Donkey Milk
-
రూ.100 కోట్లు..‘గాడిద పాలు’
సాక్షి, హైదరాబాద్: ‘గాడిద పాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. గాడిదల ఫామ్ పెట్టుకుంటే మీ నుంచి లీటరు గాడిద పాలను రూ.1,600 చొప్పున మేమే కొంటాం. మంచి లాభాలు ఆర్జించవచ్చు’అని నమ్మించి ది డాంకీ ప్యాలస్ సంస్థ ప్రతినిధులు తమను మోసం చేశారని ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాయిబాబు, మరికొంత మంది బాధితులు ఆరోపించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా ముక్కడల్ గ్రామంలో ‘డాంకీ ప్యాలస్’అనే సంస్థ ఉంది.వీళ్లు గాడిదలు, గాడిద పాల వ్యాపారం చేస్తారు. గాడిద పాలతో లాభాలు ఆర్జించవచ్చని యూట్యూబ్‌లో బాగా ప్రచారం చేశారు. దీనికి ఆకర్షితులైన పలువురు రైతులు ఆ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకునేవారు రూ.5.5 లక్షలు ముందుగా చెల్లించాల్సి ఉంటుందని, ఆపై గాడిదలను తామే కొనుగోలు చేసి ఇస్తామని, ఒక్కో లీటరు పాలకు రూ.1,600 చొప్పున చెల్లిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. గాడిదలను గుజరాత్ నుంచి కొనుగోలు చేయడానికి ఒక్కోదానికి రూ.70 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వివరించారు.ఇదిలా ఉండగా ప్రారంభ సమయంలో కొందరికి 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు సక్రమంగానే పాలకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. దీంతో ఈ వ్యాపారం బాగుందని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 400 మందికి పైగా రైతులు ఫ్రాంచైజీలు తీసుకున్నారు. దీంతో డాంకీ ప్యాలస్ సంస్థ ప్రతినిధులు ఒకొక్కరి నుంచి రూ.20 లక్షలు మొదలు రూ.70 లక్షల వరకు కట్టించుకున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం.. ఆపై బెదిరింపులు మొదట్లో బాగానే ఉన్నా.. గత 18 నెలల నుంచి పాల బిల్లుల చెల్లింపులో జాప్యం మొదలైంది. బిల్లులు అడిగితే సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు దిగడం మొదలు పెట్టారు. దీంతో తిరునెలవేలి జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలను కలసి ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసులు డాంకీ ప్యాలస్ ప్రతినిధులను గట్టిగా హెచ్చరించారని, రైతులకు న్యాయం చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని వెల్లడించారు.దీంతో డాంకీ ప్యాలస్ ప్రతినిధులు దాదాపు 200 మంది రైతులను వాట్సాప్ గ్రూపుల్లో బెదిరించారని చెప్పారు. తమకు రాజకీయంగా పలుకుబడి ఉందని, మీరేం చేయలేరని, చంపేస్తామని మెస్సేజ్‌లు పెట్టారని బాధితులు వాపోయారు. తామంతా సుమారు రూ.100 కోట్ల వరకు మోసపోయామని పేర్కొన్నారు. కాగా, ఏడాది క్రితం రూ.10 కోట్ల చెక్కు యూరప్ నుంచి వచి్చందని, ఆ డబ్బులు రాగానే అందరికి చెల్లింపులు చేస్తామని చెప్పారని వెల్లడించారు.చాలా మందికి చెక్కులు ఇచ్చారని, అయితే తమ బ్యాంకు ఖాతాల్లో చెక్‌లను డిపాజిట్ చేస్తే బౌన్స్ అయ్యాయని తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఏపీ మంత్రి లోకేశ్‌కు వినతి పత్రం ఇచ్చామని, తమ బాధలను కేటీఆర్ ట్విట్టర్లో చూసి స్పందించారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్లు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.ఆదుకోకుంటే.. ఆత్మహత్యే శరణ్యం మేం రైతులం. పాలు అమ్ముకుని బతుకుదాం అనుకున్నాం. రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాం. డాంకీ ప్యాలస్ వాళ్లు మోసం చేశారు. రూ.లక్షలు పెట్టి గుజరాత్లో కొనుగోలు చేసిన వందలాది గాడిదలను మేపలేక వదిలేస్తున్నాం. అవి చచి్చపోతున్నాయి. చేసిన అప్పులు తీర్చడానికి మాకు వేరే దిక్కులేదు. ప్రభుత్వాలు ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నాం. - తేజస్విని, బాధితురాలు, అనంతపురం (ఏపీ) -
గాడిద పాలకు భలే డిమాండ్
బాల్కొండ: ప్రస్తుతం సమాజంలో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది. గాడిద పాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం చేస్తూ పాలను విక్రయిస్తున్నారు. గాడిద పాలు కూడా తాగే వారి సంఖ్య పెరగడంతో ఈ పాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. కరము పాలు గరిటడైనా చాలు అన్నట్లుగా.. గాడిద పాలు తాగితే పలు రకాల మొండి వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని గాడిద పాల విక్రయదారులు పేర్కొంటున్నారు. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, గాడిద పాలను కూడా అనేక మంది కొనుగోలు చేసి తాగుతున్నారు. మండల కేంద్రంలో కొందరు వీటిని గాడిద పాలను విక్రయిస్తున్నారు. పాలు కావాలంటే ఇంటి వద్దనే గాడిద పాలను పితికి అక్కడికక్కడే ఇస్తారు. చిన్న గ్లాస్ పాలకు రూ. 50 నుంచి రూ. 100 చొప్పున విక్రయిస్తున్నారు. గిరాకీ ఉంటే అంతో ఇంతో ఆదాయం వస్తోందని, అది కూడా గాడిద పాల గురించి తెలిసిన వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయని దీంతో గాడిద పాలకు కాస్త గిరాకీ తగ్గిందని విక్రయదారులు పేర్కొంటున్నారు. దగ్గు, దమ్ము, ఆస్తమా, గురక వంటి వ్యాధులకు గాడిద పాలు తాగితే పూర్తిగా తగ్గిపోతుందని, ఈ పాలల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయని నిర్వామకులు ప్రచారం చేస్తూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. -
గాడిద పాల సబ్బు.. డబ్బే డబ్బు
సాక్షి, అమరావతి: గాడిద పాలు లీటర్ రూ.3 వేలు. అదే లీటరు పాలతో సబ్బులు తయారు చేస్తే రూ.11,980 ఆదాయం. గాడిద పాలకంటే.. ఆ పాలతో తయారు చేసే ఉప ఉత్పత్తులు సైతం అధిక లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం గాడిద పాలకు ప్రపంచమంతా క్రేజ్ వచ్చింది. ఏపీలో తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని తోకాడ వద్ద ప్రారంభించిన అక్షయ డాంకీ ఫౌండేషన్ నాలుగేళ్లలోనే మంచి గుర్తింపు పొందింది. రూ.80 లక్షల వ్యయంతో 10 ఎకరాల్లో ప్రారంభించిన ఈ ఫామ్ ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాల ఉత్పత్తి చేస్తోంది. ఈ పాలతో సబ్బులు, పాల పౌడర్ వంటి ఉప ఉత్పత్తులు తయారు చేస్తోంది. వారానికి 310 లీటర్ల పాల ఉత్పత్తిఅక్షయ డాంకీ ఫామ్‌లో దేశీయ నాటు గాడిదలతో పాటు అంతర్జాతీయంగా పేరొందిన హలారీ, కాట్వాడి, టోక్యో జాతులకు చెందిన గాడిదలున్నాయి. 80 గాడిదలతో ప్రారంభమైన ఈ ఫామ్‌లో ప్రస్తుతం వాటి సంఖ్య 120కు పెరిగింది. నాటు గాడిదలు రోజుకు సగటున 250–350 మిల్లీలీటర్ల పాలు ఇస్తుండగా, హలారి (గుజరాత్), కాట్వాడి (మహారాష్ట్ర), టోక్యో (ఇథియోఫియా) జాతి గాడిదలు రోజుకు 750 మిల్లీ లీటర్ల నుంచి 1.75 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. ప్రారంభంలో వారానికి 240 లీటర్ల పాల ఉత్పత్తి జరగ్గా.. ప్రస్తుతం 310 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గాడిద పాలు పితికిన తర్వాత 3 గంటలకు మించి నిల్వ ఉండవు. పాశ్చురైజ్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే 3 రోజులు, డీప్ ఫ్రిజ్‌లో పెడితే 6 నెలలు, పౌడర్ రూపంలో అయితే రెండేళ్ల పాటు నిల్వ ఉంచొచ్చు. పిల్లలు తాగే పాలు లీటర్ రూ.3 వేలకు విక్రయిస్తుండగా.. కాస్మొటిక్ కంపెనీలకు రూ.5 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. మూత్రాన్ని లీటర్ రూ.450, పేడ కిలో రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువటగాడిద పాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పాలలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ, ఈతోపాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వే ప్రొటీన్, కాసియన్ ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ పెంచేందుకు దోహదపడుతుందని, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధంగా ఉపయోగçపడుతుందని పేర్కొంటున్నారు. గాడిద మూత్రాన్ని ఆయుర్వేద మందుల తయారీ, పేడను ధూప్‌స్టిక్స్, ఎరువులుగా వాడతారు.ఈ–కామర్స్‌లో అమ్మకాలుగాడిద పాల సబ్బులు, గాడిద పాల పౌడర్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. త్వరలో స్కిన్ లోషన్‌తో పాటు మరిన్ని ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు ఫ్లేవర్స్‌లో సబ్బుల తయారీక్లియోపాత్ర చర్మ సౌందర్యానికి గాడిద పాలే కారణమని చెబుతారు. గాడిద పాలతోనే స్నానం చేసేదాననని తన స్వీయ చరిత్రలో ఆమె రాసుకున్నారు. గాడిద పాలతో తయారు చేసే సబ్బులను మోడల్స్, సినీతారలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటి వాడకం వలన శరీరం కాంతివంతమవుతుందని, చర్మం త్వరగా ముడతలు పడదని చెబుతారు.అక్షయ డాంకీ ఫౌండేషన్ ఇటీవలే ఫామ్‌లో కొత్తగా సబ్బులు, పాల పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. లావెండర్, గులాబీ, హనీ–బెంటోనైట్ క్లే, అలోవెరా–ఫ్రెంచ్ గ్రీన్ క్లే వంటి నాలుగు రకాల సబ్బులను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల సబ్బు తయారీకి 50 మిల్లీలీటర్ల పాలను వినియోగిస్తున్నారు. ఒక్కో సబ్బును రూ.599 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ఫామ్‌లో ఏడాదికి సుమారు 6 వేల సబ్బులు తయారవుతాయి.మిల్క్ పౌడర్కూ భలే గిరాకీగాడిద పాలతో తయారు చేసే పాల పౌడర్‌ను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలు, బ్యూటీ కాస్మోటిక్స్ తయారీలో వినియోగిస్తుంటారు. ఒక స్పూన్ పౌడర్ లీటర్ నీటిలో కలుపుకుంటే అవన్నీ పాలుగా మారిపోతాయి. ఆస్తమా రోగులు ఎక్కువగా ఈ పాలను సేవిస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో పాల పౌడర్ ధర రూ.85 వేల పైమాటే. 13 లీటర్ల పాలతో కిలో పౌడర్ తయారవుతుంది. ఈ ఫామ్‌లో ఏటా 200 కేజీల పాల పౌడర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 100 గ్రాముల పౌడర్ రూ.8,500 చొప్పున విక్రయిస్తున్నారు. సబ్బులకు మంచి డిమాండ్నాలుగేళ్లలోనే ఫామ్‌ను విస్తరించాం. గాడిదల సంఖ్యతోపాటు పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. సబ్బులు, పాల పౌడర్ తయారు చేస్తున్నాం. త్వరలో మరిన్ని ఉప ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ఎం.ప్రదీప్, మేనేజర్, అక్షయ ఫౌండేషన్ -
గాడిద పాల డెయిరీకి బ్రేక్
హొసపేటె: గాడిద పాలు అనేక ఔషధ గుణాలు కలిగినవని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగడంతో ఆ పాలకు ఎనలేని గిరాకీ నెలకొంది. చిన్న కప్పు పాలు రూ. వందలు పలుకుతున్నాయి. అదే అదనుగా కొందరు గాడిద పాల పేరుతో వ్యాపారాలు ప్రారంభించారు. ఇదే మాదిరిగా హొసపేటె పట్టణంలో జెన్నీ మిల్క్ పేరుతో ఓ షాపు వెలసింది. అందులో గాడిద పాలను అమ్మేవారు. దానికి ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో నగరపాలక సంస్థ అధికారులు గురువారం తాళం వేశారు.రూ.3 లక్షలు తీసుకుని గాడిదలు ఇచ్చి..గత కొన్ని నెలలుగా జనం నుంచి తలా రూ. 3 లక్షలను తీసుకొని తలా 3 ఆడ గాడిదలను, 3 పిల్లలను ఇచ్చేవారు. వారు గాడిదల నుంచి పాలను సేకరించి ఇస్తే జెన్నీ నిర్వాహకులు కొనుగోలు చేసేవారు. ఇందులో మోసం జరుగుతోందని కొందరు రైతు నేతలు జిల్లా కలెక్టర్ ఎంఎస్ దివాకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ జరిపి ట్రేడ్ లైసెన్స్ లేక పోవడంతో మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జెన్ని మిల్క్ కంపెనీ, హొసపేటెలో కార్యాలయం ఉన్నాయి. డెయిరీని మూసివేయడంతో పాల విక్రేతలు ఆందోళనకు గురయ్యారు. -
గాడిద పాలకు భలే డిమాండ్.. లీటరు రూ. 2 వేలు
భిక్కనూరు: గంగి గోవుపాలు గరిటైడెనను చాలు.. కడివడైననేమి కరము పాలు.. ఇది ఒకప్పుడు అందరూ చదువుకున్న పద్యపాదం. ఆవు పాల ముందర గాడిద పాలు ఎందుకూ పనికిరావని దీని అర్థం. అయితే పరిస్థితి మారిపోయింది. గాడిద పాలకే ఎక్కువ డిమాండ్ వచ్చింది. పిల్లల దగ్గు, ఆయాసం తగ్గడానికి వీటిని వినియోగిస్తుండడంతో లీటరు పాటు రూ. 1600 నుంచి రూ. 2 వేల వరకు పలుకుతోంది. పది మిల్లీలీటర్ల పాలు పిల్లలకు తాపితే దగ్గు, ఆయాసం, ఆకలి లేకపోవడం వంటి వ్యాధులు నయమవుతాయని గ్రామ ప్రజల నమ్మకం. దీంతో 25 ఎంఎల్ పాలు రూ. 40 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. రెండు రోజులుగా మండల కేంద్రంలో గాడిద పాల వ్యాపారులు తిరుగుతూ పాల వ్యాపారం చేస్తున్నారు. వారు అమ్మే ధరను చూస్తే లీటరు గాడిద పాలు రూ. 2 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కామారెడ్డిలో నివాసం ఉంటూ మండల కేంద్రాల్లో గాడిద పాల వ్యాపారం చేస్తున్న రాధను ‘సాక్షి’ పలుకరించగా గ్రామాల్లో తిరుగుతూ పాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. గాడిద పాలు చిన్నపిల్లలకు తాగిపిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. తనకున్న గాడిదల పాల వ్యాపారం ద్వారా రోజుకు రూ. వెయ్యి వరకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. -
గాడిదపాలా మజాకా..!
-
గాడిద పాలు బహు ప్రియం
గౌరిబిదనూరు: పట్టణంలో గాడిద పాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అదిలాబాద్ నివాసి సురేశ్ రౌత్ అనే యువకుడు గాడిదను తీసుకుని పాలు విక్రయిస్తున్నాడు. 100 మిల్లీలీటర్ల పాల ధర రూ. 150 నుండి 180 దాకా అమ్ముతామని చెప్పారు. ఈ లెక్కన గాడిద పాలు లీటరు కొనాలంటే కనీసం రూ. 1,500 చెల్లించాలి. పసిపిల్లలకు ఆరోగ్యానికి మంచిదని అతడు చెప్పాడు. తాము కుటుంబం మొత్తం గాడిదలను తోలుకుని వచ్చామని, మరికొందరు బెంగళూరులో ఉన్నారని తెలిపాడు. -
'గాడిద పాల సబ్బు వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు'
లక్నో: బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ స్టేట్మెంట్కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు వాడితే మహిళలు చాలా అందంగా అవుతారని మేనకా గాంధీ అన్నారు. ఈజిప్టుకు చెందిన ప్రఖ్యాత రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలలోనే స్నానం చేసేదని పేర్కొన్నారు. దీంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 'గాడిద పాలతో తయారు చేసిన సబ్బు ధర ఢిల్లీలో రూ.500 ఉంది. మనం కూడా గాడిద పాలు, మేక పాలతో సబ్బులు తయారు చేయడం ఎందుకు ప్రారంభించకూడదు?. లద్దాక్‌కు చెంది ఓ కమ్యూనిటీ గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వెల్లడించింది. అందుకే గాడిద పాలను వారు సబ్బుల తయారీకి వాడుతున్నారు. గాడిద పాలతో చేసిన సబ్బును వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు.' అని మేనకా గాంధీ అన్నారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/AlvguCEgE5— Shahzad Khan (@Shahzadkhanjou) April 2, 2023 చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
లాభాల గాడిద పాలు.. రోజూ లీటరున్నర వరకు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’.. అంటూ వేమన అప్పట్లో గాడిదపాలను విలువలేనివిగా భావించి అలా పద్యం రాశాడేమోగానీ వాటి పాల వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాల గురించి తెలిసుంటే రూ. కోట్లిచ్చును ఖరము పాలు అని రాసేవాడేమో.. ఎందుకిదంతా చెప్పడమంటే.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువరైతు రాష్ట్రంలోనే మొదటి గాడిద డెయిరీ ఫాంను ఏర్పాటు చేసుకొని భారీ లాభాలు ఆర్జిస్తున్నాడు మరి! ఆ యువరైతు విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. లీటర్ రూ. 4– 5 వేలు రోజుకు ఒక గాడిద గరిష్టంగా లీటర్ వరకు పాలు ఇస్తుంది. ఉదయం, సాయంత్రం రెండుసార్లు పితికితే లీటరున్నర వరకు పాలు వస్తాయి. ఈ పాలను ఎక్కువగా ఆయుర్వేద మందులు, కాస్మొటిక్స్ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ మేరకు కంపెనీలు పలు ఏజెన్సీల ద్వారా అంతర్జాతీయంగా కొనుగోలు చేస్తున్నాయి. లీటర్ గాడిద పాలకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ధర పలుకుతోంది. పాల ఉత్పత్తి, గాడిదల ఆరోగ్యంపై ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుండగా.. ఫామ్ నిర్వాహకులు స్థానిక పశు వైద్యాధికారి సాయంతో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పెద్దమొత్తంలో పాలు ఉత్పత్తి అయితే ఇంకా అధిక ధరతో నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన పులిదండ నగేష్ కుటుంబం వినూత్న వ్యాపార ఆలోచనను ఆచరణలోపెట్టి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సంప్రదాయ ఆవు, గేదె పాల డెయిరీలకు పూర్తి భిన్నంగా గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన నగే‹Ùకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు అఖిల్ డిగ్రీ చేయగా చిన్నకొడుకు వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నగేష్ తల్లిదండ్రులు నర్సోజీ, లలితమ్మ. వారి కులవృత్తి (మాంసం విక్రయించడం) కూడా చేసేవారు. పలు రకాల పంటల సాగుతోపాటు పలు వ్యాపారాలు చేసినా ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకోకపోవడంతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో అఖిల్ యూట్యూబ్‌లో అన్వేíÙస్తుండగా డాంకీ ఫామ్పట్ల ఆసక్తి కలిగింది. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్న క్రమంలో అఖిల్ రాజస్తాన్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్లో గుర్రాలు, గాడిదల పెంపకం, పాల ఉత్పత్తుల గురించి శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. నెలకు వారం చొప్పున మూడు నెలలు శిక్షణ తీసుకున్నాడు. అనంతరం గుజరాత్‌లోని ఖతియవాడి, హలరీతోపాటు ఫ్రాన్స్ (పోటియో రకం) నుంచి గాడిదలను దిగుమతి చేసుకున్నాడు. ఒక్కోదానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వెచ్చించి మొత్తం 60 గాడిదలు తెచ్చుకున్నాడు. ఇందులో 57 ఆడ.. మూడు మగవి. ఈ నెలలో మరో 20 గాడిదలను (ఆడ 16, మగ 4)ను తీసుకురావడంతో వాటి సంఖ్య 80కి చేరింది. ఫామ్‌తోపాటు గాడిదలకు దాణా కోసం వివిధ రకాల గడ్డి పెంచేందుకు బిజినేపల్లి మండల కేంద్రంలోని వృద్ధాశ్రమం సమీపంలో దాదాపు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. అందులో ఒక పెద్ద షెడ్ (ఐదు భాగాలు), మరో 3 చిన్న షెడ్లు ఏర్పాటు చేసి గాడిదలను వేర్వేరుగా పెట్టాడు. వాటికి కావాల్సిన దాణా కోసం దాదాపు 15 ఎకరాల్లో సీఎస్వీ 33 ఎంఎఫ్ (జొన్న రకం), దశరథ గడ్డి, 4జీ బులెట్ (సూపర్ నేపియర్ రకం), మొర్ర గడ్డి తీగ పెంచుతున్నాడు. వీటితోపాటు ఎండు వరి గడ్డి, మక్కసొప్ప, బుడ్డ (పల్లి) పొల్లు, మక్క, గోధుమ, బార్లీ, పిండిని గాడిదలకు ఆహారంగా ఇస్తున్నాడు. గాడిదలను చూసుకునేందుకు రెండు కుటుంబాలను తమిళనాడు నుంచి రప్పించి వారికి వసతి కల్పిస్తున్నాడు. మంచి బ్రీడ్, ఎజెన్సీ చూసుకోవాలి గతేడాది నవంబర్ 13న ఫామ్ అందుబాటులోకి వచి్చంది. ప్రస్తుతం 23 గాడిదలు పాలు ఇస్తున్నాయి. పోటియో (ఫ్రాన్స్) గాడిదలు రోజుకు 2 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. గాడిద పాలు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. అయితే వాటిని ఫ్రిజ్లోనే ఉంచాలి. ఏజెన్సీ వాళ్లు ప్రస్తుతం 15 రోజులకు లేదా నెలకోసారి వచ్చి పాలు తీసుకెళ్తున్నారు. గాడిద పాల వ్యాపారం లాభదాయకమే. అయితే మంచి బ్రీడ్, ఏజెన్సీని ఎంచుకోవాలి. – పులిదండ నగేష్, గాడిద ఫాం నిర్వాహకుడు -
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని.. సొంతూరిలో గాడిదల ఫారం.. ఆదాయం ఎంతో తెలుసా?
రాజానగరం(తూర్పుగోదావరి): ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడవడైననేమి ఖరము పాలు.. అన్నాడు వేమన. ఆయన ఇప్పటి కాలంలో ఉంటే గాడిద పాలకు ఉన్న డిమాండ్ చూసి తన పద్యాన్ని సవరించుకునేవాడేమో.. నిజమే మరి..! ఆవు పాలు, గేదె పాలకు కూడా లేనంతగా గాడిద పాల ధర లీటరుకు రూ.7,500 వరకూ పలుకుతోంది. ఈ డిమాండ్‌ను తనకు ఉపాధిగా మలచుకున్నారాయన. విదేశాల్లో లక్షల రూపాయల జీతాన్ని.. సాప్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని సొంతూరిలో డాంకీ ఫారం పెట్టాడు రాజమహేంద్రవరానికి చెందిన నరాల వీర వెంకట కిరణ్‌కుమార్. ఇందుకు దారి తీసిన పరిస్థితులను ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? ‘‘మాది రాజమహేంద్రవరం. ఎమ్మెస్సీ చదువుకున్నాను. యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఓ కంపెనీ మారాను. బెంగళూరు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండేది. రోగ నిరోధక శక్తి కోసం అందరూ నానారకాలుగా తాపత్రయ పడేవారు. ఇందుకు గాడిద పాలు బాగా ఉపయోగపడతాయని చెప్పేవారు. కొందరు ఇంటింటికీ గాడిదలను తిప్పుతూ చిన్నపాటి గ్లాసులతో పాలు అమ్మేవారు. మా అబ్బాయి ఆస్త్మా ఉండేది. గాడిద పాల వల్ల ఇది తగ్గుతుందని తెలుసుకున్నాను. ప్రయోజనం కనిపించింది. గాడిద పాలకు ఉన్న డిమాండును సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. డాంకీ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నాను. వెంటనే కాతేరులోని మా ఫ్రెండ్ జీవీ రాజుతో నా ఆలోచన షేర్ చేసుకున్నాను. ఉద్యోగాన్ని వదులుకున్నాను. గాడిడల పెంపకంపై శిక్షణ తీసుకున్నాం. రాజానగరం మండలం మల్లంపూడిలో 30 ఎకరాలు లీజుకు తీసుకున్నాం. అక్షయ డాంకీ ఫారం గత నెలలో ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఇందులో నా స్నేహితుడి కుమార్తె నవ్య కూడా పార్టనర్‌గా చేరారు. ఆమె ఢిల్లీ ఐఐటీలో ఫస్టియర్ చదువుతున్నారు. చదువుకు ఆటంకం కలగకుండా చదువు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ఫారం ఇలా.. అక్షయ డాంకీ ఫారంలో ప్రస్తుతం 120 గాడిదలు ఉన్నాయి. టోక్యో దేశానికి చెందిన యుథోపియన్ బ్రీడ్ అచ్చు గుర్రంలా ఉంటుంది. దీని ఖరీదు రూ.5 లక్షలు. ఇది రోజుకు లీటరున్నర పాలు ఇస్తుంది. రాజస్తాన్‌కు చెందిన హాలారీ రకం రోజు 750 మిల్లీలీటర్ల పాలు ఇస్తుంది. దీని ఖరీదు రూ.80 వేలు పైనే. మా ఫారంలో రోజుకు 30 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి శనివారం 300 లీటర్లు హైదరాబాద్ పంపిస్తున్నాం. రోజు విడిచి రోజు కాకినాడ మీదుగా 20 లీటర్ల పాలను కాస్మెటిక్ కంపెనీలకు రవాణా చేస్తున్నాం. పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి గాడిద పిల్లలను కూడా విక్రయిస్తున్నాం. పాల పొడి, పనీరు కూడా అమ్ముతున్నాం. మద్య వ్యసనం నుంచి విముక్తి కల్పించే ఔషధంలో గాడిద మూత్రం ఉపయోగపడుతుంది. ఇందుకోసం సూరత్, మహారాష్ట్రలకు వారం వారం గాడిద మూత్రం పంపిస్తున్నాం. ఎన్నో రకాల విటమిన్లు గాడిద పాలలో విటమిన్ ఎ, బి, సి, డితో పాటు కాల్షియం ఉంటుంది. కొవ్వు శాతం తక్కువ. ఎక్కువ కేలరీలు లాక్టోస్ రూపంలో ఉండే కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తాయి. రోజుకు పది మిల్లీలీటర్ల గాడిద పాలు తాగితే ఎన్నో ఫలితాలుంటాయి. ఆవు, గేదెల పాల కంటే గాడిద పాలు కాస్త పలుచగా ఉంటాయి. రుచిలో కొబ్బరి పాలను తలపిస్తాయి. విదేశాల్లో గిరాకీ ఎక్కువగానే ఉంది. యూరప్ దేశాల్లో ఆహార పదార్థాలు, పానీయాల తయారీ, కాస్మెటిక్స్ తయారీలో వాడుతుంటారు. గాడిదలకు నిరంతరం డాక్టర్ అరుణ వైద్య సేవలు అందిస్తున్నారు. గాడిదలు ఉదయం, సాయంత్రం స్వేచ్ఛగా తిరిగేందుకు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాం. రోజుకు 25 కిలోల పచ్చగడ్డి అవసరమవుతోంది. సొంత ప్రాంతంపై మమకారంతో ఇక్కడ ఇలా డాంకీ ఫారం పెట్టాను’’ అని కిరణ్‌కుమార్ వివరించారు. -
గాడిద పాలకు డిమాండ్.. లీటరెంతో తెలుసా?
సాక్షి, కోహీర్(జహీరాబాద్): అవును మీరు విన్నది నిజ మే. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైనను నేమి ఖరము పాలు’ అనే వేమన పద్యంలో మార్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు అనిపిస్తుంది. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి చెందిన బాలాజీ ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో గాడిద పాలు అమ్ముతూ కనిపించాడు. ఒక చిన్న అమృతాంజనం సీసా పాలు (సుమారు 10ఎంఎల్) రూ.100కు విక్రయిస్తున్నట్టు చెప్పాడు. ధర వింటే మీకు మూర్ఛ వచ్చినట్టయ్యిందా! కానీ గాడిద పాలలో దగ్గు, దమ్ము, మూర్ఛ వంటి వ్యాధులను తగ్గించే శక్తి ఉందని ప్రచారం ఉంది. అందుకే.. లీటరు రూ.10 వేలకు అమ్ముతున్నాడు. ఒకప్పుడు గాడిదను కొనాలంటే రూ.10 నుంచి 15 వేలు పెట్టాల్సి వస్తే, పాలకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం రూ.45 నుంచి రూ.50 వేల ధర పలుకుతోందని కూడా తెలిపాడు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే గాడిదలు పెంచుకోవడం నయం!
వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. ఒకరికి కింద భయపడుతూ పని చేయడం కంటే సొంత వ్యాపారం మేలనుకున్నాడో గ్రాడ్యుయేట్. చీటికి మాటికి బాసులు పెట్టే టార్చర్లు భరించడం కంటే జంతువులతో మసలుకోవడం మేలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. ఫార్మ్‌హౌస్ బాట పట్టాడు. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరుకు పేరు. ఒక్క కర్నాటక యువతనే కాదు దేశం నలుమూలల నుంచి ఉద్యోగ అవకాశాల కోసం యువతరం బెంగళూరు వైపు చూస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆధారంగా అనేక స్టార్టప్‌లు పుట్టుకు వచ్చి యూనికార్న్ కంపెనీలుగా ఎదిగిన ఘనత కూడా ఈ నగరానికే సొంతం. అలాంటి బెంగళూరు నగరం వీడిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు పల్లెబాట పట్టాడు. గాడిదలు పెంచుకుంటూ లక్షలు కూడబెడుతున్నాడు. సాఫ్ట్వేర్ వదిలి శ్రీనివాస గౌడ్ అందరిలాగే గ్రాడ్యుయేష్ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ కలలతో బెంగళూరులో వాలిపోయాడు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గ కోర్సులు నేర్చుకుని కంప్యూటర్ ముందు వాలిపోయాడు. కానీ ఒకరి కింద పని చేయడంలో ఉండే అసంతృప్తి అతన్ని వేధించాయి. తన మనసుకు నచ్చిన పని చేయాలని డిసైడ్ అయ్యాడు. కడక్తో మొదలు కోవిడ్ కల్లోలం 2020లో ప్రపంచాన్ని పలకరించింది. బెంగళూరు వీడి దక్షిణ కన్నడ జిల్లాలోని సొంతూరైన ఐరాకు చేరుకున్నాడు. అప్పుడే తెలిసింది తన మనసు ఏం కోరుతుందో. వెంటనే జాబ్‌కు రిజైన్ చేశాడు. ఇంటి దగ్గరున్న రెండున్నర ఎకరాల స్థలంలో కడక్‌నాథ్ కోళ్లు, కుందేళ్ల పెంపకం ప్రారంభించాడు. కంప్యూటర్ ముందు కాలు కదపకుండా పని చేయాలనే భావనలో యువత ఉంటే, చిత్రంగా కోళ్లు, కుందేళ్లు అంటూ పరితపించే శ్రీనివాస్‌ను అంతా వింతగా చూశారు. గాడిదల కోసం రెండేళ్లు గడిచిన తర్వాత మార్కెట్ మరింతగా అర్థమైంది శ్రీనివాస్‌కి. అప్పుడు అతను తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా అతని పేరు వెలుగులోకి రావడానికి కారణమైంది. ఎవ్వరి ఊహకు అందని విధంగా గాడిదల ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. మేలురకం గాడిదల కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఓ రేంజ్ వరకు కోళ్లు, కుందేళ్లు ఒకే కానీ ఈ గాడిదల పెంపకం ఏంటి? పిచ్చేమైనా పట్టిందా అన్నట్టుగా చూశారు అంతా. మార్కెటింగ్ కర్నాటక అంతా గాలించి చివరకు 20 గాడిదలు సాధించి వాటితో ఫామ్ ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి గాడిద పాలు మార్కెటింగ్ చేయడం కోసం బెంగళూరుతో పాటు కర్నాటకలో ఉన్న ఇతర నగరాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈసారి అతనికి నిరాశ ఎదురు కాలేదు. ఊహించినదాని కంటే అనేక రెట్లు అధికంగా రెస్పాన్స్ వచ్చింది. మాకు కావాలంటే మాకు కావాలంటూ బయ్యర్లు ఎగబడ్డారు. నా అంచనా నిజమైంది - శ్రీనివాసగౌడ గాడిద పాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటికీ చిన్న పిల్లల్లో ఉబ్బసం వ్యాధికి ఔషధంగా గాడిద పాలు పట్టిస్తారు. అయితే ఆ రోజుల్లో ఊళ్లలో రజకల దగ్గర గాడిదలు ఉండేవి. బరువులు మోసే పనులకు వీటిని ఉపయోగించేవారు. కానీ మెషినరీ పెరిగిపోయిన తర్వాత అన్ని చోట్ల గాడిదల సంతతి తగ్గిపోతుంది. గాడిద పాలు దొరకం లేదనే విషయం గమనించాను. అందుకే గాడిదలో ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. అప్పుడందరూ నన్నో పిచ్చోడిలా చూశారు. కానీ ఫామ్ ఏర్పాటు చేసిన ఆరు నెలలకే నాకు రూ. 17 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఇవి సప్లై చేయడమే కష్టంగా ఉంది. ఇంకా డిమాండ్ కూడా పెరుగుతోంది. చదవండి: సంపద సృష్టిలో అదానీ అదరహో -
గాడిద పాలకు మంచి డిమాండ్.. కప్పు పాల ధర ఎంతంటే..
Health Benefits With Donkey Milk, Huge Demand in Telangana, Rates For A Cup సాక్షి, పాల్వంచ(ఖమ్మం): ప్రస్తుతం సమాజంలో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది. గాడిదపాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం చేస్తూ పాలను విక్రయిస్తున్నారు. గాడిద పాలు కూడా తాగే వారి సంఖ్య పెరగడంతో ఈ పాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. కరము పాలు గరిటడైనా చాలు అన్నట్లుగా.. గాడిద పాలు తాగితే పలు రకాల మొండి వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని గాడిద పాల విక్రయదారులు అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, గాడిద పాలను కూడా అనేక మంది కొనుగోలు చేసి తాగుతున్నారు. మంచిర్యాలకు చెందిన కొంతమంది యువకులు మూడు గాడిదలతో ప్రతి సంవత్సరం ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు పాల్వంచ పట్టణ, మండలంలో ఊరూరా తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. పాలు కావాలంటే ఇంటివద్దనే గాడిదపాలను పితికి అక్కడిక్కడే ఇస్తారు. అర టీ కప్పు గాడిద పాలు చిన్న పిల్లలకు రూ.150, పెద్దలకు ఒక టీ కప్పు రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ గాడిద పాల విక్రయదారులు రోజుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. గిరాకీ ఉంటే అంతో ఇంతో ఆదాయం లభిస్తుందని, అది కూడా గాడిద పాల గురించి తెలిసిన వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయని దీంతో గాడిద పాలకు కాస్తా గిరాకీ తగ్గిందంటున్నారు. దగ్గు, దమ్ము, ఆస్తమా, గురక వంటి వ్యాధులను గాడిద పాలు తాగితే పూర్తిగా తగ్గిపోతుందని, ఈ పాలల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయని నిర్వాహకులు ప్రచారం చేస్తూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. గిరాకీ తగ్గింది ఆవు, గేదె, మేక పాలకు ఉన్న గిరాకీ గాడిద పాలకు ఉండటం లేదు. అయితే గాడిద పాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తాగడం ద్వారా చిన్నారులకు, పెద్దలకు పలు రకాల వ్యాధులు నివారణ అవుతాయి. చాలామందికి ఈ పాల వలన అనేక రకాల మొండి వ్యాధులు తగ్గిపోయాయి. – ఇరుగుదిండ్ల లక్ష్మి, మంచిర్యాల చదవండి: భార్య ఉసురుతీసిన భర్త వివాహేతర బంధం -
గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు..
హింగోలి: గాడిదపాల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. అంతేకాదు గాడిద పాలు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శరీరంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుందని విక్రేతలు చెప్తున్నారు కూడా. కరోనా వంటి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందనే నమ్మకం కూడా లేకపోలేదు. దీంతో గాడిద పాలకు గరిష్ఠంగా లీటరుకు పది వేల రూపాయలు వెచ్చించిమరీ మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బారీ స్థాయలో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. హింగోలిలో వీధి వీధికి గాడిద పాలను విక్రయిస్తున్నారు. స్పూను పాలు తాగితే అన్ని రకాల రోగాలు దూరమవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాడిదపాలల్లో ఔషధగుణాలు అధికంగానే ఉంటాయని, పిల్లలకు న్యుమోనియాను దూరం చేస్తుందని, జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులతో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని పాల విక్రయదారులు నమ్మబలికి వ్యాపారం చేస్తున్నారు. అనేక వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని టీస్పూన్ పాలను రూ. 100కు, ఒక లీటరు పాలు ఏకంగా రూ. 10,000లకు అమ్ముతున్నారు. పుట్టిన బిడ్డకు 3 సంవత్సరాల వరకు రోజూ ఈ పాలను తాగిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే ప్రచారం కొనసాగుతోంది. దీనితో జనాలు విపరీతంగా కొనుగోలు సాగిస్తున్నారు. వైద్యులు ఏమి చెబుతున్నారంటే.. ఈ వందంతులన్నీ పూర్తిగా అవాస్తవాలని, గాడిద పాలు తాగడం వల్ల కరోనా లాంటి ఇన్ఫెక్షన్లు నయమవుతాయనేది అసాధ్యమని, ఇలాంటి వదంతులకు మోసపోవద్దని డాక్టర్ వీఎన్ రోడ్జ్ చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రజలు తమ డబ్బును వృధాగా ఖర్చు చేసకోవద్దని సూచించారు. చదవండి: పదేళ్ల బాలిక సక్సెస్ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం... -
చులకన వద్దు.. గరిటెడైనను చాలు గాడిద పాలు!
సాక్షి, అమరావతి: గాడిదను మనం చాలా చులకనగా చూస్తుంటాం.. ఒరేయ్ గాడిదా.. అంటూ దాని పేరును ఓ తిట్టులా వాడేస్తాం. మన దృష్టిలో అవమానానికి మారుపేరుగా మిగిలిన ఆ గాడిద పాలలోమనకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అనారోగ్యం బారిన పడినప్పుడు అవి మనకు అక్కరకొస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన తాజా పరిశోధనలు నిగ్గుతేల్చాయి. దేశంలో గాడిద పాల వినియోగం పూర్వకాలం నుంచే ఉన్నా.. పాల కోసమే గాడిదల్ని పెంచే దశకు మనం ఇంకా రాలేదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియా ఉపఖండ ప్రాంతాలను మినహాయిస్తే.. అమెరికా, లాటిన్ అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరింది. ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలెండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం వాణిజ్య స్థాయిలో కొనసాగుతోంది. యూరోప్‌లో సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో గాడిద పాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయన్న నమ్మకం అనాదిగా ఉంది. వయసు మళ్లిన వారు గాడిద పాలను బలవర్ధక ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని ఇటీవలి పరిశోధనలో తేలింది. లాటిన్ అమెరికన్ దేశాల్లో గాడిద పాలను ఔషధంగానే కాకుండా తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అయితే మన దేశంలో మాత్రం కేవలం ఔషధంగానే తీసుకుంటున్నారు. ఈ పాలు తాగితే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకం కూడా ఉంది. లీటర్ గాడిద పాల ధర సుమారు రూ.2 వేలపైనే ఉంది. ఔషధ వినియోగం కోసం సుమారు 25, 30 మి.లీ. మోతాదులో విక్రయిస్తున్నారు. ఒక్కో మోతాదు ధర రూ.200 నుంచి రూ.300 వరకూ ఉంది. మన ఇళ్ల దగ్గరకొచ్చేవారు 10 మి.గ్రా ఇచ్చి రూ.100 తీసుకుంటున్నారు. సీ విటమిన్ పుష్కలంగా ఉన్న గాడిదపాల వినియోగం ఇటీవల కరోనా నేపథ్యంలో బాగా పెరిగింది. పుష్కలంగా పోషకాలు గాడిద పాలల్లో విటమిన్ సీ, బీ, బీ12, ఈ విటమిన్లతో పాటు, న్యూట్రిన్లు ఉన్నాయి. ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో సీ విటమిన్ 60 రెట్లు అధికం కీలకమైన ఓమేగా–3, 6తో పాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలం తల్లిపాలతో సమాన స్థాయిలో కేలరీలు, మినరల్స్ ఉంటాయి. గేదె పాలతో సమానమైన బలం ఇస్తాయని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఆస్తమా, క్షయ, గొంతు సంబంధిత వ్యాధుల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో గాడిద పాలను వినియోగిస్తారు. నవజాత శిశువులకు పూర్తి పోషకాలను అందించడంతో పాటు చర్మవ్యాధులను నయం చేస్తాయి. గాడిద పాలల్లో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తక్కువ. ఆవుల వల్ల వచ్చే ఎలర్జీ వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయి. గాడిద పాలలో కాల్షియం ఎక్కువ. పిల్లల్లో ఎముకలను పటిష్ట పర్చడం, విరిగిన ఎముకలను అతికించే స్వభావం వీటికి ఉంది. ఈ పాల వినియోగంతో ఉబ్బసం, సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్టు ఇటీవల సైప్రస్ వర్సిటీ నిర్ధారించింది. కొవ్వు శాతం చాలా తక్కువ గాడిద పాలు తల్లి పాలకు దగ్గర ఉంటాయి. తల్లి పాలకు దాదాపు సమానంగా వీటిలో లాక్టోజ్ ఉంటుంది. ఈ పాలలో కొవ్వు శాతం చాలా తక్కువ. స్థూలకాయం నుంచి బయటపడేందుకు గాడిద పాలను సూచిస్తున్నారు. మనకు మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నా.. మన దేశంలో మాత్రం గాడిద పాలు వాణిజ్య స్థాయిలో వినియోగంలోకి రాలేదు. – డాక్టర్ జి.రాంబాబు, అసిస్టెంట్ సర్జన్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ జనాభాలో దాదాపు 2 నుంచి 6 శాతం ప్రజలకు ఆవు పాలు సరిపడవు. ఆ పాల వల్ల ఎలర్జీలొస్తాయి. అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయి. – ఐక్యరాజ్యసమితి అధ్యయనం మా తాతముత్తాతల దగ్గర్నుంచి మా ఇంట్లో గాడిద పాలు వాడుతున్నాం. గాడిద పెంపకందార్లే ఇంటి ముందుకొచ్చి పాలు పితికి ఇస్తారు. చిన్న అమృతాంజనం సీసా పాలకు రూ.100 తీసుకుంటారు. ఇప్పుడు కరోనా కూడా రావడంతో ఇంట్లో పిల్లలకీ ఇస్తున్నాం.. – మురళీ, చీరాల గాడిద పాలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయకపోయినా, రోగుల జీవిత కాలాన్ని పొడిగించేందుకు మాత్రం దోహదపడతాయి – లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్‌దీపక్ ప్రకటన -
Reindeer: దుప్పి పాలు రుచి చూస్తారా!
పాలు అంటే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది అవులు, గేదెలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మేకపాలు, గొర్రె పాలు కూడా తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో పాల కోసం దుప్పి (రైన్డీర్)ని పెంచుతారన్న విషయం మీకు తెలుసా? స్కాండినేవియా ప్రాంతంలో ఈ రైన్డీర్ పాలు వినియోగిస్తారు. అతి తక్కువ పరిమాణంలో లభించే ఈ పాలను పోషకాల ఘనిగా చెప్పవచ్చు. ఈ పాలలో 20 శాతం కొవ్వు 10 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఒక్కో రైన్డీర్ రోజుకి ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తుంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏఏ జంతువుల పాలు వినియోగిస్తారో చూద్దాం.. ఒంటె (సోమాలియా, కెన్యా) ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పాడి జంతువు ఒంటె. ఇవి సుమారు వారం రోజుల పాటు నీరు తాగకుండా జీవించగలవు. సోమాలియా, కెన్యాలు ప్రపంచంలో అత్యధికంగా ఒంటె పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలు. ఒంటెలు రోజుకు 5 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఆవు పాలతో పోల్చితే ఒంటె పాలు చిక్కగానూ, రుచిలో కాస్త ఉప్పగానూ ఉంటాయి. గేదె (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో పాల ఉత్పత్తికి ప్రధాన ఆధారం పాడి గేదెలు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పరిమాణంలో 80 శాతానికిపైగా గేదె పాలు ఈ రెండు దేశాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. గేదెలు ఆవుల కన్నా ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి. భారత్‌లో గుజరాత్‌లోని సూరత్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గేదె పాలతో తయారుచేసే ‘సూర్తి పనీర్’ అనే మృదువైన జున్ను (చీజ్)కు విశేషమైన గుర్తింపుఉంది. సాహివాల్ (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో ప్రధానంగా కనిపించే మరో పాడి ఆవు సాహివాల్. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సాహివాల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో వృద్ధి చెందిన దేశవాళీ ఆవు. మన దేశంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దేశీ జాతి ఆవులు కనిపిస్తాయి. వీటిలో రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం ఉంది. పాలలో వెన్న 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. గుర్రం (మంగోలియా) గుర్రాలను ఎందుకు వినియోగిస్తారో అందరికీ తెలుసు. కానీ గుర్రం పాల గురించి చాలా మందికి తెలీదు. మంగోలియాలో గుర్రాలను వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తికి వాడుతున్నారు. ఇక్కడ గుర్రపు పాలను 24 నుంచి 48 గంటలపాటు పులియబెట్టి, చిలకడం ద్వారా కౌమిస్ (లేదా ఐరాగ్) అనే పానీయాన్ని తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పానీయంలో 2 శాతం ఆల్కహాల్ ఉండటం విశేషం. యాక్ (జడల బర్రె) / (టిబెట్) యాక్ (జడల బర్రె) హిమాలయ ప్రాంతానికి చెందిన పాడి జంతువు. వీటి నుండి పాలతోపాటు ఉన్ని, మాంసం ఉత్పత్తి చేస్తున్నారు. చలికాలంలో కంటే వేసవిలో ఎక్కువ పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఆవు పాలతో పోల్చితే జడల బర్రె పాలలో కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటి పాలతో వెన్న, వివిధ రకాల చీజ్‌లను తయారు చేస్తారు. మేక (ఫ్రాన్స్) ఫ్రాన్స్‌లో మేక పాలు విరివిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ మేక పాలను రకరకాల చీజ్ల తయారీలో ఉపయోగిస్తారు. సహజసిద్ధంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల మేక పాలను చర్మ సంరక్షణకు, సౌందర్య సాధనాల (కాస్మొటిక్స్) తయారీకి వినియోగిస్తున్నారు. మేక పాలలో కంటి చూపుకు మేలు చేసే ఎ–విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. రైన్డీర్ (పలవల దుప్పి)/ (ఫిన్‌ల్యాండ్) రైన్డీర్ పాలు చాలా అరుదుగా లభిస్తాయి. స్కాండినేవియా భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైన్డీర్లు సంచరిస్తున్నాయి. ఇవి రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తాయి. ఈ పాలలో 20 శాతం కొవ్వు పదార్థం ఉండటంతో చిక్కదనంతో పాటు రుచిగా ఉంటాయి. ఫిన్‌ల్యాండ్‌లో రైన్డీర్ పాలను ‘లేపజువస్టో’ అనే జున్ను తయారీకి వాడతారు. గొర్రె (గ్రీస్) గొర్రె పాలకు గ్రీస్ ప్రసిద్ధి చెందింది. ఆవు పాలతో పోల్చితే గొర్రె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. అందువల్ల ఇవి చీజ్ తయారీకి అత్యుత్తమైనవి. గ్రీస్‌లో గొర్రె పాలతో ఎన్నో వెరైటీల చీజ్‌లను తయారు చేస్తున్నప్పటికీ ‘ఫెటా చీజ్’ అనే వెరైటీని ఇక్కడ ఎక్కువ మంది ఇష్టపడతారు. గొర్రె పాలలో అధికంగా ఉండే కాల్షియం మన దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూస్ (రష్యా, స్వీడన్) ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా లభిస్తున్న మూస్ పాలను రష్యా, స్వీడన్ దేశాలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మూస్ రోజుకు 1 నుండి 6 లీటర్ల పాలను ఇస్తుంది. మూస్ పాలతో తయారయ్యే చీజ్ (మూస్ చీజ్) ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూస్ చీజ్‌ను తయారు చేస్తున్న ఏకైక కేంద్రం (మూస్ హౌస్) స్వీడన్‌లోని బ్జుర్హోమ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మూడు వెరైటీలతో మూస్ చీజ్‌లను తయారు చేస్తున్నారు. గాడిద పాలు గాడిద పాలు మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కలిగిఉన్నట్లు ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. క్రీస్తు పూర్వం ఈజిప్టు రాణి క్లియో పాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆమెనే చెబుతారు. -
గాడిద పాల డెయిరీ.. లీటరు ధర ఎంతో తెలుసా!
చండీగఢ్: హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్(ఎన్ఆర్సీఈ) వారు త్వరలో కొత్తగా ఓ పాల కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అయితే అది సాధారణ విషయమే అయినప్పటికీ ఆ డెయిరీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యంతో పాటు.. లీటరు పాల ధర తెలిస్తే ఇక నోరు వెళ్లబెట్టాల్సిందే. ఆ రీసెర్చ్ సెంటర్ వారు త్వరలో ప్రారంభించేది ఆవు, గెదె పాల డెయిరీ కాదు.. గాడిద పాలడెయిరీ. ఇందుకోసం వారు 10 హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్ కూడా ఇచ్చినట్లు రిసెర్చ్ సెంటర్ వారు తెలిపారు. అయితే ఈ జాతికి చెందిన గాడిదలు ఎక్కువగా గుజరాత్‌లోనే కనిపిస్తాయి. వీటి పాలల్లో జౌషధ గుణాలు మెండుగా ఉంటడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. (చదవండి: హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు) ఇక చిన్న పిల్లలకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. పిల్లలు పుట్టాక రెండు చుక్కలు గాడిద పాలు వారి ముక్కులో వేస్తే ఉబ్బసం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వారి దరి చేరవని మన పెద్దలు చెబుతూ ఉండటం చాలా సార్లు వినే ఉంటారు. అలాగే పెద్ద వారిలో సాధారణంగా వచ్చే ఎన్నో జబ్బులకు కూడా గాడిద పాలు మంచి జౌషధంగా పనిచేస్తాయి. ఇక హలారి గాడిదలకు గుజరాత్లో చాలా డిమాండ్ ఉందంట. అందుకే వీటి పాల ధర లీటర్‌కు 7వేల రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు. అలర్జీ, క్యాన్సర్, ఆస్తమా, వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తని పెంచేందుకు హలారి గాడిదల పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్ వారు హలారి గాడిదల పాల డెయిరీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. (చదవండి: ‘ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది’) మొదట గాడిదల బ్రీడింగ్ జరుగుతుందని, ఆ తర్వాత డెయిరీ పనులు మొదలు పెట్టనున్నట్లు జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం పేర్కొంది. ఈ సందర్భంగా రీసర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, కలుషిత ఆవు, గేదె పాల వల్ల చిన్న పిల్లలు అప్పుడప్పుడు అలర్జీల బారిన పడుతుంటారని ఆయన అన్నారు. అయితే ఈ హలారి బ్రీడ్ గాడిదల పాలతో ఎలాంటి అలర్జీలు రావని ఆయన చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్లు ఈ పాలలో ఉంటాయన్నారు. గతంలో తన ఆధ్వర్యంలోనే గాడిద పాలపై రీసర్స్ ప్రారంభమైనట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
గంటెడైనా చాలు ఖరము పాలు
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : గంగిగోవు పాలు గంటెడైనను చాలు.. కడవెడైననేమి ఖరము పాలు.. అంటూ వేమన కవి భక్తిసారాన్ని వివరించే క్రమంలో బోధిస్తారు. ఖరము (గాడిద) పాలు నిరుపయోగమనే అర్థం. కానీ..విచిత్రంగా ఇప్పుడు ఈ ఖరము పాలకే గిరాకీ వచ్చి పడింది. ఎంతగా అంటే..ఖరము పాలు గరిటెడైనా చాలు..అనేంతగా. అవును మరి చిన్న చాయ్ గ్లాస్ సైజు పాత్ర పాలు రూ.100, రూ.150 ధర పలుకుతోంది. మంచిర్యాలకు చెందిన ముగ్గురు యువకులు మూడు గాడిదలతో ఊరూరా తిరిగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. కావాలనుకున్న వారికి అక్కడికక్కడే పాలు పితికి పోస్తున్నారు. ఈ పాలు తాగితే..ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, దమ్ము, ఆస్మా, దగ్గు తగ్గుతాయని, శ్వాసకోశ వ్యాధులు నయం అవుతాయని వీరు చెబుతున్నారు. ఆవు, గేదె, మేకల పాల కన్నా శ్రేష్టమైనవని వివరిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించాలి.. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు వెళ్లి విక్రయిస్తున్నాం. గాడిదపై ఆధారపడి జీవనంసాగించే వారికి ప్రభుత్వం ఆర్థికంగా రుణాలు మంజూరు చేసి గాడిద పాలవిక్రయాలను ప్రోత్సహించాలి. – ఇరగదిండ్ల వినోద్ పాల్వంచలో గాడిద పాలను పితుకుతున్న యువకుడు -
ఈ పాలకు మస్తు గిరాకి..
సాక్షి, కదిరి(అనంతపురం) : ‘గంగిగోవు పాలు గరిటేడైన చాలు.. ఖరము పాలు కడవడైననేమీ’ అంటూ వేమన చెప్పిన మాటలు ప్రస్తుత రోజుల్లో తిరగబడ్డాయి. గంగి గోవు పాలు సంగతి ఎలా ఉన్నా.. ఖరము (గాడిద)పాలు ఉగ్గేడుంటే చాలు అంటూ పెద్దలు ఎంపర్లాడుతున్నారు. నవజాత శిశువులకు గాడిద పాలు తాపడం ద్వారా ఎలాంటి వ్యాధులు దరిచేరవని, జీర్ణశక్తి మెరుగు పడుతుందని పలువురు విశ్వసిస్తుండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో గాడిద పాలు అమ్మేవారు పది రోజులుగా కదిరి శివారులో మకాం వేశారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన పది కుటుంబాలు దాదాపు 30కి పైగా గాడిదలను వెంట తెచ్చుకుని ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ఉదయాన్నే గాడిదలను తీసుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పాలను అమ్ముతుంటారు. అయితే ఉగ్గు (దాదాపు 5 ఎంఎల్) గాడిద పాలను రూ.200 చొప్పున విక్రయిస్తుండడం గమనార్హం. -
అందాన్ని పెంచే గాడిద పాలు
అందాన్ని పెంచే సౌందర్యసాధనాలెన్నో మార్కెట్లో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రస్తుతం వీటి సరసన గాడిద పాలు కూడా చేరనున్నాయి. గాడిద పాలేంటీ అనుకుంటున్నారా? సాధారణంగా సబ్బులు, అందాన్ని పెంచే క్రీముల్లో పాలు, పాలమీగడ కలిపితయారు చేస్తారు. అయితే సరికొత్తగా ఆ పాల స్థానంలో గాడిద పాలను ఉపయోగించి సబ్బులు తయారు చేస్తుంది ఓ సంస్థ. ఈ సబ్బులు చర్మానికి మరింత అందాన్ని తెస్తాయని సంస్థ చెబుతుండడంతో చాలామంది వీటిని కొనుక్కుంటున్నారు. మరి గాడిద పాల సబ్బు వివరాలేంటో తెలుసుకుందాం... ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అన్నాడు వేమన. కానీ.. ఇప్పుడు ఆ గాడిద పాలే.. అందాన్ని పెంచనున్నాయి. గాడిద పాలు కూడా ఆవు పాలతో సమానమైన పోషకాలు కలిగి ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. గాడిద పాలల్లో.. యాంటీ ఏజింగ్ గుణాలు బోలెడన్ని ఉన్నాయని ఢిల్లీ సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో వెల్లడైంది. అందుకే.. గాడిద పాలతో సబ్బులను తయారుచేసి ఓ స్టార్టప్ కంపెనీ అమ్మకాలు కూడా ప్రారంభించింది. ఆర్గానికో కంపెనీ... ఢిల్లీలోని ఆర్గానికో అనే కంపెనీ గాడిద పాలతో అందాన్ని పెంచే సబ్బులు తయారుచేస్తూ అమ్మకాలు చేపట్టింది. సబ్బుల అమ్మకం మొదలుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మార్కెట్లో మంచి పేరు కూడా సంపాదించింది. గాడిద పాలతో స్నానంచేస్తే.. చర్మం మృదువుగా మారుతుంది. చర్మం కూడా సంరక్షించబడుతుందట. గాడిద పాల వల్ల చర్మానికి అంత త్వరగా కూడా వృద్ధాప్య ఛాయలు రావు. ఎక్కువకాలం చర్మం యవ్వనంగా ఉంటుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారి నిగనిగలాడుతుంది. గాడిద పాలలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను, మొటిమలను తగ్గిస్తాయని ఆర్గానికో కంపెనీ చెబుతోంది. లీటరు పాలు రూ.వెయ్యి... ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గాడిద పాలతో తయారుచేసిన సబ్బులకు మంచి డిమాండ్ ఉంది. సబ్బుతో పాటు.. గాడిద పాలకు కూడా ఉన్నపళంగా డిమాండ్ పెరిగింది. అందుకే లీటర్ గాడిద పాల ధర రూ.వెయ్యికి పైగా పలుకుతోంది. గాడిద పాలను తాగితే.. ఆస్తమా, ఆర్థరైటీస్, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట. గాడిద పాలతో చేసిన సబ్బులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడంతో.. ఈ పాలతో చేసిన ఒక్కో సబ్బు రూ. 500 వరకు పలుకుతుంది. ప్రస్తుతం గాడిద పాలతో తయారైన సబ్బులకు ఆన్లైన్లో కూడా ఆర్డర్లు వస్తుండడం విశేషం. పూర్వీకుల నుంచే.. గాడిద పాలు తాగితే... ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వీకుల నమ్మకం. ఆస్తమా, జలుబు, దగ్గు తగ్గుతాయని పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. దీనిని నమ్మేవారు ఎక్కువమందే ఉన్నారు. గాడిద పాలు... మనిషి పాలలాగే ఉంటాయని, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలతో పాటూ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్వం గ్రామాల్లో చంటి పిల్లలకు తల్లి పాలకు బదులు గాడిద పాలు పట్టేవారు. అంతేగాక ఈజిప్టును పరిపాలించిన అందమైన మహారాణి క్లియోపాత్ర గాడిద పాలతోనే స్నానం చేసేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 2017 నుంచే... ఈ ఏడాది జనవరిలో చండీగడ్‌లో జరిగిన ‘ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గా్గనిక్ ఫెస్టివల్’లో మొదటిసారిగా గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘ఆర్గా్గనికో’ సంస్థ స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ సబ్బులను విక్రయించింది.దీంతో చాలా మంది సందర్శకులు వాటిని కొనేందుకు ఆసక్తిని చూపారు. అయితే ఈ సబ్బు ధర అంత తక్కువేమీ కాదు. 100 గ్రాముల సబ్బును రూ.499లకు విక్రయించారు. ‘ఆర్గా్గనికో’ వ్యవస్థాపకురాలు పూజా కౌల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 2017 నుంచి ఈ సబ్బులను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ‘‘గాడిద పాలలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని.. పెరిగే వయస్సు, చర్మంపై ముడతలను నియంత్రించే శక్తి దీనికి ఉందన్నారు. గాడిద రోజుకు ఒక లీటరు పాలు మాత్రమే ఇవ్వడం వల్ల లీటరు పాలు ధర రూ.2000 పలుకుతుందని వివరించారు. అందువల్లే సబ్బు ధర ఎక్కువగా ఉందన్నారు. మాకు ఢిల్లీ, జైపూర్లలో మాత్రమే ఔట్లెట్స్ ఉన్నాయని, త్వరలో గాడిద పాల ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్ క్రీమ్‌లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. -
గాడిద పాలకు భలే డిమాండ్.. ఒక చెంచా ధర..
చెన్నై : తమిళనాడులో గాడిద పాలకు హఠాత్తుగా డిమాండ్ పెరిగిపోయింది. అన్నవాసల్ ప్రాంతంలో 100 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.500కు విక్రయిస్తున్నారు. పుదుకోట జిల్లాలోని అన్నవాసల్, ఇలు ప్పూర్, ముక్కన్నమౖయెపట్టి గ్రామాల్లో విరుదాచలానికి చెందిన 10 మందికి పైగా ఊరూరా తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. అడిగినవారికి అక్కడికక్కడే పాలు పితికి ఇస్తున్నారు. పాలు ఒక చెంచా రూ.50, 100 మిల్లీలీటర్లు రూ.500లకు విక్రయిస్తున్నారు. ఈ పాలు తాగితే జలుబు, దగ్గు, కామెర్లు వంటి వ్యాధులు నయం అవుతాయని చెప్పి వ్యాపారం చేస్తున్నారు. దీంతో ప్రజలు కొనుగోలు చేసి పాలు తాగుతున్నారు. -
గాడిదలే గంగిగోవులు
► గాడిదపాల విక్రయంతో జీవనోపాధి ► మంచిర్యాలవాసుల వలస జీవితాలు సాక్షి, భీమవరం: గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. ఖరముపాలు కడివిడైనా నేమి అన్న సూక్తి ఆ కుటుంబాలకు వర్తించదు. ఖరము పాలు ఆ కుటుంబాలకు జీవనాధారం. తెలంగాణ, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొన్ని పేద కుటుంబాలు ఏటా ఆంధ్రాకు వలసవచ్చి 8 నెలల పాటు ఇక్కడే ఉంటారు. తమతోపాటు గాడిదలను తీసుకువస్తారు. జిల్లాలవారీగా పట్టణాలను ఎంపిక చేసుకుని ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుంటారు. అక్కడి నుంచి వాహనాల్లో గాడిదలను సమీప గ్రామాలకు ఉదయమే తీసుకువెళతారు. ఒకచోట వాహనాలను ఆపి ఆ గాడిదలను వీధుల్లో తిప్పుతూ వాటిపాలను విక్రయిస్తున్నారు. 50 గ్రాములు.. రూ.100 ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ తదితర జిల్లాల్లో కూడా గాడిద పాలు ఇష్టంగా తాగుతున్నారట. చిన్నటి గ్లాసు (50 గ్రాములు) గాడిద పాల ధర రూ.100. గాడిదలను రోడ్లపై తోలుకువచ్చి అప్పటికప్పుడు పాలు పితికి విక్రయిస్తున్నారు. గాడిదపాలు సర్వరోగ నివారిణి అని వీరు చెబుతుండటంతో నమ్మకం ఉన్నవారు కొనుగోలు చేస్తున్నారు. నమ్మనివారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ సంచార వాసులు భీమవరం–తాడేపల్లిగూడెం రోడ్డులోని బైపాస్ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. గాడిదలను ఆటోల్లో పట్టణాలకు, గ్రామాలకు తీసుకువెళ్లి ఇంటింటికి తిప్పుతూ పాలు విక్రయిస్తున్నారు. ఏడాదిలో 8 నెలలపాటు గాడిద పాలను విక్రయిస్తూ సంచార జీవనం సాగిస్తున్నాయి ఈ కుటుంబాలు. తరువాత తమ సొంత ప్రాంతమైన మంచిర్యాలకు వెళ్లిపోతారు. అక్కడ రోళ్లు తయారు చేసి నాలుగు నెలల పాటు ఉంటారు. తరువాత మళ్లీ సంచార జీవితమే. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో.. గాడిదపాలు సర్వరోగ నివారణి గ్యాస్, బీపీ, షుగర్ వ్యాధులు నడుం, కీళ్ల నొప్పులు, ఆయాసం తగ్గుతుంది. పచ్చిపాలు తాగాలి. మా పెద్దలు చెప్పారు. మేం నమ్ముతున్నాం, ఆచరిస్తున్నాం. మేం కూడా ఇవే తాగుతున్నాం. నమ్మిన వాళ్లు కొంటారు. కొందరు నవ్వుతూ చూస్తారు. ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పాలు విక్రయిస్తాం. -లాలూ, మంచిర్యాల వాసి -
ఆ పాలు.. లీటరు రూ. 6 వేలు
అనపర్తి: కాలం మారింది. గాడిదను ఓ అల్పజీవిగా, ఓ తిట్టుపదంగా మాత్రమే పరిగణించే రోజులకు కాలం చెల్లింది. ‘కడివెడైననేమి ఖరము పాలు’ అన్న మాటనూ మార్చుకోవలసి వస్తోంది. మరి.. గాడిద పాలకు పెరిగిన గిరాకీ అలా ఉంది. ఆ గిరాకీ ఎంత అంటే లీటరు రూ.6 వేల వరకు రేటు పలికేటంత. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన కొందరు అనపర్తికి బుధవారం సుమారు 80 ఆడ గాడిదలను తోలుకు వచ్చారు. వాటిని సంపన్నుల వాకిళ్ల ముందుకు తీసుకు వెళ్లారు. ఇంతకీ విషయమేమిటంటే.. గాడిద పాలు తాగితే ఉబ్బసం, అజీర్తి, కీళ్ల నొప్పులు వంటి పలు రోగాలు మటుమాయమవుతాయన్న నమ్మకంతో పలువురు ఆ పాల కోసం ఎగబడ్డారు. దీంతో గిరాకీ పెరిగి లీటరు రూ.6 వేలకు అమ్మారు. ఒక్కో గాడిద రోజుకోసారి 200 నుంచి 250 మిల్లీ లీటర్లు మాత్రమే పాలు ఇవ్వడంతో బుధవారం పాలు దొరకని వారు మర్నాడు పాలు తమకే ఇచ్చేలా అడ్వాన్సు కూడా చెల్లించారు. అజీర్తి, ఉబ్బసంతో బాధపడేవారికి గాడిద పాలు మంచి ఔషధమని గాడిదల పెంపకందారుడు మాచర్ల కాలయ్య చెప్పారు. అనేక చోట్ల లీటర్లు రూ.2 వేల వరకూ పలుకుతుండగా అనపర్తిలో ఏకంగా రూ.6 వేల వరకూ పెరగడం విశేషం. -
25 మిల్లీలీటర్ల గాడిద పాలు రూ.100
కాకినాడ : ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అన్న పద్యాన్ని బహుశా తిరగరాయాలేమో! ఔషధ విలువలున్నాయన్న నమ్మకంతో కొంతమంది గాడిద పాలు కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వడ్డీ రాజుల కులస్తులు గాడిద పాలు విక్రయిస్తూ పొట్ట పోసుకుంటున్నారు. వారు శుక్రవారం కోరుకొండలో మకాం వేశారు. 25 మిల్లీలీటర్ల గాడిద పాలను చిన్న సీసాలో పోసి రూ.100కు విక్రయిస్తున్నారు. ఇవి తాగితే ఉబ్బసం, నడుంనొప్పి, కడుపునొప్పి తదితర రోగాలు నయమవుతాయని గాడిదపాలు విక్రయిస్తున్న గణేష్, గంగారామ్, చంద్రమ్మలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఒక్కో గాడిద ఆరు నెలలపాటు రోజుకు పావులీటరు చొప్పున పాలు ఇస్తుందన్నారు. ఆ పాలు అమ్మగా వచ్చిన డబ్బులే తమ కుటుంబాల్లోని 20 మందికి జీవనాధారమని చెప్పారు. ప్రతి గ్రామంలో రెండేసి రోజులుంటామన్నారు. తమవద్ద సుమారు పది గాడిదలున్నాయని చెప్పారు. -
ఖరము పాలు
జంతువులన్నింటిలో గాడిద అంటే మనుషులకు చాలా తక్కువ అభిప్రాయం. తరతరాలుగా ఆ మూగ జీవి చేత గాడిద చాకిరీ చేయించుకొని దాన్నే అనేక విధాలుగా ఆడిపోసుకొనే ఆనవాయితీ అన్ని దేశా ల్లోనూ, భాషలలోనూ కనిపిస్తుంది. ‘గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు’ అన్నారు వేమన. ఆయనకు గోవు మీద భక్తి ఉంటే ఉండవచ్చుగాక. మధ్యలో గాడిదను తెచ్చి నిందించటం ఎందుకు? ఈ రోజు ఆధునిక శాస్త్ర జ్ఞులు గాడిద పాలకు విశిష్టత ఉంది అంటున్నారు. ప్రాచీన కాలంలోనే, గాడిద పాల గొప్పతనాన్ని పాశ్చా త్య వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రాటిస్ గుర్తించాడు. జ్వరాలకు, కాలేయ జబ్బులకూ, విషాహారానికీ, ఆఖరికి కీళ్ల నొప్పు లకూ అవి దివ్యౌషధమని ఆయన ఆనాడే చెప్పాడు. అతిలోక సుం దరి క్లియోపాత్రా రోజూ గాడిద పాలతో స్నానం చేసేదట. ఆమె అందం వెనక రహస్యాలలో అదొకటని వేమన గారికి తెలియకపోతే పాపం గాడిద ఏం చేస్తుంది? వేమన అంతగా ఈసడించుకొన్న గాడిద పాలు, తల్లి పాలు లభించని పసిపిల్లలకు అమృతప్రాయం. మనుషులలో తల్లి పాలకు ఉండే సుగుణాలన్నిటికీ గాడిద పాల లక్షణాలు సన్నిహితంగా ఉంటాయి. ఆవు పాల కంటే గాడిద పాలలో క్యాలరీలు తక్కువ, కొవ్వు తక్కువ, కొలెస్టరాల్ తక్కువ. ఇన్ని సద్గుణాలు ఉండ బట్టే, ప్రస్తుతం కొన్ని దేశాలలో గాడిద పాల వాడకం, అమ్మకం పెంచేందుకు వ్యాపార సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎటొచ్చీ గాడిద పాల ఖరీదు చాలా ఎక్కువ. లీటరు యాభై డాలర్లపై మాటే. అంటే మూడు వేల రూపాయల పైచిలుకు. అందుకే అందరికీ అందుబాటు లో ఉండేలా, పాశ్చాత్య దేశాల్లో కొన్ని కంపెనీలు వాటి ని ఉగ్గుగిన్నెడు రెండు డాలర్ల చొప్పున అమ్ముతున్నాయి. అవును మరి, మంచి పోషణ ఉన్న జెర్సీ ఆవు రోజుకు ముప్పై లీటర్ల పాలు ఇస్తుంది. గాడిదలు తలకు రోజుకు ఒక్క లీటరు పాలు మించి ఇవ్వవు, అదీ పిల్ల గాడిదను దగ్గర ఉంచి జాగ్రత్తగా స్వహస్తాలతో పిండుకొంటేనే. మరి ఇంకా అంటారా ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు’ అని? గాడిదలో కొంచెం ఇబ్బందికరమైన గుణం ఒకటే. మొండితనం! అది యజమాని పట్ల ఎంతో విశ్వా సంగా ఉంటుంది, ఎన్నో రకాల అడ్డమైన చాకిరీ చేస్తుం ది, కానీ తను చెయ్యగూడదనుకొన్న పని మాత్రం నయానా భయానా ఎంత చెప్పినా చెయ్యదు. ఈ మొండితనం మనకు నచ్చితే దాన్ని స్వేచ్ఛా ప్రీతీ, పట్టుదలా, దృఢనిశ్చయం అని మెచ్చుకొంటాం. నచ్చకపోతే, శఠం, హఠం, రెటమతం అని గాడిదను ఈసడించుకొన్నట్టే ఈసడించుకొంటాం. లోకం పోకడ! ఎం. మారుతి శాస్త్రి