చెన్నై : తమిళనాడులో గాడిద పాలకు హఠాత్తుగా డిమాండ్ పెరిగిపోయింది. అన్నవాసల్ ప్రాంతంలో 100 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.500కు విక్రయిస్తున్నారు. పుదుకోట జిల్లాలోని అన్నవాసల్, ఇలు ప్పూర్, ముక్కన్నమౖయెపట్టి గ్రామాల్లో విరుదాచలానికి చెందిన 10 మందికి పైగా ఊరూరా తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. అడిగినవారికి అక్కడికక్కడే పాలు పితికి ఇస్తున్నారు. పాలు ఒక చెంచా రూ.50, 100 మిల్లీలీటర్లు రూ.500లకు విక్రయిస్తున్నారు. ఈ పాలు తాగితే జలుబు, దగ్గు, కామెర్లు వంటి వ్యాధులు నయం అవుతాయని చెప్పి వ్యాపారం చేస్తున్నారు. దీంతో ప్రజలు కొనుగోలు చేసి పాలు తాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment