ఒక సారి మీ సబ్బు సంగతి తేల్చండి

Published Tue, Jun 13 2023 3:09 PM | Last Updated on Tue, Jun 13 2023 3:35 PM

Soap Could Be One Of The Reason More Attractive Mosquitoes - Sakshi

సువాసన అంటే కేవలం మనుషులు మాత్రమే ఇష్టపడతారు అనుకుంటే పొరపాటే!. ఎందుకంటే దోమలు కూడా వివిధ రకాల సువాసన గల పువ్వులను ఇష్టపడతాయట. అందువల్ల మనం ఉపయోగించే సువాసన గల సబ్బులే దోమలు కుట్టడానికి ప్రధాన కారణం అంటున్నారు పరిశోధకులు. ఈ మేరకు వర్జీనియా టెక్‌ పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని రకాల సువాసన గల సబ్బులు దోమలను బాగా ఆకర్షిస్తే.. కొన్ని సబ్బుల వాసనకు దోమలు దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడవని చెబుతున్నారు.

పరిశోధకుల బృందం ఈ విషయమై వాలంటీర్ల సహాయంతో సబ్బులు, దోమల ఆకర్షణ గురించి అధ్యయనం చేసింది. ఈ పరిశోధనల్లో కొన్ని రకాల సబ్బులు దోమల ఆకర్షణని పెంచితే మరికొన్ని తగ్గించాయి. మన శరీరం నుంచి వచ్చే సహజ వాసనలు, ఈ సబ్బుల నుంచి వచ్చే సువాసనల మధ్య జరిగే చర్య ఫలితంగా మరింతగా మన శరీరం నుంచి వాసన వెదజల్లుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో దోమలు ఈ వాసనకు ఆకర్షించబడి కుడుతున్నట్లు తేల్చారు.

ఈ మేరకు పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో పువ్వులు, పండ్ల వాసనతో కూడిన సోప్‌లకు దోమల ఎక్కువగా ఆకర్షించబడుతున్నట్లు తేలింది. వాటికి ఆహారమైన రక్తం లభించనప్పుడు మొక్కల్లో ఉండే తేనెతో ఆకలిని భర్తీ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో మనం వాడే సబ్బుల కారణంగా వాటి నుంచి వచ్చే సువాసనకు దోమలు ఎట్రాక్ట్‌ అయ్యి కుడుతున్నట్లు వెల్లడించారు.

ఐతే కొబ్బరి సువాసన గల సబ్బుని దోమలు ఇష్టపడవని, అందువల్ల వాటితో స్నానం చేస్తే దోమలకు దూరంగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు. అదీగాక కొబ్బరినూనె సహజ నిరోదకం లాంటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరి సువాసన వచ్చే నూనె లేదా సబ్బులను ఉపయోగించవచ్చునని పరిశోధకులు అధ్యయనంలో వెల్లడించారు. 

(చదవండి: నిత్యం వంటింట్లో ఉపయోగించే వాటితో..గుండెలో బ్లాక్స్‌కి చెక్‌పెట్టండి ఇలా..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement