
పాలను చూపిస్తున్న మహిళలు, రబ్బరు లాగా సాగుతున్న పాలు
జగద్గిరిగుట్ట: ప్రగతినగర్‌లో కల్తీ పాల సంఘటన కలకల రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన పవన్, సౌమ్య దంపతులు స్థానిక సాయితేజ మిల్క్ సెంటర్ నుంచి ఈ నెల 8, 9 తేదీల్లో గేదె పాలను కొనుగోలు చేశారు. అందులో ఒక ప్యాకెట్‌లోని పాలను వేడి చేయగా విరిగి పోయి ప్లాస్టిక్ ముద్దలా మారిపోయాయి. పాత్ర ప్రభావం కారణంగా పాలు పాడై ఉండవచ్చునని భావించిన వారు మరో ప్యాకెట్‌పాలను వేడి చేయగా అవి అలాగే మారాయి. దీంతో మిల్క్ సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా అతను దురుసుగా ప్రవర్తించడంతో శుక్రవారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారంతో ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అశోక్ పాలను ల్యాబ్‌కు పంపారు. పరీక్షించిన తరువాత కల్తీగా తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment