Donkey Milk Benefits In Telugu: Huge Demand Of Donkey Milk - Sakshi
Sakshi News home page

Donkey Milk: గాడిద పాలకు మంచి డిమాండ్‌.. కప్పు పాల ధర ఎంతంటే..

Published Thu, Dec 16 2021 1:19 PM | Last Updated on Thu, Dec 16 2021 5:08 PM

Huge Demand To Donkey Milk: Public Interest on Purchase for Good Health  - Sakshi

Health Benefits With Donkey Milk, Huge Demand in Telangana, Rates For A Cup 
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): ప్రస్తుతం సమాజంలో గాడిద పాలకు మంచి డిమాండ్‌ ఉంది. గాడిదపాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం చేస్తూ పాలను విక్రయిస్తున్నారు. గాడిద పాలు కూడా తాగే వారి సంఖ్య పెరగడంతో ఈ పాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. కరము పాలు గరిటడైనా చాలు అన్నట్లుగా.. గాడిద పాలు తాగితే పలు రకాల మొండి వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని గాడిద పాల విక్రయదారులు అంటున్నారు.

ఇందులో నిజమెంతో తెలీదు కానీ, గాడిద పాలను కూడా అనేక మంది కొనుగోలు చేసి తాగుతున్నారు. మంచిర్యాలకు చెందిన కొంతమంది యువకులు మూడు గాడిదలతో ప్రతి సంవత్సరం ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు పాల్వంచ పట్టణ, మండలంలో ఊరూరా తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు.

పాలు కావాలంటే ఇంటివద్దనే గాడిదపాలను పితికి అక్కడిక్కడే ఇస్తారు. అర టీ కప్పు గాడిద పాలు చిన్న పిల్లలకు రూ.150, పెద్దలకు ఒక టీ కప్పు రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ గాడిద పాల విక్రయదారులు రోజుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. గిరాకీ ఉంటే అంతో ఇంతో ఆదాయం లభిస్తుందని, అది కూడా గాడిద పాల గురించి తెలిసిన వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు.

టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయని దీంతో గాడిద పాలకు కాస్తా గిరాకీ తగ్గిందంటున్నారు. దగ్గు, దమ్ము, ఆస్తమా, గురక వంటి వ్యాధులను గాడిద పాలు తాగితే పూర్తిగా తగ్గిపోతుందని, ఈ పాలల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయని నిర్వాహకులు ప్రచారం చేస్తూ గాడిద పాలను విక్రయిస్తున్నారు.

 గిరాకీ తగ్గింది 
ఆవు, గేదె, మేక పాలకు ఉన్న గిరాకీ గాడిద పాలకు ఉండటం లేదు. అయితే గాడిద పాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తాగడం ద్వారా చిన్నారులకు, పెద్దలకు పలు రకాల వ్యాధులు నివారణ అవుతాయి. చాలామందికి ఈ పాల వలన అనేక రకాల మొండి వ్యాధులు తగ్గిపోయాయి.

– ఇరుగుదిండ్ల లక్ష్మి, మంచిర్యాల 

చదవండి: భార్య ఉసురుతీసిన భర్త వివాహేతర బంధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement