లక్నో: బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు వాడితే మహిళలు చాలా అందంగా అవుతారని మేనకా గాంధీ అన్నారు. ఈజిప్టుకు చెందిన ప్రఖ్యాత రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలలోనే స్నానం చేసేదని పేర్కొన్నారు. దీంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
'గాడిద పాలతో తయారు చేసిన సబ్బు ధర ఢిల్లీలో రూ.500 ఉంది. మనం కూడా గాడిద పాలు, మేక పాలతో సబ్బులు తయారు చేయడం ఎందుకు ప్రారంభించకూడదు?. లద్దాక్‌కు చెంది ఓ కమ్యూనిటీ గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వెల్లడించింది. అందుకే గాడిద పాలను వారు సబ్బుల తయారీకి వాడుతున్నారు. గాడిద పాలతో చేసిన సబ్బును వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు.' అని మేనకా గాంధీ అన్నారు.
गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"
— Shahzad Khan (@Shahzadkhanjou) April 2, 2023
◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/AlvguCEgE5
చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్
Comments
Please login to add a commentAdd a comment