milk dairy
-
పాలు అందరికీ అందుతున్నాయా?
అధికారిక డేటా ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. భారతదేశపు పాల ఉత్పత్తి మెజా రిటీ బర్రెల నుండి లభిస్తుండగా, ఆవు పాల వాటా పెరుగుతోంది. 2021 నాటికి ఆవు పాల వాటా 48.2%. 2019లో విడుదల చేసిన 20వ పశుగణన ప్రకారం, ఆవులు బర్రెలు, పాలు ఇచ్చేవి వట్టి పోయినవి కలిపి, దేశంలో మొత్తం పాడి పశువులు 12.57 కోట్లు. మునుపటి గణనమీద ఇది 6% పెరుగు దల. పాలు ఇచ్చే పశువుల సంఖ్య వేరుగా లేదు. వట్టి పోయిన పశువుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? పశువుల సంఖ్యలో పెరుగుదల ఎట్లా సాధ్యం? ప్రభుత్వం ఇస్తున్న లెక్కలకూ, క్షేత్ర పరిస్థితికీ మధ్య తేడా ఉన్నది. పలుచనవుతున్న పాలుదేశంలోని 110 బిలియన్ డాలర్ల పాడి పరిశ్రమలో డెయిరీ సహకార సంఘాలు, ప్రైవేట్ సంస్థలు, ‘అమూల్’, ‘మదర్ డెయిరీ’ వంటి ప్రభుత్వ సంస్థలతో కూడిన సంఘటిత రంగం వాటా కేవలం 30 బిలియన్ డాలర్లు. ఇది 30 శాతం కంటే తక్కువ. భారతదేశంలోని పాల ఉత్పత్తిలో సగానికి పైగా ప్రాసెస్ అవుతున్నది. అంటే నెయ్యి వగైరా వాటికి లేదా ఇతర ఉత్పత్తులలో ఒక ముడి పదార్థంగా వాడతారు. మిగిలిన 48% పాలుగా అమ్ముతున్నారు. నిత్యం పాలు వాడే హోటళ్ళు, స్వీట్ దుకాణాలలో పన్నీర్ కొరకు కూడా డిమాండ్ పెరుగుతోంది. పెద్ద హోటళ్ళు వాళ్ళకు అవసరమైన పాలను అధిక ధరకు కొని, వినియోగ దారుల నుంచి వసూలు చేయగలవు. దరిమిలా చిన్న హోటళ్ళు, చాయ్ దుకాణాలకు అంతగా పాలు దొరక కపోవచ్చు. లేదా ఆ ధర వాళ్ళు పెట్టలేరు. ముడి పాల కొరకు ఉన్న ఇటువంటి పోటీ గురించి, అంతర్గత డిమాండ్ గురించి, ఆ యా వినియోగ వర్గాలు చెల్లిస్తున్న ధరల గురించి విశ్లేషణలు లేవు. పోటీ పడలేని వ్యక్తులు, రంగాలు అసంఘటిత రంగంలోనే ఎక్కువ. పర్యవసానంగా, చాయ్ దుకాణాల చాయ్‌లో పాల ‘శాతం’ తగ్గుతున్నది. కొన్ని ఉత్పత్తులలో పాలు పలుచన అవుతున్నాయి.చిన్న పిల్లల ఎదుగుదలకు ముడి పాలు అవస రమని వైద్యులు, పోషకాహార నిపుణులు నిత్యం వల్లెవేస్తున్న తరుణంలో ‘అందరికీ పాలు’ దొరకక పోవడం అన్యాయమే. పేద వాడికి పాలు అందక పోవడం మన ఆహార వ్యవస్థలో ఉన్న తీవ్ర లోపం. ఈ లోపాన్ని సరిదిద్దే ప్రభుత్వ చర్యలు కావాలి. ఒక ఊర్లో ఉత్పత్తి అవుతున్న పాలు, ఇతర ఉత్పత్తులు అక్కడే, లేదా ఆ ప్రాంతంలోనే వినియోగం అయ్యే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి.దిగుమతులతో దెబ్బతినే జీవనోపాధిఅమెరికా సహా వివిధ దేశాల నుంచి ఏటా రూ. 200–300 కోట్ల విలువైన పాల ఉత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. 2020లో భారత ప్రభుత్వం 10,000 టన్నుల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. 2023 జన వరిలో, దేశంలోకి పాలు, క్రీమ్ దిగుమతులు మునుపటి సంవత్సరం కంటే వెయ్యి శాతం పైగా పెరిగి 4.87 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ వంటి దేశాల నుండి వచ్చాయి.పాల ఉత్పత్తుల దిగుమతులను సరళీకృతం చేయా లని భారత్ మీద ఐరోపా కమ్యూనిటీ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఒత్తిడి ఉన్నది. డెయిరీ ఉత్పత్తుల దిగుమతుల మీద సుంకాలు తగ్గించాలని వాణిజ్య ఒప్పందాలలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో భారతదేశం నుండి డెయిరీ దిగుమతులకు నిబంధనలు పెట్టి రష్యా, యూరప్, మెక్సికో, చైనా అనుమతించడం లేదు. డెయిరీ దిగుమతులపై 60–70% సుంకం విధిస్తున్న అమెరికా, భారతదేశం విధించే 30–60% సుంకాలను తగ్గించాలని కోరుతున్నది. ఇంకొక వైపు అమెరికా తన డెయిరీ రంగానికి సంవత్సరానికి 28 బిలియన్ డాలర్ల సబ్సి డీలను ఇస్తుంది. పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే లక్షలాది మంది భారత చిన్న, సూక్ష్మ పాడి రైతుల జీవనోపాధి ఆగమైపోతుంది అనే ఆందోళన నెలకొంది.విధానాలు అనుకూలమేనా?ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 22%. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది 5%. దాదాపు 7 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. పాడి పరిశ్రమ జీవనోపాధులను, వాతావరణ మార్పులను, కులం, మతాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. వినియోగదారులు వివిధ రకాలగా పాలకు ధర చెల్లిస్తున్నారు. పంటల మాదిరే పాడి రైతుకు ఆ వినియోగం నుంచి వస్తున్న డబ్బులో ఎంత శాతం చేరుతున్నది అనే ప్రశ్న ఉన్నది. బర్రె మీద, ఆవుల మీద పెట్టాల్సిన ఖర్చుకు తగినట్టు ముడి పాలకు ధర లేదనీ, ఇంకా ఆదాయం సంగతి దేవుడెరుగు అనీ పాడి రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అనేకం ఉన్నాయి. అందులో అనేకం చిన్న పాడి రైతులు అందుకోలేరు. భారత పాడిపరిశ్రమలో సరళీకృత విధానం చిన్న రైతులకు ముప్పు కలిగిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పాడి రైతులకు భూమి దొరికే అవకాశం తగ్గిపోతున్నది. పట్టణాలలో, పట్టణ శివార్లలో భూమి ధరలకు రియల్ ఎస్టేట్ వలన రెక్కలు రావడం వల్ల చిన్న పాడి రైతు మనగలిగే పరి స్థితులు లేవు.సగటు రైతు ఆదాయం రూ. 7,000 అని ప్రభుత్వం అంటున్నది. పశుపోషణ ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. దేశంలోని రైతులు తమ మొత్తం పశుపోషణ ఆదాయంలో దాదాపు 67% పాడి ద్వారా సంపా దిస్తున్నారు. ఇంకా అనేక రకాల ఉపయోగం పాడి పశువులతో ఉంది. పర్యావరణం వినాశనం అవుతున్న తరుణంలో పశువుల వైవిధ్యం, ఆహారం, సుస్థిర జీవనం మీద దృష్టి పెట్టడం ముఖ్యం. పుడమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పశు పోషణ ఇంకా సమస్యాత్మకంగా మారుతున్నది. హైబ్రిడ్ జాతులతో, పాశ్చాత్య పశు పోషణ పద్ధతుల వల్ల కాలుష్యం పెరుగుతున్నది. అనారోగ్య పశువుల సంఖ్య పెరుగు తున్నది. శుభ్రత పాటించని ఆధునిక డెయిరీల వల్ల పశువుల వ్యాధులు మానవులకు సంక్రమిస్తున్నాయి. పశువులకు సరైన ఆహారం, జీవనం లేని కారణంగా వాటి పాలలో కూడా పోషకాలు ఉండటం లేదు. విషాలు, రసాయనాలు, యాంటీ బయాటిక్స్ వాటికి ఇవ్వడం వలన, వాటి పాల ద్వారా అవి మనుషులకు చేరుతున్నాయి.పశుపోషణలో సంప్రదాయ విజ్ఞానం, నైపుణ్యానికి చాలా విలువ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాడి పశువులను ప్రకృతి వనరుగా పరిగణించాలి. ఈ సూత్రం ఆధారంగా విధానం తీసుకురావాలి. పథకాలు వాటి సుస్థిరతకు, విస్తృతికి ఉపయోగపడే విధంగా రూప కల్పన చెయ్యాలి. స్థానిక పాడి రైతులను స్థానిక మార్కె ట్లతో అనుసంధానం చెయ్యాలి. పాలు, పాల ఉత్పత్తులు గ్రామాలలో ప్రథమంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. పాడి రైతులకు ప్రతి ఏటా చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను ప్రకటించి, అమలు చెయ్యాలి. పాల సహకార సంఘాల సంఖ్యను పెంచాలి. కేంద్రీకృత పాల మార్కెటింగ్ వ్యవస్థకు ఇచ్చే సబ్సిడీలు స్థానిక సహకార సంస్థలకు ఇవ్వాలి. భూమి వినియోగ విధానం రూపొందించి అందులో గడ్డి మైదానాలకు స్థానం కల్పించాలి. పశుగ్రాసానికి, దాణాకు సంబంధించి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలి. పాడి రైతులకు భూమి ఇవ్వాలి. లేదా భూమి ఉన్న రైతుకు పాడి పశువులను అందజెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డివ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
చెప్పాడంటే..చేస్తాడంతే
-
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబు చంపేసిన చిత్తూరు డెయిరీకి పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయా డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపన తర్వాత 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిత్తూరు డెయిరీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం 1945లో చిల్లింగ్ ప్లాంట్‌గా ఏర్పడగా, 1969లో పూర్తి స్థాయి డెయిరీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రోజుకు 2 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో 1988లో చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌గా ఏర్పడింది. జిల్లాలోని మొత్తం డెయిరీ కార్యకలాపాలను దాని పరిధిలోకి తీసుకొచ్చారు. డెయిరీకి అనుబంధంగా పిచటూర్, శ్రీకాళహస్తి, మదనపల్లి, వి.కోట, పీలేరులో మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 1988–93 మధ్య చిత్తూరు డెయిరీ సగటున రోజుకు 2.5 – 3 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే స్థాయికి చేరుకుంది. తిరుమల శ్రీవారి ఆలయానికి పాల ఉత్పత్తుల సరఫరాలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు చిత్తూరు డెయిరీకి అనుబంధంగా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ద్వారా తిరుపతిలో 1992–93లో లక్షన్నర లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంలో బాలాజీ డెయిరీని ఏర్పాటు చేశారు. హెరిటేజ్ కోసం నిర్వీర్యం సరిగ్గా అదే సమయంలో హెరిటేజ్ డెయిరీ పురుడు పోసుకుంది. చంద్రబాబునాయుడు తన డెయిరీ హెరిటేజ్ కోసం లాభాల్లో దూసుకుపోతున్న చిత్తూరు డెయిరీని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడం మొదలు పెట్టారు. ఆర్థిక నష్టాలకు గురిచేసి, చివరికి రైతులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితికి తీసుకొచ్చారు. చెప్పాపెట్టకుండా 2002 ఆగష్టు 31న ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మూత వేశారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు రూ.వందల కోట్లు బకాయి పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2008లో మదనపల్లి చిల్లింగ్ యూనిట్‌ను పాక్షికంగా పునఃప్రారంభించగా, ఆ తర్వాత వచ్చిన పాలకుల నిర్వాకంతో మళ్లీ మూత పడింది. ప్రస్తుతం చిత్తూరు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి యూనియన్ లిక్విడేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రోజుకు 1.5 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో లాభాల్లో నడుస్తున్న బాలాజీ డెయిరీకి చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొట్టడంతో ఎన్డీడీబీకి అప్పగించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. దీని నిర్వహణా బాధ్యతలను ఎన్డీడీబీ శ్రీజ డెయిరీకి అప్పగించగా, ప్రస్తుతం 3 లక్షల లీటర్ల సామర్థ్యానికి విస్తరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్దరణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుంబిగించారు. రాష్ట్రంలో సహకార డెయిరీలకు పూర్వవైభవం తీసుకు రావాలన్న సంకల్పంతో ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్)తో చేసుకున్న విషయం తెలిసిందే. జగనన్న పాల వెల్లువ పథకం కింద ఇప్పటికే 3.07 లక్షల మందితో 3,551 మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాల సేకరణ ద్వారా రూ.393 కోట్లు చెల్లించారు. అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాల సేకరణ ధర వల్ల ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.3,754 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. వీరి కోసం గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా 4,796 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు నిర్మిస్తున్నారు. మరో వైపు మూత పడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రీ ప్యాకింగ్, ప్రాసెసింగ్, అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్రీ ప్యాకింగ్, యూహెచ్‌టీ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా మదనపల్లి యూనిట్‌ను పునరుద్ధరించారు. 2021 నుంచి దీన్ని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. అమూల్ రూ.385 కోట్ల పెట్టుబడులు చిత్తూరు డెయిరీని పునరుద్ధరించడం ద్వారా పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు హెరిటేజ్ ఫుడ్స్‌కు బలమైన పోటీదారుగా నిలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే లక్ష్యంతో డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం అమూల్ సంస్థ ద్వారా రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టిస్తోంది. తొలుత రూ.150 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీరు, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు యూహెచ్‌టీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. డెయిరీ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. శంకుస్థాపనకు ఏర్పాట్లు 2002లో మూత పడిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. జూలై 4వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్నాం చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నాం. లాభాల్లో నడిచిన ఈ డెయిరీని కావాలనే నాశనం చేశారు. ఈ డెయిరీ మూత పడడంతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోయాల్సి వచ్చేది. నాకు ఐదు ఆవులున్నాయి. రోజుకు 18–20 లీటర్ల పాలు పోస్తుంటా. గతంలో లీటర్‌కు రూ.20కి మించి వచ్చేది కాదు. అమూల్ రాకతో ప్రస్తుతం రూ.43 వస్తోంది. నిజంగా చాలా ఆనందంగా ఉన్నాం. డెయిరీ పునరుద్ధరణతో ఈ ప్రాంత పాడి రైతులందరికీ మేలు జరుగుతుంది. – ఎం.చిట్టిబాబు, జి.గొల్లపల్లి, తవనంపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
పాల కల్తీకి చెక్
సాక్షి, అమరావతి: వినియోగ దారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం రాష్ట్రంలో సహకార పాలడెయిరీల్లో డెన్మార్క్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్ ఎనలైజర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పాలల్లో ఉండే కొవ్వు, ఘనపదార్థాలు, నీళ్ల శాతమే కాదు.. ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి కల్తీ పదార్థాలనైనా పసిగట్టే అవకాశం రానుంది. రోజుకు 4.22కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి.. రాష్ట్రంలో 27లక్షల రైతుకుటుంబాల వద్ద 46లక్షల ఆవులు, 62లక్షల గేదెలున్నాయి. వాటి ద్వారా రోజుకు 4.22 కోట్ల లీటర్ల పాలఉత్పత్తి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.34 కోట్ల లీటర్ల పాల వినియోగమవుతుండగా, 2.88 కోట్ల లీటర్లు మార్కెట్‌కు వస్తున్నాయి. దాంట్లో 21.7 లక్షల లీటర్ల పాలను సహకార పాల డెయిరీలు సేకరిస్తుండగా, 47.5 లక్షల లీటర్ల పాలను ప్రైవేటు డెయిరీలు సేకరిస్తున్నాయి. 2.19 కోట్ల లీటర్లు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్కెట్‌కు వస్తున్నాయి. పాలల్లో ప్రధానంగా కొవ్వు పదార్థాలు 4 శాతం, పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్స్) 4.7 శాతం, మాంసకృత్తులు(ప్రొటీన్స్) 3.3 శాతం, నీరు 88 శాతం ఉంటాయి. ఆవు పాలల్లో 69 కిలో కేలరీలు, గేదె పాలల్లో 100 కిలో కేలరీల శక్తి ఉంటుంది. ప్రధానంగా గేదె పాలల్లో కొవ్వు 5.5శాతం, ఎస్ఎన్ఎఫ్ (ఘనపదార్థాలు) 8.7 శాతం, ఆవు పాలల్లో కొవ్వు 3.2 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.3 శాతం ఉంటే మంచి పోషక విలువలున్న పాలుగా పరిగణిస్తారు. కల్తీ లేని పాల సరఫరాయే లక్ష్యం ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే పాలల్లో స్వచ్ఛత ఎంతన్నది ప్రశ్నార్ధకంగా మారింది. రంగు, రుచి, చిక్కదనం కోల్పోకుండా ఉండేందుకు పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతుంటారు. మరికొంతమంది రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తుంటారు. పాలల్లో ప్రధానంగా అమ్మోనియం సల్ఫేట్, డిటర్జెంట్, గ్లూకోజ్, మాల్టోస్, మెలమైన్, ఉప్పు, సోడియం కార్బోనేట్, సోడియం సిట్రేట్, సార్బిటాల్, స్టార్చ్, సుక్రోజ్, యూరియా, వెజిటబుల్ ఆయిల్, ఫార్మాల్డిహైడ్ వంటి కల్తీ పదార్థాలను వాడుతుంటారు. ప్రస్తుతం పాలకేంద్రాల్లో ఉండే మిషనరీ ద్వారా పాలల్లో కొవ్వు, ఘనపదార్థాలు, నీటి శాతాన్ని మాత్రమే గుర్తించగలుగుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీల బలోపేతం ప్రభుత్వ డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీలను బలోపేతం చేయడం ద్వారా కల్తీ పాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాలడెయిరీల్లో హై ఎండ్ ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొక్కటి రూ.84లక్షల అంచనా వ్యయంతో పోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ (ఎఫ్టీఐఆర్) టెక్నాలజీ కలిగిన మిల్క్ ఎనలైజర్స్ (మిల్క్ స్కానర్స్)ను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.5.44 కోట్లు ఖర్చు చేసింది. వీటిద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఘన పదార్థాలు, ఎస్ఎన్ఎఫ్ వంటి వాటితో పాటు 24 పారామీటర్స్‌లో కల్తీ పదార్థాలుగా గుర్తించిన వాటి శాతాన్ని కూడా పసిగడుతుంది.కాగా, పాలసేకరణ, రవాణాలో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు వీలుగా పశుసంవర్ధక శాఖాధికారులకు అధికారాలిచ్చారు. ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పాల శాంపిల్స్‌ను సేకరించి మిల్క్ ఎనలైజర్స్ ద్వారా కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. -
World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా!
తమిళనాడులో భిక్షాటన, బలవంతపు వ్యభిచారం వద్దనుకొని 30 మంది ట్రాన్స్‌జెండర్స్ నిర్ణయించుకున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు 30 మంది 30 ఆవులు కొనుక్కుందామనుకున్నారు. తెలుగువాడైన డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి సపోర్ట్‌గా నిలుచున్నాడు. ఇంకేముంది... 2020లో దేశంలో మొదటి ‘‘ట్రాన్స్ విమెన్ మిల్క్ డెయిరీ’ కోవిల్పట్టిలో మొదలైంది. ఆవులు వారికి పాలు ఇస్తున్నాయి. దాంతో పాటు గౌరవం కూడా. నేటికీ దేశంలో చాలాచోట్ల పాల మీద వచ్చే ఆదాయం ఆ ఇంటి ఆదాయంగా స్త్రీ ఆదాయంగా ఉంటుంది. పాలు ఈ దేశంలో యుగాలుగా ఉపాధి స్త్రీలకు. పాలు అమ్మి గృహ అవసరాలకు దన్నుగా నిలిచిన, నిలుస్తున్న స్త్రీలు ఉన్నారు. వీరి కోసమని పథకాలు ఉన్నాయి. లోన్లు ఉన్నాయి. అవి పొందేందుకు సాయం చేసే ఇంటి పురుషులు ఉంటారు. అయితే ఇటు స్త్రీలుగా, అటు పురుషులుగా గుర్తింపు పొందక, ఎటువంటి అస్తిత్వ పత్రాలు లేక, రేషన్ కార్డులు లేక అవస్థలు పడే ట్రాన్స్‌జెండర్స్ పరిస్థితి ఏమిటి? వీరికి ఉపాధి పొందే హక్కు లేదా? ఎందుకు లేదు? అనుకున్నారు తమిళనాడులో ట్రాన్స్‌జెండర్స్ యాక్టివిస్ట్ గ్రేస్ బాను. ట్రాన్స్‌జెండర్స్ కోసం నిలబడి తమిళనాడులో 30 ఏళ్ల గ్రేస్‌బాను ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందిన తొలి ట్రాన్స్ ఉమన్. అయితే ఆమె ఆ చదువును డిస్కంటిన్యూ చేసి ట్రాన్స్‌జెండర్స్ కోసం మదురైకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే కోవిల్పట్టి జిల్లాలో ఉంటూ తమిళనాడు అంతటా పని చేయసాగింది. ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు పత్రాల కోసం, రేషన్ కార్డుల కోసం, గృహ వసతి కోసం ఈమె అలుపెరగక పని చేస్తున్నా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఆ సమయంలోనే కోవిల్పట్టికి తెలుగువాడైన సందీప్ నండూరి కలెక్టర్‌గా వచ్చారు. ఆయనను గ్రేస్‌బాను కలిసి సమస్యను వివరించారు. కోవిల్పట్టి జిల్లాలో దాదాపు 250 మంది ఎటువంటి దారి లేక రోడ్డుమీద జీవిస్తున్నారని గ్రేస్‌బాను కలెక్టర్‌కు వివరించారు. వీరిలో కొందరు తమ జీవితాలను మార్చుకుందామని అనుకుంటున్నారని తెలియచేశారు. తొలి డెయిరీ ఫామ్ గ్రేస్బానుతో కలిసి సందీప్ నండూరి 30 మంది ట్రాన్స్ ఉమన్‌ను గుర్తించారు. వీరి స్వయం సమృద్ధికి అవసరమైన లోన్లను బ్యాంకులతో మాట్లాడి ఇప్పించారు. ఒక్కొక్కరు ఒక్కో ఆవు కొనుక్కునేందుకు లోను లభించింది. ప్రభుత్వం తరఫున కోవిల్పట్టికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒకటిన్నర ఎకరం భూమి కేటాయించబడింది. ఇక్కడ ఆవులకు కావాల్సిన షెడ్స్, నీళ్లు, మేత సదుపాయం అన్నీ కల్పించుకునే ఏర్పాటు జరిగింది. ఈ ట్రాన్స్ ఉమన్‌కు ఎవ్వరికీ ఇంతకుముందు పశువుల్ని చూసుకోవడం కానీ, పాలు పితకడం కానీ రాదు. వీరికి నిపుణులతో 10 రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ట్రాన్స్ ఉమన్ నుంచి నేరుగా పాలు కొనడానికి కొందరు వైముఖ్యం చూపవచ్చు. అందుకే కలెక్టర్ స్థానిక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాలసంఘానికి వీరి పాలను కొనే ఏర్పాటు చేశారు. పాల సంఘానికి చేరిన పాలకు కులం, మతం, జెండర్ ఉండదు. పుష్టి తప్ప. 2020 జూన్ ప్రాంతంలో దేశంలోనే మొదటిసారిగా, ఒక ప్రయోగంగా ఈ డెయిరీ ఫామ్ మొదలైంది. అందరూ కలిసి... పంచుకుని డెయిరీని 30 మంది కలిసి చూసుకుంటారు. ఎవరి ఆవు బాగోగులు వారు చూసుకుంటారు. ముప్పై ఆవుల నుంచి మొత్తం పాలు సంఘానికి చేరతాయి. సంఘం సాయంత్రానికి వాటి డబ్బును డెయిరీ అకౌంట్లో వేస్తుంది. ఆ పడేది ఎంతైనా 30 సమాన భాగాలు అవుతుంది. నెలకు కనీసం 8 వేల నుంచి 10 వేల రూపాయలు ఒక్కొక్కరికి వస్తున్నాయి. ‘మా కల నిజమైంది. గౌరవంగా బతుకుతున్నాం’ అని ఈ ట్రాన్స్ ఉమన్ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జీవనం సందీప్ నండూరి (ప్రస్తుతం తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్) వీరి కోసం అక్కడే ఉమ్మడి జీవనానికి ఏర్పాటు చేశారు. సందీప్ మీద గౌరవంతో వారు ఆ కాలనీకి ‘సందీప్ నగర్’ అని పేరు పెట్టుకున్నారు. ట్రాన్స్‌జెండర్ లకు నివాసం, జీవనం చాలా ముఖ్యమైనవి. అవి కల్పిస్తే వారు ఈ సంఘంలో భాగమయ్యి తమ ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకుంటారని ఈ డెయిరీ చెబుతుంది. కోవెల్‌పట్టి దారిలో తమిళనాడులోని మరికొన్ని జిల్లాలు ఇలాంటి డెయిరీలు భిన్న వర్గాల కోసం నడపాలని యోచిస్తున్నాయి. మంచిదే కదా. – సాక్షి ఫ్యామిలీ -
కాలగర్భంలో కలిసిపోయిన మిలటరీ ఫామ్స్
న్యూఢిల్లీ: సైనిక యూనిట్లకు పాలు సరఫరా చేసేందుకు బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన మిలటరీ ఫామ్స్ కాలగర్భంలో కలిసిపోయాయి. సైనిక సంస్కరణలలో భాగంగా వీటిని మూసివేసినట్లు భారత సైన్యం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 132 ఏళ్లుగా సేవలందిస్తూ వచ్చిన పాల ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్లలో మిలటరీ ఫామ్స్ ఉన్నాయి. వీటిలో 25 వేల ఆవులు/గేదెలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం వేలాది లీటర్ల పాలు ఇచ్చేవి. భారత్‌లో మొదటి మిలటరీ ఫామ్ 1889 ఫిబ్రవరి 1న అలహాబాద్‌లో ప్రారంభమయ్యింది. స్వాతంత్య్రం వచ్చే నాటికి 130 ఫామ్‌లు, 30 వేల ఆవులు/గేదెలు ఉన్నాయి. 20 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. మిల్క్ ఫామ్స్ నిర్వహణ కోసం సైన్యం ప్రతిఏటా రూ.300 కోట్లు ఖర్చు చేసేది. ఫామ్స్‌ను మూసివేయడంతో వీటిలో ఉన్న ఆవులు, గేదెలను ప్రభుత్వ విభాగాలకు, డెయిరీ సహకార సంఘాలకు తక్కువ ధరకే ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ చదవండి: కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా? సుప్రీంకోర్టుకు ‘సాగు చట్టాల’పై నివేదిక -
దళిత యువతకు మినీ డెయిరీలు!
సాక్షి, హైదరాబాద్: దళిత నిరుద్యోగ యువతకు మినీ డెయిరీల ద్వారా ఉపాధి కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో పాల ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండడం.. డిమాండ్‌కు తగిన విధంగా పాల దిగుబడి లేకపోవడంతో పాడిపరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి పశుసంవర్థక శాఖ అధికారులతో సమాలోచనలు చేసిన ఎస్సీ కార్పొరేషన్.. ఔత్సాహికులతో మినీ డెయిరీలు ఏర్పాటు చేయించాలని భావిస్తోంది. వాస్తవానికి గత ఏడాదే ఈ అంశంపై దృష్టిసారించిన ఎస్సీ కార్పొరేషన్, కరోనా నేపథ్యంలో ఆ ప్రయత్నాలను వాయిదా వే సింది. తాజాగా పరిస్థితులు సద్దుమణుగుతుండ డంతో మళ్లీ మినీ డెయిరీల ఏర్పాటుపై దృష్టి సారించింది. 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పొందుపరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. గరిష్టంగా రూ.4 లక్షలతో.. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న రెండు, మూడు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఎస్సీ కార్పొరేషన్ యోచిస్తోంది. జిల్లాకు సగటున 100 యూనిట్లు మంజూరు చేయా లని భావిస్తోంది. ఒక్కో యూనిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య బ్యాంకు అనుసంధానంతో రుణం ఇచ్చి ఇందులో 60 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ప్రతి డెయిరీ యూనిట్‌కు 3 గేదెలు పంపిణీ చేస్తారు. అదేవిధంగా గేదెలకు షెల్టర్ కోసం ప్రత్యేక షెడ్ ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాజెక్టు యూనిట్ కాస్ట్లో కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. దీంతోపాటు ఆరునెలలకు సరిపడా పశుగ్రాసం కోసం అవసరమైన నిధులకు కూడా ప్రత్యేక మొత్తాన్ని నిర్దేశిస్తారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటున్న అధికారులు.. యూనిట్ విలువ కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండేలా అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. త్వరలోనే సబ్సిడీ పాడిగేదెల పంపిణీ పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు త్వరలోనే సబ్సిడీపై పాడిగేదెలను అందించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలి పారు. గురువారం మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ సబ్సిడీ పాడిగేదెల కోసం 3,834 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించారని, గేదెల పంపిణీకి సంబం ధించి విజయ డెయిరీ సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉం టుందని వెల్లడించారు. కాగా, గతంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన పాడిగేదెల్లో 2,691 గేదెలు చనిపోయాయని, వాటికి సంబంధించి పరిహారం కింద కొత్తగా పాడి గేదెలను కొనుగోలు చేసి వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక నుంచి లీటర్ పాలకు ప్రభుత్వం రూ.3, ఆయా డెయిరీ సంస్థలు రూ.1 చొప్పున కలిపి రైతులకు ప్రోత్సాహకం కింద చెల్లిస్తామ న్నారు. ఇందులో భాగంగా కరీంనగర్, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు పాలుపోసే రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకం బకాయిలలో రూ.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విజయ ఐస్క్రీంల విక్రయాలకు సైకిల్ రిక్షాలు.. విజయ ఐస్క్రీంల విక్రయాల కోసం ప్రత్యేక పుష్ కార్ట్ (సైకిల్ రిక్షా)లను వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ముందుగా 250 పుష్‌కార్ట్‌ల ద్వారా ఐస్ క్రీంల విక్రయాలు ప్రారంభించాలన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, శిల్పారామం, గోల్కొండ కోట, దుర్గంచెరువు వంటి ప్రాంతాల్లో విక్రయాలు చేప ట్టాలన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో అనువైన ప్రాంతాలను గుర్తించి నూతన ఔట్లెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి మార్చిలో వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ రాంచందర్ పాల్గొన్నారు. -
కార్మికుడి చెత్త పని : కంపెనీ క్లోజ్!
అంకారా: టిక్‌టాక్ వీడియో మోజులో పడి ఓ కార్మికుడు తనతో పాటు కంపెనీని కూడా వీధుల్లోకి తీసుకువచ్చాడు. పాల డైరీలో పని చేసే అతడి వెధవ పనికి ఏకంగా డైరీ కంపెనీనే మూతపడింది. ఈ సంఘటన టర్కీలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. టర్కీ, కోన్యాలోని సెంట్రల్ అనాటోలియన్ ప్రావిన్స్‌కు చెందిన ఎంమ్రీ సయర్ అనే వ్యక్తి అక్కడి ఓ పాల డైరీలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం టిక్‌టాక్ వీడియోకోసం డైరీలోని పాల టబ్బులోకి దిగి స్నానం చేశాడు. ( బీట్ రూట్ రసం కాదు.. నదిలోని నీళ్లు..! ) ఆ టిక్‌టాక్ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఎంమ్రీతో పాటు వీడియో తీసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా సదరు డైరీ కంపెనీని మూసి వేయాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోన్యా అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యల కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. Bir süt fabrikasında çekilen ve Tiktok'ta paylaşılan 'süt banyosu' videosu. Fabrikanın 'Konya'da olduğu' iddia ediliyor. pic.twitter.com/erkXhlX0yM — Neden TT oldu? (@nedenttoldu) November 5, 2020 -
చిత్తూరు: పాల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ
-
చిత్తూరు: పాల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ
సాక్షి, చిత్తూరు : జిల్లలోని పూతలపట్టు మండలంలో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో 20మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 100మందికి పైగా కార్మికులు ఉండగా వారిలో 14మంది మహిళా కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. పూతలపట్టు మండలం బండపల్లి హట్సన్ పాల డెయిరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలు కోల్డ్ స్టోరేజ్ కోసం అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఆ వాయువు లీక్ కావడంతో 14మంది అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్వాహకులు చిత్తూరు, గుడిపాల ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. పాల డెయిరీ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.మరోవైపు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా హట్సన్ పాల డెయిరీని పరిశీలించారు. అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ లీక్ సంఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీరియర్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. -
గాడిద పాల డెయిరీ.. లీటరు ధర ఎంతో తెలుసా!
చండీగఢ్: హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్(ఎన్ఆర్సీఈ) వారు త్వరలో కొత్తగా ఓ పాల కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అయితే అది సాధారణ విషయమే అయినప్పటికీ ఆ డెయిరీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యంతో పాటు.. లీటరు పాల ధర తెలిస్తే ఇక నోరు వెళ్లబెట్టాల్సిందే. ఆ రీసెర్చ్ సెంటర్ వారు త్వరలో ప్రారంభించేది ఆవు, గెదె పాల డెయిరీ కాదు.. గాడిద పాలడెయిరీ. ఇందుకోసం వారు 10 హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్ కూడా ఇచ్చినట్లు రిసెర్చ్ సెంటర్ వారు తెలిపారు. అయితే ఈ జాతికి చెందిన గాడిదలు ఎక్కువగా గుజరాత్‌లోనే కనిపిస్తాయి. వీటి పాలల్లో జౌషధ గుణాలు మెండుగా ఉంటడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. (చదవండి: హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు) ఇక చిన్న పిల్లలకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. పిల్లలు పుట్టాక రెండు చుక్కలు గాడిద పాలు వారి ముక్కులో వేస్తే ఉబ్బసం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వారి దరి చేరవని మన పెద్దలు చెబుతూ ఉండటం చాలా సార్లు వినే ఉంటారు. అలాగే పెద్ద వారిలో సాధారణంగా వచ్చే ఎన్నో జబ్బులకు కూడా గాడిద పాలు మంచి జౌషధంగా పనిచేస్తాయి. ఇక హలారి గాడిదలకు గుజరాత్లో చాలా డిమాండ్ ఉందంట. అందుకే వీటి పాల ధర లీటర్‌కు 7వేల రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు. అలర్జీ, క్యాన్సర్, ఆస్తమా, వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తని పెంచేందుకు హలారి గాడిదల పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్ వారు హలారి గాడిదల పాల డెయిరీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. (చదవండి: ‘ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది’) మొదట గాడిదల బ్రీడింగ్ జరుగుతుందని, ఆ తర్వాత డెయిరీ పనులు మొదలు పెట్టనున్నట్లు జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం పేర్కొంది. ఈ సందర్భంగా రీసర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, కలుషిత ఆవు, గేదె పాల వల్ల చిన్న పిల్లలు అప్పుడప్పుడు అలర్జీల బారిన పడుతుంటారని ఆయన అన్నారు. అయితే ఈ హలారి బ్రీడ్ గాడిదల పాలతో ఎలాంటి అలర్జీలు రావని ఆయన చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్లు ఈ పాలలో ఉంటాయన్నారు. గతంలో తన ఆధ్వర్యంలోనే గాడిద పాలపై రీసర్స్ ప్రారంభమైనట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
చంద్రబాబు కనుసన్నల్లోనే డెయిరీ నాశనం
సాక్షి, ఒంగోలు: అనుకున్నదే జరిగింది.. ఒంగోలు డెయిరీ నిండా మునిగింది.. టీడీపీకి చెందిన పాలకమండలి నిండా ముంచితే నూతనంగా ఏర్పడిన అధికారులతో కూడిన కమిటీ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు డెయిరీని కోలుకోలేని స్థితిలోకి నెట్టింది. పాడి రైతుల ఆందోళనలతో దిగొచ్చిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పాలక మండలిని రద్దు చేసి అధికారులతో కూడిన నూతన కమిటీని ఏర్పాటు చేసింది. నూతన కమిటీ ఉన్న ఉద్యోగులను కాదని అదనంగా మరో ముగ్గురు ఉన్నతాధికారులను తీసుకొని జీతాల రూపంలో డెయిరీపై నెలకు అదనంగా రూ.3 లక్షల భారం మోపింది. అలా 18 నెలల పాటు కాలంగడిపి అదనపు భారం డెయిరీ నెత్తిన మోపి ఇంకా ముంచేశారు. చివరకు డెయిరీకి ఏదో వెలగబెడతారకున్న సీఈవో జగదీశ్వరరావు వారం రోజుల క్రితం రాజీనామా చేసి జారుకున్నారు. అదనపు ఉద్యోగులు కేటాయింపుతో డెయిరీకి అదనంగా రూ.62 లక్షల భారం తప్ప ఒరిగిందేమీ లేదు. అంతకు ముందే సొసైటీ యాక్టులో ఉన్న డెయిరీని కంపెనీ యాక్టులోకి మార్చి అప్పటి చైర్మన్ చల్లా శ్రీనివాసరావు డెయిరీని కోలుకునే అవకాశాలు కూడా లేకుండా చేశాడు. పాత పాలకమండలి చైర్మన్ చల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డెయిరీని అప్పట్లో నిండా ముంచారు. పాల‘మాల్యా’గా పేరొందిన ఆయన డెయిరీని దాదాపు రూ.80 కోట్ల అప్పుల్లోకి నెట్టి ఒట్టిపోయిన గేదెను వదిలించుకున్న తీరులా చేశాడు. చంద్రబాబు కనుసన్నల్లోనే డెయిరీ నాశనం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఒంగోలు డెయిరీ సర్వనాశనమైందని జిల్లాలోని ప్రతి పాడి రైతుకు తెలుసు. తన హెరిటేజ్ డెయిరీని లాభాల్లోకి వచ్చేలా చేసి ఒంగోలు డెయిరీని కోలుకోలేని స్థితిలోకి తెచ్చిందే చంద్రబాబు.. అన్న ప్రచారం జిల్లా రైతుల్లో ఉంది. డెయిరీని తిరిగి యథావిధిగా నిర్వహించుకునేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీడీడీసీఎఫ్ నుంచి రూ.35 కోట్ల రుణం ఇప్పించింది. డెయిరీని పూర్తిగా కోలుకోలేని స్థితిలోకి నెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టించి మరీ రుణం ఇప్పించింది. రుణానికి తాకట్టుగా డెయిరీకి చెందిన రూ.58.98 కోట్ల విలువైన 8.75 ఎకరాలను తనఖా పెట్టారు. దీనికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయా సందర్భాల్లో ప్రకటించిన రెపోరేటు మీద 2 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం ప్రస్తుతం ఈ రుణానికి 8.25 శాతం వడ్డీ రేటు పడుతుంది. అందుకుగాను రుణాన్ని 2020 నవంబర్ నుంచి నెల నెలా కంతుల వారీగా వాయిదాలు చెల్లించేలా మారిటోరియం ఉంటుంది. అప్పటి నుంచి నెలకు రూ.18,01,062 వాయిదాలుగా చెల్లించాలి. ఆ నిధులను డెయిరీ నిర్వహణతో పాటు అంటే ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, డెయిరీ అభివృద్ధికి వినియోగించాల్సిందిపోయి అప్పనంగా కాజేశారు. ఈ ఏడాది నవంబర్ నుంచి 120 సమాన వాయిదాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంది. భారంగా జీత భత్యాలు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు తయారైంది ఒంగోలు డెయిరీ పరిస్థితి. అసలే అప్పుల్లో ఉన్న డెయిరీకి అదనంగా కొత్తగా బి.జగదీశ్వరరావు అనే వ్యక్తిని సీఈఓను నియమించారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు సంబంధించిన జీతాలు నెలకు రూ.40 లక్షలు. అసలే భారంగా మారితే నూతన కమిటీ కొత్తగా అదనంగా మరో ముగ్గురు ఉద్యోగులను నియమించింది. ఈ ముగ్గురి జీతభత్యాలు వెరసి నెలకు అక్షరాలా రూ.3 లక్షలు. సీఈవోకు నెలకు రూ.లక్ష జీతం, అదనంగా అదనపు సౌకర్యాల పేరుతో హీనపక్షాన నెలకు రూ.50 వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా నియమించింన కమిటీ ముగ్గురికీ కలిపి నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తూ వచ్చారు. అదనంగా చేరిన వారి జీతభత్యాలు పేరుతో మొత్తం 18 నెలలకు కలిపి రూ.62 లక్షలు అప్పనంగా తీసుకున్నారు. డెయిరీని గాడిలో పెట్టి లాభాల బాట పట్టిస్తారనుకుంటే ఆ విషయాన్ని విదిలేసి పాత కమిటీని కాపాడే పనిలో నిమగ్నమై డెయిరీని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టారు. చివరకు కోలుకోలేని స్థితిలోకి డెయిరీని నెట్టి డెయిరీని కాపాడతాడనుకున్న సీఈవో జగదీష్ రాజీనామా చేసి గప్‌చప్‌గా వెళ్లిపోయాడు. బొక్కింది కక్కించేదెవరు? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు బొక్కిన రూ.కోట్లు కక్కించేది ఎవరు. పాత కమిటీ దాదాపు రూ.80 కోట్లకు పైగా బొక్కి డెయిరీని నిలువునా నష్టాల్లోకి నెట్టింది. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం రోజు డెయిరీ చైర్మన్ జె.మురళీ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించి కాజేసిన మొత్తాన్ని తిరితి రాబడతామని ప్రతినబూనారు. ఇప్పటికీì ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా పాత కమిటీ పాపాలను వెనకేసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారన్న ఆరోపనలు వినవస్తున్నాయి. ఫొరెన్సిక్ ఆడిట్లో ఎన్నో అక్రమాలు బయట పడుతుంటే అందుకు ప్రస్తుతం ఉన్న అధికారులు రికార్డులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. లాభాలతో సాగిపోతున్న డెయిరీని చల్లా శ్రీనివాసరావు కంపెనీ చట్టంలోకి మార్చటం వెనుకే దోచుకునే దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్లు అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. దోచుకున్న డబ్బును అప్పులు తిరిగి చెల్లిస్తున్నామంటూ నూతన కమిటీ తిరిగి డెయిరీని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టేసిందనడంలో సందేహం లేదు. 15 ఏళ్లకు పైగా చైర్మన్‌గా ఉన్న కందుకూరుకు సమీపంలోని ఓగూరుకు చెందిన టీడీపీ నాయకుడు చల్లా శ్రీనివాసరావు రూ.కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
గిట్టుబాటు ధర ఇవ్వని ప్రైవేటు డెయిరీలు
కడప అగ్రికల్చర్ : జిల్లాలోని పాడి రైతుల కష్టాన్ని ప్రైవేటు డెయిరీలు దోపిడీ చేస్తున్నాయి. పాలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా మొండి చేయి చూపుతున్నాయి. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి చితికి పోతోంది. వెన్నశాతం పేరుతో తక్కువ ధరలు నిర్ణయిస్తూ పాలదోపిడీకి పాల్పడుతున్నాయి. ఇందులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ కూడా భాగస్వామ్యం కలిగి ఉందని పాడి రైతులు ధ్వజమెత్తుతున్నారు. గత ప్రభుత్వంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు డెయిరీలు పుట్టుకొచ్చాయి. అవి చేస్తున్న దోపిడీ వ్యాపారాలను పట్టించుకోక పోవడంతోనే నేటి ధరలు పాడి రైతులకు శాపంగా మారాయి. జిల్లాలోని రైతాంగం అధిక శాతం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోంది. దాదాపు 1.50 లక్షల మంది పంటల సాగు, పాడి పశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆవులు 1,38,132, బర్రెలు 4,57,504 ఉన్నాయి. ఇందులో పాలిచ్చే ఆవులు 46,485, బర్రెలు 1,50,658 ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 2,25,900 లీటర్ల నుంచి 2,32,625 లీటర్ల వరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 90,832 లీటర్ల నుంచి 1,05,658 లీటర్ల పాలను రైతులు గ్రామాల్లోని, పట్టణాల్లోని వినియోగదారులకు విక్రయిస్తుండగా మిగతావి ప్రైవేటు డెయిరీలకు పోస్తున్నారు. పాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో పశువుల కాపాడుకుంటున్నారు. కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలలో అత్యధికంగా ప్రైవేటు డెయిరీలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు డెయిరీలు పాడి రైతులను నిలువునా దోచుకుంటూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. లీటరు పాలకు సాలీడ్ నాన్ ఫ్యాట్ (ఎస్ఎన్ఎఫ్), ఫ్యాట్ల ఆధారంగా పాలకు ధర నిర్ణయించడం, ట్యాక్స్‌ల పేరుతో మరికొంత కోత కోస్తున్నారు. సాధారణంగా పాలను కొలత పాత్రలో పోసి ల్యాక్టో మీటరు (ఎల్ఆర్) ఆధారంగా ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం, ఫ్యాట్ 4.5 మేరకు రీడింగ్ వస్తే లీటరుకు రూ.35 నుంచి 40లు నిర్ణయించాల్సి ఉంది. కానీ రూ.25 నుంచి 27లు వరకు మాత్రమే ధరను నిర్ణయించి ఇస్తున్నారు. రైతులను నిలువు దోపిడీ చేసేందుకు రోజుకో ప్రైవేటు డెయిరీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణను చేస్తున్నాయి. ఇవి రోజుకు 1,35,068 లీటర్ల నుంచి 1,26,967 లీటర్ల పాలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పాడి రైతు తేజోమయం...:2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పశుక్రాంతి పథకాన్ని తీసుకొచ్చి వారి కు టుంబాల్లో సంతోషం నింపారు. 2006లో డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో పాల శీ తలీకరణ (బీఎంసీయూ) కేంద్రాలను ఏర్పాటు చే యించారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సబ్సిడీపై దాణా, గడ్డి విత్తనాలు, పోషకా ల మందులు ఇచ్చేవారు మొత్తం 1.20 లక్షల లీట ర్ల పాలను విజయా డెయిరీ వారు సేకరణ చేసేవారు. పాడి రైతులకు ఎంతో ఊరట లభించేది. చంద్రబాబు స్వలాభం కోసం విజయా డెయిరీ నిర్వీర్యం జిల్లాలో తలమానికంగా నిలిచిన విజయా డెయిరీని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుటుంబం నిర్వహిస్తున్న హేరిటేజ్ అభివృద్ధి కోసం నిర్వీర్యం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల కుటుంబాల రైతులు విజయా డెయిరీకి నిత్యం పాలుపోసి జీవనం సాగిస్తున్నారు. 1999లో, 2014 లోనూ తన సొంత హెరిటేజ్ డెయిరీ అభివృద్ధి కోసం విజయా డెయిరీని నిలువునా ముంచారు. బాబుగారి హెరిటేజ్ సంస్థ లీటరు పాలను ఎన్నికల ముందు వరకు రూ.52లతో ప్యాకెట్‌ను విక్రయించారు. ఎన్నికలు ముగియగానే దాన్ని కాస్తా రూ.54 చేశారు. ప్రస్తుతం లీటరు పాల ప్యాకెట్ ధర రూ.60 చేశారు. మిగతా డెయిరీలు కూడా లీటరు రూ.60 ధరతో ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ఇది దోపిడీ కాదా అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రైతుల వద్ద మాత్రం లీటరుకు రూ.25 నుంచి 27లకు కొనుగోలు చేసి అధిక లాభంతో అవే పాలను ప్యాకెట్లు చేసి విక్రయిస్తారా? అని ధ్వజమెత్తుతున్నారు. పోషణ భారంగా మారింది... ప్రైవేటు డెయిరీల పాలదోపిడీతో పాడి పశువుల పోషణ భారంగా మారింది. గతిలేని పరిస్థితిలో ఆ డెయిరీలకు పాలను పోస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతులకు భరోసా ఇస్తున్నట్లు ప్రకటించారు.మాకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ప్రైవేటు డెయిరీలను కట్టడి చేయాలి. ప్రభుత్వ ఆధీనంలోని విజయా డెయిరీ పాలను సేకరించేలా చూడాలి. – కె.చిన్నమ్మ,పాడిరైతు, ఎస్ సోమవరం, సంబేపల్లె మండలం. నాటి ప్రభుత్వంనిలువునా ముంచింది... టీడీపీ ప్రభుత్వం పాలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ప్రభుత్వ ఆధీనంలోని విజయా డెయిరీని నిర్వీర్యం చేయించారు. ప్రైవేటు డెయిరీలు పట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చేలా ప్రోత్సహించారు. దీంతో పాడి రైతులు గిట్టుబాటు కాక పాలను ఇప్పటికీ తెగనమ్ముకోవాల్సి వస్తోంది. రైతులు ఆర్ధికంగా చితికి పోతున్నారు.– సుబ్బారెడ్డి, పాడి రైతు, వెంకట్రామ్పల్లె, చింతకొమ్మదిన్నె మండలం. -
పాపాల పుట్ట పగిలేనా..!
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీలో తోడే కొద్దీ అక్రమాల పుట్ట కదులుతోంది..రూ.కోట్లకు కోట్లు కొల్లగొట్టిన తెలుగుదేశంకు చెందిన డెయిరీ పాత పాలకమండలి పాలు, పాల పదార్థాల రూపంలో తాగేసిన, తినేసిన దాదాపు రూ.100 కోట్ల లెక్కలు మాయం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అందుకే పాత అధికారులను పక్కన పెట్టి డెయిరీకి నూతనంగా ముగ్గురు అధికారులను నియమించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో డెయిరీ లెక్కలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్స్ నివేదికలో చూపించిన రిపోర్టులు మాయం చేసే పనిలో కొత్త అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో అక్రమాలు చేసి కాజేసిన డెయిరీ సొమ్మును తిరిగి చెల్లించాలని రూపొందించిన రికవరీ ఫైళ్లు కనుమరుగు చేసినట్లు సమాచారం. బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు చూపించిన డెయిరీలోని నిల్వలు మాయంచేసి చివరకు బ్యాంకులకే కుచ్చుటోపీ పెట్టిన ఘనత పాత కమిటీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావుది. చివరకు రూ.కోట్ల కొద్దీ బొక్కి ఒట్టిపోయిన గేదెను చేసి అధికారులతో ఏర్పాటైన నూతన కమిటీకి డెయిరీని అప్పగించిన చల్లా ఇప్పటికీ అధికార పార్టీని అడ్డంపెట్టుకొని మరీ డెయిరీలో తన పెత్తనమే చెలాయిస్తున్నారు. అందుకే ఆయన చేసిన పా‘‘పాలు’’బయటకు రానీయకుండా ప్రస్తుతం ఉన్న అధికారులపై అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో బెదిరింపులకు దిగిమరీ తన తప్పులు బయట పెట్టకుండా తన జులుం ప్రదర్శిస్తున్నారు. అందుకే నూతనంగా డెయిరీలోని అక్రమాలు బయటకు తీసేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్‌కు చెందిన ఆడిట్ కమిటీకి ఇక్కడ సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి, ఐఏఎస్ అధికారి అయిన జుజ్జవరపు మురళిని కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మితో పాటు పలువురు అధికారుల జిల్లా అధికారులు, రాష్ట్రంలోని పలు డెయిరీలకు చెందిన అధికారులను కమిటీలో వేశారు. అయితే పూర్తి స్థాయి కమిటీ 2018 జూన్ నెలలో మొదలు పెట్టి జూలై 19 కల్లా ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటై దాదాపు 11 నెలలు కావస్తుంది. కానీ ఇప్పటికీ డెయిరీలో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలు వెలికితీయటంలో కమిటీ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో పాడి రైతులకు అర్థం కావటం లేదు. అది కేవలం ఒంగోలు డెయిరీని సర్వ నాశనం చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం కాబట్టి డెయిరీ అక్రమాలు బయట పెట్టడానికి చివరకు అధికారులు కూడా భయపడుతున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే డెయిరీని అభివృద్ధి చేయటానికంటూ నూతన పాలక మండలి కొత్తగా ముగ్గురు అధికారులను నియమించింది. అయినా వారివల్ల డెయిరీ అభివృద్ధి కాదు కదా పాత అక్రమాలను కూడా ఒక్క పైసా కూడా వెలికితీయలేదు. నూతనంగా నియమించిన వారిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ (క్యూసీఓ), బాయిలర్ జూనియర్ ఇంజినీర్లను నియమించి వారి ముగ్గురికి జీతాలతో కలుపుకొని అదనపు సౌకర్యాలు అన్నీ కలిపి నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు డెయిరీకి అదనపు భారం మాత్రం చివరకు మిగిలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.7.29 కోట్ల నష్టాల్లో ఉన్న డెయిరీని, 2017–18లో రూ.58.34 కోట్లు నష్టాల్లోకి నెట్టిన ఘనత చల్లా శ్రీనివాసరావుది. మొత్తం పూర్తి లెక్కలు తేల్చకముందు నష్టాల రూపంలో చూపించింది రూ.65.63 కోట్లు వాటి ఊసు ఇప్పటి వరకూ అంతూ పంతూ లేదు. ఒంగోలు డెయిరీ నూతన కమిటీ గతంలో పాపాలు చేసి రూ.100 కోట్లకు పైగా దోచుకున్న పాత పాలక మండలి తప్పులకు సంబంధించిన లెక్కల రికార్డులను మాయం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఫోరెన్సిక్ ఆడిట్లో ఎన్నో అక్రమాలు బయట పడుతుంటే అందుకు ప్రస్తుతం ఉన్న అధికారులు రికార్డులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. లాభాలతో సాగిపోతున్న డెయిరీని చల్లా శ్రీనివాసరావు కంపెనీ చట్టంలోకి మార్చటం వెనుకే దోచుకునే దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్లు అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. 2017 మార్చి 31 నాటికి డెయిరీ ముగింపు నిల్వ కింద రూ.14,07,80,470 లెక్కల్లో చూపించారు. అదే 2017 ఏప్రిల్ 1 నాటికి 2017–18 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రారంభ నిల్వ కింద రూ.2,57,39,160 చూపించ చారు. అంటే ఒకరాత్రి గడిచేలోపే రూ.11,50,41,310 మాయం అయిపోయాయి. ఆ లెక్కలను చూసిన పాత ఆడిట్ కంపెనీ గుడ్లు వెళ్లబెట్టింది. అదేంది తెల్లవారే సరికి రూ.11.50 కోట్లు ఏమయ్యాయని ఆడిట్లో అభ్యంతరం తెలిపింది. అది ఇంత వరకూ బయటకు రాలేదు. ఇలా ఎన్నో ఆడిట్ తనిఖీల్లో బయట పడితే వాటిని పట్టించుకుంటున్న పాపాన పోవటం లేదు. వీటితో పాటు అనేకరకాల అక్రమాలు ఆడిట్ తనిఖీల్లో బయటపెట్టారు. వాణిజ్య చెల్లింపులు, ఇతర అప్పులు, వ్యాపార ఆదాయాలు, అడ్వాన్సులు, ఇతర ఆదాయాల ఊసే లెక్కల్లో లేవు. ఉద్యోగుల ఈపీఎఫ్ చెల్లింపులు చెల్లించకుండా రూ.42,90,691 మాయం చేసినట్లు బయట పడింది. గతంలో అప్పుడప్పుడూ నగదు రూపంలోకి మార్చిన బయటి వ్యక్తుల సరుకు నిల్వలకు సంబంధించి వ్యయాన్ని, రుణాలను కంపెనీ తన పద్దులలో చూపింది. కానీ ఆయా వాటాల మొత్తం నగదు విలువ రూ.24,03,65,841 మాత్రం మాయం అయింది. కర్నాటక ఫెడరేషన్‌కు సంబంధించిన పాలపొడి కాజేసిన దానిలో కాజేసిన దాదాపు రూ.2 కోట్లకు సంబంధించిన రికార్డులు మాయం. విశాఖ డెయిరీ నుంచి సంఘ డెయిరీ నుంచి బజాజ్ సంస్థల నుంచి తీసుకున్న దాదాపు రూ.7 కోట్లు ఏం చేశారో లెక్కలు లేవు. 2013 నుంచి 2016 వరకు ప్రతి నెల రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు మెషినరీ కొనుగోలు చేశామని మినిట్స్‌లో రాసి కొనుగోలు పేరుతో దోచుకున్న రూ.కోట్లకు సంబంధించిన మిషనరీ అక్కడ లేదు. గతంలో విజిలెన్స్ కమిటీ పాలలో ఎస్ఎన్ఎఫ్ శాతం తక్కువగా ఉందని దాని ద్వారా రూ.1.20 కోట్లు కాజేశారని ఇచ్చిన నివేదిక రికార్డులు బయట పెట్టటం లేదు. పాడి రైతులకు ఇచ్చిన గేదెల రుణాలను రైతులు డెయిరీకి తిరిగి చెల్లించారు. అవి దాదాపు రూ.2.60 కోట్ల మేరకు ఉన్నాయి. కానీ ఆ నిధులు పాత కమిటీ, అధికారులు దోచుకున్నారు. ఆ డబ్బులు బ్యాంకుకు చెల్లించలేదు. దానికి సంబంధించి రైతుల వద్ద నుంచి వసూలు చేసిన సొమ్ము ఏమైందో తేలలేదు. వీటన్నింటిపై హైదరాబాద్‌కు చెందిన ఆడిట్ సంస్థ అక్రమాల రికార్డులు బయటకు తీసేనా..వారిపై కూడా ఉన్నతాధికారులు వత్తిడి తెచ్చి అటకెక్కిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
క్షీర విప్లవంపై ఉక్కుపాదం
పాడిరైతులకు ప్రత్యామ్నాయం లేక జీవనోపాధికోసం వలసబాట పడుతున్నారు. టీడీపీప్రభుత్వం పాడి రైతులనువిస్మరించడంతో పాడి పరిశ్రమ మొత్తం కుదేలైంది. మహానేత దివంగత ముఖ్యమంత్రిడాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నన్నాళ్లువ్యవసాయంతో పాటు పాడి రంగానికి పెద్దపీట వేశారు. ప్రైవేట్ డెయిరీలదోపిడీకి కళ్లెం వేశారు వైఎస్సార్. ప్రైవేట్ డెయిరీల వారు తప్ప పాలను అడిగేవారు లేనిపరిస్థితిలో క్షీర విప్లవాన్ని తీసుకొచ్చారు. పాలకు అమాంతంగా రేట్లు పెంచిగిట్టుబాటు ధరలు కల్పించారు. దీంతో మదనపల్లె డివిజన్లోని ప్రయివేట్ డెయిరీలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. పాడి రైతులకు ఎప్పటికప్పుడు పాల డబ్బులు చేతికందడంతోవైఎస్ మా దేవుడని కొలిచారు. మదనపల్లె టౌన్ : మోతుబరి రైతులు మొదలుకుని చిన్న సన్నకారు రైతులు, దినసరికూలీలు, చివరకు తాండాల్లో సారా అమ్మే లంబాడీల వరకు పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అవిరళ కృషి ఎనలేనిది. తన హయాంలో వైఎస్సార్ పశుక్రాంతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు నుంచి ఆరు పాడి ఆవులను ఇవ్వడంతో ఏ పల్లెలో చూసిన క్షీర సాగరమైంది. అలాగే పాడి రైతులను ఆదుకునేందుకు జిల్లాలోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్ పార్టీలకతీతంగా రూ.కోట్లు ఖర్చు చేసి మండలానికో బీఎంసీయూ(బల్క్‌మిల్క్ యూనిట్‌ను నెలకొల్పారు. స్థానిక రైతుల నుంచి సేకరించే పాలను బీఎంసీయూలకు చేర్చి ఆ పాలను పట్టణాలకు తరలించి విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. అప్పటివరకు హెరిటేజ్ డెయిరీలతో పాటు మరో 14 ప్రైవేట్ పాల డెయిరీలు కుమ్మక్కై రైతుల నుంచి పాలన అతి తక్కువ ధరకే సేకరించి రూ.కోట్లు దండుకున్నారు. వైఎస్సార్ చూపిన చొరవతో ప్రైవేట్ డెయిరీలకు కళ్లెం పడడంతో పాటు పాడి రైతులకు ఆర్థికంగా బాసటగా నిలిచారు. రైతు రాజ్యమనే మాటను రైతు నోట నుంచే వినపడే విధంగా చేశారు. గిరిజనుల బతుకు మార్చిన పశుక్రాంతి.. మదనపల్లెకు ఆనుకుని ఉన్న తుమ్మల తాండా గ్రామంలో లంబాడీ కుటుంబాలు సుమారు వందకుపైగా ఉన్నాయి. వీరంతా ఒకప్పుడు నాటుసారా తయారు చేయడం, విక్రయించడం చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కి ఇంట్లో ఎందరుంటే అందరిపైనా కేసులు పడి కుటుంబాలకు కుటుంబాలే నాశనం చేసుకున్నారు. అలా చితికిపోయిన సమయంలో వారికి వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పశుక్రాంతి పథకం ఓ వరంలా మారింది. ఆ గ్రామానికి చెందిన డాక్టర్ రోహిణి ప్రతి ఇంటికి రెండు నుంచి నాలుగు పాడి ఆవులను మంజూరు చేసింది. వారు సారా కాయడం, తయారీ, విక్రయాలకు స్వస్తి పలికారు. పాడిని అభివృద్ధి చేసుకుని రోజూ వేల లీటర్ల పాలను ఉత్పత్తిచేస్తూ మండలంలోనే ఆదర్శంగా నిలిచారు. అందే సమయంలో వైఎస్సార్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు పాడి పరిశ్రమను పట్టించుకోలేదు. దీంతో బల్క్‌మిల్క్ యూనిట్లు ఒక్కొక్కటిగా మూతపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమంతో పాటు, రైతుల మాటను విస్మరించింది. మదనపల్లె డివిజన్లో 21 మండలాల్లో 2,90,900 పాడి పశువులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 2,23,674కు చేరింది. గేదెలు 2224 ఉండగా రైతులు 2,03,904 పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలి.. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాకు పశుక్రాంతి పథకంలో రెండు పాడి ఆవులు ఇచ్చారు. పాలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేదాన్ని. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఆవులు లేవు. మహానేత వైఎస్సార్ బతికి ఉంటే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదు. మళ్లీ ఆ రోజులు రావాలి.– లక్ష్మీదేవి, తుమ్మలతాండా, మదనపల్లె జగనన్నతోనే మా జీవితాలు మారుతాయి జగనన్న సీఎం అయితేనే మళ్లీ మా ఊరిలో క్షీరదార ప్రవహిస్తుంది. పాడి ఆవుల పాలతో వచ్చే ఆదాయంతో పిల్లలను చదివించుకుని అప్పుల ఊబిలో నుంచి బయటపడుతాం. మా జీవితాలు మారాలంటే జగనన్న సీఎం కావాలి.– బయమ్మ, తుమ్మలతాండా కర్ణాటక ఆవులు పాలు ఇవ్వడం లేదు.. ప్రభుత్వం కర్ణాటక ఆవులను కొనుక్కోవాలని కండీషన్లు పెట్టడంతో విధిలేక కొంటున్నాం. దళారీలు పాలు ఇవ్వని ఆవులను మాకు అంటగడుతున్నారు. దీంతో పాలు ఇవ్వకపోవడంతో మేము నష్టపోతున్నాం. – రమణమ్మ, మల్లయ్యదేవరపల్లె పాడి రైతులను విçస్మరించింది.. టీడీపీ అధికారంలోకి వచ్చాక పాడి పరిశ్రమను విస్మరించింది. దీంతో వేలాది మంది రైతులు పాలకు గిట్టుబాటు ధర లేక ప్రైవేట్ డెయిరీలను ఆశ్రయించాల్సి వస్తోంది. వైఎస్సార్ తనయుడు వైస్ జగన్ సీఎం అయితే పాడి పరిశ్రమను ఆదుకుంటారని ఆశిస్తున్నా. – శంకర్‌నాయక్, తుమ్మలతాండా జగనన్న పూర్వవైభవం తెస్తాడు.. మహానేత వైఎస్సార్ పాడి రైతులను ఆదుకుని ఒకప్పుడు క్షీరవిప్లవాన్ని సృష్టించారు. జగన్మోహన్రెడ్డిని సీఎం కాగానే పాడి పరిశ్రమను కాపాడి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చి క్షీరవిప్లవాన్ని తీసుకురావాలని కోరుతున్నా.– రెడ్డెప్పనాయక్, తుమ్మలతాండా పాడి ఆవులే జీవనాధారం పాడిఆవులే మాలాంటి పేదవాళ్లకు జీవనాధారం. పాలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రైవేట్ డెయిరీల ఆగడాలను అరికడితే మాలాంటి పేద కుటుంబాలు జీవించగలరు.– వెంకటరమణ నాయక్, తుమ్మల తాండా కర్ణాటక పాయింట్లను ఎత్తివేయాలి.. కర్ణాటక డెయిరీల యాజమాన్యం మదనపల్లె డివిజన్లోని పలు ప్రాంతాల్లో కర్ణాటక పాలపాయింట్లను నెలకొల్పింది. ఇక్కడి పాడి రైతుల నుంచి పాలను సేకరించి బల్క్‌మిల్క్ యూనిట్లు మూతపడేలా చేస్తోంది. – రామకృష్ణ, పెంచుపాడు పంచాయతీ స్థానిక ఆవులనే ఇవ్వాలి.. కర్ణాటక పాడి ఆవులను కాకుండా స్థానికంగా ఉన్న హెచ్ఎఫ్ ఆవులను రైతులకు పశుసంవర్థకశాఖ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఆవులకు వ్యాధులు సోకకుండా పాలు ఇవ్వగలవు.– కుమార్‌నాయక్, తుమ్మలతాండా -
పాల కేంద్రాలే పచ్చ ఏటీఎంలు
వారంతా ఒక సంస్థ ఉద్యోగులు.. తమకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఓ రాజకీయ పార్టీకి కార్యకర్తలుగా వెట్టిచాకిరీ చేస్తున్నారు.పోలింగ్ వరకు డెయిరీ విధులు పక్కన పెట్టి.. ప్రచార కార్యక్రమాలు భుజానికెత్తుకోవాలని ఆ సంస్థ యాజమాన్యం హుకుం జారీ చేయడంతో వారికి వేరే గత్యంతరం లేకపోయింది.ఆ సంస్థే విజయ విశాఖ డెయిరీ.. చైర్మన్గిరీతోపాటు పలు కీలక పదవులను తన ఇంటి గుమ్మంలో కట్టేసుకున్న టీడీపీ నేత ఆడారి తులసీరావు.. ఈ సారి ఎన్నికల్లో తన కుమారుడు ఆనంద్‌కు టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు.అదిగో.. అప్పట్నుంచే డెయిరీ ఉద్యోగులు ఏటీఆర్ ఆర్మీగా మారిపోయారు.. పాలసేకరణ కేంద్రాలు నగదు పంచే ఏటీఎం కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. ఉత్తరాంధ్రతోపాటు గోదావరి జిల్లాల్లోనూ తనకున్న నెట్‌వర్క్‌ను ఎన్నికల్లో దుర్వినియోగం చేసేందుకు ఆడారి కుటుంబం స్కెచ్ వేసింది. ఆ ప్రణాళిక అమలవుతున్న తీరు ఓసారి పరికిద్దాం రండి.. విశాఖపట్నం, పెందుర్తి: రైతుల సంక్షేమం కోసమే డెయిరీ నడుపుతున్నాం. లాభాల్లో అధిక మొత్తం వారికే బోనస్‌గా అందిస్తున్నాం. వారి సంక్షేమమే మా ధ్యేయం’.. అని నీతి వాక్యాలు వల్లిస్తూ ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ సుదీర్ఘకాలంగా విశాఖ డెయిరీని ఏలుతున్న ఆడారి తులసీరావు అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడు ఆనంద్ విజయం కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పాలసేకరణ కేంద్రాలను ఏటీఎం(ఆడారి ట్రాన్స్ఫర్ మనీ) కేంద్రాలుగా మార్చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. డెయిరీ ఉద్యోగులే పర్యవేక్షకులుగా.. పాల కేంద్రాల సిబ్బందితో ఏటీఆర్ ఆర్మీ పేరిట బృందాలను ఏర్పాటు చేశారు. వారితో పగలంతా ప్రచారం చేయించుకుని.. పొద్దుపోయాక ఓటర్లకు పంపిణీ కార్యక్రమాలు చేపట్టాని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందుకోసం ఇప్పటికే పాల కేంద్రాలకు గుట్టుచప్పుడు కాకుండా నగదు మూటలు చేరవేసినట్లు సమాచారం. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని టీడీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు పచ్చ జెండాలు మోసిన డెయిరీ సిబ్బంది పంపిణీ కార్యక్రమాల్లోనూ కీలకపాత్ర పోషించనున్నారు. అలా అయితేనే పంపిణీ సులభమని.. ‘మా సార్ కొడుకు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ 20 రోజులు డెయిరీ పని పక్కన పెట్టి ఎన్నికల పనే చూడమన్నారు. ఆనంద్ సార్ గెలవగానే మాకు జీతాలు పెంచుతామన్నారు. పోలింగ్ వరకు పార్టీ జెండా మా భుజాన ఉండాల్సిందే. పాల సేకరణ కేంద్రాల నుంచే డబ్బుల పంపిణీకి అంతా సిద్దం చేశారు’.. అని జిల్లా నుంచి నగరానికి పనిమీద వచ్చిన ఓ డెయిరీ ఉద్యోగి తన స్నేహితుడితో చెప్పడం ఆ నోటా ఈ నోటా ప్రచారంలోకి వచ్చింది. ఈ మాటలే ఆడారివారి ప్రణాళికను బట్టబయలు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ డెయిరీకి పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. పాల వ్యాన్ల ద్వారా ఆ కేంద్రాలకు నగదు చేరవేస్తే ఓటర్లకు పంపిణీ చేయడం సులభమనేది టీడీపీ నేతల ఎత్తుగడ. దీనికి తోడు ఎన్నికలకు ముందే ఉగాది పండుగ ఉంది. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని పండుగ బోనస్ పేరిట ఏప్రిల్ మొదటివారంలో నగదు పంపిణి చేయాలని ఆడారి సైన్యం ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులకూ సాయం మరోవైపు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆనంద్ తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఈ ‘ఏటీఎం’ల సాయం అందిస్తామని మాటిచ్చారట!. ఈ మేరకు ఎంపీ ‘సాయం’తో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలకు పంపిణీ చేయనున్న నగదును డెయిరీ కేంద్రాలకు చేరవేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి డబ్బు ఎప్పుడు పంపిణీ చేయాలి.. ఎలా చేయాలి అన్నదానిపై కసరత్తు చేశారని అంటున్నారు. -
ఆయిల్ మిల్క్
అనంతపురం, నార్పల: నియోజకవర్గం లోని నార్పల పరిధిలో కల్తీపాల గుట్టు రట్టైంది. పోలీసులు ఏకకాలంలో దా డులు నిర్వహించి 2050 లీటర్ల కల్తీ పాలతో పాటు అందుకోసం ఉపయోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇం దులో భాగంగానే ముగు రు నిందితులను అరెస్టు చేశారు. ఎస్ ఐ శ్రీనివాసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ కు వచ్చిన సమాచారం మేరకు కేశేపల్లి, నార్పలల్లో దాడులు చేశామన్నా రు. కేశేపల్లిలోని పాలవిక్రయదారుడు రాజశేఖరరెడ్డి ఇంటిలో, నార్పలలోని కూతలేరు బ్రిడ్జి వద్ద ఉన్న సాయి మిల్క్‌డైరీ, ఉయ్యాలకుంటలోని భూ షణ పాలకేంద్రంలోని కల్తీ పాలు, పె రుగును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కల్తీపాల తయారు కో సం వినియోగిస్తున్న ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో పాటు మూడు మిక్సీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ పాల డైరీలలో తయారు చేస్తున్న కల్తీ పాలను అనంతపురం పట్టణంలో విక్రయిస్తున్నారని చెప్పారు. కల్తీపాలు త యారు చేసి విక్రయిస్తున్న సుబ్బరా యుడు, నాగభూషణ, రాజశేఖరరెడ్డిల ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు ఫుడ్‌సేఫ్టీ అధికారి రవిశంకర్ కల్తీపాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. -
డెయిరీ తెరిస్తేనే..చొక్కావేస్తా
ఆరు పదులు దాటిన వయసు. బక్క చిక్కిన శరీరం. శరీరం పైకి ఓ పంచె, కండువా. చొక్కా కూడా వేసుకోరు. సాధారణంగా కనిపించే ఈ వ్యక్తి వెనుక అసాధారణ పట్టుదల..సంకల్పం ఉన్నాయి. ఫలితం ఎదురు చూడని ఉద్యమ కారుడీయన. లక్ష్య సాధన కోసం ఎన్నాళ్లయినా నిరీక్షించే తత్వం. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా వందల కిలో మీటర్లు నడిచి వెళ్లిపోతుంటాడు. ఆయనే ఈదల వెంకటాచల నాయుడు. ఈ రైతు ఉద్యమ నేత గురించి తెలుసుకుందాం... చిత్తూరు (అర్బన్): కష్టం వచ్చినప్పుడు సాయం కోసం పక్క వారిని పిలుస్తాం. కానీ వెంకటాచల నాయుడు తనను ఎవరూ పిలవకున్నా వచ్చి నిలబడుతాడు. నీ కష్టం ఏమిటని అడుగుతాడు. అలా అడిగి వెళ్లిపోడు. వెన్నంటే నిలుస్తా డు. ఈయనది పెనుమూరు మండలంలోని సాతంబాకం పంచాయతీ పెరుమాళ్ల కండిగ. ఆరెకరాల పొలం, నాలుగు ఆవులే ఆయన ప్రపంచం. పోరాట పటిమకు పెద్దగా చదువులు అవసరంలేదని ఐదో తరగతి వరకు చదువుకున్నా రు. పట్టుపురుగులు పెంచి పట్టుగూళ్లను అమ్మడం.. సేద్యం చేయడం తప్ప వెంకటాచలంకు మరో లోకం తెలియదు. ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలను డెయిరీకి పోసి జీవనం సాగించేవాడు. 15 ఏళ్లకు పైగా జిల్లాలో ఏ రైతుకు కష్టమొచ్చినా అక్కడ వాలిపోతుంటారు. రూ.2 కోసం తొలి ఉద్యమం... 2003లో ఎదురైన ఓ ఘటన తనలో పోరాట స్ఫూర్తికి బీజం వేసిందని చెబు తారు వెంకటాచలం. చిత్తూరు నుంచి పెనుమూరు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుకు గతంలో నాలుగు స్టేజీలు ఉండేవని, కొత్తగా ఓ స్టేజీ పెరగడంతో రూ.2 అదనంగా పెంచడాన్ని ఈయన తట్టుకోలేకపోయాడు. సామాన్యులపై అదనపు భారా న్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ 2003 జూన్‌లో పెనుమూరులో 16 రోజుల పాటు దీక్షకు కూర్చున్నాడు. సమస్య పరి ష్కారం కాలేదు. పట్టువదలకుండా ఇదే సమస్యపై 2004లో 65 రోజులు, 2008 లో 13 రోజులు దీక్షలు చేశాడు. ఏ ఒక్క రూ పట్టించుకోలేదు. ఫలితం కోసం ఎదురుచూడటం ఇష్టం లేదంటాడు. 2002లో చిత్తూరు విజయా సహకార డెయిరీని సీఎం చంద్రబాబు నాయు డు హయాంలో మూసేశారు. రైతులంతా రోడ్డున పడ్డారు. డెయిరీ పునఃప్రారంభిం చాలని ఈయన వెంటనే దీక్షలు చేసినా ఫలితం కనిపించలేదు. 2005లో హైదరాబాదు వెళ్లి ఇందిరాపార్కు వద్ద 48 గంటలు దీక్ష చేశాడు. 2007 అక్టోబరు 2న ప్రతిన పూనాడు. డెయిరీని పునః ప్రారంభించేత వరకు చొక్కా ధరించనని, కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం పూనారు. పదేళ్లుగా అలాగే ఉన్నాడు. ఎన్టీఆర్ జలాశయాన్ని శుభ్రం చేయిం చాలని 2008లో 18 రోజులు దీక్ష చేశాడు. చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీలో కనీస మద్దతు ధర కల్పించాలని 2015లో 48 రోజులకు పైగా దీక్షలు చేశాడు. జీవనం అంతంతే... ఎవరెట్లా పోతే మనకెందుకు. గమ్మున ఇంటి పట్టున ఉండలేవా.. అంటూ ఈయన పెద్ద కుమారుడు పలుమార్లు హెచ్చరించినా వెంటాచలం నాయుడు తన పంథాను మార్చుకోలేదు. కుమారుడి ఇంటి నుంచి వెళ్లిపోయి మేస్త్రీ పనిచేసుకుంటున్నాడు. ఆవులను మేపుతూ పాలు, పంటలను అమ్మి వెంకటాచలం నాయుడు కూతురికి పెళ్లిచేశాడు. ఇంకో కొడుకును ఇంజనీరింగ్ చదివించాడు. ఉద్యమాల నుంచి పక్కకురాలేక, ఇళ్లు గడవలేక కష్టాలకు ఎదురెళ్లి ఎకరం పొలం కూడా అమ్మేశాడు. అయినా దీక్షలకు ఎవర్నీ అర్థించడు. ఎవరైనా తులమో ఫలమో ఇచ్చినా దాన్ని తీసుకుని ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని వెంకటాచలం నాయుడు చెబుతున్నారు. ప్రభుత్వాలు తన సమస్యల్ని పరిష్కరిస్తుందో లేదో తెలియదు... కానీ జిల్లాలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు బాహ్య ప్రపంచానికి చెప్పడానికి తనదైన శైలిలో నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నాడు. చొక్కాలేకుండా తమ ఇంటికి రావద్దని ఇతనికి చెప్పినవారూ లేకపోలేదు. ఇవేవీ ఆయన పట్టించుకోలేదు. -
రేపటి నుంచే ‘పాల’ ప్రోత్సాహకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు పాల సహకార సంఘాల్లోని రైతులకు ప్రోత్సాహకం అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విజయ డెయిరీ రైతులకు అందజేస్తున్న తరహాలో లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తామని, 24వ తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది. సచివాలయంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై శుక్రవారం తలసాని సమీక్ష నిర్వహించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, తెలంగాణ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, విజయ డెయిరీ ఎండీ నిర్మల, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ముల్కనూరు డెయిరీ చైర్మన్ విజయ, పశుసంవర్థకశాఖ అదనపు డైరెక్టర్ రాంచందర్‌రావు తదితరులు పాల్గొ న్నారు. ఇతర డెయిరీలకు పాలు విక్రయించే రైతులకు ప్రోత్సాహకం చెల్లిస్తామన్న సీఎం హామీ మేరకు జీవో విడుదల చేశామని సమావేశం అనంతరం తలసాని తెలిపారు. 1.98 లక్షల మందికి ప్రయోజనం మదర్ డెయిరీకి పాలుపోస్తున్న 55 వేల మంది, ముల్కనూరు డెయిరీ పరిధిలోని 20 వేల మంది, కరీంనగర్ డెయిరీ పరిధిలోని 70 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మొత్తంగా ప్రోత్సాహకంతో 1.98 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహకం సొమ్మును పాల బిల్లు చెల్లింపులతో పాటే లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తామని వెల్లడించారు. అలాగే ప్రోత్సాహకం పొందే రైతులకు సబ్సిడీపై పాడి గేదెలను అందిస్తామని, ఈ పథకంతో ప్రభుత్వంపై రూ.600 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొన్నారు. సబ్సిడీ గేదెలు పొందిన రైతులకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలనూ సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్ విజయ డెయిరీలో రూ.170 కోట్ల వ్యయంతో 4.50 లక్షల లీటర్ల సామర్థ్యంతో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పాల పొడి ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా పాడిరంగం అభివృద్ధిలో గుత్తా సుఖేంద ర్‌రెడ్డికి ఎంతో అనుభవం ఉన్నందున.. ఆయన సలహాలు, సూచనలను స్వీకరించేందుకు ఈ సమావేశానికి ఆహ్వానించామన్నారు. రాజీనామాపై గుత్తా మౌనం నల్లగొండ ఎంపీ స్థానానికి రాజీ నామా చేసే అంశంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి మౌనం దాల్చారు. రైతు సమన్వయ సమితి రాష్ట్రస్థాయి సమన్వయకర్తగా గుత్తాను నియమించి కేబినెట్ ర్యాంకు ఇస్తారని.. తన ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా రాజీనామా అంశాన్ని ప్రస్తావించగా.. ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
‘అనంత పాలంటే పారిపోతున్నారు’
– నాణ్యత పెంచితే ప్రోత్సాహకాలు – 100 లీటర్ల పాలు వచ్చే ప్రాంతాల్లో సొసైటీలు – ఏపీ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మురళి వెల్లడి అనంతపురం అగ్రికల్చర్ : ‘మదనపల్లి, కడప, రాయచోటి నుంచి వచ్చే పాలకు మంచి డిమాండ్ ఉంది. అనంతపురం పాలకు అంతంత మాత్రంగా, హిందూపురం పాలకు అసలే అధ్వానంగా ఉండటంతో కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అనంత’ పాలంటే పారిపోతున్నారు.’ అంటూ ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీ డెయిరీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మురళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఏపీ డెయిరీ మార్కెటింగ్ విభాగం అధికారి పాపారావుతో కలిసి శనివారం స్థానిక ఏపీ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా డెయిరీ పనితీరు, వివిధ విభాగాలు, యంత్రసామగ్రిని పరిశీలించారు. డెయిరీ స్థితిగతులు, రైతుల ఆర్థిక పరిస్థితులు, ప్రైవేట్ డెయిరీల ఆధిప్యతం తదితర అంశాలపై డీడీ వై.శ్రీనివాసులు, ఏడీ శ్రీనివాసులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అనంతపురం, హిందూపురం పాలశీతలీకరణ కేంద్రాల నుంచి సేకరిస్తున్న పాలు నాసిరకంగా ఉంటున్నాయన్నారు. రైతుల నుంచి నాణ్యమైన పాల సేకరించడంలో ఏజెంట్లు, జిల్లా అధికారులు వైఫలం చెందుతున్నారని తెలిపారు. ఇందులో రైతులు కూడా పాలలో నీళ్లు అధికంగా కలుపుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఆవు ఈనిన రోజు నుంచి మళ్లీ ఒట్టిపోయే దాకా ఒకే మోతాదులో పాలు పోస్తుండటం జరుగుతోందన్నారు. ఇలా రైతులు కూడా అవగాహన లోపంతో పాలు పోస్తుండగా ఇంటిదొంగలు కూడా అందులో నీళ్లు కలపడం, అవకతవకలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని అసహనం వెలిబుచ్చారు. కొవ్వు, వెన్నశాతం తక్కువగా వస్తుండటం వల్ల రైతులకు ధరలు గిట్టుబాటు కావడం లేదన్నారు. నాణ్యమైన పాలకు మంచి గిరాకీతో పాటు ధరలు కూడా పలుకుతాయని, రైతులు అపోహలు విడనాడి మంచి పాలు పోయాలని సూచించారు. ఆ దిశగా రైతుల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత డెయిరీ, పశుశాఖ అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తుల పంపకం పూర్తీ కాకపోవడంతో డెయిరీ కొంత వరకు కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీని వల్ల సకాలంలో బిల్లులు చెల్లింపు, వేతనాలు చెల్లింపు, నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేక పోతున్నట్లు ఆయన అంగీకరించారు. అనంతపురం జిల్లాలో 100 లీటర్లు పాల సేకరించే ప్రాంతాల్లో రైతులతో సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు. సహకార బ్యాంకుల్లో మహిళ రైతులతో అకౌంట్లు ఓపెన్ చేయించి బిల్లులు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు. కంప్యూటరీకరణ, రేషన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రాం (ఆర్బీపీ)లో భాగంగా తొలుత జిల్లాలో 50 గ్రామాలను ఎంపిక చేసి నాణ్యతా ప్రమాణాల పరిశీలన చేస్తామన్నారు. ఏపీ డెయిరీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ‘ప్రభుత్వ డెయిరీని కాపాడండి’ అనంతపురం అగ్రికల్చర్ : ‘‘వర్షాలు లేక, పంటలు పండక, బోర్లలో నీళ్లు రాక జిల్లాలో కరువు రాజ్యమేలుతోంది. పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రత్యామ్నాయ వనరుగా ఆదుకోవాల్సిన పాడి పరిశ్రమ కూడా చేతులెత్తే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ డెయిరీ పాల ధరలు బాగా తగ్గించడంతో దాన్ని నమ్ముకున్న రైతు కుటుంబాలు, పేదల పరిస్థితి దారుణంగా ఉంది. మరోపక్క ప్రైవేట్ డెయిరీలు ఆధిపత్యం కొనసాగుతోన్నా ముకుతాడు వేసేవాళ్లు లేకపోవడంతో ప్రభుత్వ డెయిరీని నమ్ముకున్న రైతులు నష్టపోతున్నారు’’ అని ఏపీ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జే.మురళీ ఎదుట పాడిరైతుల సంఘం నాయకులు, సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం నాయకులు ఆవేదన వెళ్లబోసుకున్నారు. ఆయన శనివారం స్థానిక ఏపీ డెయిరీని సందర్శించి రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాడి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై ఏకరువు పెట్టారు. పాడి రైతుల సంఘం నాయకులు బిల్లే ఆదినారాయణ, గంగులకుంట కిష్ట, సుదర్శనరెడ్డి, కృష్ణమూర్తి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సమస్యలు చెబుతూనే ఎండీని నిలదీసే ప్రయత్నం చేశారు. ప్రైవేట్ డెయిరీలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పాడి రైతులను వదిలేయడంతో కష్టాలు పడుతున్నారన్నారు. ధరలు గిట్టుబాటు కావడం లేదు, సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదు, దాణా, గడ్డి, పశువుల వంటి పంపిణీ చేయలేదు, బీమా సదుపాయం లేదు, డెయిరీ ఉద్యోగుల నిర్లక్ష్యం తదితర సమస్యలు ఆయన ముందుంచారు. ప్రోత్సాహం అందిస్తే నాణ్యమైన పోలు పోయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డెయిరీని అభివృద్ధి చేయడంతో పాటు అనుబంధంగా పెరుగు, పాలపౌడర్ తయారీ కంపెనీలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పాలు జిల్లాలోనే అమ్మకాలు సాగిస్తే నష్టాలు తగ్గుతాయన్నారు. వచ్చే వారం బకాయిలు పూర్తీగా చెల్లిస్తామని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పాల ధరలు పెంపు ఉంటుందని, పశుసంవర్ధకశాఖ తరఫున కాకుండా డెయిరీ ద్వారా పాడి రైతులకు సైలేజ్ గడ్డి, పశుదాణా పంపిణీ చేస్తామని, పశుబీమా అమలుపై దృష్టి పెడతానని ఎండీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలో పోల్చకుండా ‘అనంత’ను ప్రత్యేకంగా తీసుకుని అభివృద్ధి చేయడానికి రైతుల బాగోగులపై దృష్టి పెడతామని భరోసా ఇచ్చారు. డెయిరీ రైతుల విషయంలో రాజకీయాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
క్షీర సంక్షోభం
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలివీ.. - పాడి పశువులకు అధిక మొత్తంలో రాయితీ కల్పించాలి. - పశువులకు పౌష్టికాహారం, పశువుల దాణాను చౌకగా అందించాలి. - సన్న, చిన్న కారు రైతులకు పచ్చిమేతలు ఉచితంగా ఇవ్వాలి. - పాడిని వదిలించుకోకుండా కాపాడుకునే స్థితిని ప్రభుత్వం కల్పించాలి. ఒంగోలు టూటౌన్: క్షీర సంక్షోభం తారస్థాయికి చేరుతోంది. పాలసేకరణ దారుణంగా పడిపోతోంది. వినియోగదారులకు విక్రయించే పాలలో సగం కూడా నేరుగా రైతుల నుంచి ఒంగోలు డెయిరీ సేకరించలేకపోతోంది. జిల్లాలో పాలడెయిరీకి పాలు పోయడం క్రమేణా తగ్గుతోంది. ఈ ప్రభావం మొత్తం పాలధరల పెంపుపై పడుతోంది. - జిల్లాలో ప్రకాశం పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఒంగోలు డెయిరీ)తో పాటు మొత్తం 72 ప్రైవేట్ డెయిరీలున్నాయి. ఒంగోలు డెయిరీ పరిధిలో 1050 కేంద్రాల ద్వారా పాల సేకరణ జరుగుతోంది. నెలకు సుమారుగా 16 నుంచి 18 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. దీనిలో ఒంగోలు డెయిరీ 60 వేల లీటర్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 45 వేల లీటర్లు సేక రించే సరికే చతికిల పడుతోంది. - ఉత్పత్తికన్నా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాలధరలు పెంచాల్సిన పరిస్థితి వస్తోంది. అందులో భాగంగానే జిల్లా డెయిరీ గత నెల 11న పాల ధరలను పెంచింది. అరలీటర్ డబుల్ టోన్డ్ పాలు పాత ధర రూ.18 ఉంటే రూపాయి పెంచి రూ.19 చేశారు. ఫుల్క్రీమ్ పాలు అరలీటర్ రూ.23 ఉండగా రూ.24కు పెంచారు. ఈ లెక్కన లీటర్ రూ.48 చేరింది. హోమోజినైజ్డ్ఫుల్ క్రీమ్ పాలు అరలీటరు రూ.23 నుంచి రూ.24 పెరిగింది. అదే విధంగా హోమోజినైజ్డ్టోన్డ్ పాలు రూ.19 నుంచి రూ.20 పెంచారు. - పెరుగు ధరలు పెంచకుండా కొంత ఊరట కలిగించారు. ప్రైవేట్ దుకాణాలలో మాత్రం కొన్ని చోట్ల అరలీటర్ ప్యాకెట్ రూ.25 అమ్ముతూ వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. పాల వినియోగం పెరగడంతో పాలపొడిపై ఆధారపడాల్సి వస్తోంది. డెయిరీ పాలకవర్గం పెట్టుకున్న లక్ష లీటర్ల లక్ష్యం కలగానే మిగిలింది. - జిల్లాలో మొత్తం 13,88,975 లక్షల వరకు ఆవులు, గేదేలు ఉన్నాయి. సుమారుగా లక్ష వరకు పాడి గేదెలు, పాడి ఆవులు ఉన్నాయి. పశుక్రాంతిపథకం, రాష్ట్రీయ కృషి యోజన, మినీ డెయిరీలు, జీవక్రాంతి తదితర పథకాలున్నా ఆశించిన స్థాయిలో రైతుల దరి చేరడం లేదు పెరిగిన దాణా..మేత ఖర్చులు : మూడేళ్లుగా దాణా, మేతల ధరల పెంపు అధికమైంది. 2010 సంవత్సరంలో తవుడు రూ.11 నుంచి రూ.13 వరకు పెరిగింది. మరుసటి ఏడాది కిలో ధర రూ.14 నుంచి రూ.16 కి పెరిగింది. 2012లో తవుడు మొదటి రకం ధర కిలో రూ.22 ఉండగా, రెండవ రకం రూ. 19 పలికింది. 2013లో కిలో రూ.27 ఉండగా, కొబ్బరి పిట్టు రూ.27 పెరిగింది. నువ్వులు కిలో రూ.32, వేరుశనగ చెక్క రూ.32, సెంటు విస్తీర్ణంలో పచ్చగడ్డి కొనుగోలు ధర రూ.200 నుంచి రూ.600 పెరిగింది. గేదెకు ఒక ఏడాదికి ట్రాక్టర్ గడ్డి కావాలి. రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది. గత రెండు సంవత్సరాల్లో అదికాస్తా రూ.10 వేలు అయింది. పశువుల పోషణ ఆర్థికంగా పెనుభారమై పాడి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వెన్నశాతంలో మాయాజాలం: పాలవెన్న శాతంలో ప్రైవేట్ డెయిరీల మాయాజాలం అంతా ఇంతా అని చెప్పలేం. ఈ విషయంలో ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే సహకార డెయిరీలు కొంత నయమనిపిస్తున్నాయి. 10 శాతం వెన్న ఉన్న లీటరు పాలకు ఒంగోలు డెయిరీ రూ.43.50 ఇస్తుంటే, అదే పదిశాతం వెన్న ఉన్న పాలకు ప్రైవేట్ డెయిరీలు రూ.40.50 ఇస్తున్నాయి. దీంతో పశుపోషకులకు నష్టాలు తప్పడం లేదు. తగ్గిన పాల దిగుబడి: మండుతున్న ఎండలకు పాడిపశువులు అల్లాడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పాల దిగుబడిపై పడుతోంది. దీనికి తోడు పచ్చగడ్డి కనుచూపు మేరలో కనిపించడం లేదు. వర్షాలు లేక పొలాలు బీడులయ్యాయి. దీంతో పాల దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఒక గేదె రోజులో 4 లీటర్ల కంటే తక్కువగానే ఇచ్చే పరిస్థితి ఉంది. -
అక్రమాల పుట్ట
సాక్షి ప్రతినిధి, గుంటూరు :పాడి పరిశ్రమకు, పశుపోషకులకు ఆలంబనగా నిలవాల్సిన డెయిరీ అక్రమాలకు కేంద్రంగా మారింది. సంస్థలోని కొందరు ఉద్యోగులు తెలుదేశం పార్టీ కార్యకర్తలుగా రూపాంతరం చెందారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీకి టీడీపీ నాయకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కొందరు ఉద్యోగులు డెయిరీలోవిధులు నిర్వహించకుండా పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతూ జీతాలు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది రైతులు పాడిపరిశ్రమ అభివృద్ధికి తమ భూములను విరాళంగా ఇచ్చి ఒక రోజు పాల వేతనాన్ని అప్పగించి పునాదులు వేస్తే నేడు ఆ డెయిరీ ఆశయాలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇతర జిల్లాల వారికే ఉద్యోగాలు.. జిల్లాలో పాల ఉత్పత్తిదారుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాల్సిన పాలకవర్గం అందుకు భిన్నంగా అనంతపురం, కృష్ణా, చిత్తూరు జిల్లాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇచ్చి జిల్లాలోని నిరుద్యోగ యువతకు శఠగోపం పెడుతోంది. 1994లో సంగం డెయిరీలో పాల ఉత్పత్తిదారుల పిల్లల సంక్షేమం కోసం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసేందుకు వీరయ్య చౌదరి ఆధ్వర్యంలోని దూళిపాళ్ల మెమోరియల్ ట్రస్టుకు పదెకరాల భూమిని విరాళంగా అందజేశారు. కళాశాలను ఏర్పాటు చేయకుండా ఆ భూములను సొంత ఆస్తిగా అనుభవిస్తున్నారు. వీరయ్య చౌదరి మరణానంతరం కృష్ణా, గుంటూరు జిల్లాల పాల ఉత్పత్తిదారులు ట్రస్టు కోసం ఒక రోజు పాల వేతనం రూ.18 లక్షలను జమ చేయగా, ఆ నగదు జమా లెక్కలు వివరాలను చైర్మన్ ఇంత వరకు వెల్లడించలేదు.కీలక సిబ్బందికి నో రిటైర్మెంట్.. డెయిరీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేసినప్పటికి వారి స్థానంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. అదే సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకొని వేలకు వేలు జీతాలిస్తూ పెంచి పోషిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కొందరు సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉద్యోగులమనే విషయాన్ని మరిచిపోయి నిబంధనలకు విరుద్ధంగా పెదకాకాని మండలంలో నగదు పంచుతూ పోలీసులకు చిక్కటమే ఇందుకు నిదర్శనం. ఎక్స్గ్రేషియానూ వదలటం లేదు.. డెయిరీలో 200 మంది వరకు ఎసైన్మెంట్ సిబ్బంది ఉన్నారు. వారికిచ్చే అరకొర జీతం నుంచి విరాళాలు ఇవ్వాలని డెయిరీ యూనియన్ నాయకులు పార్టీకి చందాలు వసూలు చేస్తున్నారు. డెయిరీ చైర్మన్‌గా ఉన్న నరేంద్రకుమార్ పొన్నూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ఆ పార్టీ అనుబంధ యూనియన్ నాయకులు ఒక్కో ఉద్యోగి నుంచి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు విరాళాలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినపడుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా కింద అందజేసే సొమ్ములో కొంత మొత్తాన్ని విరాళంగా వసూలు చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్క్ సొసైటీల నుంచి ఇదే తరహాలో విరాళాలు సేకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.సంగం డెయిరీ ఏర్పడిన తరువాత పాలక వర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన వారు డైరక్టర్లుగా ఎన్నిక కాకపోవటం గమనార్హం. బలహీన వర్గాలకు చెందిన వారు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు గ్రామాల్లో పాల ఉత్పత్తిదారులుగా ఉండగా వారికి పాలకవర్గంలో అవకాశం దక్కటం లేదు. ప్రస్తుత పాలకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు అధిక శాతం ఉన్నారు. మహిళలకు ప్రాతినిథ్యం కూడా లేకపోవటం విమర్శలకు కారణమవుతుంది. పవర్‌ప్లాంట్‌కు డెయిరీ భూమి.. డెయిరీ భూమిలో పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన పాలకవర్గం ఆ భూమిని ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నదనే విమర్శలున్నాయి. ప్రయివేట్ పవర్ ప్లాంట్‌కు మూడెకరాల భూమిని అధిక మొత్తాలకు లీజుకు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై డెయిరీ మేనేజింగ్ డెరైక్టర్ కె.గోపీనాథ్‌ను వివరణ కోరగా ఆ భూమిని పదేళ్లకు మాత్రమే లీజుకిచ్చామని, అక్కడ ఉత్పత్తయ్యే కరెంటులో కొంతభాగం డెయిరీకిచ్చేలా ఒప్పందం కుదిరినట్లు చెప్పారు.