
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పోలీస్ స్నైపర్ డాగ్ (టైసన్) మంగళవారం అనారోగ్య కారణాలతో మృతి చెందింది. కమిషనరేట్‌లో సీపీ వి.సత్యనారాయణతోపాటు పోలీసు అధికారులు నివాళులరి్పంచారు. ఈ డాగ్ 2015 నుంచి కమిషనరేట్‌లో సేవలందిస్తోంది. మానేరు డ్యామ్ తీరంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. టైసన్ మోయినాబాద్‌లో ఒక సంవత్సరం శిక్షణ తీసుకోగా.. తర్వాత ఆరేళ్లు పోలీసుశాఖలో సేవలందించింది.
రెండుసార్లు రాష్ట్రపతి, రెండుసార్లు ప్రధానమంత్రి, మూడుసార్లు గవర్నర్, పది సార్లు ఇతర వీఐపీలు, 20 మినిస్టర్ డ్యూటీలు, 5 సార్లు అసెంబ్లీ విధులు, 2 మేడారం, 150 ఆర్‌వోపీలు, 6 వినాయకచవితి విధులు, 6 శివరాత్రి, 6 రమజాన్, 10 త్రెట్ కాల్స్, 5 రిఫ్రెషర్స్ కోర్సుల విధులు నిర్వహించింది. కార్యక్రమంలో అడిషినల్ డీసీపీ (శాంతిభద్రతలు) ఎస్.శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి.చంద్రమోహన్, ఏఆర్ ఏసీపీ సి.ప్రతాప్, ఆర్‌ఐలు కిరణ్ కుమార్, రమేశ్, మల్లేశం, సురేశ్, పశువైద్యాధికారి నరేశ్ రెడ్డి, ట్రైనర్ రాజు పాల్గొన్నారు.