కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి, చేర్యాల గ్రామాల్లో కల్తీ పాలు తయారుచేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు ఆయా గ్రామాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూరియాతో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.