గాడిద పాలకు భలే డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

గాడిద పాలకు భలే డిమాండ్‌

Oct 17 2024 12:24 AM | Updated on Oct 17 2024 1:23 PM

గాడిద పాలకు భలే డిమాండ్‌

గాడిద పాలకు భలే డిమాండ్‌

దగ్గు, దమ్ము, ఆస్తమాకు ఎంతో మేలంటున్న నిర్వాహకులు

చిన్న గ్లాసు పాల ధర రూ. 50 నుంచి రూ. 100

బాల్కొండ: ప్రస్తుతం సమాజంలో గాడిద పాలకు మంచి డిమాండ్‌ ఉంది. గాడిద పాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం చేస్తూ పాలను విక్రయిస్తున్నారు. గాడిద పాలు కూడా తాగే వారి సంఖ్య పెరగడంతో ఈ పాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. కరము పాలు గరిటడైనా చాలు అన్నట్లుగా.. గాడిద పాలు తాగితే పలు రకాల మొండి వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని గాడిద పాల విక్రయదారులు పేర్కొంటున్నారు. 

ఇందులో నిజమెంతో తెలీదు కానీ, గాడిద పాలను కూడా అనేక మంది కొనుగోలు చేసి తాగుతున్నారు. మండల కేంద్రంలో కొందరు వీటిని గాడిద పాలను విక్రయిస్తున్నారు. పాలు కావాలంటే ఇంటి వద్దనే గాడిద పాలను పితికి అక్కడికక్కడే ఇస్తారు. చిన్న గ్లాస్‌ పాలకు రూ. 50 నుంచి రూ. 100 చొప్పున విక్రయిస్తున్నారు. 

గిరాకీ ఉంటే అంతో ఇంతో ఆదాయం వస్తోందని, అది కూడా గాడిద పాల గురించి తెలిసిన వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయని దీంతో గాడిద పాలకు కాస్త గిరాకీ తగ్గిందని విక్రయదారులు పేర్కొంటున్నారు. దగ్గు, దమ్ము, ఆస్తమా, గురక వంటి వ్యాధులకు గాడిద పాలు తాగితే పూర్తిగా తగ్గిపోతుందని, ఈ పాలల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయని నిర్వామకులు ప్రచారం చేస్తూ గాడిద పాలను విక్రయిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement