పెంచుపాడు పందివారిపల్లెలో తుప్పుపట్టిన యంత్రాలు
పాడిరైతులకు ప్రత్యామ్నాయం లేక జీవనోపాధికోసం వలసబాట పడుతున్నారు. టీడీపీప్రభుత్వం పాడి రైతులనువిస్మరించడంతో పాడి పరిశ్రమ మొత్తం కుదేలైంది. మహానేత దివంగత ముఖ్యమంత్రిడాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నన్నాళ్లువ్యవసాయంతో పాటు పాడి రంగానికి పెద్దపీట వేశారు. ప్రైవేట్ డెయిరీలదోపిడీకి కళ్లెం వేశారు వైఎస్సార్. ప్రైవేట్ డెయిరీల వారు తప్ప పాలను అడిగేవారు లేనిపరిస్థితిలో క్షీర విప్లవాన్ని తీసుకొచ్చారు. పాలకు అమాంతంగా రేట్లు పెంచిగిట్టుబాటు ధరలు కల్పించారు. దీంతో మదనపల్లె డివిజన్‌లోని ప్రయివేట్ డెయిరీలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. పాడి రైతులకు ఎప్పటికప్పుడు పాల డబ్బులు చేతికందడంతోవైఎస్ మా దేవుడని కొలిచారు.
మదనపల్లె టౌన్ : మోతుబరి రైతులు మొదలుకుని చిన్న సన్నకారు రైతులు, దినసరికూలీలు, చివరకు తాండాల్లో సారా అమ్మే లంబాడీల వరకు పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అవిరళ కృషి ఎనలేనిది. తన హయాంలో వైఎస్సార్ పశుక్రాంతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు నుంచి ఆరు పాడి ఆవులను ఇవ్వడంతో ఏ పల్లెలో చూసిన క్షీర సాగరమైంది. అలాగే పాడి రైతులను ఆదుకునేందుకు జిల్లాలోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్ పార్టీలకతీతంగా రూ.కోట్లు ఖర్చు చేసి మండలానికో బీఎంసీయూ(బల్క్‌మిల్క్ యూనిట్‌ను నెలకొల్పారు. స్థానిక రైతుల నుంచి సేకరించే పాలను బీఎంసీయూలకు చేర్చి ఆ పాలను పట్టణాలకు తరలించి విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. అప్పటివరకు హెరిటేజ్ డెయిరీలతో పాటు మరో 14 ప్రైవేట్ పాల డెయిరీలు కుమ్మక్కై రైతుల నుంచి పాలన అతి తక్కువ ధరకే సేకరించి రూ.కోట్లు దండుకున్నారు. వైఎస్సార్ చూపిన చొరవతో ప్రైవేట్ డెయిరీలకు కళ్లెం పడడంతో పాటు పాడి రైతులకు ఆర్థికంగా బాసటగా నిలిచారు. రైతు రాజ్యమనే మాటను రైతు నోట నుంచే వినపడే విధంగా చేశారు.
గిరిజనుల బతుకు మార్చిన పశుక్రాంతి..
మదనపల్లెకు ఆనుకుని ఉన్న తుమ్మల తాండా గ్రామంలో లంబాడీ కుటుంబాలు సుమారు వందకుపైగా ఉన్నాయి. వీరంతా ఒకప్పుడు నాటుసారా తయారు చేయడం, విక్రయించడం చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కి ఇంట్లో ఎందరుంటే అందరిపైనా కేసులు పడి కుటుంబాలకు కుటుంబాలే నాశనం చేసుకున్నారు. అలా చితికిపోయిన సమయంలో వారికి వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పశుక్రాంతి పథకం ఓ వరంలా మారింది. ఆ గ్రామానికి చెందిన డాక్టర్ రోహిణి ప్రతి ఇంటికి రెండు నుంచి నాలుగు పాడి ఆవులను మంజూరు చేసింది. వారు సారా కాయడం, తయారీ, విక్రయాలకు స్వస్తి పలికారు. పాడిని అభివృద్ధి చేసుకుని రోజూ వేల లీటర్ల పాలను ఉత్పత్తిచేస్తూ మండలంలోనే ఆదర్శంగా నిలిచారు. అందే సమయంలో వైఎస్సార్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు పాడి పరిశ్రమను పట్టించుకోలేదు. దీంతో బల్క్‌మిల్క్ యూనిట్లు ఒక్కొక్కటిగా మూతపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమంతో పాటు, రైతుల మాటను విస్మరించింది. మదనపల్లె డివిజన్‌లో 21 మండలాల్లో 2,90,900 పాడి పశువులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 2,23,674కు చేరింది. గేదెలు 2224 ఉండగా రైతులు 2,03,904 పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.
ఆ రోజులు మళ్లీ రావాలి..
మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాకు పశుక్రాంతి పథకంలో రెండు పాడి ఆవులు ఇచ్చారు. పాలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేదాన్ని. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఆవులు లేవు. మహానేత వైఎస్సార్ బతికి ఉంటే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదు. మళ్లీ ఆ రోజులు రావాలి.– లక్ష్మీదేవి, తుమ్మలతాండా, మదనపల్లె
జగనన్నతోనే మా జీవితాలు మారుతాయి
జగనన్న సీఎం అయితేనే మళ్లీ మా ఊరిలో క్షీరదార ప్రవహిస్తుంది. పాడి ఆవుల పాలతో వచ్చే ఆదాయంతో పిల్లలను చదివించుకుని అప్పుల ఊబిలో నుంచి బయటపడుతాం. మా జీవితాలు మారాలంటే జగనన్న సీఎం కావాలి.– బయమ్మ, తుమ్మలతాండా
కర్ణాటక ఆవులు పాలు ఇవ్వడం లేదు..
ప్రభుత్వం కర్ణాటక ఆవులను కొనుక్కోవాలని కండీషన్లు పెట్టడంతో విధిలేక కొంటున్నాం. దళారీలు పాలు ఇవ్వని ఆవులను మాకు అంటగడుతున్నారు. దీంతో పాలు ఇవ్వకపోవడంతో మేము నష్టపోతున్నాం.
– రమణమ్మ, మల్లయ్యదేవరపల్లె
పాడి రైతులను విçస్మరించింది..
టీడీపీ అధికారంలోకి వచ్చాక పాడి పరిశ్రమను విస్మరించింది. దీంతో వేలాది మంది రైతులు పాలకు గిట్టుబాటు ధర లేక ప్రైవేట్ డెయిరీలను ఆశ్రయించాల్సి వస్తోంది. వైఎస్సార్ తనయుడు వైస్ జగన్ సీఎం అయితే పాడి పరిశ్రమను ఆదుకుంటారని ఆశిస్తున్నా. – శంకర్‌నాయక్, తుమ్మలతాండా
జగనన్న పూర్వవైభవం తెస్తాడు..
మహానేత వైఎస్సార్ పాడి రైతులను ఆదుకుని ఒకప్పుడు క్షీరవిప్లవాన్ని సృష్టించారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కాగానే పాడి పరిశ్రమను కాపాడి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చి క్షీరవిప్లవాన్ని తీసుకురావాలని కోరుతున్నా.– రెడ్డెప్పనాయక్, తుమ్మలతాండా
పాడి ఆవులే జీవనాధారం
పాడిఆవులే మాలాంటి పేదవాళ్లకు జీవనాధారం. పాలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రైవేట్ డెయిరీల ఆగడాలను అరికడితే మాలాంటి పేద కుటుంబాలు జీవించగలరు.– వెంకటరమణ నాయక్, తుమ్మల తాండా
కర్ణాటక పాయింట్లను ఎత్తివేయాలి..
కర్ణాటక డెయిరీల యాజమాన్యం మదనపల్లె డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కర్ణాటక పాలపాయింట్లను నెలకొల్పింది. ఇక్కడి పాడి రైతుల నుంచి పాలను సేకరించి బల్క్‌మిల్క్ యూనిట్లు మూతపడేలా చేస్తోంది.
– రామకృష్ణ, పెంచుపాడు పంచాయతీ
స్థానిక ఆవులనే ఇవ్వాలి..
కర్ణాటక పాడి ఆవులను కాకుండా స్థానికంగా ఉన్న హెచ్‌ఎఫ్ ఆవులను రైతులకు పశుసంవర్థకశాఖ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఆవులకు వ్యాధులు సోకకుండా పాలు ఇవ్వగలవు.– కుమార్‌నాయక్, తుమ్మలతాండా
Comments
Please login to add a commentAdd a comment