చండీగఢ్: హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్(ఎన్‌ఆర్‌సీఈ) వారు త్వరలో కొత్తగా ఓ పాల కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అయితే అది సాధారణ విషయమే అయినప్పటికీ ఆ డెయిరీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యంతో పాటు.. లీటరు పాల ధర తెలిస్తే ఇక నోరు వెళ్లబెట్టాల్సిందే. ఆ రీసెర్చ్ సెంటర్ వారు త్వరలో ప్రారంభించేది ఆవు, గెదె పాల డెయిరీ కాదు.. గాడిద పాలడెయిరీ. ఇందుకోసం వారు 10 హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్ కూడా ఇచ్చినట్లు రిసెర్చ్ సెంటర్ వారు తెలిపారు. అయితే ఈ జాతికి చెందిన గాడిదలు ఎక్కువగా గుజరాత్‌లోనే కనిపిస్తాయి. వీటి పాలల్లో జౌషధ గుణాలు మెండుగా ఉంటడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. (చదవండి: హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు)
ఇక చిన్న పిల్లలకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. పిల్లలు పుట్టాక రెండు చుక్కలు గాడిద పాలు వారి ముక్కులో వేస్తే ఉబ్బసం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వారి దరి చేరవని మన పెద్దలు చెబుతూ ఉండటం చాలా సార్లు వినే ఉంటారు. అలాగే పెద్ద వారిలో సాధారణంగా వచ్చే ఎన్నో జబ్బులకు కూడా గాడిద పాలు మంచి జౌషధంగా పనిచేస్తాయి. ఇక హలారి గాడిదలకు గుజరాత్‌లో చాలా డిమాండ్ ఉందంట. అందుకే వీటి పాల ధర లీటర్‌కు 7వేల రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు. అలర్జీ, క్యాన్సర్, ఆస్తమా, వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తని పెంచేందుకు హలారి గాడిదల పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్ వారు హలారి గాడిదల పాల డెయిరీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. (చదవండి: ‘ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది’)
మొదట గాడిదల బ్రీడింగ్ జరుగుతుందని, ఆ తర్వాత డెయిరీ పనులు మొదలు పెట్టనున్నట్లు జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం పేర్కొంది. ఈ సందర్భంగా రీసర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, కలుషిత ఆవు, గేదె పాల వల్ల చిన్న పిల్లలు అప్పుడప్పుడు అలర్జీల బారిన పడుతుంటారని ఆయన అన్నారు. అయితే ఈ హలారి బ్రీడ్ గాడిదల పాలతో ఎలాంటి అలర్జీలు రావని ఆయన చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్లు ఈ పాలలో ఉంటాయన్నారు. గతంలో తన ఆధ్వర్యంలోనే గాడిద పాలపై రీసర్స్ ప్రారంభమైనట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment