యువరాజు కోసం పాక్ ఆరాటం
కాంగ్రెస్ పతనం చూసి ఏడుస్తోంది
ఇండియాలో బలహీన, అవినీతి ప్రభుత్వం రావాలన్నదే వారి కోరిక
బలమైన మోదీ ప్రభుత్వం ఉన్నంత కాలం పాక్ ఆటలు సాగవు
గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పషీ్టకరణ
ఆనంద్: విపక్ష కాంగ్రెస్‌ను పాకిస్తాన్‌కు శిష్యరికం చేసే పార్టీగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ)ని మన దేశ తదుపరి ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందని అన్నారు. ఇండియాలో బలహీన, అవినీతి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మన శత్రువులు కోరుకుంటున్నారని ఆరోపించారు.
ఇండియాలో కాంగ్రెస్ పతనమవుతుండడం చూసి పాకిస్తాన్ నాయకులు కన్నీరు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బాగు కోసం వారు ప్రారి్థస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ముమ్మాటికీ పాకిస్తాన్‌ను అనుసరించే పారీ్టయేనని పేర్కొన్నారు. రాహుల్ గాం«దీని ప్రశంసిస్తూ పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సేన్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను మోదీ ప్రస్తావించారు. పాకిస్తాన్, కాంగ్రెస్ మధ్య అనుబంధం ఇప్పుడు పూర్తిగా బయటపడిందని చెప్పారు.
భారత్‌లో అత్యంత బలమైన మోదీ ప్రభుత్వం ఉన్నంతకాలం పాకిస్తాన్ ఆటలు సాగవని తేలి్చచెప్పారు. తాము ఎవరికీ తలవంచబోమని స్పష్టం చేశారు. తమ పాలనలో పాకిస్తాన్ ఉగ్రవాద టైర్లు పంక్చర్ అయ్యాయని అన్నారు. గతంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన దేశం ఇప్పుడు గోధుమ పిండి కూడా దిగుమతి చేసుకోలేక తిప్పలు పడుతోందని, గతంలో బాంబులు విసిరిన చేతులు నేడు భిక్షపాత్ర పట్టుకొని యాచిస్తున్నాయని పేర్కొన్నారు. గురువారం గుజరాత్‌లోని ఆనంద్, సురేంద్రనగర్, జునాగఢ్, జామ్‌నగర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కట్టబెట్టడానికి వీలుగా రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ కుట్ర పన్నిందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే...
ఓటు జిహాద్.. సిగ్గుచేటు
‘‘భారత్ గ్లోబల్ పవర్‌గా ఎదుగుతోంది. ప్రపంచదేశాలు భారత్‌ను విశ్వబంధుగా పరిగణిస్తున్నాయి. రెండు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించే సత్తా భారత్‌కు ఉంది. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి ముస్లింలకు దొడ్డిదారిన రిజర్వేషన్లు ఇవ్వబోమంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి పక్షాలు దేశ ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలి. రాజ్యాంగం ప్రతిని నెత్తిన పెట్టుకొని డ్యాన్సులు చేయడం పిచి్చపని. కాంగ్రెస్ యువరాజు ఇలాంటి పనులు మానుకోవాలి. రాజ్యాంగం కోసం ఎలా జీవించాలో, ఎలా మరణించాలో తెలుసుకోవాలంటే నా దగ్గరికి రండి.. నేరి్పస్తా.
మనం ఇప్పటిదాకా లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ గురించి విన్నాం. ఇప్పుడు విపక్ష ఇండియా కూటమి కొత్తగా ఓటు జిహాద్ అంటోంది. మతం ఆధారంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటున్నారు. ఇలాంటి పిలుపులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కించపర్చడమే. మదర్సాల్లో చదువుకున్నవారు కాదు, ఉన్నత చదువులు చదివినవారు ఓటు జిహాద్ అంటుండడం సిగ్గుచేటు. దీనిపై కాంగ్రెస్ ఎందుకు నోరుమెదపడం లేదు? ప్రతిపక్ష కూటమి ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉన్నాయి.
కాంగ్రెస్ చిమ్ముతున్న విషం..
కులం పేరిట, మతం పేరిట సమాజాన్ని ముక్కలు చేసి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ కుతంత్రాలకు పాల్పడుతోంది. బుజ్జగింపు విధానాల ద్వారా ఓటు బ్యాంక్‌ను సంఘటితం చేసుకోవాలని చూస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను ఎన్నికల అజెండాగా మార్చాలని ప్రయతి్నస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు చెందిన 27 శాతం కోటాను రాత్రికి రాత్రే లూటీ చేసింది. ముస్లింలకు కట్టబెట్టింది.
రాజ్యాంగాన్ని రాసిన ముసాయిదా కమిటీలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులెవరూ లేరు. అంబేడ్కర్ లాంటి మేధావులు రాజ్యాంగాన్ని రాశారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగాన్ని లెక్కచేయడం లేదు. కాంగ్రెస్ చిమ్ముతున్న విషం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో నాకు అర్థం కావడంలేదు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఉగ్రవాదులకు మద్దతిచ్చారు. కశీ్మర్‌లో వేర్పాటువాదుల ఎదుట సిగ్గులేకుండా మోకరిల్లారు. ఢిల్లీ బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతమైతే ఒక మేడమ్(సోనియా గాం«దీ) బాధతో కన్నీరు ఆపులేకపోయారట! మన విశ్వాసాన్ని ఎగతాళి చేయడానికి కాంగ్రెస్ నేతలు వెనుకాడడం లేదు. సందర్భం వచి్చనప్పుడులా మన విశ్వాసాన్ని కించపరుస్తున్నారు. అదే ధైర్యం ఇతర మతాల విషయంలో ఆ నాయకులకు ఉందా? స్వార్థం కోసం, ఓట్ల కోసం సమాజాన్ని విచి్ఛన్నం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదు.
‘మిషన్’ పూర్తిచేయాలన్నదే లక్ష్యం
ఈ ఎన్నికలను నా వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకొనే ఎన్నికలుగా నేను భావించడం లేదు. నా ఆకాంక్షలను 2014లోనే ప్రజలు నెరవేర్చారు. 2024 ఎన్నికల తర్వాత నా ‘మిషన్’ను పూర్తి చేయాలన్నదే లక్ష్యం. కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడం కేవలం మన దేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా అవసరం. శ్రీరాముడిని శివుడు ఓడించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపునిస్తున్నారు.
ఇదెక్కడి వైపరీత్యం? మొఘల్ రాజులు అదే ఆలోచనా ధోరణి కలిగి ఉండేవారు. అయోధ్యలో రామ మందిరాన్ని, సోమనాథ్‌లో ఆలయాన్ని మొఘల్ రాజులు కూల్చేశారు. దేవుళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టి, హిందువులను కులాల వారీగా విడదీయాలన్నదే కాంగ్రెస్ కుతంత్రం. అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని, ట్రిపుల్ తలాక్‌ను మళ్లీ తీసుకొస్తామని చెప్పే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? దుష్ట కాంగ్రెస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment