చాలామంది తమ ఉదయాన్ని కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు మార్నింగ్ కాఫీతోనే పరగడుపు మాత్రలు తీసుకుంటుంటారు. చాలావరకు కప్పు కాఫీతో మందులు మిక్స్ చేసి తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం మంచిది కాదని, వివిధ దుష్ప్రభావాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఏఏ మందులు కాఫీతో కలిపి తీసుకోకూడదో సవివరంగా తెలుసుకుందామా..!
కాఫీ కడుపుని ప్రేరేపించి జీర్ణవ్యవస్థ ఆహారాన్ని తీసుకునే సమయాన్ని మారుస్తుంది. మందులు మింగే వారికి ఈ కాఫీ వాటితో రియాక్షన్ చెంది రక్తప్రవహంలోకి శోషించటానికి ఎక్కువ వ్వవధి తీసుకునేలా చేస్తుంది. ఇది మానువుల జీవక్రియ, విసర్జనపై గణనీయమైన ప్రభావం చూపి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు.
కాఫీతో తీసుకోవడం నివారించాల్సిన మందులు..
యాంటీబయాటిక్స్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి.. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ని నిరోధించడంలో సహాయపడతాయి. ఇక్కడ కాఫీ కూడా ఒక ఉద్దీపన కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అశాంతి, నిద్రలేమి దారితీస్తుంది లేదా దీర్ఘకాలంలో నిద్రలేమికి కారణమవుతుంది.
ఫెక్సోఫెనాడిన్ వంటి అనేక ఇతర అలెర్జీ ఔషధాలను కాఫీతో తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ కేంద్ర నాడీ వ్యవస్థను ఎక్కువగా ప్రేరేపిస్తుంది - విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాలను పెంచుతుంది.
థైరాయిడ్ మందులు
హైపో థైరాయిడిజం ఉన్నవారికి - తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి అవ్వదు. దీంతో బరువు పెరగడం, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన జుట్టు రాలడం మహిళల్లో క్రమరహిత రుతుక్రమాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, హార్మోన్లను సమతుల్యం చేయడం కోసం థైరాయిడ్ మందులు తీసుకునేవారు కాఫీతో తీసుకుంటే గనుకు ఆ మందులు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. కాఫీ థైరాయిడ్ మందుల శోషణను సగానికి పైగా తగ్గిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.
ఆస్తమా మందులు
ఆస్తమా మందులు ఊపిరితిత్తులలోని కండరాలను సడలించి, వాయు వాయుమార్గాలను విస్తరించేలా చేసి..సులభంగా శ్వాస తీసుకునేలా చేస్తాయి. ఇక్కడ కెఫీన్ ఒక తేలికపాటి బ్రోంకోడైలేటర్. ఇది ఈ ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేగాదు ఈ బ్రోంకోడైలేటర్లను మందులతో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, కడుపు నొప్పి, చిరాకు వంటివి కూడా ముఖ్యంగా పిల్లలలో కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహం మందులు
కాఫీని చక్కెర లేదా పాలతో కలపడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్షణమే పెరుగుతాయి. అందువల్ల మధుమేహం మందులు అంతబాగా ప్రభావితంగా పనిచెయ్యవు. పైగా మధుమేహం ఉన్నవారికి కెఫీన్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అల్జీమర్స్ ఔషధం
అల్జీమర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి. ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఒకరకమైన మెదడు రుగ్మత లేదా అభిజ్ఞా పనితీరును కోల్పోవడం. దీనివల్ల రోజువారీ పనులను ఆలోచించడం, గుర్తుంచుకోవడం లేదా చేయడం చాలా కష్టం.
అల్జీమర్స్‌తో నివసించే మిలియన్ల మంది ప్రజలు ఈ పరిస్థితికి మందులు తీసుకుంటారు. అయినప్పటికీ, డోపెజిల్, రివాస్టిగ్మైన్, గెలాంటమైన్ వంటి మందులు కెఫిన్ ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతాయని వైద్యులు చెబుతున్నారు. కెఫిన్ రక్తం, మెదడు మధ్య అవరోధాన్ని బిగించి, ఔషధ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ అల్జీమర్స్ మందులు న్యూరోట్రాన్స్‌మిటర్, ఎసిటైల్‌కోలిన్‌ను రక్షించడం ద్వారా పని చేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే అధిక మొత్తంలో కాఫీ తీసుకుంటామో అప్పుడు ఈ కెఫీన్ ఆ రక్షణ ప్రభావాన్ని దెబ్బతీస్తుందని పరిశోధనలో తేలిందని వివరించారు ఆరోగ్య నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment