‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’.. అంటూ వేమన అప్పట్లో గాడిదపాలను విలువలేనివిగా భావించి అలా పద్యం రాశాడేమోగానీ వాటి పాల వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాల గురించి తెలిసుంటే రూ. కోట్లిచ్చును ఖరము పాలు అని రాసేవాడేమో.. ఎందుకిదంతా చెప్పడమంటే.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువరైతు రాష్ట్రంలోనే మొదటి గాడిద డెయిరీ ఫాంను ఏర్పాటు చేసుకొని భారీ లాభాలు ఆర్జిస్తున్నాడు మరి!
ఆ యువరైతు విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
లీటర్ రూ. 4– 5 వేలు
రోజుకు ఒక గాడిద గరిష్టంగా లీటర్ వరకు పాలు ఇస్తుంది. ఉదయం, సాయంత్రం రెండుసార్లు పితికితే లీటరున్నర వరకు పాలు వస్తాయి. ఈ పాలను ఎక్కువగా ఆయుర్వేద మందులు, కాస్మొటిక్స్ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ మేరకు కంపెనీలు పలు ఏజెన్సీల ద్వారా అంతర్జాతీయంగా కొనుగోలు చేస్తున్నాయి. లీటర్ గాడిద పాలకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ధర పలుకుతోంది. పాల ఉత్పత్తి, గాడిదల ఆరోగ్యంపై ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుండగా.. ఫామ్ నిర్వాహకులు స్థానిక పశు వైద్యాధికారి సాయంతో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పెద్దమొత్తంలో పాలు ఉత్పత్తి అయితే ఇంకా అధిక ధరతో నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది.
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన పులిదండ నగేష్ కుటుంబం వినూత్న వ్యాపార ఆలోచనను ఆచరణలోపెట్టి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సంప్రదాయ ఆవు, గేదె పాల డెయిరీలకు పూర్తి భిన్నంగా గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన నగే‹Ùకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు అఖిల్ డిగ్రీ చేయగా చిన్నకొడుకు వంశీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నగేష్ తల్లిదండ్రులు నర్సోజీ, లలితమ్మ. వారి కులవృత్తి (మాంసం విక్రయించడం) కూడా చేసేవారు. పలు రకాల పంటల సాగుతోపాటు పలు వ్యాపారాలు చేసినా ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకోకపోవడంతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో అఖిల్ యూట్యూబ్‌లో అన్వేíÙస్తుండగా డాంకీ ఫామ్‌పట్ల ఆసక్తి కలిగింది.
యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్న క్రమంలో అఖిల్ రాజస్తాన్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్‌లో గుర్రాలు, గాడిదల పెంపకం, పాల ఉత్పత్తుల గురించి శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. నెలకు వారం చొప్పున మూడు నెలలు శిక్షణ తీసుకున్నాడు. అనంతరం గుజరాత్‌లోని ఖతియవాడి, హలరీతోపాటు
ఫ్రాన్స్ (పోటియో రకం) నుంచి గాడిదలను దిగుమతి చేసుకున్నాడు. ఒక్కోదానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వెచ్చించి మొత్తం 60 గాడిదలు తెచ్చుకున్నాడు. ఇందులో 57 ఆడ.. మూడు మగవి. ఈ నెలలో మరో 20 గాడిదలను (ఆడ 16, మగ 4)ను తీసుకురావడంతో వాటి సంఖ్య 80కి చేరింది.
ఫామ్‌తోపాటు గాడిదలకు దాణా కోసం వివిధ రకాల గడ్డి పెంచేందుకు బిజినేపల్లి మండల కేంద్రంలోని వృద్ధాశ్రమం సమీపంలో దాదాపు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. అందులో ఒక పెద్ద షెడ్ (ఐదు భాగాలు), మరో 3 చిన్న షెడ్‌లు ఏర్పాటు చేసి గాడిదలను వేర్వేరుగా పెట్టాడు. వాటికి కావాల్సిన దాణా కోసం దాదాపు 15 ఎకరాల్లో సీఎస్‌వీ 33 ఎంఎఫ్ (జొన్న రకం), దశరథ గడ్డి, 4జీ బులెట్ (సూపర్ నేపియర్ రకం), మొర్ర గడ్డి తీగ పెంచుతున్నాడు. వీటితోపాటు ఎండు వరి గడ్డి, మక్కసొప్ప, బుడ్డ (పల్లి) పొల్లు, మక్క, గోధుమ, బార్లీ, పిండిని గాడిదలకు ఆహారంగా ఇస్తున్నాడు. గాడిదలను చూసుకునేందుకు రెండు కుటుంబాలను తమిళనాడు నుంచి రప్పించి వారికి వసతి కల‍్పిస్తున్నాడు.
మంచి బ్రీడ్, ఎజెన్సీ చూసుకోవాలి
గతేడాది నవంబర్ 13న ఫామ్ అందుబాటులోకి వచి్చంది. ప్రస్తుతం 23 గాడిదలు పాలు ఇస్తున్నాయి. పోటియో (ఫ్రాన్స్) గాడిదలు రోజుకు 2 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. గాడిద పాలు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. అయితే వాటిని ఫ్రిజ్లోనే ఉంచాలి. ఏజెన్సీ వాళ్లు ప్రస్తుతం 15 రోజులకు లేదా నెలకోసారి వచ్చి పాలు తీసుకెళ్తున్నారు. గాడిద పాల వ్యాపారం లాభదాయకమే. అయితే మంచి బ్రీడ్, ఏజెన్సీని ఎంచుకోవాలి.
– పులిదండ నగేష్, గాడిద ఫాం నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment