గౌరిబిదనూరు: పట్టణంలో గాడిద పాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అదిలాబాద్ నివాసి సురేశ్ రౌత్ అనే యువకుడు గాడిదను తీసుకుని పాలు విక్రయిస్తున్నాడు. 100 మిల్లీలీటర్ల పాల ధర రూ. 150 నుండి 180 దాకా అమ్ముతామని చెప్పారు. ఈ లెక్కన గాడిద పాలు లీటరు కొనాలంటే కనీసం రూ. 1,500 చెల్లించాలి. పసిపిల్లలకు ఆరోగ్యానికి మంచిదని అతడు చెప్పాడు. తాము కుటుంబం మొత్తం గాడిదలను తోలుకుని వచ్చామని, మరికొందరు బెంగళూరులో ఉన్నారని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment