Maneka Gandhi Said Donkey Milk Soap Makes Women's Body Beautiful - Sakshi
Sakshi News home page

క్లియోపాత్ర గాడిద పాలతోనే స్నానం చేసింది!: మేనక గాంధీ వ్యాఖ్యలు వైరల్‌

Published Mon, Apr 3 2023 2:51 PM | Last Updated on Mon, Apr 3 2023 3:25 PM

Maneka Gandhi Said Donkeys Milk Soap Makes Womens Body Beautiful - Sakshi

బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ గాడిద పాల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ మేరకు ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో గాడిద పాల సబ్బులు మహిళలను ఎల్లప్పుడూ అందంగా ఉంచుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆమె ఆ వీడియోలో..గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళల సౌందర్యాన్ని పెంచుతాయని, ఈజిప్టు రాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసిందని అన్నారు.

పైగా ఢిల్లీలో గాడిద పాలతో చేసిన సబ్బు ఒక్కొక్కటి రూ. 500 ధర పలుకుతుందని చెప్పారు. లడఖ్‌ కమ్యూనిటీ కూడా గాడిద పాలతోనే సబ్బులు తయారు చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లే గాడిదల సం‍ఖ్య తగ్గిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. అదీగాక చాకలివాళ్లు కూడా గాడిదలను వినయోగించడం లేదని అన్నారు. లడఖ్‌లోని కమ్యూనిటీ సంఘం కూడా గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్ల గుర్తించిందని తెలిపారు. తన ప్రసంగంలో పెరుగుతున్న ఖర్చుల గురించి కూడా ప్రస్తావించారు..చెట్లు అంతరించిపోతున్నాయని, అందువల్లే కలప ఖరీదు పెరిగిపోయిందన్నారు. దీంతో దహన సంస్కారాల ఖర్చులు కూడా పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు.

అందువల్ల పేద ప్రజలు మరణంలో సైతం తమ కుంటుంబికులను నిర్థాక్షిణ్యంగా  వదిలేస్తున్నారని చెప్పారు. దహన సంస్కరాలకు కలపను/ఆవు పేడను వినియోగిస్తే అయ్యే ఖర్చుల వ్యత్యాసాన్ని సైతం విపులంగా వివరించారు మేనకా గాంధీ. అయితే తన ఉద్దేశ్యం ప్రజలు జంతవుల నుంచి డబ్బు సంపాదించమని  కాదని, ఐనా ఈనాటికి మేకలు, ఆవులు పెంచుతున్న వారెవరూ ధనవంతులు కాలేదని చెప్పారు. అయినా మన వద్ద తగిన సంఖ్యలో వైద్యులు కూడా అందుబాటులో లేరని అన్నారు.

సుమారు 25 లక్షల మంది ఉండే సుల్తాన్‌పూర్‌లో కనీసం ముగ్గురు డాక్టర్లు కూడా లేరని, కొన్నిసార్లు అంతమంది కూడా ఉండరని ‍చెప్పుకొచ్చారు. గెదె, మేక జబ్బు పడితే లక్షలు ఖర్చు పెడతారు, పైగా ఆడవాళ్లను కూడా పశుపోషణలో చేయమని అడుగుతాం. అయితే వారు ఎంతవరకు చేయగలరు. అందుకే తాను మేక లేదా ఆవు పెంపకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. దీంతో మీరు సంపాదించాలంటే దశాబ్దం పడుతుంది. పైగా ఆ జంతవు ఒక్క రాత్రిలో చనిపోతుంది. దీంతో అప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుందంటూ మేనకా గాంధీ చాలా విచిత్రంగా ప్రసంగించారు. 

(చదవండి: కాంగ్రెస్‌ ఫైల్స్‌ అంటూ వీడియో రిలీజ్‌ చేసిన బీజేపీ)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement