కరీంనగర్ : కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సందులో ఓ గదిలో ఎం.కె.మిల్క్ హౌస్ పేరుతో ఎలగందుల గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ గత కొద్ది రోజులుగా పాల డిపో నడుపుతున్నాడు. ఎలాంటి పేర్లు, ముద్రణ లేకుండా పాలను ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారని, అవి కల్తీ పాలు అని, పౌడర్స్ కలిపి తయారు చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. వాటిపై దృష్టిపెట్టిన అధికారులు గురువారం ఉదయం పాల డిపోపై దాడి చేశారు. ఈ సందర‍్భంగా 200 లీటర్ల పాలు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్ పాల శాంపిళ‍్లను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస రావు, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు, ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అమృతశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment