Milk adulteration
-
కల్తీపాల కలకలం
జగద్గిరిగుట్ట: ప్రగతినగర్‌లో కల్తీ పాల సంఘటన కలకల రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన పవన్, సౌమ్య దంపతులు స్థానిక సాయితేజ మిల్క్ సెంటర్ నుంచి ఈ నెల 8, 9 తేదీల్లో గేదె పాలను కొనుగోలు చేశారు. అందులో ఒక ప్యాకెట్లోని పాలను వేడి చేయగా విరిగి పోయి ప్లాస్టిక్ ముద్దలా మారిపోయాయి. పాత్ర ప్రభావం కారణంగా పాలు పాడై ఉండవచ్చునని భావించిన వారు మరో ప్యాకెట్పాలను వేడి చేయగా అవి అలాగే మారాయి. దీంతో మిల్క్ సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా అతను దురుసుగా ప్రవర్తించడంతో శుక్రవారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అశోక్ పాలను ల్యాబ్‌కు పంపారు. పరీక్షించిన తరువాత కల్తీగా తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆయిల్ మిల్క్
అనంతపురం, నార్పల: నియోజకవర్గం లోని నార్పల పరిధిలో కల్తీపాల గుట్టు రట్టైంది. పోలీసులు ఏకకాలంలో దా డులు నిర్వహించి 2050 లీటర్ల కల్తీ పాలతో పాటు అందుకోసం ఉపయోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇం దులో భాగంగానే ముగు రు నిందితులను అరెస్టు చేశారు. ఎస్ ఐ శ్రీనివాసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ కు వచ్చిన సమాచారం మేరకు కేశేపల్లి, నార్పలల్లో దాడులు చేశామన్నా రు. కేశేపల్లిలోని పాలవిక్రయదారుడు రాజశేఖరరెడ్డి ఇంటిలో, నార్పలలోని కూతలేరు బ్రిడ్జి వద్ద ఉన్న సాయి మిల్క్‌డైరీ, ఉయ్యాలకుంటలోని భూ షణ పాలకేంద్రంలోని కల్తీ పాలు, పె రుగును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కల్తీపాల తయారు కో సం వినియోగిస్తున్న ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో పాటు మూడు మిక్సీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ పాల డైరీలలో తయారు చేస్తున్న కల్తీ పాలను అనంతపురం పట్టణంలో విక్రయిస్తున్నారని చెప్పారు. కల్తీపాలు త యారు చేసి విక్రయిస్తున్న సుబ్బరా యుడు, నాగభూషణ, రాజశేఖరరెడ్డిల ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు ఫుడ్‌సేఫ్టీ అధికారి రవిశంకర్ కల్తీపాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. -
యథేచ్ఛగా పాల కల్తీ!
తూప్రాన్: ప్యాకెట్ పాలైనా.. గేదె పాలైనా.. విష రసాయనాలు, ఎముకల పొడిమయమై పోయాయి. పాలల్లో పోషక పదార్థాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ ప్రస్తుతం పాలల్లో వాటికి బదులుగా ప్రజలను రోగాల బారిన పడేసే విషం ఉంటోంది. ఇదేంటి అనుకుంటున్నారా..? ఇది నిజం.. జిల్లాలోని తూప్రాన్, కాళ్లకల్ మండల కేంద్రాలు పాల కల్తీకి అడ్డాగా మారాయి. పాల కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. దీంతో వ్యాపారులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని తూప్రాన్, కాళ్లకల్ గ్రామాలను అడ్డాగా ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు సమాచారం. పట్టణానికి చెందిన ఓ పాల వ్యాపారి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తూప్రాన్ డివిజన్లోని రైతుల వద్ద ఉన్న గేదెలు, ఆవులు సుమారు 5 వేలకు పైగా ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ఇక్కడ నిత్యం సుమారు 50 వేల లీటర్ల వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. తూప్రాన్‌కు చుట్టుపక్కల మండలాలైన శివ్వంపేట, Ðవెల్దుర్తి, వర్గల్, చేగుంట మండలాలు, కాళ్లకల్‌కు మేడ్చెల్ జిల్లాలోని పూడూరు, రావన్‌కోల్, సోమారం, ఘనపూర్, మేడ్చెల్, లింగాపూర్, డబీల్‌పుర తదితర గ్రామాల వ్యాపారులు అక్కడ సేకరించిన పాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. రహస్యంగా ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు.. జిల్లాలో సరఫరా అవుతున్న పాలల్లో దాదాపు 80 శాతం కల్తీ జరుగుతున్నట్లు పలువురు పాల వ్యాపారులు చెబుతున్నారు. ఒక లీటరు స్వచ్ఛమైన పాలను ఎనిమిది లీటర్ల కల్తీ పాలుగా మార్చుతున్నారు. దీని కోసం మొదట లీటరు పాలల్లో అత్యధికంగా నీళ్లు కలుపుతారు. ఆ తర్వాత ఇందులో యూరియా, ఎముకల పొడి, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వంటి రసాయనాలను తక్కువ మోతాదులో కలిపి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాక కొందరు రైతులు అధిక పాల ఉత్పత్తి కోసం పశువులకు మోతాదుకు మించి ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ ఇంజక్షన్లు రంగారెడ్డి జిల్లా మేడ్చల్, బోయిన్‌పల్లిలోని జనరల్ వెటర్నరీ, పశువుల దాణా దుకాణాల్లో రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం. గతంలోనే ప్రభుత్వం ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను నిషేధించింది. ఈ ఇంజక్షన్ వాడడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ అధిక పాల ఉత్పత్తి కోసం ఈ ఇంజక్షన్‌ను వాడుతున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు నిల్వ కోసం.. కల్తీ పాలను ఎక్కువ సేపు నిల్వ ఉంచడం కోసం హైడ్రోజన్ ఫెరాక్సైడ్, సోడియం బై కార్పొనేట్, క్యాల్షియం యాక్సైడ్, ఎముకల పొడి, ఇతర రసాయనాలు కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. పాలు తెల్లగా ఉండేందుకు లీట రుకు రెండు గ్రాముల చొప్పున యూరియాను కలుపుతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా సోయా, ఆముదం వాటి నుంచి వచ్చే నూనెలను కూడా కలుపుతున్నారు. అయితే అసలైన పాల వ్యాపారులు ఈ కల్తీ వ్యాపారుల వల్ల నష్టాలకు గురవుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి గేదెలను పెంచుతున్న రైతులు, వ్యాపారులు కల్తీ పాల పోటీకి తట్టుకోలేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. కల్తీ పాలతో వచ్చే వ్యాధులు.. కల్తీ పాల వల్ల చిన్న పిల్లలతోపాటు పెద్దవారు కూడా అనారోగ్యానికి గురవుతారు. వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్ట్రో, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కల్తీ పాలను నివారించాలని పలువురు కోరుతున్నారు. తూప్రాన్‌లో రెండేళ్ల క్రితం ఓ పాల వ్యాపారి కృత్రిమ పాలను తయారు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడి ఇంటిపై దాడి చేశారు. పాలల్లో కల్తీ గుట్టు రట్టు చేశారు. ఈ పాలల్లో యూరియా, నూనె, పౌడర్, తదితర రసాయనాలు గుర్తించి సదరు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. అయితే కొన్నాళ్లపాటు జాగ్రత్త పడిన వ్యాపారులు తిరిగి జోరుగా పాల కల్తీకి పాల్పడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు. పాలు అమ్మేవారు రోజూ నాణ్యమైనవి అమ్మడం లేదు. పలుచని పాలు అమ్ముతున్నారు. కనీసం పెరుగు కూడా తోడు కోవడం లేదు. కల్తీ పాలు అమ్ముతున్నారు. ఎక్కడ కొనాలో తెలియక నిత్యం సతమతమవుతున్నాం. నాణ్యమైన పాలు అమ్మే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. –మహ్మద్ అసీఫ్, కల్తీ పాలతో ఇబ్బందులు తప్పడం లేదు వ్యాపారులు కల్తీ పాలను అమ్మడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తూప్రాన్‌లో కృత్రిమ పాల తయారుదారుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అదే తరహాలో పాలల్లో కల్తీ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. తనిఖీ అధికారులు పాలల్లో కల్తీని గుర్తించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. –చెలిమెల జయరాములు, తూప్రాన్ -
పాల కల్తీపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాల కల్తీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిం చింది. పశు సంవర్థ్ధక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి, డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ ఎండీ, స్టే ఫుడ్ లేబొరేటరీ చీఫ్ పబ్లిక్ అనలిస్ట్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పాలు కాదు పచ్చి విషం ’శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని చదివిన నల్లగొండకు చెందిన కె.నర్సింహారావు లేఖ రూపంలో హైకోర్టు ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. ఆ లేఖను ఆయన పిల్ కమిటీకి నివేదించగా, కమిటీలోని మెజారిటీ న్యాయ మూర్తులు సాక్షి కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని సిఫారసు చేశారు. దీంతో ఏసీజే ఆ లేఖను పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించడంతో మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. -
పాల కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి
కరీంనగర్ : కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సందులో ఓ గదిలో ఎం.కె.మిల్క్ హౌస్ పేరుతో ఎలగందుల గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ గత కొద్ది రోజులుగా పాల డిపో నడుపుతున్నాడు. ఎలాంటి పేర్లు, ముద్రణ లేకుండా పాలను ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారని, అవి కల్తీ పాలు అని, పౌడర్స్ కలిపి తయారు చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. వాటిపై దృష్టిపెట్టిన అధికారులు గురువారం ఉదయం పాల డిపోపై దాడి చేశారు. ఈ సందర్భంగా 200 లీటర్ల పాలు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస రావు, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ అమృతశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
పాల కల్తీ చేస్తే యావజ్జీవం!
న్యూఢిల్లీ: పాలు, పాల ఉత్పత్తుల కల్తీపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీని నివారించేందుకు కఠిన చర్యలతో పాటు ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో సవరణలు చేయాలని, శిక్షార్హమైన నేరంగా మార్చాలని సూచించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలు ఐపీసీలో సవరణలు చేశాయని, పాల కల్తీకి పాల్పడితే జరిమానా, జరిమానా లేకుండా జీవిత ఖైదు విధించేలా చట్టంలో మార్పులు చేశాయంటూ విచారణ సందర్భంగా కోర్టు ఉదహరించింది. -
పాల కల్తీ కేంద్రాలపై ఎస్వోటీ దాడులు
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో కల్తీ పాల తయారీ కేంద్రాలపై ఎస్వోటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కంపెనీల పేరుతో పాల కల్తీకి పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 80 లీటర్ల పాలు, ఖాళీ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
కల్తీ పాల తయారీ ముఠా అరెస్ట్
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్పల్లి, చేర్యాల గ్రామాల్లో కల్తీ పాలు తయారుచేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఆయా గ్రామాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూరియాతో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. -
కల్తీ పాల కేంద్రంపై అధికారుల దాడులు
-
క్షీరం.. కల్తీ మయం
జిల్లాలో పాలను కల్తీ చేసి విక్రయించడం పరిపాటిగా మారింది.. తాజాగా పాలు చిక్కగా ఉండేందుకు ఓ రకమైన పేస్టు కలుపుతూ మెదక్ పట్టణంలో ఓ పాల వ్యాపారి ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన మలికె మల్లేశం కొంత కాలంగా మెదక్ పట్టణంలో పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజులుగా పట్టణంలోని 19వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ తక్కువ ధరకే చిక్కని పాలు వేస్తానని చెప్పి అక్కడి మహిళలను నమ్మించాడు. కొంత మంది అతడి మాటలు నమ్మి పాలు తీసుకుంటున్నారు. కాని వాటని వేడి చేసిన తరువాత ముద్దగా మారడం.. ముట్టుకుంటే పెయింట్ అంటుకున్నట్లుగా ఉండటాన్ని గమనించారు. అంతేకాకుండా రెండు రోజులు గడిచినా అవి పాడు కాకపోవడంతో వారికి అనుమానం బలపడింది. ఆ పాలు తాగిన వారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో విషయాన్ని కాలనీ వాసులు కౌన్సిలర్ సులోచన దృష్టికి తీసుకెళ్లారు. ఆమె మంగళవారం పాలు తీసుకువచ్చిన మల్లేశంను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. తాను రోజు విక్రయించే స్వచ్ఛమైన పాలతో పాటు కొన్ని నీళ్లు కలిపి దానికి గోబిందా అనే కంపెనీకి చెందిన పేస్టును వాడుతున్నట్లు తెలిపారు. కాగా మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్ సైతం సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని ఆరా తీయగా తనతో పాటు సిద్ధిరాములు, గంగారాంలు కూడా పేస్టు కలిపి పాలను విక్రయిస్తున్నారని మల్లేశం చెప్పాడు. దీని వెనుక ఇంక ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలని మల్లేశంను స్థానిక పోలీసులకు అప్పగించారు. కల్తీ పాల ఘటన తెలుసుకున్న పుడ్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ సంగారెడ్డి నుంచి మెదక్‌కు వచ్చి పాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలలో వైట్ పేస్టు కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిగతా విషయాలను తెలుసుకోవడానికి వాటిలో నుంచి 500 మి.లీ. పాలను తీసుకుని వాటిని హైదరాబాద్ సమీపంలోని నాచారం వద్ద గల పాల నిర్ధారణ కేంద్రానికి పంపనున్నట్లు వివరించారు. -
ఏమిటీ పాపాలు!
-
ఏమిటీ పాపాలు!
* హెరిటేజ్ పాల కల్తీ అంశంపై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ * ప్రశ్నోత్తరాల సమయంలో పాల కల్తీ అంశంపై చర్చ * హెరిటేజ్ ప్రస్తావనతో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన * చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్ * ఆ సంస్థ పాలను నిషేధించాలన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు * పరస్పర నినాదాలతో సభ రెండుసార్లు వాయిదా * కల్తీపై కఠిన చర్యలు చేపడుతున్నామన్న రాజయ్య సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ పాలలో కల్తీపై అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలతో తెలంగాణ శాసనసభ బుధవారం దద్దరిల్లింది. పరస్పర నినాదాలతో సభ మారుమోగింది. కల్తీకి పాల్పడుతున్న హెరిటేజ్ కంపెనీ పాలను నిషేధించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా, దానిపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా హైదరాబాద్‌లో కల్తీ పాల సరఫరా అంశం ప్రస్తావనకు వచ్చింది. పాల ఉత్పత్తిని పెంచేందుకు పశువులకు హానికరమైన ఇంజెక్షన్లు ఇస్తున్నారని పలువురు సభ్యులు మాట్లాడిన సందర్భంగా హెరిటేజ్ పాలలో కల్తీ విషయం చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేలు గీతారెడ్డి, చిన్నారెడ్డి, రెడ్యానాయక్, తాటి వెంకటేశ్వర్లు తదితరులతో పాటు టీడీపీ సభ్యులు రాజేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి కూడా పాలలో కల్తీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ కూడా కల్తీ పాలు అమ్ముతోందన్నారు. కేరళ ప్రభుత్వం ఆ సంస్థను నిషేధించినట్లు పత్రికల్లో వచ్చిందని, దానిపై తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టిందని ప్రశ్నించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలపడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్పించుకున్నారు. అది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చెందిన సంస్థ అని, దాన్ని నిషేధించాలో వద్దో టీడీపీ ఎమ్మెల్యేలే చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ కల్తీ వల్ల పిల్లలకు పాలు తాగించాలంటే భయం వే స్తోందన్నారు. పాల రూపంలో విషం తాగుతున్నామన్నారు. సామాజిక రుగ్మతగా మారిన పాల కల్తీపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కేరళలో హెరిటేజ్‌ను రద్దు చేశారన్నది ఎంత వర కు నిజమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ సంస్థ ఎన్ని పాల ను విక్రయిస్తోందని, ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం టి.రాజయ్య సమాధానమిస్తూ.. హెరిటేజ్ సంస్థ కల్తీ పాల విక్రయం, కేరళలో నిషేధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ (ఎఫ్ఎస్ఎస్) చట్టం ప్రకారం చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామని, జిల్లాల్లోనూ అధికారులను నియమించామని చెప్పారు. మం త్రి మాట్లాడుతుండగానే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తది తరులు పట్టుబట్టారు. అవకాశం ఇవ్వకపోవడం తో నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్ద న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. హెరిటేజ్ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్ ఈ సందర్భంగా మంత్రి కె. తారక రామారావు మాట్లాడుతూ.. పాలల్లో కల్తీపై ప్రశ ్న వేసిందీ, చర్చనుప్రారంభించిందీ టీడీపీ సభ్యులేనన్నారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులు ప్రస్తావిస్తే ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నిం చారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తుండటంతో.. ‘ఇక్కడ హెరిటేజ్ సంస్థ డెరైక్టర్, ప్రతినిధులు లేరు.. మీరు మాత్రం వారిలాగే వ్యవహరిస్తున్నారు. ఏపీ నుంచి నామినేట్ అయినవారిలా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత తొత్తులుగా వ్యవహరించడం తెలంగాణ ప్రజల దురదృష్టం. మీరు ఆ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడటం దారుణం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడారు. రాష్ట్రంలో పాల కల్తీని తేల్చేందుకు ‘ఐపీఎం’ను రెఫరల్ ల్యాబ్‌గా గుర్తించామన్నారు. 32 పాల నమూనాలను సేకరించగా 11 నమూనాల్లో కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. పంజాగుట్టలో సేకరించిన హెరిటేజ్ టోన్డ్ మిల్క్ శాంపిల్‌లో డిటర్జెంట్ కలిపినట్లు తేలిందన్నారు. దీంతో టీడీపీ సభ్యులు మళ్లీ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిగ్గుచేటు అంటూ నినాదాలు చేశారు. అనంతరం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించినా టీడీపీ సభ్యులు నినాదాలను కొనసాగించడంతో సభను మళ్లీ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. -
పాల కల్తీ యావజ్జీవ శిక్షార్హ నేరం: సుప్రీం
న్యూఢిల్లీ: పాలకల్తీని యావజ్జీవ శిక్షార్హ నేరంగా మార్చాలని సుప్రీంకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మానవ వినియోగానికి హానికరమైన రీతిలో కల్తీపాల ఉత్పత్తి, విక్రయాలు చేయడాన్ని యావజ్జీవ శిక్షార్హమైన నేరంగా మార్చేందుకు చట్టాల్లో తగిన సవరణలు తీసుకురావాలని కోర్టు సూచించింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు ఇప్పటికే కల్తీపాల విక్రయాలను యావజ్జీవ శిక్షార్హమైన నేరంగా మార్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈమేరకు సిఫారసు చేసింది. -
పాలను కల్తీ చేస్తే యావజ్జీవ శిక్ష: సుప్రీం
కల్తీ పాలు ఉత్పత్తికి, మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. అక్రమంగా పాలను కల్తీ చేసే వారిని శిక్షించడానికి చట్టాలను మార్చాలని సుప్రీం సూచించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో సింథటిక్ మెటిరియల్ తో పాలను కల్తీ చేస్తున్నారనే అంశంపై కేఎస్ రాధాకృష్ణన్, ఎకే సిక్రిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందించారు. పాలను కల్తీ చేసే వారికి యావజ్జీవ శిక్ష విధించాలని సుప్రీం ఆదేశించింది. హాని కలిగించే విధంగా పాల ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన చట్టాలను పటిష్టం చేయాలని సూచనలు చేసింది. అంతేకాక అలాంటి అక్రమాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ కింద కనీసం ఆరు నెలల శిక్ష విధించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల కల్తీ జరుగుతోందంటూ ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ శాంపిల్స్ ను సేకరించి 2011లో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం తీవ్రంగా స్పందించింది.