Disciple
-
PM Narendra Modi: యువరాజు కోసం పాక్ ఆరాటం
ఆనంద్: విపక్ష కాంగ్రెస్‌ను పాకిస్తాన్‌కు శిష్యరికం చేసే పార్టీగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ)ని మన దేశ తదుపరి ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందని అన్నారు. ఇండియాలో బలహీన, అవినీతి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మన శత్రువులు కోరుకుంటున్నారని ఆరోపించారు. ఇండియాలో కాంగ్రెస్ పతనమవుతుండడం చూసి పాకిస్తాన్ నాయకులు కన్నీరు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బాగు కోసం వారు ప్రారి్థస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ముమ్మాటికీ పాకిస్తాన్‌ను అనుసరించే పారీ్టయేనని పేర్కొన్నారు. రాహుల్ గాం«దీని ప్రశంసిస్తూ పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సేన్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను మోదీ ప్రస్తావించారు. పాకిస్తాన్, కాంగ్రెస్ మధ్య అనుబంధం ఇప్పుడు పూర్తిగా బయటపడిందని చెప్పారు. భారత్‌లో అత్యంత బలమైన మోదీ ప్రభుత్వం ఉన్నంతకాలం పాకిస్తాన్ ఆటలు సాగవని తేలి్చచెప్పారు. తాము ఎవరికీ తలవంచబోమని స్పష్టం చేశారు. తమ పాలనలో పాకిస్తాన్ ఉగ్రవాద టైర్లు పంక్చర్ అయ్యాయని అన్నారు. గతంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన దేశం ఇప్పుడు గోధుమ పిండి కూడా దిగుమతి చేసుకోలేక తిప్పలు పడుతోందని, గతంలో బాంబులు విసిరిన చేతులు నేడు భిక్షపాత్ర పట్టుకొని యాచిస్తున్నాయని పేర్కొన్నారు. గురువారం గుజరాత్‌లోని ఆనంద్, సురేంద్రనగర్, జునాగఢ్, జామ్‌నగర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కట్టబెట్టడానికి వీలుగా రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ కుట్ర పన్నిందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఓటు జిహాద్.. సిగ్గుచేటు ‘‘భారత్ గ్లోబల్ పవర్‌గా ఎదుగుతోంది. ప్రపంచదేశాలు భారత్‌ను విశ్వబంధుగా పరిగణిస్తున్నాయి. రెండు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించే సత్తా భారత్‌కు ఉంది. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి ముస్లింలకు దొడ్డిదారిన రిజర్వేషన్లు ఇవ్వబోమంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి పక్షాలు దేశ ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలి. రాజ్యాంగం ప్రతిని నెత్తిన పెట్టుకొని డ్యాన్సులు చేయడం పిచి్చపని. కాంగ్రెస్ యువరాజు ఇలాంటి పనులు మానుకోవాలి. రాజ్యాంగం కోసం ఎలా జీవించాలో, ఎలా మరణించాలో తెలుసుకోవాలంటే నా దగ్గరికి రండి.. నేరి్పస్తా. మనం ఇప్పటిదాకా లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ గురించి విన్నాం. ఇప్పుడు విపక్ష ఇండియా కూటమి కొత్తగా ఓటు జిహాద్ అంటోంది. మతం ఆధారంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటున్నారు. ఇలాంటి పిలుపులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కించపర్చడమే. మదర్సాల్లో చదువుకున్నవారు కాదు, ఉన్నత చదువులు చదివినవారు ఓటు జిహాద్ అంటుండడం సిగ్గుచేటు. దీనిపై కాంగ్రెస్ ఎందుకు నోరుమెదపడం లేదు? ప్రతిపక్ష కూటమి ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉన్నాయి. కాంగ్రెస్ చిమ్ముతున్న విషం.. కులం పేరిట, మతం పేరిట సమాజాన్ని ముక్కలు చేసి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ కుతంత్రాలకు పాల్పడుతోంది. బుజ్జగింపు విధానాల ద్వారా ఓటు బ్యాంక్‌ను సంఘటితం చేసుకోవాలని చూస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను ఎన్నికల అజెండాగా మార్చాలని ప్రయతి్నస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు చెందిన 27 శాతం కోటాను రాత్రికి రాత్రే లూటీ చేసింది. ముస్లింలకు కట్టబెట్టింది. రాజ్యాంగాన్ని రాసిన ముసాయిదా కమిటీలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులెవరూ లేరు. అంబేడ్కర్ లాంటి మేధావులు రాజ్యాంగాన్ని రాశారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగాన్ని లెక్కచేయడం లేదు. కాంగ్రెస్ చిమ్ముతున్న విషం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో నాకు అర్థం కావడంలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఉగ్రవాదులకు మద్దతిచ్చారు. కశీ్మర్లో వేర్పాటువాదుల ఎదుట సిగ్గులేకుండా మోకరిల్లారు. ఢిల్లీ బాట్లాహౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతమైతే ఒక మేడమ్(సోనియా గాం«దీ) బాధతో కన్నీరు ఆపులేకపోయారట! మన విశ్వాసాన్ని ఎగతాళి చేయడానికి కాంగ్రెస్ నేతలు వెనుకాడడం లేదు. సందర్భం వచి్చనప్పుడులా మన విశ్వాసాన్ని కించపరుస్తున్నారు. అదే ధైర్యం ఇతర మతాల విషయంలో ఆ నాయకులకు ఉందా? స్వార్థం కోసం, ఓట్ల కోసం సమాజాన్ని విచి్ఛన్నం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదు. ‘మిషన్’ పూర్తిచేయాలన్నదే లక్ష్యం ఈ ఎన్నికలను నా వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకొనే ఎన్నికలుగా నేను భావించడం లేదు. నా ఆకాంక్షలను 2014లోనే ప్రజలు నెరవేర్చారు. 2024 ఎన్నికల తర్వాత నా ‘మిషన్’ను పూర్తి చేయాలన్నదే లక్ష్యం. కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడం కేవలం మన దేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా అవసరం. శ్రీరాముడిని శివుడు ఓడించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపునిస్తున్నారు. ఇదెక్కడి వైపరీత్యం? మొఘల్ రాజులు అదే ఆలోచనా ధోరణి కలిగి ఉండేవారు. అయోధ్యలో రామ మందిరాన్ని, సోమనాథ్‌లో ఆలయాన్ని మొఘల్ రాజులు కూల్చేశారు. దేవుళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టి, హిందువులను కులాల వారీగా విడదీయాలన్నదే కాంగ్రెస్ కుతంత్రం. అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని, ట్రిపుల్ తలాక్‌ను మళ్లీ తీసుకొస్తామని చెప్పే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? దుష్ట కాంగ్రెస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. -
తీవ్ర మానసిక క్షోభతోనే మహంత్ గిరి ఆత్మహత్య
న్యూఢిల్లీ: అఖిల భారతీయ అఖాడా పరిషత్ దివంగత అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు అతని మాజీ శిష్యుల బెదిరింపులు, వేధింపులే కారణమని సీబీఐ పేర్కొంది. మాజీ శిష్యులైన ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, అతని కొడుకు సందీప్ తివారీల చేతిలో అవమానాలను భరించలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని సీబీఐ తన చార్జిషీటులో తెలిపింది. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నప్పటికీ వీడియోను బహిర్గతం చేస్తానంటూ ఆనంద్ గిరి తనను బెదిరించినట్లు ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు మహంత్ నరేంద్ర గిరి ఆరోపిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో తమకు లభ్యమైందని సీబీఐ తెలిపింది. అలహాబాద్‌లోని బడే హనుమాన్ మందిర్ పూజారి ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, సందీప్ తివారీలు మహంత్ బలన్మరణం కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్రలో నిందితులుగా పేర్కొంటూ ఈ నెల 20వ తేదీన కోర్టుకు సీబీఐ చార్జిషీటు సమర్పించిందని అధికారులు వెల్లడించారు. అలహాబాద్‌లోని బాఘంబరీ మఠంలోని తన గదిలో సెప్టెంబర్ 20వ తేదీన మహంత్ గిరి ఉరికి వేలాడుతుండగా గమనించి శిష్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
‘నా కుమార్తెను చంపేశారు’ : నిత్యానంద మరో అకృత్యం
సాక్షి, బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద అకృత్యాలకు సంబంధించి మరో హృదయ విదారక గాథ తాజాగా వెలుగులోకి వచ్చింది. నిత్యానంద ఆశ్రమంలో అమ్మాయిలను (శిష్యులను) భక్తి ముసుగులో లోబర్చుకోవడం, లైంగిక వేధింపులతో నరకం చూపిస్తున్నారంటూ కలకలం రేపిన ఇటీవలి కథనాలు, బాలికల మాయం ఉదంతాలు వెలు చూసిన అనంతరం ఓ బాధిత తల్లి తన గోడును మీడియా ముందు వెల్లడించారు. 2014లో నిత్యానంద ఆశ్రమంలో తన కుమార్తెను హింసించి, దారుణంగా హత్య చేశారని ఝాన్సీ రాణి అనే మహిళ ఆరోపించారు. బిడ్డను, భర్తను కోల్పోయాను.. కుటుంబం మొత్తం సర్వ నాశనమైపోయింది. తనలాంటి దుస్థితి మరెవ్వరికీ రాకూడదు..దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు. ఇండియా టుడే టీవీ కథన ప్రకారం నిత్యానంద బెంగళూరు ఆశ్రమంలో తన కుమార్తె సంగీత అర్జున్ను అక్రమంగా బంధించి, హత్యచేశారని ఝాన్సీరాణి ఆరోపణ. త్రిచికి చెందిన సంగీత అర్జునన్ 2008 - 2014 కాలంలో నిత్యానంద ఆశ్రమంలో కంప్యూటర్ విభాగానికి హెడ్‌గా పనిచేసేది. మరణించే నాటికి (డిసెంబర్28, 2014) ఆమె వయసు 24 మాత్రమే. ఆశ్రమంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో సంగీత జీవిస్తున్న విషయాన్ని గమనించి ఆమెను ఇంటికి తీసుకొచ్చానని, అయితే వెంటనే నలుగురు వ్యక్తులు వచ్చి బలవంతంగా సంగీతను తీసుకెళ్లారని, పైగా ఆశ్రమనుంచి ఎత్తుకొచ్చావంటూ తనమీదే కేసు పెడతామని బెదిరించాని ఆమె పేర్కొన్నారు. ఆ తరువాత తన బిడ్డను మళ్లీ సజీవంగా చూడలేకపోయానని ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు. ఆశ్రమంలో ఉండే హంసానంద, ప్రణయానంద ఇద్దరూ కనీసం తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడటానికి అనుమతించలేదని రాణి చెప్పారు. చాలాసార్లు ఆశ్రమానికి సంగీతను కలవడానికి వెళ్లి...గంటల తరబడి గేటు ముందు వేచి చూసినా ఫలితం లేదని, చివరకు గుండెపోటుతో చనిపోయిందంటూ ఆమె మృతదేహాన్ని అప్పగించారని వాపోయారు. కచ్చితంగా తన బిడ్డను హత్య చేశారని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును చేపట్టాలని ఆమె కోరుతున్నారు. అంతేకాదు సంగీత అంత్యక్రియలు కూడా ఆశ్రమంలోనే చేయాలని గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యారని ఝాన్సీ రాణి చెప్పారు. అంత్యక్రియలు నిర్వహించడానికి తన కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలని పట్టుబట్టడంతోనే మొదటి పోస్ట్‌మార్టం జరిగిందని ఆమె తెలిపారు. అయితే సంగీతం మృతదేహంపై కాళ్లపై వాపు, బ్లడ్ క్లాట్స్ బంధువులు గమనించడంతో బెంగళూరులోని రాంగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతోపాటు, రెండవసారి పోస్ట్‌మార్టం కోసం పట్టుబట్టినట్టు ఆమె చెప్పారు. దీంతో ఆమె శరీరంలోని అవయవాలన్నీ మాయమయ్యాయని రెండవ పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. అయితే మొదటి శవపరీక్షలో వాటిని తొలగించినట్టు గత ఏడాది హైకోర్టు జడ్జికి తెలిపారన్నారు. కర్ణాటక కోర్టులో కేసు వేసి ఐదేళ్ళు అయ్యింది. గత ఏడాది ఈ కేసులో సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. కానీ ఆ తరువాత పదిరోజుల్లోనే ఆ సదరు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో విచారణలో ఎలాంటి పురోగతి లేదని, ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించి బీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. సంగీత చనిపోయిన రెండేళ్లకే కుమార్తె చనిపోయిన బాధతో కుమిలిపోయిన తన భర్త కూడా ఈ లోకాన్ని వీడారని, నిత్యానంద నిర్వాకంతో సర్వం కోల్పోయానని ఝాన్సీరాణి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కుటుంబంలో గుండెపోటు వ్యాధికి సంబంధించిన హిస్టరీ ఉన్న కారణంగా జెనెటిక్‌గా వచ్చిన గుండెపోటుతో అతి చిన్న వయసులోనే సంగీత చనిపోయిందని ఆశ్రమ వర్గాలు తమ వెబ్సైట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా స్వామి ముసుగులో ఆశ్రమంలో లైంగిక కార్యకలాపాలు, అత్యాచార ఆరోపణలను ఇప్పటికే ఎదుర్కొంటున్న నిత్యానందపై మరోసారి తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. అమ్మాయిలతో బలవంతపు విరాళాలు వసూలు కోసం పిల్లలను కిడ్నాప్ చేసి, తప్పుగా నిర్బంధించినందుకు నిత్యానందపై గత వారం కేసు నమోదైంది. అయితే నిత్యానంద దేశం విడిచి పారిపోయాడని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నేను ఇలా చెయ్యడం సముచితమేనా?
ఆయన ఓ సాధువు. ఆయన దగ్గర బోలెడంత మంది శిష్యులున్నారు. ఓ రోజు ఆయన వద్దకు ఓ పాత శిష్యుడు వచ్చాడు. గురువుగారికి నమస్కరించాడు. అవీ ఇవీ మాట్లాడుకున్నాక అతను ‘‘గురువుగారూ నాకో సందేహం. మనసెప్పుడూ గందరగోళంగా ఉంటోంది’’ అన్నాడు శిష్యుడు.‘‘ఎందుకు?’’ గురువుగారు ప్రశ్నించారు.‘‘నేను మీ దగ్గరున్న రోజుల్లో పద్ధతి ప్రకారమే ధ్యానపద్ధతులు నేర్చుకున్నాను. అంకితభావంతోనే అనుసరించాను. ఆ ధ్యానపద్ధతులు నాకు తగిన ప్రశాంతతనే ఇచ్చాయి. మంచి ఆలోచనలు చేయగలుగుతున్నాను కూడా. ఇది అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాను’’ అన్నాడు ఆ పాత శిష్యుడు. ‘‘అటువంటప్పుడు సంతోషమేగా... మరెందుకు గందరగోళం?’’ అన్నాడు గురువు.‘‘నేను ధ్యానంలో లేనప్పుడు పూర్తి మంచి వాడిగా ఉంటున్నానో లేదో అనే సందేహం కలుగుతోంది. ఆ విషయం నాకే తెలుస్తోంది. కొన్నిసార్లు సరిగ్గా లేనని అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ ఒకటి రెండు తప్పులు కూడా చేస్తున్నాను. ధ్యానం తెలిసిన నేను ఇలా చేయడం సముచితమేనా. అది ఆలోచించినప్పుడు నా మనసు కలవరపడుతోంది’’ అన్నాడు శిష్యుడు.అతను చెప్పిన మాటలన్నీ విన్న గురువుగారు ఓ నవ్వు నవ్వారు.‘‘ఆహా, నువ్వు ధ్యానమూ చేస్తున్నావు. తప్పులూ చేస్తున్నావు. అంతేగా నీ మాట’’ అన్నాడు గురువు.‘‘అవును గురువుగారూ...’’ అది తప్పు కదా అని అడిగాడు గురువు.‘‘కాదు. నువ్వు రోజూ ధ్యానం చెయ్యి. తప్పులూ చెయ్యి. ఇలాగే చేస్తూ ఉండు. ఏదో రోజు ఈ రెండింట్లో ఏదో ఒకటి ఆగిపోతుంది’’ అన్నాడు గురువు.‘‘అయ్యో.. గురువుగారూ అలా అంటే ఎలాగండీ... ఒకవేళ తప్పులకు బదులు ధ్యానం ఆగిపోతే..?’’ అని ప్రశ్నార్థకంగా చూశాడు శిష్యుడు గురువు వంక.‘‘అదీ మంచిదేగా....నీ నైజమేంటో నీ సహజత్వమేదో తెలిసొస్తుంది కదా’’ అన్నాడు గురువు. అర్థమైందన్నట్లుగా చిరునవ్వుతో తల పంకిస్తూ గురువుగారికి నమస్కరించాడతను. – యామిజాల జగదీశ్ -
శంకరా... ఆది శంకరా! జగద్గురు!!
సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరంలో కాలటి క్షేత్రాన ఆర్యాంబ, శివగురువు అనే పుణ్యదంపతులకు ఆ పరమేశ్వరుడే స్వయంగా శంకరాచార్యుల వారి రూపంలో వైశాఖ శుక్ల పంచమి రోజున అవతరించారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీ కృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవద్గీతలో చెప్పినట్టు ధర్మం క్షీణిస్తున్నప్పుడు అంటే జనులందరూ స్వధర్మాచరణను కొంచెం కూడా పాటించకుండా ఉన్నప్పుడు జనులందరి శ్రేయస్సుకై పునః ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడు తానే అవతరిస్తానని చెప్పినట్లుగా సాక్షాత్ పరమేశ్వరుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించారు. ఆ సమయంలో బౌద్ధాది మతాల ప్రభావంతో వేదం, శాస్త్రం, ధర్మం, యాగం అనే శబ్దాలు కూడా వినబడని పరిస్థితి. అలాంటి సమయంలో శంకరాచార్యుల వారు జనులందరికీ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని స్వధర్మాచరణను ప్రబోధిస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ ధర్మ సంస్థాపన చేశారు. శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రస్థానత్రయాది భాష్యాలను రచించారు. ముప్ఫై రెండు సంవత్సరాల వయసులో కైవల్యాన్ని పొందారు. ఇదంతా ఏ ఒక్క మానవ మాత్రునికీ సాధ్యం కాని పని. అందుకే అంటారు ‘శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూపా’ ఈ జగత్తులో పరమేశ్వరుడే శంకరాచార్యుల రూపంలో సంచరించారు అని. శంకరాచార్యుల వారికి మాత్రమే జగద్గురువు అనే శబ్దం సార్థకం అవుతుంది. ప్రతి మనిషికీ ధర్మాన్ని ఆచరించడం, అర్థం అంటే సంపాదనం, కోరికలు తీర్చుకోవడం చివరికి ముక్తిని పొందడం. ధర్మ, అర్థ, కామ మోక్షాలు పురుషార్థాలు. ఇవి ప్రతి ఒక్కరికీ జీవిత లక్ష్యాలు. అయితే వీటిలో మోక్షం చాలా ప్రధానమైనది. అది ఆత్మజ్ఞానం ద్వారా లభిస్తుంది. ఆత్మజ్ఞానం గురువు వల్లనే లభిస్తుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది గురువు అంటే ఎవరు, గురువు ఎలా ఉండాలి? అని. దానికి చెప్తారు. ‘‘కో గురుః’ అంటే గురువు ఎవరు? దానికి సమాధానం... తత్త్వాన్ని అర్థం చేసుకొని శిష్యుడి హితం ఎల్లప్పుడూ కోరేవాడే గురువు. శ్రీ శంకరాచార్యులవారి దగ్గర ఈ లక్షణం సంపూర్ణంగా కనపడుతోంది. ధర్మాన్ని ప్రస్థానత్రయాది గ్రంథాలలో మహా మహా పండితులకు కూడా మళ్లీ మళ్లీ చదివితేనేగాని అర్థం కాని ప్రౌఢ భాషలోనూ; ఎలాంటి శబ్ద జ్ఞానం కూడా లేని సామాన్యుడికి అర్థం అయ్యేట్టుగా సులభ శైలిలో ఉండే భజగోవిందాది స్తోత్రాలతోనూ ప్రబోధించారు. ఆయన సర్వ శాస్త్రాలు తెలిసిన వారు. మానవులందరికి శ్రేయస్సుకోసం అపారమైన కృషి చేసిన వారు. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఆయన ఉపదేశాలు మానవాళికి మార్గదర్శనం అవుతున్నాయి. ఉపనిషత్తులలో ప్రతిపాదించిన భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్నే శంకరులు చెప్పారే కాని ఏ కొత్త సిద్ధాంతాన్నీ చెప్పలేదు. ఎందుకంటే మనకు వేదం ప్రామాణికం. ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. వారి వారి సంస్కారాన్ని అనుసరించి వారి జీవన విధానం ఉంటుంది. అయితే వారందరికీ ధర్మబద్ధమైన జీవనం గడపడం ఎలాగో సూచించగల మహానుభావుడే జగద్గురువు. ఆదిశంకరులను జగద్గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాము ప్రబోధించినటువంటి సనాతన ధర్మం ఇప్పుడు పిలవబడే హిందూధర్మం సూర్యచంద్రులు ఉన్నంత వరకు మానవాళికి అంది, వారు శ్రేయస్సును పొందాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలో నాలుగు దిక్కులలో నాలుగు మఠాలను స్థాపించారు. దాంట్లో... 1. తూర్పున పూరీలో గోవర్థన పీఠాన్ని, 2. దక్షిణాన శృంగేరీలో శారదాపీఠాన్ని, 3. పశ్చిమాన ద్వారకలో ద్వారకా పీఠాన్ని, 3. ఉత్తరాన బదరీలో జ్యోతిర్మఠ పీఠాన్ని నాలుగు దిక్కులలో నాలుగు వేదాలకు ప్రతీకలుగా నాలుగు పీఠాలను స్థాపించారు. మనకు దక్షిణాన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో శృంగేరీ శారదాపీఠం ధర్మాన్ని ప్రబోధిస్తుంది. ఈ పీఠంలో శంకరాచార్యులు మొదలుకొని ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఉత్తరాధికారి అయినటువంటి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వరకు అవిచ్ఛిన్న గురు పరంపరలో ప్రతి ఒక్కరూ కూడా శంకరాచార్యులే. ఈ మాట శంకరులు స్వయంగా చెప్పినారు. వీరు నడిచే అమ్మవారి లాగా అమ్మవారే స్వయంగా పురుషాకారం తీసుకుని ఈ భూమియందు మానవాళిని ఉద్ధరించడానికే నడుస్తున్నది అని. ఒక మహాకవి ఇదే చెప్తారు ‘పుంభావం సము పేయుషీ భగవతి’ ఆది శంకరాచార్యులవారి జయంతి సందర్భాన వారు ఉపదేశించినటువంటి ధర్మాన్ని ఆచరించి మనందరికీ కూడా సద్బుద్ధి, సత్ప్రేరణ, సన్మార్గం కలగాలని శంకరాచార్యుల స్వరూపులైన శ్రీ మద్ భారతీ తీర్థ మహాస్వామి వారికీ, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికీ సవినయ సాష్టాంగ నమస్సులతో.... – వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ శృంగేరీ పండితులు -
జల్లెడని నీళ్లతో నింపండి!
ఒక గురువు తన శిష్యులకు సృజనాత్మకత గురించి అద్భుతమైన పాఠం చెప్పాడు. ఆ పాఠం మనసులో నాటుకుపోయి, తమ సృజనాత్మకత నిరూపించుకునే అవకాశం అడిగారు శిష్యులు. వారి చేతికి ఒక జల్లెడ అందించి దాని నిండా నీరు నింపమని ఆదేశించాడు గురువు. దగ్గరలోని నదికి వెళ్ళి నీటితో జల్లెడ నింపుతున్నారు శిష్యులు. ప్రతిసారీ రంధ్రాల ద్వారా ధారలు కురిసి జల్లెడ ఖాళీ అవుతోంది తప్ప శిష్యులు సఫలీకృతులు కాలేదు. చాలా సేపటి తరువాత వారిని వెతుకుతూ వచ్చిన గురువు జరిగింది తెలుసుకుని చిరునవ్వు నవ్వాడు. జల్లెడ అందుకుని ప్రవాహంలో దిగి నీటి లోపల వదిలాడు. జల్లెడ నీటిలో పూర్తిగా మునిగింది. జల్లెడ నీటితో నిండింది. ఆ ఆలోచన రానందుకు సిగ్గుపడ్డారు శిష్యులు. ‘‘జల్లెడను వెనక్కు ఇవ్వమనే నిబంధన లేనప్పుడు సృజనాత్మకంగా ఆలోచించి వుంటే జల్లెడ నింపడం సులువయ్యేది’’ అన్నాడు గురువు. శిష్యుల మాదిరిగానే చాలా మంది మూస ధోరణిలో ఆలోచిస్తూనే తమ ప్రయత్నాలను గుర్తించడం లేదని, సృజనాత్మకత మరుగున పడి మసక బారుతోందని గగ్గోలు పెడతారు. ఇందుకు మరో ఉదాహరణ చూద్దాం... జైలులో ఉన్న యువకుడైన కొడుక్కి వృద్ధుడైన తండ్రి ‘వయసు మీద పడి తోట తవ్వలేక పోవడం వలన తల్లికి ఇష్టమైన బంగాళ దుంపలు వేయలేక పోయానని’ ఉత్తరం రాసాడు. ఆ కొడుకు ఆలోచించి ‘‘పొరపాటున కూడా తోట తవ్వకు. అందులో తుపాకులు దాచానని తంతి సమాచారం తిరిగి పంపాడు. ఆ ఉత్తరం చదివిన పోలీసులు మందీ మార్బలంతో వెళ్లి తోట మొత్తం తవ్వించారు. ఆ భూమిలో తుపాకులు దొరకలేదు. పోలీసులు చేసిన పని వివరిస్తూ మరో ఉత్తరం కొడుక్కి రాసాడు తండ్రి. ‘‘జైలులో వున్న నేను ఇంతకన్నా సాయం చేయలేను. ఎలాగూ పోలీసులు భూమిని తవ్వారు. ఇప్పుడు అమ్మకిష్టమైన బంగాళదుంపలు పండించు’’ అని జవాబిచ్చాడు కొడుకు. ఆ యువకుడిలా కొత్తగా ఆలోచిస్తే పనులు సులభంగా పూర్తవుతాయి. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
దేవదేవుడయినా గురువుకి శిష్యుడే!
కృష్ణ భగవానుడిది పరిపూర్ణావతారం. ఆయనే జగద్గురువు. కానీ ఈ లోకంలోకి వచ్చిన తరువాత గురువయిన సాందీపని మహర్షికి ఎంత సేవ చేసాడో! ఆ సేవకుమెచ్చి గురువులు కూడా అలాగే అనుగ్రహించేసారు. ఒకరోజు సమిధలు తేవడానికి అరణ్యానికి వెళ్ళారు శ్రీ కృష్ణుడు, కుచేలుడు. కొద్దిసేపటికి మబ్బులు పట్టి హోరున వాన, చీకటి.. అరణ్యంలో దారితప్పి తెల్లవారేసరికి తిరిగొచ్చారు. ఈలోగా వారు రాలేదన్న బెంగతో సాందీపని మహర్షి వాళ్ళ పేర్లుపెట్టి పెద్దగా అరుస్తూ వెతికాడు ఆ రాత్రంతా. వారు ఎదురు పడగానే గట్టిగా కావలించుకుని ‘‘ఓ కృష్ణా! ఓ కుచేలా! ఇకపై మీకు విశేషమైన ఐశ్వర్యం, జ్ఞానంతోపాటూ బంధుమిత్ర బలగాలు అన్నీ విశేషంగా సమకూరుతాయి’’ అని ఆశీర్వదించేసాడు ఆ ఆనందంలో. గురువు ప్రేమైక హృదయుడు. దాచుకోవడం గురువుకి తెలియదు. తాను కష్టపడి నేర్చుకున్నది మొత్తం ఇచ్చేస్తాడు. అంతేకాదు, గురువు వినయ సంపన్నుడు. ఉపనిషత్తులో ఒక కథ ఉంది. సుకేశుడని ఒక మహర్షి. ఆయన దగ్గరకు ఒక రాకుమారుడు వెళ్ళాడు. ‘‘చంద్రకళలు, షోడశకళలు ఏవి? వాటి విశేషం గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పండి’’ అని అడిగాడు. ‘‘అయ్యో నాకు తెలియదే, మరొకర్ని అడగండి’’ అన్నాడు. చెప్పలేక పోయినవాడు సుకేశుడనే గురువయితే, అడిగిన రాకుమారుడు సిగ్గుపడి తలొంచుకుని వెళ్ళిపోయాడు. ఇదేమిటి? అంటే...ఆయన ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాడు, కష్టపడి ఎంతో మంది శిష్యులకు చెబుతున్నాడు. ఆయనకి తెలియని ఏదో ఒక చిన్న విషయం ఉంటే నేనది అడిగి ఆ మహానుభావుడినోటితో తెలియదనిపించానే, ఇటువంటి ప్రశ్న అడిగి ఆయన్ని ఇబ్బందిపెట్టానే...అని క్షోభిస్తూ వెళ్ళాడు యోగ్యుడైన ఆ శిష్యుడు. శిష్యుడు గురువుగారి కీర్తిప్రతిష్ఠలు నిలబెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. పెద్దవాళ్ళయిన తరువాత కుచేలుడు, శ్రీకృష్ణుడు ఒకసారి కలుసుకున్నప్పుడు పాతజ్ఞాపకాలు నెమరువేసుకునే క్రమంలో కృష్ణుడు మొదటగా ప్రస్తావించిన అంశం – ‘‘ఓయ్, కుచేలా! నీకు గుర్తున్నారు కదా మనకు పాఠం చెప్పిన ఆ గురువుగారంటూ... మన సాందీపని గురువుగారు ఎంత గొప్పవాడయ్యా, అజ్ఞానమన్న చీకటికి దీపమయ్యా ఆయన. ఎంత మహానుభావుడో.. అవ్యయమైన బ్రహ్మాన్ని లోపల తాను అనుభవించి ఎప్పుడూ సత్కర్మలు చేస్తూ పండిత శ్రేష్ఠులచేత ప్రశంసలనందుకొన్నవాడయ్యా... అటువంటి గురువు లభించడం.. అక్కడ మనం చదువుకోవడం ఎంత అదృష్టమయ్యా..’’ అంటాడు. రుక్మిణీ కళ్యాణంలో... అగ్నిద్యోతనుడు రుక్మిణికి గురువు, కాబట్టి కృష్ణుడికీ గురువే. ఆయనను రమ్మని పిలుస్తూ ’ఆలస్యం చేస్తావేం..ఆవిడ రాసిన పత్రిక చదివావుగా, లే, లేచిరా, పెళ్ళవుతుందా, అని సందేహిస్తున్నావా. తప్పకుండా అవుతుంది. ఉపాధ్యాయులం, గురువులమయిన మేం ఆశీర్వదిస్తున్నాం. కళ్యాణమస్తు.’’ గురుభక్తి ఎలా ఉండాలో చిన్న పద్యాల్లో పోతన గారు అద్భుతంగా ఆవిష్కరించేసారు. శిష్యుడి ప్రథమ కర్తవ్యం–గురువుగారి గౌరవాన్ని నిలబెట్టడం. గురువు పేరెత్తితే చాలు పరబ్రహ్మం, పరిపూర్ణావతారం కూడా తలవంచేసింది. అంతే. అదీ ఆచార్యదేవోభవ అంటే. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురు శిష్యులు
ఒకసారి ఓ గురుశిష్యులిద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఎటో వెళుతున్నారు. శిష్యుడికి ఆ గురువంటే అమితమైన గౌరవాభిమానాలు. గురువుముందు బిగ్గరగా మాట్లాడడం గాని, అతనికంటే ఒక్క అడుగు కూడా ముందు నడవడం గాని చేసేవాడు కాదు. వినయ విధేయతలతో మసలుకునేవాడు. వారలా వెళుతూ ఉండగా మార్గంలో ఒక వాగు దాటవలసి వచ్చింది. అప్పుడు గురువు, శిష్యుడికి జాగ్రత్తలు చెబుతూ వాగులోకి దిగాడు. కాని శిష్యుడు వెంటనే గురువుగారి చెయ్యి పట్టుకొని ఒడ్డుకు లాగి, ‘‘గురువుగారూ.. ముందు నేను వాగు దాటుతాను. తరువాత మీరొద్దురుగాని.. అందాకా ఇక్కడే ఉండండి’’ అన్నాడు వినయంగా. ‘‘లేదు లేదు నేనే ముందు వాగు దాటుతాను’’ అంటూ కోప్పడ్డాడు గురువు. శిష్యుడు మొండిగా ‘‘నేనే దాటుతాను గురువుగారూ’’ అని పట్టుబట్టాడు. చివరికి గురువే కాస్త మెత్తబడి, ‘సరే నువ్వేదాటు.. ఏం చేస్తాం.. అని అనుమతించాడు. గురువు అనుమతి పొందిన శిష్యుడు తానే ముందుగా వాగుదాటాడు. తరువాత గురువు కూడా దాటాడు. మొత్తానికి గురుశిష్యులిద్దరూ వాగుదాటి, ఓ చెట్టుకింద కూర్చున్నారు. అప్పుడు గురువు శిష్యుడితో మాట్లాడుతూ.. ‘‘నీకు బాగా తలబిరుసుతనం ఎక్కువైంది. నామాట వినకుండా నీ పంతమే నెగ్గించుకొని నాకన్నా నువ్వే ముందు వాగు దాటావు. గురువు పట్ల ఇలాంటి అవిధేయత పనికిరాదు.’’ అన్నాడు కోపంగా... అప్పుడు శిష్యుడు, ‘‘గురువుగారూ.. నేను మీ పట్ల అవిధేయత చూపలేదు. ఎప్పుడూ చూపను కూడా..! నేను కేవలం నా బాధ్యతను గుర్తించి, మీ హక్కును నెరవేర్చాను. అయితే ఇప్పుడు మీమాట వినకపోడానికి ఒక కారణముంది’’ అన్నాడు వినయంగా. ‘‘ఏమిటది?’’ అడిగాడు గురువు ఆశ్చర్యంగా ..‘‘అసలే వర్షాకాలం రోజులు. వాగేమో ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో వాగు దాటేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తే, నేనొక్కణ్ణే కొట్టుకుపోతాను. ఒకవేళ మీరు ముందుగా వాగు దాటితే, దురదృష్టవశాత్తూ అలాంటి ప్రమాదమేమైనా మీకు గాని జరిగితే, మీతోపాటు వేలాదిమందిని ముంచినవాణ్ణి అయిపోతాను.’’ అన్నాడు శిష్యుడు.. ‘అదేమిటి.. అదెలా?’’ అన్నాడు గురువు ఆశ్చర్యంగా.. ‘‘గురువర్యా.. అదంతే.. నాలాంటి వేలమంది శిష్యులు కలిసి కూడా మీలాంటి ఒక గురువును తయారు చేయలేరు. అదే మీరు చల్లగా ఉంటే, నాలాంటి శిష్యుల్ని వేలాదిమందిని తయారు చేయగలరు.’’ అన్నాడు శిష్యుడు. శిష్యుని మాటలు విన్న గురువు అమితానంద భరితుడై శిష్యుణ్ణి మనసారా దీవించాడు. అతడి ఉన్నతి కోసం దైవాన్ని ప్రార్థించాడు. ఆ శిష్యుడు సికిందర్ చక్రవర్తి అయితే గురువు అరిస్టో. ప్రపంచ విజేతగా ప్రఖ్యాతి పొందిన యూనాన్ చక్రవర్తి సికిందర్‌ను ‘తండ్రి ఔన్నత్యం గొప్పదా.. గురువు ఔన్నత్యం గొప్పదా..’ అని అడిగితే, ‘తండ్రి నన్ను ఈలోకంలోకి తీసుకు వచ్చాడు. నా ఉనికికి కారణం ఆయన. అయితే, గురువు నన్ను, నా స్థానాన్ని ఆకాశానికెత్తాడు.’ అని సమాధానం చెప్పాడు.పవిత్ర ఖురాన్లో సైతం దేవుడు, ప్రవక్తవారి ముందు అనుచరుల్ని పెద్దగా గొంతెత్తి మాట్లాడకూడదని ఆదేశించాడు. అందుకని, తల్లిదండ్రులు, పెద్దలు, గురువుల పట్ల వినయ విధేయతలతో మసలుకోవాలి. వారిని గౌరవించాలి. వారి ఆశీర్వాదాలు, దుఆలు పొందాలి. అంతేకానీ, గురువును అవహేళన చేయడం, గురు నింద చేయడం తగదు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సాయం చేసి మరచిపో!
జెన్‌పథం ఓ శిష్యుడు గురువు వద్దకు వచ్చి, నమస్కరించి ‘‘నాకిప్పుడు బోలెడు సంపద లభించింది. దానినేం చేయాలి? మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఏం చేస్తే నా మనసుకి ఆత్మకు ప్రశాంతత, ఆనందం కలుగుతుందో చెప్పండి... చేస్తాను’’ అన్నాడు శిష్యుడు. కొన్ని రోజుల తర్వాత రా. చెప్తాను’’ అన్నారు గురువుగారు. శిష్యుడు వారం పది రోజుల తర్వాత గురువు దగ్గరకు తిరిగొచ్చాడు. అప్పుడు గురువు ఇలా చెప్పారు – ‘‘నీకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నీ సంపదను నువ్వే ఖర్చు చేస్తే అందువల్ల నీకు ఎలాటి ప్రయోజనమూ ఉండదు. పోనీ బంధువులకూ మిత్రులకూ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. అలాగని ఆలయాలకో మరి దేనికో ఇస్తే అక్కడి నిర్వాహకుల ధనాశకు మేత పెట్టినట్టు అవుతుంది. అంతా పేదలకు ఇచ్చావనుకో నీకు తృప్తి కలుగుతుందనడంలో సందేహం లేదు. కానీ నీలో పోను పోను ‘నేనేగా చేసాను అంతటి పనిని’ అంటూ అహం పెరిగి దానితోపాటు గర్వం ఎక్కువైతే అది నీ వ్యక్తిత్వానికి, పురోగతికి అడ్డుకట్టు అవుతుంది, నిన్ను దెబ్బ తీస్తుంది. ఆ దెబ్బతో నువ్వు దిగజారిపోతావు...’’ అన్నారు గురువు. అయితే మరేం చెయ్యమంటారు చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాను’’ అన్నాడు శిష్యుడు. ‘నిరుపేదలకు ఇచ్చేసెయ్. దానితో వారికి ఆనందం కలుగుతుంది. కానీ నువ్వు వారికి ఇచ్చాననుకున్న విషయాన్ని మరచిపో. సహాయం చేసిన వారికి గుర్తు పెట్టుకోనక్కర లేదు. సహాయం పొందిన వారు మరచిపోకుండా ఉంటే చాలు’’ అన్నారు గురువు. – యామిజాల జగదీశ్ -
తనకేమీ తెలియదని తెలుసుకున్నవాడు జ్ఞాని
అధ్యాపకుడు అంటే ఏది చదవాలో అది చదివిస్తాడు. ఏ చదువయినా ఈశ్వరుడి దగ్గరకు చేరుకునేటట్లు చేస్తాడు. గురువు వినీతుడు. శిష్యుడు వినేయుడు. గురువుచేసే మొదటి పని వినయాన్ని నేర్పడం. అసలు విద్య అన్న మాటకు ఒక అర్థం–విత్ అంటే తెలుసుకొనుట. రెండవ అర్థం–నాకేమీ తెలియదని తెలుసుకొనుట. కానీ మానవ నైజం ఏమిటంటే– సరస్వతీ కటాక్షం లేదంటే (నీ కేమీ తెలియదంటే) ఎవ్వడూ ఒప్పుకోడు. లక్ష్మీకటాక్షం (పుష్కలంగా సంపద/డబ్బు) ఉందంటే ఒప్పుకోడు. ‘నాకేం తెలుసండీ’ అనగలగాలంటే చాలా తెలిసి ఉండాలి. కొన్ని తెలుసుకున్న తరువాత... ‘ఎన్ని గ్రంథాలున్నాయి, ఎంతమంది రుషులున్నారు, ఎన్నిదర్శనాలు, ఎంతమంది మహానుభావులు. అవన్నీ చదవడానికి నా జీవితం ఏం సరిపోతుంది. దీనికే సరిపోకపోతే ఇక వాటిని ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకోవాలి... అయ్యబాబోయ్, నాకేం తెలియదండీ’ అంటాడు. బాగా తెలిసున్నవాడి లక్షణం నాకేమీ తెలియదని వినయంతో ఉండడం. సుందరకాండలో సీతమ్మ హనుమని పిలిచి–‘అంతమంది వానరులొచ్చి అటుపక్కన సముద్రపు ఒడ్డున ఉండిపోయారు కదా, నువ్వొకడివే కదా ఇక్కడికి వచ్చావు, రేపు రామ– రావణ యుద్ధం జరిగితే ఎంతమంది వానరులు వస్తారు’ అని సందేహం వ్యక్తం చేస్తే హనుమ అంటాడు ‘‘అమ్మా! నీకు తెలుసుకదా, రాణివాసంలోని మహారాణి దగ్గరకు ఎవర్నయినా పంపాల్సి వచ్చినప్పుడు ప్రభువులు తమ దగ్గరున్న సేవకుల్లో అందరికన్నా పనికిమాలిన వాడెవడో వాడిని పంపిస్తారు. అమ్మా, సుగ్రీవుడు నన్ను పంపించాడంటే–నాతో సమానులు, నాకన్నా అధికులున్నారు కానీ, నాకన్నా తక్కువ వాళ్ళు అక్కడ లేరమ్మా’’ అన్నాడు. అదీ వినయం. అందుకే హనుమ పాదాలు పట్టుకుంటే బుద్ధి, వినయం లభిస్తాయంటారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యులొకసారి ‘మిమ్మల్ని జగద్గురువని సంబోధించాలని ఉంది... అలా పిలవొచ్చా– అని అడిగారు. దానికాయన ‘‘జగద్గురువంటే ఒక సమాసం ప్రకారం ‘జగత్తునంతా గురువుగా కలిగినవాడు’ అనే అర్థంలో నేను ఎప్పుడూ జగద్గురువునే. ఎందుకంటే ఇంతమందిని చూసి నేను ప్రతిరోజూ నేర్చుకుంటున్నాను కనుక’ అన్నారు. అదీ ఆయన వినయం. శిష్యుడు అంటే శిక్షింపబడేవాడు. వినయం ఉండి ఇంద్రియములు శిక్షింపబడిన వాడు శిష్యుడు. గురువుగారి పేరు వినబడినా, ఆయన కనబడినా ఇంద్రియాలు అదుపులోకి రావాలి. చూడకూడనిది కన్ను చూడదు, స్మరించకూడనివి మనసు స్మరించదు, వినకూడనివి చెవులు వినవు. అలా ఇంద్రియాలను శిక్షించుకుని, నిగ్రహించుకుని, శమదమాదులు నేర్చుకుని గురువు ముందు కూర్చున్నవాడు శిష్యుడు. అందుకే శంకరాచార్యులవారు షట్పదీ స్తోత్రం చేసూ ్త‘నా అవినయాన్ని తీసేసి వినయాన్ని కటాక్షించు’ అన్నారు. మొదట వినయం నేర్పినవాడు గురువు, ఆయన అధ్యాపకుడు. చదువు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు అని మరో పేరు. అనేకమైన క్రియాకలాపాల వల్ల గురువు ఇన్ని పేర్లతో పిలవబడతాడు. లౌకికంగా అర్థం చెప్పాలంటే – కొంత ద్రవ్యాన్ని జీతంగా తీసుకుని పాఠం చెప్పేవాడు ఉపాధ్యాయుడు అని. మరొక అర్థంలో – కుమారుడికి ఉపనయనంచేసే తండ్రి చెపుతున్నట్లుగా ‘‘ఉపేధ్య–తస్మాత్ అధీయతా’’ ఉపేధ్య అంటే వెళ్ళు. ఆయన దగ్గరకు వెళ్ళు, తస్మాత్ అధీయతా.. ఇప్పుడు ఆ మహానుభావుడి దగ్గరకువెళ్ళి నేర్చుకో అని తండ్రి ఎవరివంక చేయి చూపించి పంపుతాడో, ఎవరు వేదం నేర్పుతారో ఆయన ఉపాధ్యాయుడు. -
పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి?
గురువు అంటే పాఠం చెప్పేవాడు, శిష్యుడు అంటే పాఠం వినేవాడు అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాకాదు వినీతుడు, వినీయుడులాగా ఉండాలి. విద్యార్థిగా సంస్కారవంతుడు ఎప్పుడవుతాడంటే- ప్రప్రథమంగా గురువు దగ్గర వినయాన్ని నేర్చుకున్నప్పుడు. ఇది ఎలా తెలుస్తుంది? ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జించిన గురువు దానిని అంతే కష్టపడి శిష్యుడికి నేర్పినప్పుడు... తదనంతర కాలంలో ఆ గురువు పేరు తలచుకున్నప్పుడల్లా ఆ శిష్యుడి కళ్ళు చెమ్మగిల్లినప్పుడు తెలుస్తుంది. ఆర్ద్రత అని సంస్కృతంలో ఒక మాట ఉంది. తడిసి ఉండుట, చల్లగా ఉండుట అని దాని అర్థం. జీవితంలో ఎవర్నీ నమ్మని స్థితిలో మనసు పొడిబారుతుంది. అది జీవితంలో వృద్ధిలోకి రావడానికి అన్ని తలుపులూ మూసివేసుకుని ఉన్న స్థితికి పరాకాష్ఠ. అందుకే మన ఎప్పుడూ పొడిబారకూడదు. తేమగా ఉంటేనే విత్తనం జీవం పోసుకుంటుంది. పాషాణం మీద మొలకెత్తదు. గోడకు కొద్దిగా గుల్లబారుతనం ఉంటేనే మేకు దిగుతుంది. ఇనుప స్తంభానికి మేకు కొట్టే ప్రయత్నం చేస్తే అది వంగిపోతుంది తప్ప దిగదు. అందువల్ల మనిషి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పొందవలసింది-మనసునందు ఆర్ద్రత. గురువు అంటే పాఠం చెప్పేవాడు, శిష్యుడు అంటే పాఠం వినేవాడు అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాకాదు వినీతుడు, వినీయుడులాగా ఉండాలి. విద్యార్థిగా సంస్కారవంతుడు ఎప్పుడవుతాడంటే- ప్రప్రథమంగా గురువు దగ్గర వినయాన్ని నేర్చుకున్నప్పుడు. ఇది ఎలా తెలుస్తుంది? ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జించిన గురువు దానిని అంతే కష్టపడి శిష్యుడికి నేర్పినప్పుడు... తదనంతర కాలంలో ఆ గురువు పేరు తలచుకున్నప్పుడల్లా ఆ శిష్యుడి కళ్ళు చెమ్మగిల్లినప్పుడు తెలుస్తుంది. ఒకసారి లబ్ధప్రతిష్ఠుడైన ఒక డాక్టర్‌ను కలిసాను. ఆయనకు 80 ఏళ్ళు. ఆయన ఒక్క పైసా ప్రతిఫలం పొందకుండా ఆరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 1 లక్షా 70 వేల పోలియో ఆపరేషన్లు చేసాడట. ఉచితంగా ఎందుకు చేస్తున్నారని నేనడిగితే- ‘‘విశాఖపట్టణంలో వ్యాఘ్రేశ్వరుడని ఎముకల వైద్యంలో దిట్ట అయిన ఒక డాక్టరుగారుండేవారు. ఆయన పోలియో ఆపరేషన్స్‌లో పరమ నిష్ణాతుడు. ఆయన వద్ద పోలియో ఆపరేషన్స్ నేర్చుకున్నాను. మొట్టమొదటి పేషంట్‌కు నేను ఆపరేషన్ చేసేటప్పుడు ఆయన తన చేతిలో నా చెయ్యి వేయించుకుని ఒక మాట తీసుకున్నారు. దానికి ముందు ఆయనేం చెప్పారంటే.. ‘ఒక వ్యక్తికి పోలియో వచ్చి ఒక కాలు తోటకూర కాడలా, ఒక చెయ్యి మరో తోటకూర కాడలా వేలాడుతుంటే వాడు జీవితాంతం ఎంత బాధపడతాడో గుర్తు చేసుకో. భగవంతుడి అనుగ్రహం చేత శస్త్రచికిత్స చేసి అతని కాలూ చెయ్యీ కదిలేటట్లు చెయ్యగలిగే ప్రజ్ఞ పొందుతున్నావు. నీవిస్తానన్న గురుకట్నంగా ఈ మాట ఇవ్వు. నిన్ను గొప్ప నిష్ణాతుడిని చేస్తాను. పోలియో ఆపరేషన్ చేస్తే ఎన్నడూ నయాపైసా పుచ్చుకోకు’-అన్నారు. అలా ఇది ఆయన పెట్టిన భిక్ష. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా లక్షా 70 వేల ఆపరేష్ల చేసాను’’ అంటూ చెబుతూంటే ఆయన కళ్ళవెంట నీళ్ళు అప్రయత్నంగా కారిపోతున్నాయి. పోలియో బారి నుండి విజయవంతంగా బయటపడ్డ కొన్ని వేలమంది ఆ డాక్టర్‌ను దేముడిలాగా రోజూ తలచుకొని వారి భార్యాబిడ్డలతో సంతోషిస్తుంటే అంతకన్నా పుణ్యకార్యం ఇంకొకటి ఉంటుందా లోకంలో! అంతకన్నా కీర్తి పొందడానికి మరొక మార్గం ఉంటుందా ప్రపంచంలో! ఇదీ ఆర్ద్రత అంటే... ఇదీ వినయంతో కూడిన సంస్కారం అంటే. చదువు ఎప్పుడూ అహంకారానికే పనికి వస్తే అంతకన్నా అర్థరహితమైన విద్య లోకంలో మరొకటి లేదు. ప్రపంచంలో పరమ ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు... అహంకారగ్రస్థుడైన చదువుకున్నవాడు. పల్లెపట్టుల్లో ఏమీ చదువుకోని బాగా అమాయకులైన వారెక్కువగా ఉంటూంటారు. వాళ్ళు సాధారణంగా ఎవరూ ఎవరినీ పేరుపెట్టి పిలుచుకోరు. ఎవరినైనా పిలవవలసి వస్తే నాయనగారూ, అమ్మగారూ, బావా, బాబాయి, మామా, అక్కా, అన్నా - అంటారు తప్ప పేరుపెట్టి పిలవరు. బంధువుల్లాగా ప్రేమతో పిలుచుకుంటారు. అటువంటి చోట్ల ఒక అమాయకుడైన చదువుకోని వ్యక్తి ఒక నేరం చేయాల్సివస్తే బహుశః దొంగతనం, జేబులు కొట్టేయడం వంటివి చేస్తాడేమో కానీ బాగా చదువుకున్న వ్యక్తి ఏ సాఫ్ట్వేర్ వంటి వాటిలో కూడా నైపుణ్యం ఉన్నవాడు నేరం చేస్తే వాడిని పట్టుకోవడం ఒక పట్టాన సాధ్యపడదు. మనిషిలో తెలివితేటలు సమాజహితానికి పనికి రావాలి తప్ప కేవలం ఆ విద్య అడ్డుపెట్టుకుని తాను ఎలా బతకాలనుకుంటున్నాడో అలా భోగవంతమైన జీవితం గడపడానికి అది ఆలంబనం కాకూడదు. అందుకే విద్యావిధానం గురించి (పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలన్న విషయాన్ని గురించి) రామాయణంలో మహర్షి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. రెండు గంటల్లో చెప్పగల విషయాన్ని రెండు నిమిషాల్లో చాలా ప్రభావవంతంగా చెప్పగలిగినట్లు ఈ శ్లోకంలో చెప్పారు‘‘సర్వే వేద విదాః శూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానపాశ సంపన్నాః సర్వే సముదితాణైహి’’ వశిష్ఠుడు రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలను కూర్చోబెట్టుకుని విద్య నేర్పాడు. అంటే పాఠం ఒక్కటే చెప్పి వెళ్ళిపోలేదు. వేదాలన్నీ నేర్పాడు, విద్యలన్నీ నేర్పాడు. శూరాః అంటే శూరుడు అంటే యుద్ధం చేసేవాడని కాదు. పండితుడనే అర్థం కూడా ఉంది. అంటే జ్ఞానవంతుల్ని చేసాడు. సర్వేలోకహితేరతాః... అంటే పాఠం చెప్పేటప్పుడే ఈ చదువుకున్న చదువంతా దేనికి పనికి రావాలో చెబుతుండేవాడు. లోక హితానికి, లోక క్షేమానికి ఆ విద్య ఎలా వినియోగించాలో చెప్పేవాడు. అందుకే అంత గొప్పవిద్య పొందిన ఆ శిష్యులు కూడా లోక హితానికే తప్ప లోక కంటకానికి, లోకుల్ని బాధించడానికి తమ విద్యలను ఎప్పుడూ ఉపయోగించలేదు. నిగ్రహం ఎక్కడి నుంచీ వచ్చిందంటే... గురువుగారు పాఠం చెప్పినప్పుడు... ‘‘ఈ విద్య లోక క్షేమానికి తప్ప నీ స్వార్థానికి వినియోగించుకోకుండా ఉండాలనే మాట నుంచి వచ్చింది’’ వ్యాఘ్రేశ్వరుడుగారు పోలియో ఆపరేషన్లు మాతమే నేర్పి చేతిలో చెయ్యి వేయించుకుని ఉండకపోతే ఆ ఆపరేషన్లు చేసిన డాక్టర్‌గారు కోట్లకు పడగలెత్తేవారేమో కానీ ఇలా ప్రపంచం గుర్తించుకోదగ్గ వ్యక్తిగా మాత్రం ఆయన అయి ఉండేవారు కాదు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కవ్వింత: ఆరోగ్యం
భార్య: ఇక్కడ స్నానాల సబ్బుండాలి ఏమైందండీ? భర్త: ఆ.. ఆరోగ్యానికి మంచిదని టీవీలో చెబితే తినేశా!! మళ్లీ అదే మాట! భర్త: ఈ ఇంట్లో నా బతుకు కుక్క కన్నా హీనంగా ఉంది. భార్య: నువ్వెందుకలా ఫీలవుతున్నావో నాకర్థం కావడం లేదు. భర్త: నువ్వు నన్నలా ట్రీట్ చేస్తున్నావు, మన ఇంటికి వచ్చిన ఎవరినైనా అడుగు. భార్య: ఊరికే ఎందుకలా మొరుగుతారు!? కాసేపు ఊరికే ఉండలేరా? లేట్ న్యూస్! భర్త: నాకస్సలు బుద్ధిలేదు. దేవత లాంటి ఆ అమ్మాయికి విడాకులిచ్చి అనవసరంగా నిన్ను కట్టుకున్నాను భార్య: దేవత లాంటి అమ్మాయిని ఎలా వదిలేశారు మరి? భర్త: నువ్వొచ్చాకే కదా నాకా విషయం అర్థమైంది. తుంటరి పిల్లాడు తండ్రి: మా వాణ్ణి ఎందుకు కొట్టారు టీచర్? టీచరు: మీకు తెలిసిన కళల పేర్లు రాయమంటే మీ వాడు ఏం రాశాడో తెలుసా? తండ్రి: కరెక్టుగా రాశానని చెప్పాడే! టీచరు: అవును, శశికళ, చంద్రకళ, సూర్యకళ, కళాజ్యోతి... రెండు జతలు రవి: అదేంట్రా నీ చెప్పుల జత ఒక్కోటీ ఒకోలా ఉంది? పప్పు: మా ఇంట్లో ఇలాంటి జత ఇంకోటి ఉంది తెలుసా? తత్వం శిష్యుడు: పెళ్లి వలన లాభమేంటి? గురువు: ప్రాణం మీద భయం, తీపి పోవడానికి అంతకంటే ఉత్తమ మార్గం లేదు.