కవ్వింత: ఆరోగ్యం
భార్య: ఇక్కడ స్నానాల సబ్బుండాలి ఏమైందండీ?
భర్త: ఆ.. ఆరోగ్యానికి మంచిదని టీవీలో చెబితే తినేశా!!
మళ్లీ అదే మాట!
భర్త: ఈ ఇంట్లో నా బతుకు కుక్క కన్నా హీనంగా ఉంది.
భార్య: నువ్వెందుకలా ఫీలవుతున్నావో నాకర్థం కావడం లేదు.
భర్త: నువ్వు నన్నలా ట్రీట్ చేస్తున్నావు, మన ఇంటికి వచ్చిన ఎవరినైనా అడుగు.
భార్య: ఊరికే ఎందుకలా మొరుగుతారు!? కాసేపు ఊరికే ఉండలేరా?
లేట్ న్యూస్!
భర్త: నాకస్సలు బుద్ధిలేదు. దేవత లాంటి ఆ అమ్మాయికి విడాకులిచ్చి అనవసరంగా నిన్ను కట్టుకున్నాను
భార్య: దేవత లాంటి అమ్మాయిని ఎలా వదిలేశారు మరి?
భర్త: నువ్వొచ్చాకే కదా నాకా విషయం అర్థమైంది.
తుంటరి పిల్లాడు
తండ్రి: మా వాణ్ణి ఎందుకు కొట్టారు టీచర్?
టీచరు: మీకు తెలిసిన కళల పేర్లు రాయమంటే మీ వాడు ఏం రాశాడో తెలుసా?
తండ్రి: కరెక్టుగా రాశానని చెప్పాడే!
టీచరు: అవును, శశికళ, చంద్రకళ, సూర్యకళ, కళాజ్యోతి...
రెండు జతలు
రవి: అదేంట్రా నీ చెప్పుల జత ఒక్కోటీ ఒకోలా ఉంది?
పప్పు: మా ఇంట్లో ఇలాంటి జత ఇంకోటి ఉంది తెలుసా?
తత్వం
శిష్యుడు: పెళ్లి వలన లాభమేంటి?
గురువు: ప్రాణం మీద భయం, తీపి పోవడానికి అంతకంటే ఉత్తమ మార్గం లేదు.