Soap
-
సబ్బు ఎంత పనిచేసింది?
బనశంకరి: అనుకోకుండా సబ్బుపై కాలు పెట్టిన మహిళ మూడంతస్తుల భవనంపై నుంచి కిందికి పడింది. ఆమెను కాపాడడానికి భర్త ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన బెంగళూరులోని డీజే హళ్లి ప్రాంతంలో రెండురోజుల కిందట చోటుచేసుకోగా శనివారం ఆ వీడియో వైరల్ అయ్యింది.ఎలా జరిగిందంటే..వివరాలు... డీజే హళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కనకనగరలో ఓ భవనంపై రుబాయ్ (27) అనే మహిళ, ఆమె భర్త కలిసి బట్టలు ఉతుకుతున్నారు. ఆమె బట్టలు ఆరవేస్తూ సబ్బుపై కాలు పెట్టడంతో జారి కిందికి పడబోయింది. ఆమె భర్త చేయి పట్టుకుని రక్షించే ప్రయత్నం చేయగా సబ్బు వల్ల చేతులు జారుడుగా ఉండడంతో సాధ్యం కాలేదు. వారిద్దరి ఆర్తనాదాలు విని కింద రోడ్డుపై పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. ఆమె భర్త చేతుల నుంచి జారి కిందపడే సమయంలో ఓ కిటికీని పట్టుకుని కొన్ని క్షణాలు ఉండింది, కానీ మళ్లీ కిందకు పడిపోయింది. నేరుగా కింద రోడ్డుపై నిలిపిన బైక్‌ల మీద పడిపోయింది, జనం చేతులు అడ్డుపెట్టి పట్టుకునే యత్నం చేసినా ఫలితం లేదు. కాళ్లు, తలకు తీవ్ర గాయాలపాలైన మహిళను కొందరు వెంటనే సమీపంలోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!
కొన్ని పురాతన భవనాలు శిథిలావస్థకు చేరుకుంటే అధికారులు కూల్చేస్తారు. ఇది సర్వసాధారణం. అలాంటి ఓ పురాతన భారీ హోటల్ కట్టడం కూడా శిధిలావస్థకు చేరుకోవడంతో కూల్చేయాలనుకున్నారు అధికారులు. ఎప్పటి నుంచే కూల్చేస్తామని ఆ హోటల్‌కి నోటీసులు వచ్చాయి కూడా. అయితే ఆ భవంతి నిర్మాణం అత్యంత పురాతనమైనదే గాక చాలా భారీ కట్టడం కూడా అది. అలాంటివి కూల్చితే మళ్లీ అదే రీతిలో పునర్నిర్మించటం కూడా కష్టమే!. ఆ చారిత్రక భవనాన్ని కూల్చడానికి మనసొప్పని ఓ కంపెనీ దాన్ని కొనుగోలు చేయడమే గాక మరొక ప్రదేశానికి చెక్కు చెదరకుండా తరలించాలనుకుంది. అదెలా సాధ్యం అనిపిస్తోంది కదా!.పైగా అంత పెద్ద కట్టడం తరలించడం మాటలు కూడా కాదు. మరేలా చేసిందంటే...? ఆ చారిత్రాత్మక కట్టడం కెనడాలో ఉంది. ఈ కట్టడాన్ని సుమారు 1826లలో నిర్మించారు. దీని పేరు హాలిఫాక్స్ ఎల్మ్వుడ్ భవనం. ఆ తర్వాత దీన్ని 1896లో విక్టోరియన్ ఎల్మ్వుడ్ హోటల్‌గా మార్చారు. ఇది 2018 నుంచి శిథిలావస్థ స్థితిలోకి చేరవవ్వుతోంది. దీంతో కెనడా అధికారులు ఆ పురాతన కట్టడాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అది నగరంలో ఉన్న పురాతన భారీ కట్టడం. దీంతో చాలామంది ఈ నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో గెలాక్సీ ప్రాపర్టీస్ అనే కంపెనీ దాన్ని కొనుగోలు చేసి తరలించేందుకు ముందుకు వచ్చింది. అంతేగాక ఈ చారిత్ర నిర్మాణాన్ని కొత్త ప్రదేశానికి తరలించేలా ప్రణాలికలు కూడా సిద్ధం చేసింది. అయితే ఈ భారీ నిర్మాణం దాదాపు 220 టన్నుల బరువు ఉంటుంది. సాధారణ రోలర్‌తో కదిలిస్తే భవనానికి నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు. దీంతో వారు ఐవరీ సబ్బుతో తయారు చేసిన సొల్యూషన్ బార్లను ఉపయోగించి తరలించాలని అనుకున్నారు. అయితే ఆ సబ్బు కడ్డీలకు ఉండే మృదు స్వభావం ఆ భవనాన్ని చెక్కు చెదరకుండా సజావుగా తరలించడంలో చక్కగా ఉపయోగపడింది. మొత్తం మీద కంపెనీ సిబ్బంది ఈ భవనాన్ని దాదాపు 700 బార్ సోప్‌లు, రెండు ఎక్స్కవేటర్లు, ఒక ట్రక్కు సాయంతో విజయవంతంగా 30 అడుగుల వరకు లాగింది. అంతేగాదు ఆ హోటల్ని మరోక పునాదిపై ఉండిచ అపెర్ట్మెంట్కి కనక్ట్ చేయాలని చూస్తోంది ఆ కంపెనీ. భవిష్యత్తులో ఇలాంటి చారిత్రక భవనాలను రక్షించుకునేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ. అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేసింది. (చదవండి: మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే షాకవ్వుతారు!) -
సబ్బుతో స్కిన్ క్యాన్సర్‌కి చెక్..14 ఏళ్ల బాలుడి సరికొత్త ఆవిష్కరణ
క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిందే. బాగా డబ్బుంటే విదేశాల్లో పేరుగాంచిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని బయటపడుతుంటారు ప్రముఖులు, సెలబ్రెటీలు. అలాంటి భయానక క్యాన్సర్ వ్యాధుల్లో ఒకటి ఈ స్కిన్ క్యాన్సర్. అలాంటి స్కిన్ క్యాన్సర్‌ని తక్కువ ఖర్చుతోనే ఈజీగా నయం చేసేలా ఓ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికాడు ఓ టీనేజర్. ఈ ఆవిష్కరణతో ఆ యువ శాస్త్రవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఎవరా టీనేజర్? ఏమిటా ఆవిష్కరణ..?. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని వర్జీనియాకు చెందిన 14 ఏళ్ల హేమన్ బెకెలే స్కిన్ క్యాన్సర్‌ని జయించేలా సబ్బుని కనిపెట్టాడు. అది కూడా తక్కువ ఖర్చతోనే నయం అయ్యేలా రూపొందించాడు. ఈ సబ్బు ధర కేవలం రూ. 800/-. ఈ సరికొత్త ఆవిష్కరణగానూ ఆ బాలుడు టాప్ యంగ్ సైంటిస్ట్‌గా అవార్డును గెలుచుకున్నాడు. ఈ సబ్బు అందరికీ అందుబాటులో ఉండేలా ఆ బాలుడు లాభప్రేక్షలేని ఓ సంస్థను కూడా స్థాపించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ బాలుడికి ఈ ఆవిష్కరణను కనుగొనడానికి త్రీఎం డిస్కవరరీ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్తల సలహాదారు డాక్టర్ మహ్ఫుజా అలీ సాయం చేశారు. బెకెలేకి జీవశాస్త్రం, సాంకేతికపై మంచి ఆసక్తి. ఇదే ఈ ఆలోచనకు పురిగొల్పింది. అదే అతడిని యూఎస్‌లో ఏటా నిర్వహించే 2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్‌లో పాల్గొనేలా చేసింది. దాదాపు తొమ్మిది మంది పోటీ పడిన ఈ చాలెంజ్‌లో అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్‌గా విజయం కైవసం చేసుకుని దాదాపు రూ. 31 లక్షల ఫ్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఇథియోపియాకు చెందిన బెకెలే తాను అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతుండటం చూశానని చెప్పుకొచ్చాడు. అప్పుడే దీన్ని నయం చేసేలా ఏదైనా కనిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. దీనికి ఈ ఛాలెంజ్ పోటీనే సరైన వేదికగా భావించానని చెప్పుకొచ్చాడు. ఇక బెకెలే రూపొందించిన ఈ సబ్బు పేరు స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్. ఈ సోప్ చర్మాన్ని రక్షించే డెన్డ్రిటక్ కణాలను పునరుద్ధరింంచి, స్కిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతుందని బెకెలే పేర్కొన్నాడు. అదీగాక ఇంతవరకు మార్కెట్లో స్కిన్ క్యాన్సర్‌కి సంబంధించి క్రీమ్‌లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయని, సబ్బుని ఉపయోగించడం ఇదే తొలిసారి అని యంగ్ ఛాలెంజ్ ప్రెజెంటేషన్ ప్యానల్ వివరించాడు బెకెలే. సమాజానికి తన వంతుగా సాయం అందించేలా ఈ స్కిన్ క్యాన్సర్‌ని అతి తక్కువ ఖర్చుతోనే జయించేలా తాను కనుగొన్న ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రపంచానికి ఓ కొత్త ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నానని ప్యానెల్ సభ్యులకు వివరించాడు బెకెలే. (చదవండి: అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్) -
వాట్! సబ్బు తినడం ఇష్టమా? చివర్లో ట్విస్ట్ అదిరిపోలా..!
ఎన్నో వైరల్ వీడియోలు చూసుంటాం. చాలా విభిన్నంగా ఓ రేంజ్లో నెటిజన్లు కట్టేపడేసి వీడియోలు ఉంటాయి. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. పైగా దానికి ఇచ్చిన క్యాప్షన్ చూస్తేనే షాకింగ్‌గా ఉంది. ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూస్తే చివర్లో ఉన్న ట్విస్ట్ దిమ్మతిరిగేలా ఉంది. ఇంతకీ ఈ వీడియోలో ఏ ముందుంటే..ఓ చిన్నది తనకు సబ్బులు తినడం ఇష్టం అంటూ ఓ ఫేమస్ బ్రాండ్ సబ్బును చేతిలోకి తీసుకుంది. మరో చేత్తో లిక్విడ్ హ్యండ్ వాష్ పట్టుకుంది. ఈ రెండింట్లో ఏది టేస్ట్ బావుంటుంది అంటూ..ఆమె ఆ సబ్బుని ఏదో చాక్లెట్‌ని తింటున్నంతగా ఇష్టంగా లాగించేస్తుంది. నిజంగా సబ్బేనా అలా ఎలా తినేస్తుందరా బాబోయ్! అన్నట్లుగా టెన్షన్‌గా చూస్తుంటే..చివరల్లో ఓ చిన్న ట్విస్ట్.. ఓస్ ఇదేనా అనిపిస్తుంది. ఆ వీడియో చివర్లో ఆ సబ్బుని కట్ చేసి చూపిస్తున్నప్పుడూ అసలు విషయం అర్థమవుతుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసిన నెటిజన్లు సబ్బుని తినడం ఏంట్రాబాబు అని అనుకున్నాం. ఊహించుకుంటేనే ఏదోలా అనిసించింది. థ్యాంక్ గాడ్ హమ్మయా! అది కేక్ అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Suchi Dutta (@21b_kolkata) (చదవండి: ఈ మోడల్ ధరించిన కాస్ట్యూమ్ చూస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!) -
దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? ఒక సారి మీ సబ్బు సంగతి తేల్చండి
సువాసన అంటే కేవలం మనుషులు మాత్రమే ఇష్టపడతారు అనుకుంటే పొరపాటే!. ఎందుకంటే దోమలు కూడా వివిధ రకాల సువాసన గల పువ్వులను ఇష్టపడతాయట. అందువల్ల మనం ఉపయోగించే సువాసన గల సబ్బులే దోమలు కుట్టడానికి ప్రధాన కారణం అంటున్నారు పరిశోధకులు. ఈ మేరకు వర్జీనియా టెక్ పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని రకాల సువాసన గల సబ్బులు దోమలను బాగా ఆకర్షిస్తే.. కొన్ని సబ్బుల వాసనకు దోమలు దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడవని చెబుతున్నారు. It may have something to do with your body's natural odor, your diet, and even your choice of soap. https://t.co/zpf9WuWZUS — @wideopenspaces (@wideopenspaces) June 9, 2023 పరిశోధకుల బృందం ఈ విషయమై వాలంటీర్ల సహాయంతో సబ్బులు, దోమల ఆకర్షణ గురించి అధ్యయనం చేసింది. ఈ పరిశోధనల్లో కొన్ని రకాల సబ్బులు దోమల ఆకర్షణని పెంచితే మరికొన్ని తగ్గించాయి. మన శరీరం నుంచి వచ్చే సహజ వాసనలు, ఈ సబ్బుల నుంచి వచ్చే సువాసనల మధ్య జరిగే చర్య ఫలితంగా మరింతగా మన శరీరం నుంచి వాసన వెదజల్లుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో దోమలు ఈ వాసనకు ఆకర్షించబడి కుడుతున్నట్లు తేల్చారు. Research Revealed Scented Soaps Attract Mosquitoes Learn more: https://t.co/P7t1krTH6e Credit: @virginia_tech @USDA @USDA_NIFA #mosquitobites #ScentedSoaps #soapchemicals #healthcare #meded #eMednews — eMedEvents (@eMedEvents) June 12, 2023 ఈ మేరకు పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో పువ్వులు, పండ్ల వాసనతో కూడిన సోప్‌లకు దోమల ఎక్కువగా ఆకర్షించబడుతున్నట్లు తేలింది. వాటికి ఆహారమైన రక్తం లభించనప్పుడు మొక్కల్లో ఉండే తేనెతో ఆకలిని భర్తీ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో మనం వాడే సబ్బుల కారణంగా వాటి నుంచి వచ్చే సువాసనకు దోమలు ఎట్రాక్ట్ అయ్యి కుడుతున్నట్లు వెల్లడించారు. ఐతే కొబ్బరి సువాసన గల సబ్బుని దోమలు ఇష్టపడవని, అందువల్ల వాటితో స్నానం చేస్తే దోమలకు దూరంగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు. అదీగాక కొబ్బరినూనె సహజ నిరోదకం లాంటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరి సువాసన వచ్చే నూనె లేదా సబ్బులను ఉపయోగించవచ్చునని పరిశోధకులు అధ్యయనంలో వెల్లడించారు. (చదవండి: నిత్యం వంటింట్లో ఉపయోగించే వాటితో..గుండెలో బ్లాక్స్‌కి చెక్‌పెట్టండి ఇలా..) -
'గాడిద పాల సబ్బు వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు'
లక్నో: బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ స్టేట్మెంట్కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు వాడితే మహిళలు చాలా అందంగా అవుతారని మేనకా గాంధీ అన్నారు. ఈజిప్టుకు చెందిన ప్రఖ్యాత రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలలోనే స్నానం చేసేదని పేర్కొన్నారు. దీంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 'గాడిద పాలతో తయారు చేసిన సబ్బు ధర ఢిల్లీలో రూ.500 ఉంది. మనం కూడా గాడిద పాలు, మేక పాలతో సబ్బులు తయారు చేయడం ఎందుకు ప్రారంభించకూడదు?. లద్దాక్‌కు చెంది ఓ కమ్యూనిటీ గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వెల్లడించింది. అందుకే గాడిద పాలను వారు సబ్బుల తయారీకి వాడుతున్నారు. గాడిద పాలతో చేసిన సబ్బును వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు.' అని మేనకా గాంధీ అన్నారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/AlvguCEgE5— Shahzad Khan (@Shahzadkhanjou) April 2, 2023 చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
క్లియోపాత్ర వాటితోనే స్నానం చేసింది!: మేనక గాంధీ వ్యాఖ్యలు వైరల్
బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ గాడిద పాల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ మేరకు ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో గాడిద పాల సబ్బులు మహిళలను ఎల్లప్పుడూ అందంగా ఉంచుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆమె ఆ వీడియోలో..గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళల సౌందర్యాన్ని పెంచుతాయని, ఈజిప్టు రాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసిందని అన్నారు. పైగా ఢిల్లీలో గాడిద పాలతో చేసిన సబ్బు ఒక్కొక్కటి రూ. 500 ధర పలుకుతుందని చెప్పారు. లడఖ్ కమ్యూనిటీ కూడా గాడిద పాలతోనే సబ్బులు తయారు చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లే గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. అదీగాక చాకలివాళ్లు కూడా గాడిదలను వినయోగించడం లేదని అన్నారు. లడఖ్‌లోని కమ్యూనిటీ సంఘం కూడా గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్ల గుర్తించిందని తెలిపారు. తన ప్రసంగంలో పెరుగుతున్న ఖర్చుల గురించి కూడా ప్రస్తావించారు..చెట్లు అంతరించిపోతున్నాయని, అందువల్లే కలప ఖరీదు పెరిగిపోయిందన్నారు. దీంతో దహన సంస్కారాల ఖర్చులు కూడా పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల పేద ప్రజలు మరణంలో సైతం తమ కుంటుంబికులను నిర్థాక్షిణ్యంగా వదిలేస్తున్నారని చెప్పారు. దహన సంస్కరాలకు కలపను/ఆవు పేడను వినియోగిస్తే అయ్యే ఖర్చుల వ్యత్యాసాన్ని సైతం విపులంగా వివరించారు మేనకా గాంధీ. అయితే తన ఉద్దేశ్యం ప్రజలు జంతవుల నుంచి డబ్బు సంపాదించమని కాదని, ఐనా ఈనాటికి మేకలు, ఆవులు పెంచుతున్న వారెవరూ ధనవంతులు కాలేదని చెప్పారు. అయినా మన వద్ద తగిన సంఖ్యలో వైద్యులు కూడా అందుబాటులో లేరని అన్నారు. సుమారు 25 లక్షల మంది ఉండే సుల్తాన్‌పూర్‌లో కనీసం ముగ్గురు డాక్టర్లు కూడా లేరని, కొన్నిసార్లు అంతమంది కూడా ఉండరని చెప్పుకొచ్చారు. గెదె, మేక జబ్బు పడితే లక్షలు ఖర్చు పెడతారు, పైగా ఆడవాళ్లను కూడా పశుపోషణలో చేయమని అడుగుతాం. అయితే వారు ఎంతవరకు చేయగలరు. అందుకే తాను మేక లేదా ఆవు పెంపకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. దీంతో మీరు సంపాదించాలంటే దశాబ్దం పడుతుంది. పైగా ఆ జంతవు ఒక్క రాత్రిలో చనిపోతుంది. దీంతో అప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుందంటూ మేనకా గాంధీ చాలా విచిత్రంగా ప్రసంగించారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"इनकी सुंदरता की राज आजा के सामने आई जो गधे के दूध से बनी और गोबर से बनी साबुन का प्रोडक्ट यूज करती हैं ◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/rXW1aY1t6o — AZAD ALAM (@Azad24906244) April 2, 2023 (చదవండి: కాంగ్రెస్ ఫైల్స్ అంటూ వీడియో రిలీజ్ చేసిన బీజేపీ) -
నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా!
ఊరికే ఆ ద్వారం నుండి ఈ ద్వారం వరకు, ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు ఇంటిలోనుండి బయటికి బయటి నుండి ఇంట్లోకి అలా పరిగెడుతూ ఉంటానా, తలుపు పక్కనున్ను బియ్యం గచ్చులో చేయి పెట్టి ఇంత బియ్యం జేబులోకి, మరింత బియ్యం నోట్లో వేసుకుని నములుతూ ఉంటే బియ్యం ఎంత తియ్యగా ఉండేదో. పచ్చి బియ్యమే అంత తియ్యగా ఉంటే ఇంటి బయట కట్టెల పొయ్యి మీద, మట్టి కుండలో వెలుతురూ, గాలి తగులుతూ గంజి వార్చి వండిన అన్నం ఇంకెంత రుచిగా ఉండాలి? గంజి అంటే గుర్తుకు వచ్చింది. నాకు ఊహ తెలిసి కార్టూన్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకున్న వ్యాఖ్యా-బొమ్మల తొలి కార్టూను గంజి మీదే. పొలీసాయన చాకలాయన్ని గద్దిస్తూ ఉంటాడు. ఏమిరా అప్పిగా ! నా నిక్కరుకి గంజి పెట్టి ఇస్త్రీ చేయమన్నానా, గంజి పెట్టలేదే?" "మా ఇంట్లో తాగనీకే గంజి లేదు దొరా, ఇక నీ నిక్కరకు ఏమని పెట్టేది?" అప్పుడు అది చూసి భలే నవ్వుకున్నాం కానీ కాస్త ఆకలి, కాస్త గంజి మెతుకులు అనే పెద్ద మాటలు బుర్రకు పట్టాకా’అయ్యో! అనిపించింది. అలా గంజి వార్చి వండిన వేడి వేడి అన్నంలో చాలా నెయ్యి పోసి, ఎర్రపప్పు , ఎర్రెర్ర ఆవకాయ ఊర్పు కొంచెం కలిపి చిన్న చిన్న ఆవకాయ ముక్కలని గిల్లి ముద్దలుగా కట్టి కథలు చెబుతూ తినిపించేది మా జేజి. పప్పన్నం అయ్యాక పాలు చక్కర అన్నమో లేదా పెరుగన్నంలో బెల్లం ముక్కలు కలిపి తినిపిస్తే దానితో స్వస్తి. కథల్లోకి అన్నం నంజుకుంటున్నామా. అన్నం లోకి కథలు నంజుకుంటున్నామా అనేది విషయం కానే కాదు అది నాంది. అన్నం బావుండేది. కథలూ బావుండేవి. అయితే ఆ చిన్నప్పుడు బావోనివి కూడా ఉంటాయని తెలీదు కాబట్టి, బావున్నవి అప్పుడు బావున్నాయనే విషయం కూడా తెలీదు. పెరిగి పెద్దయ్యాకా ఈ ఇంటి వంట ఈ ఇంటి వంట ఆ హోటలు వంట ఈ రెస్టారెంట్ వంట తినవలసి వచ్చినపుడు అక్కడ కూర బావుంటుంది, ఇక్కడ చారు బావుంటుంది, ఆ ఇంటి వాళ్ళు పచ్చడి బాగా చేస్తారు, మా ఇంట్లో మటన్ మహత్తరం అనే సింగులర్ అప్రిషియేషన్సే అమృతం అనే భావనకు దిగ పడిపోయా. ఒకసారి మధ్యాహ్నం ఆకలి సమయాన మదరాసులో ఒక హోటలు వైపు దారి తీశారు మహా గొప్ప చిత్రకారులు సురేష్ గారు. బయట వేడిగా ఉన్నా, లోపల గాలి చల్లగా వీస్తుంది. అరవ సర్వర్ గారు వచ్చి అరిటాకు పరిచారు. వరుసగా పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. తినడం మొదలు పెట్టా, తఠాలున వెలిగింది రుచి అనేది. ఆ రుచికి నెమలీకమీది తడి పచ్చదనంలా ఉంది అరటి ఆకు తళ్ళెం. అరటి పొలం మీదికి పొగ మంచు వచ్చి కొబ్బరి కోరులా కురిసినట్లుగా ఉంది తెల్లని అన్నం. గంగమ్మ శివుడి నెత్తి మీది నుండి జాలువారుతుండగా ఒక పక్క పాయ కుంకుమ తడిసిన రంగులో అన్నాన్ని తడుపుతుంది చారు. మరో పాయ తెల్ల విభూదితో కలిసిన మజ్జిగ ధార. నక్షత్రాలు చాలా తెలుసు కానీ తెల్లని నెలవంక ఒకటేగా, నూనెలో వేగి వంకర తిరిగిన చల్ల మిరపకాయలన్నీ చంద్ర వంకలే! ఆ కూరా, ఈ పచ్చడి, అక్కడ అప్పడం, ఇక్కడ నెయ్యి, వేలు ముంచి నోటి దాకా ఎత్తిన తీపి... ఏది తిన్నా బావుందే! ఎంత తిన్నా బావుందే! ఇది కదా భోజనం అంటే, సంపూర్ణం అంటే. ఇంతకాలం భోజనం అని, అన్నం అని పేరు పెట్టుకుని ఏం తింటున్నాం? దశాబ్దాలుగా తిండిముందు సర్దుకు పోతున్నాం అంతే. ప్రపంచంలో చాలా మందికి ఈ మాత్రం అన్నం కూడా గతిలేదు అని సర్దుకుపోయి బావుంది, బాలేదు అనే మాటలే మర్చిపోయాం. మంచి భోజనం మాదిరిదే మంచి కథ కూడా, గొప్ప కథ కూడా, అద్భుతమైన కథ కూడా. భోజనం మొత్తంలో అన్నమొక్కటి బావున్నట్టో, కూర బావున్నట్టో, చారు మజ్జిగ లేదా మజ్జిగ పులుసు బావున్నట్టో, ఏదో ఒకటి బావుంటే అది చాలులే అనుకునేట్టు అయిపోయింది కథా కాలం. వొస్తువు కొత్తగా ఉంది కదా? ఇతివృత్తం మంచిది ఎన్నుకున్నాడు, శిల్పం చూశావా? ఆ శైలి ఉందే! అబ్బో!! వచనంలో నడక కొత్త దారి దొక్కింది. ఈ కాలం మరీ అన్యాయం, కథ ఏవుందిలే! కథ రాసి వడ్డిస్తున్న పిల్లను చూడు, కత్తి కదూ! దేనికదేగా బావున్నాయి. మొత్తంగా బావుందో లేదో తెలీదు, తెలుసుకోవాలసిన అక్కరలేదు. ఈ రోజు బావుందని అనుకుంటున్న కథను అసలు కళ్లకద్దుకుని మళ్లా మళ్లా చదువుతున్నామా అసలు? నాకై నేను కథని వెదుక్కుని చదువుకుని ఎంత కాలం అయ్యింది? బలివాడ కాంతారావు గారి బయ్యన్న మాదిరి కథ ఒకటి వచ్చి గుండెలో మెత్తగా పడుకుని ఎంత కాలం అయ్యింది? అయితే ఒక అదృష్టమున్నది భోజనమైతే రోజూ తినాలి, మంచిది ప్రతి రోజూ దొరక్క పోవచ్చు, బ్రతకడానికి ఏదో ఒకటి తిని బ్రతకాలి తప్పదు. అయితే కథలు మాత్రం కొత్త వాటి కొరకు ఎదురు చూడనక్కరలేదు, ప్రపంచంలో కథావాంగ్మయం అనేది ఒకటి పాతది చాలా తయారయ్యి ఉంది. మళ్ళా మళ్ళా చదువుకునెందుకు చాలా దయతో గొప్ప కథని దానం చేసి పోయిన కథకులు చాలా మందే ఉన్నారు. తరగని కథ చాలా ఉంది. కొత్త కథల కొరకు ఎదురు చూడాల్సినంత కథ ఏమీ తరిగిపోలేదు తరిగేదల్లా చదవడానికి సమయం లేని మన వయసు. ఉండండి, పాత కాలంలోకి పరిగెత్తి పోవాల్సిన శ్రమ తెలియకుండా మీకు ఒక కథ చెబుతాను రండి. నార్మన్ గార్డ్స్ బై అనే మనిషి వచ్చి పార్క్ లో వచ్చి కూచుని మనుషులకేసి చూస్తున్నాడు. అది సంధ్యా సమయం. ఆయన దృష్టిలో సంధ్యా సమయం అంటే మనుషులు పగలంతా పోరాడి ఓడిపోయిన తమ అదృష్టాలను, చనిపోయిన తమ నమ్మకాలను చేతనయినంతవరకు లెక్కలు చూసుకునే సమయం, ఈ రోజుకు ఇక మనం మరణించి రేపటి పోరాటానికి మరలి పుడదామనుకుంటూ వంగిపోయిన భుజాలతో ఆశలు అడుగంటిన కళ్లతో బరువుగా ఇంటి వైపుకో, సారా కొట్టుకొ సాగే సమయం. వారిని చూస్తూ ఉంటే నార్మన్ గార్డ్స్ బై కళ్లకు ఈ లోకమనే ఆనందక్షేత్రంలో హక్కుగా ఉండవలసిన వాళ్ళెవరూ కనపట్టం లేదు. నిజానికి ఈ ఓడిపోయిన వాళ్లల్లో తనని తాను కూడా ఒకడిగా లెక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు గార్డ్స్ బై. అతనికి పోయిన గంటు అంటూ ఏమీ లేదు, డబ్బుకు కొదువా లేదు. అయినా మనిషి అనేవాడికి సంతోషపడ్డానికి ఒక కారణం కావాలి కానీ దిగాలు పడ్డానికి కారణం అవసరం లేదు, కారణం లేకపోయినా దుఖ కారణం కోరి తెచ్చుకునేంత సమర్దత ఒక మనిషిలో మాత్రమే ఉంటుంది. సరే, గార్ద్స్ బై పక్క బెంచి మీదికి ఒక ముసలాయన వచ్చి చేరాడు. ఆయనని చూస్తే మరీ ఘోరంగా ఉన్నాడు. మనిషి కుందించుకు పోయినట్లు, ఆత్మగౌరవం అడుగంటి పోయినట్లు ఉన్నాడు. దిగాలు దరిద్రం దురదృష్టం అనే ముగ్గురమ్మలు వచ్చి మూర్తీభవించిన మూర్తిలా ఉన్నాడు. పాపమని ఒక గులాబి పువ్వును తెచ్చి అతని కోటుకు అలంకరించే ప్రయత్నం చేయండి అలా చేస్తే ఆ పువ్వు బలవంతాన అతని గుండి బొత్తానికి ఉరివేసుకుని చచ్చి పోతానని బెదిరిస్తుంది. అంత దుర్భాగ్యంగా ఉన్నాడు అతను. అతను ఈ ప్రపంచంలోని పరమ ఏడుపుగొట్టు వాళ్లలో ఒకడు. కానీ ఈ ప్రపంచంలో ఒకడయినా అతడి గురించి ఏడుస్తారని మనం ఆశించలేనంత దిక్కుమాలిగా ఉన్నాడు. త్వరగా ఇంటికి వెడితే, ఇంట్లో వాళ్లతో నిద్రపోయే సమయం వరకు ఎక్కువ చీవాట్లు తినాల్సి వస్తుంది కాబటి తక్కువ చీవాట్లు తినడం కోసం వీలయినంత ఆలస్యంగా ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకున్నట్టుగా ఉన్నాడితను అనుకుంటాడు గార్డ్స్ బై. మొత్తానికి ఒక సమయం తరువాత ఆ ముసిలాయన లేచి చీకట్లో కలిసిపోయాడు. అతని వెళ్ళిన కాసేపటికి ఒక యువకుడు వచ్చి ఆ ముసిలాయన ఖాలీ చేసిన బెంచిలో కూచున్నాడు. ఇతని దుస్తులు బావున్నాయి, పైగా మంచి వయసు తాలూకు ఆరొగ్యం. అయితే ముఖంలో మాత్రం అంతకు ముందు మనిషికన్నా ఆనందం ఎక్కువగా ఏ మాత్రం లేదు. గార్డ్స్ బై ఇక ఉండబట్టలేక ఇతనితో మాట కలుపుతాడు. ఏమిటి విషయం, ఎందుకంత నిరాశ అని. ఇతగాడి కథ భలే విచిత్రంగా ఉంది. ఈ రోజే కొత్తగా ఈ ఊరికి పనిమీద వచ్చాడు. టాక్సీ డ్రైవర్ తనని ఇది మంచి హోటల్ అని ఒక హోటలులో దింపి వెళ్లాడు. బస బానే ఉంది. ఆ తరువాత స్నానానికి హోటల్ వారి సబ్బు వాడ్డం ఇష్టం లేక కొత్త సబ్బు కొనుక్కుందామని బయటికి వచ్చాడు. వస్తూ వస్తూ నాలుగు డబ్బులు మాత్రమే జేబులో వేసుకుని మిగతా అంతా తన పెట్టెలో భద్రపెట్టి దిగాడు. సబ్బు ఒకటి కొనుక్కుని ఆ వీధి ఈ వీధి సరదాగా చూసుకుంటూ ఒక బార్ లో దూరి చిన్న డ్రింక్ కూడా తాగాడు, అప్పటికే చీకటి పడింది. బార్ నుండి బయటికి వచ్చాకా అసలు సంగతి అర్థమయ్యింది. అసలే ఊరికి కొత్త . బసకు దిగిన హొటల్ అడ్రస్ గుర్తు పెట్టుకోలేదు, వీధి పేరు అవసరం అనుకొలేదు. సబ్బుకోసం దిగిన వాడు సబ్బు కొని వెనుదిరిగి పోక వీధులు కొలిచే పనిలో పడి, ఉన్న డబ్బుతో తాగి ఇప్పుడు ఈ చీకట్లో దిక్కు తోచక వచ్చి కూచున్నాడు. "ఇది నా కథ, కాబట్టి నా కథని నమ్మి నా పరిస్థితిని దిగమింగగలిగిన మీ వంటి ఏ మంచి మనిషయినా ఎదురయ్యి నాలుగు రాళ్ళు అరువిస్తే ఈ రాత్రి ఈ దగ్గరలోని ఏ హోటల్లోనో తల దాచుకుని, రేపు ఉదయమే నా బస వెదుక్కోగలను" అన్నాడు. "అదేలే! దాందేముందిలే! ఇటువంటి కథలకేం గొడ్డు పోయిందిలే? నువ్వు ఏ సబ్బు ముక్క కొసం ఇన్ని తంటాలు పడ్డావో ఆ సబ్బు ముక్క నాకు చూపిస్తే, నీ చిక్కు తీరిపోదూ" అన్నాడు గార్డ్స్ బై. యువకుడు గబ గబా జేబులు తడుముకున్నాడు, తనమీద తనే కొపడ్డాడు, చిరాకు పడ్డాడు, ఈ గందరగోళంలో సబ్బు ముక్క ఎక్కడో పడిపోయినట్లుంది అని తన దురదృష్టానికి తనే చింతించాడు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) "చూసావా? నువ్వు కథ బాగా చెప్పగలిగావు. నీ మాటల్లో సత్యం, కళ్లల్లో దీనత్వం కొట్టొచ్చినట్లు చూపించగలిగావు. అయితే నువ్వు మరిచి పొయిందల్లా కనబడినవాడికల్లా నీ దీన కథ వినిపించాలనుకోవడానికి ముందుగా ఒక సబ్బు ముక్కను సాక్ష్యంగా తోడు తెచ్చుకోడమే" అన్నాడు గార్డ్స్ బై వెటకారంగా. ఆ యువకుడు ఇదంతా వినదలుచుకోలేదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హాస్యాస్పదంగా నవ్వుకుంటూ గార్డ్స్ బై కూడా అక్కడి నుండి ఇక వెళ్ళిపోదామని లేచాడు. అయితే ఉన్నట్టుండి నేల మీద పడి ఉన్న ఒక పొట్లం ఆకర్షించింది. ఏమిటా అని దానిని అందుకుని చూస్తే, పొట్లం కట్టి ఉన్న సబ్బు బిళ్ళ, అరెరే! ఎంత పని జరిగి పోయింది, అనుకుని ఆ కుర్రాడు వెళ్ళిన దారి వైపు కదిలాడు గార్డ్స్ బై. అదిగో అతను అక్కడున్నాడు. అబ్బాయి నీ నిజాయితికి ఇదిగో సాక్షం దొరికింది. నీ అవసరంపై నా అపనమ్మకాన్ని నువ్వు మన్నిస్తావనే అనుకుంటాను. ఈ డబ్బు పట్టు నా అడ్రస్ కాగితం కూడా. నువ్వు డబ్బు నాకు ఎప్పుడు పంపించినా తొందరలేదు. అదృష్టం నీకు తోడుగా ఉండుగాక. యువకుడు ధన్యవాదాలు చెబుతూ అక్కడి నుండి నిష్క్రమించాడు. ఈ కథ వ్రాసిన వారు హెచ్ హెచ్ మన్రో అనే బ్రిటీష్ రచయిత. కలం పేరు సాకీ. నేను స్కూలు పిల్లవాడిగా ఉన్నప్పుడు సరిగా గుర్తు లేదు కానీ శారదా విద్యామందిరం లోనే నేతాజీ పబ్లిక్ స్కూల్ వారో దీనిని పిల్లలతో ఇంగ్లీష్ లోనే నాటకం వేపించారు. ఒక బ్రిటిష్ కథ మా చిన్న ఊరిలో ఒక చిన్న బడిదాకా ఎట్లా చేరిందా అని నా ఆశ్చర్యం. ఆ మధ్య కె.బి. గోపాలం గారు దీనిని తెలుగులోకి అనువదించారు. కథ ఎలా మొదలవాలి? ఎక్కడ ఆపెయ్యాలి ఈ రెంటి మధ్య ఏం జరగాలి అది ఎంత ఉండాలి అని కదా కథ. ఇక వినండి. "పాపం కుర్రవాడు అన్యాయమైన పరిస్తితులకు దొరికిపోయాడు, అదృష్టవశాత్తు అతని సబ్బు దొరికింది లేకపోతే నేను అతి తెలివితో ఆలోచించినట్లే అతని గోడు విన్న ప్రతి ఒక్కరు నాలా సాక్ష్యం అడిగితే అతనికి మానవ జాతిమీద ఏం నమ్మకం మిగిలేట్లు. "గార్డ్స్ బై కి వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు వెను తిరిగి తను కూచున్న బెంచి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎవరో ఉన్నారు, మోకాళ్ళ మీద వంగి ఏమో చేస్తున్నాడు. (క్లిక్: అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..) 'ఎవరది?" అతను తల తిప్పి చూశాడు, ఇందాకటి దురదృష్ట మొహం పెద్దాయన. ఏమిటండి సంగతి?" "నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా" - అన్వర్ -
ఆన్లైన్లో ఫోన్ ఆర్డర్.. సోపు చూసి షాకైన కస్టమర్!
సాక్షి, ఆదిలాబాద్: ఇంటర్నెట్ వాడకం పెరిగినప్పటి నుంచి ఆన్లైన్ కొనుగోళ్లపై కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే ఏది కావాలన్న కూర్చున్న చోట నుంచే ఆర్డర్ పెడితే చాలు మన ముందుకు వస్తున్నాయి. అయితే ఒక్కోసారి మాత్రం ఒకటి ఆర్డర్ పెడితే ఇంకోటి ప్రత్యక్షమై, కస్టమర్లను కంగారుపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫోన్ బుక్ చేస్తే బట్టల సబ్బు దర్శమిచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో వెలుగు చూసింది. వివరాల ప్రకారం భీమన్న ఆన్లైన్ లోని ఓ యాప్ ద్వారా మొబైల్ కొనుగోలు చేశాడు. అందుకుగాను అతను రూ.6100 చెల్లించి ఫోన్ బుక్ చేసుకున్నాడు. అనుకన్నట్లే ఫోన్ ప్యాక్ చేసిన పార్శిల్ అతని ఇంటికి వచ్చింది. కొత్త ఫోన్ చూద్దామని ఎంతో ఆశగా పార్శిల్ తెరవగా అందులో ఫోన్‌కి బదులుగా బట్టల సబ్బు దర్శనమిచ్చింది. దీంతో భీమన్న షాకయ్యాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని సదరు ఆన్లైన్ సంస్థను విజ్ఞప్తి చేస్తున్నాడు. చదవండి: Amnesia Pub Case: జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన ఐదుగురు నిందితులు.. అందరూ పొలిటికల్ లీడర్ల కొడుకులే -
పార్సిల్లో ఫోన్‌కి బదులు బట్టల సబ్బు దర్శనం
-
సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా?
సాక్షి, మధిర: సాధారణంగా అందరూ స్నానానికి ఉపయోగించే సబ్బు ధర రూ.20 మొదలు రూ.60వరకు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం రూ.96 విలువైన సబ్బులను పంపిణీ చేశారు. ఇదేమిటి, ఇంత ఖరీదైన సబ్బును కార్మికులకు ఇచ్చారా అని ఆశ్చర్యపోతున్నారా! అయితే, సబ్బు విలువైనదేమీ కాదు సాధారణమైనదే. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు కలిసి సబ్బు ధరను అమాంతం పెంచేశారు. కారణమేమిటో పెద్దగా ఆలోచించాల్సిన పనేమీ లేదు కదా?! ‘గణతంత్ర’ వేడుకల్లో పంపిణీ ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె డబ్బాలు, శానిటైజర్లతో పాటు దుస్తులు అందజేయాలని నిర్ణయించారు. ఈమేరకు కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, కమిషనర్ అంబటి రమాదేవి చేతుల మీదుగా వీటిని ఇచ్చేశారు. ఇక వీటి కొనుగోలుకు సంబంధించి బిల్లులను కౌన్సిల్ సమావేశంలో సభ్యులతో ఆమోదించుకుంటేనే చెక్కులు జారీ చేయడం సాధ్యమవుతుంది. చదవండి: కరీంనగర్లో కారు బీభత్సం.. నలుగురు మహిళలు మృతి ఇందుకోసం 31వ తేదీన మధిర మున్సిపల్ సాధారణ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సంబంధించి ఎజెండాలో కొన్ని అంశాలను పొందుపర్చి అధి కార, ప్రతిపక్ష కౌన్సిలర్లకు కాపీలను శనివారం అందజేశారు. ఇక ఈ కాపీలను చూడగానే సభ్యుల కళ్లు బైర్లు కమ్మాయి. ఎందుకంటారా... కార్మికులకు అందజేసిన 675 సబ్బుల కోసం రూ.96చొప్పున మొత్తం రూ.64,800 ఖర్చు చేసినట్లుగా లెక్కల్లో చూపించారు. చదవండి: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు కౌన్సిల్ ఎజెండా కాపీలో సబ్బుల ధర వివరాలు... ఇదేం సబ్బు? ఒక్కో సబ్బును రూ.96 చొప్పున వెచ్చించి కొనుగోలు చేసినట్లు బిల్లు ఉండడంతో సభ్యులు ఇవేం సబ్బులు అంటూ 26వ తేదీన వాట్సప్ గ్రూప్‌ల్లో షేర్ చేసిన ఫొటోలను వెనక్కి వెళ్లి మరీ ఆసక్తిగా పరిశీలించారు. తీరా చూస్తే ఆ ఫొటోలో 100గ్రాముల సంతూర్ సబ్బు కనిపించింది. ఇదే బరువు కలిగిన సబ్బు పంపిణీ చేసి ఉంటే మార్కెట్లో ఒక్కో సబ్బు ఎమ్మార్పీ రూ.33 ఉండగా హోల్‌సేల్‌గా రూ.29.50కు వస్తుంది. ఒకవేళ 125 గ్రాముల బరువు కలిగిన సబ్బు అయితే ఆఫర్ ప్యాక్‌లో నాలుగింటితో పాటు మరో సబ్బు ఉచితంగా వస్తుంది. ఈ ప్యాక్ ఎమ్మార్పీ రూ.190 ఉండగా హోల్‌సేల్‌గా రూ.173కు ఇస్తామని స్థానిక వ్యాపారుల్లో ఎవరిని అడిగినా చెబుతారు. అంటే ఒక సబ్బు ఖరీదు రూ.35లోపు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు మాత్రం కౌన్సిల్ ఎజెండాలో జత చేసి బిల్లులను రూ.96గా చూపించడం గమనార్హం. కార్మికుల పేరిట దోపిడీ కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కుటుంబ సభ్యులకు ఆపద ఉంటుందని తెలిసినా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్నారు. కరోనా మొదటి దశ నుంచి వైరస్ సోకిన వారి ఇళ్ల వద్ద, కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం మొదలు అన్ని పనుల్లో వీరే కీలకంగా నిలుస్తున్నారు. అలాంటిది అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా కార్మికులకు ఇచ్చిన సబ్బులకు కూడా అసలు కంటే ఎక్కువ బిల్లులను మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది. అయితే, ఈనెల 31న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని కౌన్సిలర్లు ప్రశ్నిస్తారా, లేక బిల్లులను ఆమోదిస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఒక్కో సబ్బుకు రూ.96గా బిల్లులు సిద్ధం చేయడంతో పాటు శానిటైజర్లు, కొబ్బరినూనె ధరలను కూడా ఎక్కువగానే చూపినట్లు తెలుస్తుండగా, అజెండా కాపీలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవిని సంప్రదించేందుకు ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!!
సాధారణంగా స్నానం చేసే సబ్బు ఖరీదు ఎంత ఉంటుంది. మహా అయితే రూ. 30, 40 ఉంటుంది. మరీ ఖరీదైంది ఐతే వంద రూపాయలు ఉంటుంది. ఐతే ఈ సబ్బు ఖరీదు వందలు కాదు వేలు అస్సలే కాదు ఏకంగా లక్షల్లో ఉంటుందట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బట కూడా! స్నానం చేసే సబ్బే కదా.. ఏమైనా బంగారంతో తయారు చేశారా? ఎందుకంత ఖరీదని అనుకుంటున్నారా! అవును.. ఇది మామూలు సబ్బు కాదు.. నిజంగానే బంగారంతో తయారు చేస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.. ఎక్కడా తయారు చేస్తారంటే.. లెబానోన్లోని ట్రిపోలీకి చెందిన ఒక కుటుంబం నడిపే సబ్బుల ఫ్యాక్టరీలో ఈ విధమైన సబ్బులు తయారవుతున్నాయి. 15వ శతాబ్ధం నుంచి ఈ విధమైన సబ్బులు వడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఐతే 2013 లో ఈ ఖరీదైన సబ్బులను మొదట తయారు చేశారు. దీనిని ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ లగ్జరీ సబ్బు పేరు ‘ఖాన్ అల్ సబౌన్’ సోస్. బాడర్ హసీన్ అండ్ సన్స్ కంపెనీ కేవలం చేతులతోనే ఈ సబ్బులను తయారు చేస్తుందట. ప్రత్యేకమైన నూనెలు, సహజ సువాసనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి. ఈ కంపెనీ ఉత్పత్తులు కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రత్యేక షాపుల్లో మాత్రమే అమ్ముతారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! బంగారం, వజ్రాల పొడితో తయారీ.. ఈ ఖరీదైన సబ్బుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఒక ఖాన్ అల్ సబౌన్ సబ్బు తయారీకి 17 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, 3 గ్రాముల వజ్రాల పౌడర్‌లో సహజమైన నూనెలు, సహజసిద్ధమైన తేనె, ఖర్జూరం కలిపి తయారు చేస్తారట. చూడ్డానికి అచ్చం జున్ను ముక్కలా ఉంటుందీ లగ్జరీ సబ్బు. దీని ధర కూడా చుక్కల్లో ఉంటుంది. ఒక సబ్బు ఖరీదు అక్షరాల 2 లక్షల 7 వేల రూపాయలు. ఈ సబ్బు ప్రత్యేకత అదే.. ఈ సబ్బు వాడిన వారికి ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఐతే దీనిని రుజువుచేసే ఆధారాలేవీ లేవు. అంత ఖరీదైన సబ్బు వాడేవారు కూడా ఉంటారా? అని అనుకుంటే పొరపాటే. ముఖ్యమైన విఐపీలు, సెలబ్రెటీలు మాత్రమే వీటిని వాడుతారట. ముఖ్యంగా దుబాయ్‌లో నివసించే సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఈ సబ్బులను వాడుతారు. ఆ మధ్య ఖరీదైన వాటర్ బాటిల్ ధర రూ. 45 లక్షల రూపాయలని విన్నాం. ఇప్పుడు రెండున్నర లక్షల స్నానం సబ్బు.. రోజూ వాడే మామూలు వస్తువులకు కూడా ఇంత ధర పలుకుతుందంటే నమ్మలేకపోతున్నాం కదా! చదవండి: Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..! -
ఫోనుకు బదులు సబ్బు, సర్ఫ్.. అమెజాన్‌కు మొట్టికాయ
సాక్షి, ముషీరాబాద్: ఫోనుకు బదులుగా సబ్బు, సర్ఫ్ ను వినియోగదారుడికి అందించిన అమెజాన్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం–2 మొట్టికాయ వేసింది. ఫోన్ విలువతో పాటు రూ.10 వేల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని ఫోరం సభ్యుడు పీవీటీఆర్ జవహర్‌బాబు, ఒక్కింటి నర్సింహారావు, ఆర్.ఎస్.రాజశ్రీలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. హైదరాబాద్ బీకేగూడ పార్కు వద్ద నివసించే ప్రైవేటు ఉద్యోగి అయిన పి.విజయ్‌కుమార్ 2020 డిసెంబర్ 19న అమెజాన్‌లో ఒప్పో సెల్‌ఫోన్‌ను రూ.11,990 చెల్లించి ఆర్డర్ చేశారు. అయితే ఫోనుకు బదులుగా ఒక సబ్బు, సర్ఫ్ ప్యాకెట్‌తో కూడిన పార్సల్ అందింది. వెంటనే విజయ్‌కుమార్ అమెజాన్‌కు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ అమెజాన్ నుంచి స్పందన రాకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై ఆమెజాన్ ఇండియా మేనేజర్, అప్పారియో రిటైల్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్‌కు ఫోరం నోటీసులు జారీ చేసింది. వారి తరుపున హాజరైన న్యాయవాదులు ఫిర్యాదు దారుడికి సరైన సాక్ష్యాలు చూపించక పోవడంతో వినయ్‌కుమార్ చెల్లించిన రూ.11,990లకు 9శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, ఫిర్యాదు దారుడికి కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5వేలు ఫిర్యాదుదారుడికి చెల్లించాలని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం2 ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగులో తీర్పు.. తెలంగాణ వినియోగదారుల ఫోరం సభ్యుడు పీవీటీఆర్.జవహర్‌బాబు, ఒక్కింటి నర్సింహారావు, ఆర్.ఎస్.రాజశ్రీలతో కూడిన బెంచ్ తెలుగులో తీర్పును వెలువరించింది. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు
అసలు సబ్బు అంటే ఎలాగుండాలి.. మంచి కలర్ఫుల్గా ఉండాలి.. ఇది చూడండి.. ఇది కూడా సబ్బేనా.. చూశారుగా ఎలాగుందో.. అయితే.. ఇది చాలా ‘లక్ష’ణమైన సోప్ అట.. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు. ధర కేవలం రూ.2.07 లక్షలు!! ఎందుకంత అని అడిగితే.. ఇందులో 17 గ్రాముల మేలిమి బంగారం, కొన్ని గ్రాముల వజ్రాల పొడి కూడా ఉందని దీన్ని తయారుచేసిన బడేర్ హసన్ అండ్ సన్స్ వాళ్లు చెప్పారు.. వీటితోపాటు అలీవ్ నూన్, ఆర్గానిక్ తేనె, ఖర్జూరం ఇలా చాలావాటిని వేసి.. దీన్ని తయారుచేశారట.. లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన ఈ కుటుంబం హ్యాండ్ మేడ్ సోప్స్, ఖరీదైన సబ్బులు తయారుచేయడంలో పేరెన్నికగన్నవారు.. 15వ శతాబ్దం నుంచీ వీళ్లు ఇదే బిజినెస్‌లో ఉన్నారు. దీన్ని ఈ మధ్య కొందరు ప్రముఖులకు బహుమతిగా ఇచ్చారు.. ఇచ్చినప్పుడు వారి పేరును బంగారంతో ఈ సబ్బుపై చెక్కించి మరీ ఇచ్చారట.. ఇది కొంత మందికే ప్రత్యేకమా.. లేక అందరూ దీన్ని కొనొచ్చా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. క్లారిటీ వస్తే.. కొనే ఉద్దేశం ఉందా ఏమిటి మీకు? చదవండి: (ఆ దేశాల్లో కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు) -
మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే
సాక్షి, శ్రీకాకుళం: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కరోనా కాలంలో చేతుల పరిశుభ్రతపై అందరికీ అవగాహన వచ్చింది. అయితే ఇలాంటి ఆపత్కాలంలోనే కాదు.. ఎల్లవేళలా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు బాల్యం నుంచే దీనిపై అవగాహన పెంచితే చాలా వరకు రోగాలు రాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. నేడు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఈ సందర్భంగా.. ఎందుకు శుభ్రం చేసుకోవాలి..? ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం సబ్బుతో చేతులు శుభ్రపర్చుకోకుంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు టైఫాయిడ్, పచ్చకామెర్లు, కళ్ల కలకలు, దగ్గు, జలుబు, న్యూమోనియా, మెదడు వాపు, చర్మవ్యాధులు వంటి వ్యాధులు కూడా సోకు తాయి. పాఠశాలల్లో విద్యార్థులు చేతుల శుభ్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. వారు వినియోగించే సాక్సులు రోజూ ఉతకడం, నీటి సీసాలు కడగడం వంటివి చేయకపోతే ఫంగస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకోకుండా చూడాలి. ఆటలాడి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కునేలా చర్యలు తీసుకోవాలి. దినసరి కార్యక్రమాల్లోనూ.. రోజు చేతులు మారే కరెన్సీతోపాటు ప్రతి చోటా చేతులు పెట్టడం ద్వారా మనకు క్రి ముల రూపంలో వ్యాధులు సోకే ప్రమా దం ఉంది. వివిధ రకాల రోగాలున్న వారి నుంచి రోగకారక క్రిములు మన చేతికి వస్తున్నందున అవి మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి తలుపులు, ఫ్రిజ్‌ల డోర్లు, కుళాయిలు తిప్పడం, ద్విచక్ర వాహనాల హ్యాండిల్, కంప్యూటర్లు కీబోర్డు వినియోగంలోనూ అప్రమత్తంగా ఉంటూ పరి శుభ్రత పాటించకుంటే తెలీకుండానే రోగాల పాలయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల ఇలాంటి వాటిని పట్టుకున్నప్పుడు తక్షణమే చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మీకు తెలుసా..? చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా 80 శాతం అంటువ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు దూరమవుతాయి. ప్రతి వంద మందిలో పది మందికి వచ్చే అంటువ్యాధులు చేతులు పరిశుభ్రంగా లేకుంటేనే వస్తున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. ఆహారం తీసుకునే ముందు 38 శాతం మంది, లెట్రిన్‌కు వెళ్లి వచ్చిన వారిలో 53 శాతం మంది, వంట చేసే సమయంలో 33 శాతం మంది మాత్రమే చేతులను పరిశుభ్రం చేసుకుంటున్నారని ఓ సర్వేలో తేటతెల్లమైంది. చేతులు శుభ్రం చేసుకోకుండా కంటిని, ముక్కుని, నోటిని తాకడం ద్వారా ప్రాణాంతక కరోనా వైరస్ సోకుతుంది. చేతుల శుభ్రత ఇలా.. ఏటా మన జిల్లాలో సర్వశిక్షాభియాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ చేతుల పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తుంది. చిన్నారుల కు చేతులు శుభ్రం చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తుంది. అరచేతులు, వేళ్ల సందులను సబ్బు లేదా లోషన్‌తో రుద్దుకోవాలి. చేతుల వెనుక వైపు నుంచి వేళ్ల సందుల్లో శుభ్రం చేసుకోవాలి. చేతుల ముని వేళ్లను రుద్దుకోవాలి. చేతుల మణికట్టును బాగా రుద్ది కుళాయి కింద వేళ్లు ఉంచాలి. మురికిపోయే విధంగా శుభ్రం చేసుకోవాలి. చేతి బొటన వేళ్లతో బాగా రుద్ది శుభ్రం చేసుకోవడం ద్వారా చేతులు పరిశుభ్రంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవాలి. లెట్రిన్‌కు, టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన ప్రతి సారి చేతిని శుభ్రం చేసుకోవాలి. హ్యాండ్ శానిటైజర్ వినియోగం తప్పనిసరి. అలా అని శానిటైజర్ రాసిన తర్వా త చేతిని శుభ్రం చేసుకోకుండా ఆహా రం తీసుకుంటే అనారోగ్యం దరి చేరుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారం తీసుకునే ప్రతిసారి రెండు చేతులను కనీసం రెండుసార్లు సాధారణ సబ్బుతో కడగాలి. సబ్బు అందుబాటులో లేనిచోట కనీ సం నీటితో బాగా కడగాలి. కుళాయి ఉంటే ఫోర్స్‌గా తిప్పి చేతులు కడగాలి. కాళ్లు కడగడం కూడా తప్పనిసరి. ఆహారం తీసుకున్న తర్వాత చేతులు కడిగాక, ఉతికిన పరిశుభ్రమైన వస్త్రంతో చేతిని తుడుచుకోవాలి. గోళ్లలో మట్టి చేరకుండా జాగ్రత్తపడాలి. గోళ్లు ఎక్కువైతే కట్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు అయి నా తలస్నానం చేయాలి. దువ్వెనలో మట్టిలేకుండా చూసుకోవాలి. మల విసర్జన తర్వాత తప్పనిసరిగా రెండు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తినే ఆహార పదార్థాలను ముట్టుకునే ముందు, తినే ముందు, పిల్లలకు ఆహారం తినిపించే ముందు ఆహారం తినిపిస్తున్న సమయంలో చేతులు ఇతర పనులకు వినియోగించరాదు. పెంపుడు జంతువులను తాకినప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. అప్పుడే పుట్టిన నవజాత శిశువును తాకే సమయంలో. కంప్యూటర్‌పై వర్క్ చేసిన సమయంలో పక్కనే శానిటైజర్‌తో చేతిని శుభ్రం చేసుకోవాలి. చేతుల పరిశుభ్రత అవసరం చేతుల పరిశుభ్రత అనేది చాలా అవసరం. జనాభా పెరగడంతో పాటు కాలుష్య పరికరాలు వినియోగం పెరిగిపోతుంది. ప్రతి వ్యక్తి చేతిలో 10 మిలియన్ వైరస్‌తో ఒక మిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది. భోజనానికి ముందు, తర్వాత లెట్రిన్, బాత్రూమ్లకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు సబ్బుతో, లోషన్‌తో శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది. ఇలా చేయడం ద్వారా 80 శాతం మేర అంటురోగాలు దరి చేరవు. – డాక్టర్ ఎంసీహెచ్ నాయుడు, సూపరింటెండెంట్, రాజాం సీహెచ్‌సీ ఎంతో ప్రయోజనం చేతుల శుభ్రతతో రోగాల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువగా చిన్నారుల్లో జలుబు, దగ్గు, జ్వరం, నీరసం వంటి వ్యాధులు చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్లనే సంక్రమిస్తుంటాయి. ప్రతి నిత్యం ఆటలాడుకునే చిన్నారులు చేతులు కడగకుండా చిరుతిళ్లు తినడంతోపాటు ఆహారం తీసుకోవడంతో క్రిములు వ్యాపించి రోగాల బారిన పడుతుంటారు. చేతుల శుభ్రత తప్పనిసరిగా చేయడం ద్వారా ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. – ఎం.కోటేశ్వరరావు, చిన్నపిల్లల వైద్యులు, రాజాం అంతర్జాతీయ ప్రమాణాలు.. హ్యాండ్‌వాష్ చేసుకోవడానికి అంతర్జాతీయంగా ప్రమాణాలు ఉన్నాయి. సాధారణ సబ్బుతో గానీ, లిక్విడ్‌తో గానీ చేతులను శుభ్రం చేసుకోవాలి. ముందుగా రెండు అరచేతులను రుద్దుకోవాలి. అదే విధంగా చేతివేళ్ల మధ్య ఉన్న భాగాన్ని శుభ్రం చేసుకోవాలి. చేతి గోళ్లను శుభ్రం చేసుకోవాలి. అరచేతి వెనుక భాగాన్ని బాగా కడగాలి. చేతులను శుభ్రం చేసుకున్నాక పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. – డాక్టర్ ఆర్.స్వాతి, వైద్యాధికారి, ఇచ్ఛాపురం మండలం -
కరోనాను కట్టడి చేసే సబ్బు సంగతులు
కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని అమలాపురం నుంచి అమెరికా దాకా అందరు చెబుతూనే ఉన్నారు. అసలు కరోనాకు సబ్బుకున్న సంబంధం ఏమిటి? మానవ నాగరిక చరిత్రలో సబ్బుకున్న ప్రాధాన్యత ఏమిటి? అసలు దాని పరిణామక్రమం ఎట్టిది? సబ్బుతో చేతులను కడుక్కుంటే చేతుల చర్మ కణాల్లో దాక్కున్న కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు వెలికి వస్తాయి. వాటిని ఆవలికి తోసి పడేస్తుంది. మానవ నాగరికత అంతగా పరిఢవిల్లకముందు అన్నింటిని నీటితోని శుభ్రం చేసేవారు. చమురు అంటిన వస్తువులు, పాత్రలు నీటితో శుభ్రం అయ్యేవి కావు. నీరు, చమురు అణువులు వేటికవే కలసుకుంటాయిగానీ, ఒకదానికొకటి కలవవు. అందుకని చమురును నీటితో శుభ్రం చేయలేం. కొవ్వు కణాలు, కర్రలను కాల్చడం వల్ల వచ్చే బూడిదతోనే చమురును శుభ్రం చేయగలం. సబ్బు పుట్టుక మూలాలు ‘మెసపటోనియా’ నాగరికతలోనే కనిపిస్తాయి. అప్పటి మానవులు ఆవు, మేక లేదా గొర్రెల నుంచి తీసిన కొవ్వుకు, బూడిదను కలిపి సబ్బులాగా ఉపయోగించేవారు. బూడిదలో ‘పొటాషియం హైడ్రాక్సైడ్’ లాంటి పదార్థం ఉంటుంది కనుక చమురుకు వ్యతిరేకంగా పని చేస్తుంది. క్రీస్తు శకం 77వ సంవత్సరంలో రోమన్ స్కాలర్ ప్లినీ ది ఎల్డర్ రాసిన ‘నేచురలీస్ ఇస్టోరియా’ పుస్తకంలో మొదటిసారి సబ్బు గురించి వివరణ ఉంది. ఆవు కొవ్వు, కట్టెల బూడిదతో కలిపి అప్పటి మగవాళ్లు జుట్టుకు పూసుకునే వారట. కొంచెం వెంట్రుకలు ఎరపు రంగులో ఉండేందుకు వారలా ఉపయోగించేవారట. అప్పట్లో ఈ సబ్బుకు ఓ నిర్దిష్ట ఆకారం లేదట. వారు అప్పుడు వూల్ను ఉతికేందుకు కూడా ఈ సబ్బును ఉపయోగించేవారట. గ్రీకులు, రోమన్లు కూడా సామూహిక లేదా బహిరంగ స్నానాల్లో ఒంటికి ఈ సబ్బు పదార్థాన్ని రాసుకునే వారట. ఆ తర్వాత వారిలో ఆలీవ్ ఆయిల్ వాడకం వచ్చిందట. ( అప్పటినుంచే వాడకం..ఆ సబ్బుపై నిషేధం ) మధ్యయుగాల్లో వెజిటబుల్ ఆయిల్‌తో చేసిన బార్ సోపులు అందుబాటులోకి వచ్చాయట. మొట్టమొదట సిరియాలో ఆలీవ్ ఆయిల్ నుంచే తీసిన మరింత సువాసన కలిగిన లారెల్ ఆయిల్‌తో తయారు చేసిన ఆకుపచ్చ బార్ సబ్బు మార్కెట్లోకి వచ్చిందట. బహూశా సబ్బు ఆకారంలో మొదట వచ్చింది అదే కావచ్చు. ‘అలెప్పో సోప్’గా వ్యవహరించే ఆ సబ్బు సంపన్న కుటుంబాలకే పరిమితం అయ్యిందట. ఆ సబ్బును క్రైస్తవ ఆక్రమితులు, వ్యాపారస్థులు యూరప్‌కు పరిచయం చేశారట. ఆ తర్వాత ‘జబాన్ డీ క్యాస్టిల్లా’ (క్యాజిల్ సోప్) ఫ్రెంచి, ఇటాలియన్, స్పానిష్‌లో ప్రాచుర్యం పొంది క్యాజిల్ సోప్‌గా ఇంగ్లీషువారికి పరిచయమైందట. అప్పుడు ఇంగ్లీషు వారు ఎక్కువ దాన్ని టాయ్‌లెట్ సోప్గానే పరిగణించే వారట. 775లో బూడిద, గ్రీస్‌ను ఆవు లేదా మేక కొవ్వుతో కలిపి ఉడికించి మహిళలు సబ్బును తయారు చేసినట్లుగా కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమంలో న్యూయార్క్‌లో 1807లో స్థాపించిన ‘కాల్గేట్’ కంపెనీ, సినిసినట్టిలో 1837లో ఏర్పాటయిన ‘ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్’ కంపెనీలు సబ్బు మూలకాలైన కొవ్వు, బూడిద ప్రమాణాలను తీసుకొని పెద్ద ఎత్తున సబ్బులను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. నాడు కొవ్వొత్తుల తయారీకి కూడా జంతువుల కొవ్వునే వాడేవారు. కొవ్వొత్తులతోపాటు సబ్బులను ఉత్పత్తి చేసే ‘ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్’ కంపెనీ, కావాల్సిన కొవ్వు కోసం ఇళ్లకు, హోటళ్లకు, కటిక వాళ్ల వద్దకు కూలీలను పంపించి సేకరించే వారట. ఆ తర్వాత సబ్బు కంపెనీలు సుగంధ ద్రవ్యాలను, తైలాలను కలిపి రక రకాల సబ్బులను తయారు చేయడం ప్రారంభించాయి. ( 50 మంది వలస కూలీలకు కరోనా ) అలా 1879లో ‘ప్ట్రోక్టర్ అండ్ గ్యాంబుల్’ కంపెనీ మొట్టమొదటి సారిగా సువాసన వెదజల్లే మొట్టమొదటి టాయ్‌లెట్ సోప్‌ను ‘ఐవరీ సోప్’ పేరిట విడుదల చేసింది. ఆ తర్వాత అదే క్రమంలో అమెరికా మిల్వావుకీలోని ‘బీజే జాన్సన్ సోప్ కంపెనీ’ 1898లో సువాసనతో కూడా పామోలివ్ సోప్‌ను విడుదల చేసింది. 1900 దశకంలో పామోలివ్ సబ్బు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.సబ్బుల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించడం పట్ల శాకాహారుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రత్యామ్నాయ ప్రయోగాలపై దృష్టిని కేంద్రీకరించారు. 1909లో వెజిటబుల్ ఆయిల్స్ నుంచే కొవ్వులను తయారు చేయడం కనుగొనడంతో సబ్బుల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రధానంగా జంతువుల కొవ్వుకు బదులుగా ల్యాబుల్లో సృష్టించిన విజిటబుల్ ఆయిల్ కొవ్వుకు పామోలిన్ ఆయిల్తోపాటు కొబ్బరి నూనె, పత్తి నూనె ఇతర మొక్కల నూనెలతోపాటు సెంట్లు, రంగులు, పలు రకాల రసాయనాల మిశ్రమాన్ని కలిపి సబ్బులను తయారు చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం ‘షోవర్ జెల్స్’ లాంటి పెట్రో ఉత్పత్తులను కూడా సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు. మానవాళిపై కరోనా లాంటి మహమ్మారీలు దాడి చేసినప్పుడల్లా సబ్బుల ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. -
ఈ మూడు ప్రతి నగరవాసికి ఓ అలవాటుగా
సాక్షి, సిటీబ్యూరో: సీజనల్ నేరాలు, సైబర్ క్రైమ్, అంతర్రాష్ట్ర ముఠాలు.. పోలీసు విభాగం ఇప్పటి వరకు వీటిపై మాత్రమే విస్తృతంగా ప్రచారం చేసేంది. అయితే కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో సామాజిక బాధ్యతగా వినూత్న క్యాంపెయినింగ్ మొదలెట్టారు. నగరంలో నివసించే ప్రతి ఒక్కరికీ సోప్ (ఎస్), మాస్క్ (ఎం), సోషల్ డిస్టెన్స్ (ఎస్) వినియోగం అలవాటుగా మార్చాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారానికి పోలీసు విభాగం సోషల్ మీడియాను వినియోగిస్తోంది. ఎస్ఎంఎస్పై అవగాహనకు సంబంధించి తొలి స్లైడ్‌ను అధికారులు సోమవారం విడుదల చేశారు. గడిచిన 45 రోజులుగా కరోనా వ్యాప్తి నిరోధం, లాక్డౌన్ అమలు కోసం పోలీసు విభాగం నిర్విరామంగా కృషిచేస్తోంది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టడం నుంచి కంటైన్మెంట్ జోన్ల పర్యవేక్షణ, పాజిటివ్, ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వంటి వారి గుర్తింపు.. ఇలా అనేక విధుల్లో తలమునకలయ్యారు. అయితే కరోనా ఇప్పట్లో పోయేది కాదని, దాంతో సహజీవనం చేయాల్సిందేనంటూ నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం అవగాహన, వ్యక్తగత జాగ్రత్తలతోనే దీన్ని జయించేందుకు ఆస్కారం ఉందని ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ‘ఎస్సెమ్మెస్’ క్యాంపెయినింగ్ మొదలెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారికి మాస్కులు తప్పనిసరంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరంపైనా అవగాహన కల్పిస్తున్నారు. నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ కచ్చితంగా సబ్బుతో వీలైనన్నిసార్లు చేతులు కడుక్కోవడం, బయటకు వచ్చేప్పుడు పక్కాగా మాస్క్ ధరించడం, ఎక్కడైనా ఎదుటి వారితో భౌతికదూరం పాటించడం.. ఈ క్యాంపెయినింగ్లో కీలకాంశాలు. తొలుత శానిటైజర్ల వినియోగాన్ని ఇందులో చేర్చాలని భావించారు. అయితే నగరంలో అన్ని వర్గాలకు చెందిన వారు ఉండటం, ప్రతి ఒక్కరూ వీటిని ఖరీదు చేయడం సాధ్యం కాని నేపథ్యంలో సబ్బు వినియోగానికి ప్రాధాన్యమిస్తూ ప్రచారం చేస్తున్నారు. పోలీసు అధికారిక ఫేస్బుక్, వాట్సాప్‌లతో పాటు ట్విట్టర్ ద్వారానూ ఈ ‘ఎస్సెమ్మెస్’ ప్రచారం సోమవారం నుంచి మొదలైంది. దీన్ని నిర్విరామంగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మూడు ప్రతి నగవాసికి ఓ అలవాటుగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో మరికొన్ని రకాలుగానూ ప్రచారం చేయనున్నారు. -
మేక పాలతో సబ్బుల తయారీ!
ఔరంగాబాద్: అత్యంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా రైతులకు ఇప్పుడు ‘ఉస్మానాబాదీ మేక’ ఆదాయ వనరుగా మారింది. ఈ ప్రాంతంలోని దాదాపు 250 కుటుంబాలు మేక పాలతో సబ్బులను తయారుచేసి జీవనోపాధి పొందుతున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఈ జిల్లాలోని 25 గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు సబ్బులను తయారు చేస్తున్నారు. విటమిన్ ఏ, ఈలు, సెలీనియం, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఈ మేక పాలు.. చర్మ వ్యాధులను నయం చేస్తాయని శివార్ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినాయక్ హెగనా తెలిపారు. ఒక లీటరు ఉస్మానాబాదీ మేక పాలకు తాము రూ.300 చెల్లిస్తామని, ప్రతిరోజు పని చేసినందుకు గాను వారు రూ.150 సంపాదిస్తారని ఆయన పేర్కొన్నారు. 1,400 మేకల ద్వారా కనీసం 250 కుటుంబాలు ఈ వ్యాపారాన్ని చేస్తున్నట్లు చెప్పారు. -
ఛీ.. ఛీ.. వాక్.. సబ్బును టేస్ట్ చేస్తారా?
సబ్బు.. టెస్ట్ చేయాలంటే శరీరానికి రుద్దుకోవాలి.. మరి టేస్ట్ చేయాలంటే.. ఛీ.. ఛీ.. వాక్.. సబ్బును టేస్ట్ చేస్తారా ఎవరైనా! అనే కదా మీకు అనిపిస్తుంది. కానీ ఈ ఫొటోలో ఉన్నామె కాస్త డిఫరెంట్. సబ్బును టేస్ట్ చేస్తాను అంటూ ముందుకొస్తోంది. ఇండోనేసియాలోని తూర్పు జావాకు చెందిన ఖోసిక్ అసీఫాకు ఓ వింత రకమైన అలవాటు ఉంది. సబ్బులు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మరీ వాటికి రేటింగ్ ఇస్తుందట. రెండేళ్ల కిందట ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనే కోరిక పుట్టిందట. దీంతో ఆమె సబ్బులను ఇలా రుచి చూడటం ప్రారంభించిందట. రుచి చూడటమంటే ఏదో అలా నాలుక చివర అంటించుకుని మమ అనిపించేయడం కాదు.. చక్కగా ఐస్‌క్రీం మాదిరిగా రుచి చూసి మరీ రేటింగ్ ఇస్తుందట. అంతేకాదు ఆ వీడియోలను తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈమెకు ఫాలోవర్లు పెరిగిపోయారు. వేలాది లైకులు.. కామెంట్లు వస్తున్నాయి కూడా. అంతేకాదు ఆ తర్వాత ఏ సబ్బును రుచి చూడాలో వాటి బ్రాండ్ పేరును సూచిస్తున్నారు ఫాలోవర్లు. ఎప్పుడు.. ఎవరు.. ఎలా ఫేమస్ అయిపోతారో అస్సలే అర్థం కావట్లేదు..! -
జారిపోని సోపు...
ఇదో వింత ఆకారం. పేరు టెట్రాపాడ్. సముద్ర తీరాల్లో అక్కడక్కడా ఈ ఆకారంలో ఉండే దిమ్మెలు కనిపిస్తూంటాయిగానీ.. పొటోలో ఉన్నది మాత్రం ఓ సోపు. అవునా? అని నోరెళ్లబెట్టకండి. చేతిలోంచి జారిపోకుండా ఉండేందుకు, ఎక్కువ కాలం మన్నే లక్ష్యంతో తాము దీన్ని తయారు చేశామని చెప్పుకుంటోంది టెట్రాసోప్ అనే స్టార్టప్. దీని ఆకారం చూడగానే తెలిసిపోతుంది... ఇది అస్సలు జారిపోదని. సిలికాన్ అచ్చు ద్వారా ఈ ప్రత్యేకమైన ఆకారంలో సోపులు తయారు చేస్తున్నారు. ఆముదం మొదలుకొని పలు రకాల నూనెలు, కొవ్వులతో దీన్ని తయారు చేశారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటివల్ల పర్యావరణానికి ఏమైనా నష్టం జరిగిందా? లేదా? అన్న వివరాలు కూడా ముద్రించి మరీ ఈ సోపును అమ్ముతున్నారు. ఈ రకమై సోపును తయారు చేసేందుకు డబ్బులు కావాలని టెట్రాసోపు కిక్‌స్టార్టర్‌లో అడిగిందే తడవు.. దాదాపు 30 వేల హాంకాంగ్ డాలర్లు వచ్చిపడ్డాయి. గత ఏడాది చివరలో ఈ డబ్బులతో ఉత్పత్తి ప్రారంభించిన టెట్రాసోపు ప్రస్తుతం తమ వెబ్సైట్ ద్వారా వాటిని అమ్ముతోంది. అంతాబాగానే ఉందిగానీ.. ఈ టెట్రాసోపుతో ఒంటికి సోపు రాసుకోవడం ఎలా? అన్న డౌట్ వస్తోందా? నిజమే. దీన్ని తాము చేతులు కడుక్కునేందుకు మాత్రమే తయారు చేశామని... కాకపోతే వందగ్రాముల సోపు 30 రోజులపాటు మన్నుతుంది కాబట్టి... ఇతర అవసరాలకూ వాడుకోవచ్చునని కంపెనీ అంటోంది. -
ఈ సబ్బుతో పిశాచాల పీడ విరగడ!
ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే సబ్బుల గురించి మనకు తెలుసు. సూక్ష్మక్రిములను దూరం చేసే సబ్బులు, సుగంధాలను వెదజల్లే సబ్బుల గురించి తెలుసు. చర్మసౌందర్యాన్ని ఇనుమడింపజేసి యవ్వనకాంతితో మెరిపించే సబ్బుల గురించి కూడా తెలుసు. ఇలాంటి సబ్బులను తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. ‘ఇలాంటివి ఎవరైనా తయారు చేస్తారు. వీటిలో వెరైటీ ఏముంది? మా కంపెనీ తయారు చేసే సబ్బును వాడితేనా... ఎంతటి పిశాచాలైనా పరారు కావాల్సిందే’ అంటోంది ఓ అమెరికన్ కంపెనీ. న్యూ ఇంగ్లండ్ రాష్ట్రంలోని వెర్మంట్కు చెందిన ఈ కంపెనీ ఇటీవల కొత్త తరహా సబ్బును మార్కెట్లోకి తెచ్చింది. వెల్లుల్లి తైలం, పవిత్రజలం ఉపయోగించి తయారు చేసిన ఈ సబ్బు శాకినీ, ఢాకినీ, డ్రాకులా వంటి సమస్త భూతప్రేత పిశాచాదులను దూరంగా ఉంచగలదని నమ్మకంగా చెబుతోంది. రుద్దుకుంటే పోయేదేముంది ఒంటి మీద మురికి తప్ప అనుకునే వారు, దీని పనితీరును ప్రాక్టికల్‌గా చూడాలని ఉబలాటపడేవారు ఎగబడి మరీ ఆన్లైన్లో ఈ సబ్బును తెగ కొంటున్నారు. దీని ధర ఎంతో కాదు, పట్టుమని పది డాలర్లు (రూ.656) మాత్రమే. -
కవ్వింత: ఆరోగ్యం
భార్య: ఇక్కడ స్నానాల సబ్బుండాలి ఏమైందండీ? భర్త: ఆ.. ఆరోగ్యానికి మంచిదని టీవీలో చెబితే తినేశా!! మళ్లీ అదే మాట! భర్త: ఈ ఇంట్లో నా బతుకు కుక్క కన్నా హీనంగా ఉంది. భార్య: నువ్వెందుకలా ఫీలవుతున్నావో నాకర్థం కావడం లేదు. భర్త: నువ్వు నన్నలా ట్రీట్ చేస్తున్నావు, మన ఇంటికి వచ్చిన ఎవరినైనా అడుగు. భార్య: ఊరికే ఎందుకలా మొరుగుతారు!? కాసేపు ఊరికే ఉండలేరా? లేట్ న్యూస్! భర్త: నాకస్సలు బుద్ధిలేదు. దేవత లాంటి ఆ అమ్మాయికి విడాకులిచ్చి అనవసరంగా నిన్ను కట్టుకున్నాను భార్య: దేవత లాంటి అమ్మాయిని ఎలా వదిలేశారు మరి? భర్త: నువ్వొచ్చాకే కదా నాకా విషయం అర్థమైంది. తుంటరి పిల్లాడు తండ్రి: మా వాణ్ణి ఎందుకు కొట్టారు టీచర్? టీచరు: మీకు తెలిసిన కళల పేర్లు రాయమంటే మీ వాడు ఏం రాశాడో తెలుసా? తండ్రి: కరెక్టుగా రాశానని చెప్పాడే! టీచరు: అవును, శశికళ, చంద్రకళ, సూర్యకళ, కళాజ్యోతి... రెండు జతలు రవి: అదేంట్రా నీ చెప్పుల జత ఒక్కోటీ ఒకోలా ఉంది? పప్పు: మా ఇంట్లో ఇలాంటి జత ఇంకోటి ఉంది తెలుసా? తత్వం శిష్యుడు: పెళ్లి వలన లాభమేంటి? గురువు: ప్రాణం మీద భయం, తీపి పోవడానికి అంతకంటే ఉత్తమ మార్గం లేదు. -
ఆజన్మం: సబ్బునురగలాంటి సంగతులు
దుస్తుల్ని ఉతుకడంలో ఈ మజా ఉండదు. అలా కంటిముందట శుభ్రమైపోయే గుణం బట్టల్లో లేకపోవడం వల్లనేమో! సబ్బు నురగను చూస్తే మాత్రం ఉత్తేజం కలుగుతుంది. ‘చిన్నప్పుడు’ అమ్మకోసం గిన్నెలు తోమిపెట్టాను. ఎడమచేత్తో ‘పుష్’ చేస్తూ, కుడిచేత్తో ‘పుల్’ చేస్తూ గిన్నెను గుండ్రంగా తిప్పడం తోమడంలో ఒక టెక్నిక్! ఆ రెండూ నిజంగా జరుగుతున్నాయా అని గుర్తించలేనంత సమన్వయంతో చేతులు పనిచేయడం ఒక ఆశ్చర్యం. అయితే, ఆ గిన్నె అలా తిరుగుతూ, పడే నీటి ధారకు మురికి అలా వదులుతూ పోతూవుంటే చూడ్డానికి బాగుంటుంది. పాత్రలు రాతివెండివై, తోమడానికి వాడింది బూడిదైతే గనక, ఆ ఫీలింగ్ రెట్టింపవుతుంది.అదే, దుస్తుల్ని ఉతుకడంలో ఈ మజా ఉండదు. బహుశా, అలా కంటిముందట శుభ్రమైపోయే గుణం బట్టల్లో లేకపోవడం వల్లనేమో! కానీ సబ్బు నురగను చూస్తే మాత్రం ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా దానిమీద ఏర్పడే గాలి నీడలు! నురగ బుడగలాంటి ఒక ఇల్లుండి, అలా గాల్లో తేలిపోయి, మబ్బుల మీద కాసేపు దొర్లి, ఠప్‌మని అది నిశ్శబ్దంగా చిట్లిపోయినప్పుడు విరిగిపడే తుంపరముక్కలకు చప్పున కళ్లు మూసుకుని చప్పట్లు కొట్టి, కిందపడకుండా జాగ్రత్తగా మేఘాల్ని పట్టుకుని భూమ్మీదకు దుంకి... చిన్నతనపు పెద్దకోరిక! అదే చిన్నతనంలో బ్రెడ్డు నిర్మాణం నన్ను ఆశ్చర్యగొలిపేది. తెరలు తెరలుగా, జాలిజాలిగా, ఆ డబల్రొట్టెలో అన్ని గదులు ఉండటం చిత్రంగా ఉండేది. ఎలా ఏర్పాటు చేసివుంటారు! అవి పాలల్లో మరింత రుచిగా ఉండటానికి నాకు ఈ బుల్లిగదులూ కారణమే! అదే చిరు గదుల నిర్మాణం వల్ల దోమతెరను చూసినా నాకు బాగుంటుంది. అలా నిలబడిపోయి ఎంతసేపైనా చూస్తూవుండొచ్చు. అయితే, ఇది చిత్రపడి చూడటం కాదు. ఒక రొమాన్స్ ఏదో ఉంటుందందులో! ఎందుకో అడ్డు-నిలువు గీతలు, అవి ఏర్పరిచే పటాలు నాకు ముచ్చటేస్తాయి. కాగితం మీద చతురస్రం బాగుంటుంది. అడ్డము, పొడవు మాయమైపోయిన ఒక పూర్ణ ఆకృతి ఏదో అందులో ఉంటుంది. అయితే వస్తురూపంలో మాత్రం దీర్ఘచతురస్రం ఇంపుగా ఉంటుంది. వృత్తం ఉత్తి వృత్తంగా బాగోనిది ఆమ్మాయిల రింగుల రూపంలో మాత్రం సార్థకత చేకూర్చుకుంటుంది. మా ఇంట్లోకి కరెంటు వచ్చిన చారిత్రక సందర్భం నాకు గుర్తుంది. అంతకుముందు ఇంట్లో ‘ఎక్క’లుండేవి. వాటిని పెట్టడానికి చెమ్మలు! సాయమానులో, అర్రలో, చంకలో, ముందింట్లో, వాకిట్లో ఈ చెక్కతో చేసిన చెమ్మలు గోడకు కొట్టివుండేవి. అవి లేకపోతే దీగుట్లో పెట్టేవాళ్లం. పొద్దు గూట్లో పడగానే, అమ్మ దీపాలు ముట్టించేది. కొద్దికొద్దిగా కిరోసిన్‌ను తాగుతూ వత్తి మండటం మొదలయ్యేది. కింద చిక్కటి పసుప్చచ్చ, తర్వాత ఎరుపు, ఆపైన నలుపు ఆవరించివుండే ఈ మంటను ఎంతసేపైనా అలా చూడాలనిపించేది. వత్తి కొన్నిరోజులు కాలాక, దానిమీద ఏర్పడే నల్లటి కొరుకులను చేత్తో దూస్తుంటే అవి వేళ్లకు కలిగించే స్పర్శ బాగుండేది, నల్లటి మసిరంగు అంటినప్పటికీ. ఎప్పుడూ కాదుగానీ ఒక ప్రత్యేక మూడ్‌లో ఉన్నప్పుడు కిరోసిన్ వాసన కూడా బాగుంటుంది. ముదురు కలుపు తీసిన తర్వాతి వరిపొలం కొన్నిసార్లు నా సాయంకాలపు నేత్ర విడిది! వరినాట్లు వేయడంలో శ్రమసౌందర్యం ఉండొచ్చేమోగానీ, అప్పుడే నాటిన వరిపొలంలో సొగసేమీ లేదు. కానీ క్రమంగా- ఒడ్ల మీది బురద తడి ఆరిపోయి, పక్కకు వాలిపోయిన పనలు నిటారుగా నిలబడుతూ, గంట్లు విస్తారమవుతూ, ఆకులు ముదురాకుపచ్చ రంగును సంతరించుకుంటూ... చెడ్డీలనాటి బాల్యంలోని కుదురులేనితనాన్ని వదిలించుకుని, కౌమారంలోకి వచ్చాక ఉండే శారీరక ఒద్దికను అలవర్చుకుని... పొద్దుగుంకే వేళలో ఏకప్రేయసి నియమంలేని చిరుగాలి తుంటరిగా మేను నిమురుతుంటే అలలాగా ఆనందనృత్యం చేస్తూ... తినబోయేది అన్నాన్నా? తినవల్సింది ఈ అందాన్నా? అలా తదేకంగా చూడొద్దంటారుగానీ, నిద్దరోతున్న బుజ్జాయిల ముఖాల్ని చూడగలగడం అదృష్టం! పిల్లి ఒళ్లు విరుచుకోవడం చూడదగిన దృశ్యం! వేసివున్న మెత్తలు, తెరిచివున్న కిటికీ రెక్కలు, గూనపెంకుల ఇండ్లు, ‘జుయ్య్’మని చిరుమండే వెలుగు జాలి కందిళ్లు, పాతకాలపు చేతిరాతలు... వాటితో ముడిపడిన ఏ భావన వల్లనో నాకు ఆత్మీయంగా తోస్తాయి. ఏ టీవీ రీమోట్ ప్యాకింగ్ కోసమో వాడే పాలిథీన్ గాలిబుడగలను చిట్లిస్తూ ఉంటే కూడా సరదాగా ఉంటుంది. ఉత్తి శూన్యమే! కానీ శూన్యంలో ఏమీ లేదని ఎలా అనగలం? - పూడూరి రాజిరెడ్డి