220 టన్నుల హోటల్‌ని జస్ట్‌ 700 సబ్బులతో తరలించారు! | 220 Ton Nova Scotia Building Moved Using 700 Bars Of Soap | Sakshi
Sakshi News home page

220 టన్నుల హోటల్‌ని జస్ట్‌ 700 సబ్బులతో తరలించారు!

Published Tue, Dec 12 2023 1:27 PM | Last Updated on Tue, Dec 12 2023 2:21 PM

220 Ton Nova Scotia Building Moved Using 700 Bars Of Soap - Sakshi

కొన్ని పురాతన భవనాలు శిథిలావస్థకు చేరుకుంటే అధికారులు కూల్చేస్తారు. ఇది సర్వసాధారణం. అలాంటి ఓ పురాతన భారీ హోటల్‌ కట్టడం కూడా శిధిలావస్థకు చేరుకోవడంతో కూల్చేయాలనుకున్నారు అధికారులు. ఎప్పటి నుంచే కూల్చేస్తామని ఆ హోటల్‌కి నోటీసులు వచ్చాయి కూడా. అయితే ఆ భవంతి నిర్మాణం అత్యంత పురాతనమైనదే గాక చాలా భారీ కట్టడం కూడా అది. అలాంటివి కూల్చితే మళ్లీ అదే రీతిలో పునర్‌నిర్మించటం కూడా కష్టమే!. ఆ చారిత్రక భవనాన్ని కూల్చడానికి మనసొప్పని ఓ కంపెనీ దాన్ని కొనుగోలు చేయడమే గాక మరొక ప్రదేశానికి చెక్కు చెదరకుండా తరలించాలనుకుంది. అదెలా సాధ్యం అనిపిస్తోంది కదా!.పైగా అంత పెద్ద కట్టడం తరలించడం మాటలు కూడా కాదు. మరేలా చేసిందంటే...?

ఆ చారిత్రాత్మక కట్టడం కెనడాలో ఉంది. ఈ కట్టడాన్ని సుమారు 1826లలో నిర్మించారు. దీని పేరు హాలిఫాక్స్ ఎల్మ్‌వుడ్ భవనం. ఆ తర్వాత దీన్ని 1896లో విక్టోరియన్‌ ఎల్మ్‌వుడ్‌ హోటల్‌గా మార్చారు.  ఇది 2018 నుంచి శిథిలావస్థ స్థితిలోకి చేరవవ్వుతోంది. దీంతో కెనడా అధికారులు ఆ పురాతన కట్టడాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అది నగరంలో ఉన్న పురాతన భారీ కట్టడం. దీంతో చాలామంది ఈ నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో గెలాక్సీ ప్రాపర్టీస్‌ అనే కంపెనీ దాన్ని కొనుగోలు చేసి తరలించేందుకు ముందుకు వచ్చింది. అంతేగాక ఈ చారిత్ర నిర్మాణాన్ని కొత్త ప్రదేశానికి తరలించేలా ప్రణాలికలు కూడా సిద్ధం చేసింది.

అయితే ఈ భారీ నిర్మాణం దాదాపు 220 టన్నుల బరువు ఉంటుంది. సాధారణ రోలర్‌తో కదిలిస్తే భవనానికి నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు. దీంతో వారు ఐవరీ సబ్బుతో తయారు చేసిన సొల్యూషన్‌ బార్‌లను ఉపయోగించి తరలించాలని అనుకున్నారు. అయితే ఆ సబ్బు కడ్డీలకు ఉండే మృదు స్వభావం ఆ భవనాన్ని చెక్కు చెదరకుండా సజావుగా తరలించడంలో చక్కగా ఉపయోగపడింది. మొత్తం మీద కంపెనీ సిబ్బంది ఈ భవనాన్ని దాదాపు 700 బార్‌ సోప్‌లు, రెండు ఎక్స్‌కవేటర్లు, ఒక ట్రక్కు సాయంతో విజయవంతంగా 30 అడుగుల వరకు లాగింది. అంతేగాదు ఆ హోటల్‌ని మరోక పునాదిపై ఉండిచ అపెర్ట్‌మెంట్‌కి కనక్ట్‌ చేయాలని చూస్తోంది ఆ కంపెనీ. భవిష్యత్తులో ఇలాంటి చారిత్రక భవనాలను రక్షించుకునేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది సదరు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ. అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్‌ చేసింది. 

(చదవండి: మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే షాకవ్వుతారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement