కల్తీపాల తయారీకి వినియోగిస్తున్న సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు,నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌ఐ శ్రీనివాసులు
అనంతపురం, నార్పల: నియోజకవర్గం లోని నార్పల పరిధిలో కల్తీపాల గుట్టు రట్టైంది. పోలీసులు ఏకకాలంలో దా డులు నిర్వహించి 2050 లీటర్ల కల్తీ పాలతో పాటు అందుకోసం ఉపయోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇం దులో భాగంగానే ముగు రు నిందితులను అరెస్టు చేశారు. ఎస్ ఐ శ్రీనివాసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ కు వచ్చిన సమాచారం మేరకు కేశేపల్లి, నార్పలల్లో దాడులు చేశామన్నా రు. కేశేపల్లిలోని పాలవిక్రయదారుడు రాజశేఖరరెడ్డి ఇంటిలో, నార్పలలోని కూతలేరు బ్రిడ్జి వద్ద ఉన్న సాయి మిల్క్‌డైరీ, ఉయ్యాలకుంటలోని భూ షణ పాలకేంద్రంలోని కల్తీ పాలు, పె రుగును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కల్తీపాల తయారు కో సం వినియోగిస్తున్న ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో పాటు మూడు మిక్సీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ పాల డైరీలలో తయారు చేస్తున్న కల్తీ పాలను అనంతపురం పట్టణంలో విక్రయిస్తున్నారని చెప్పారు. కల్తీపాలు త యారు చేసి విక్రయిస్తున్న సుబ్బరా యుడు, నాగభూషణ, రాజశేఖరరెడ్డిల ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు ఫుడ్‌సేఫ్టీ అధికారి రవిశంకర్ కల్తీపాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment