పాల కల్తీ యావజ్జీవ శిక్షార్హ నేరం: సుప్రీం
న్యూఢిల్లీ: పాలకల్తీని యావజ్జీవ శిక్షార్హ నేరంగా మార్చాలని సుప్రీంకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మానవ వినియోగానికి హానికరమైన రీతిలో కల్తీపాల ఉత్పత్తి, విక్రయాలు చేయడాన్ని యావజ్జీవ శిక్షార్హమైన నేరంగా మార్చేందుకు చట్టాల్లో తగిన సవరణలు తీసుకురావాలని కోర్టు సూచించింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు ఇప్పటికే కల్తీపాల విక్రయాలను యావజ్జీవ శిక్షార్హమైన నేరంగా మార్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈమేరకు సిఫారసు చేసింది.