సబ్బు ఎంత పనిచేసింది? | - | Sakshi
Sakshi News home page

సబ్బు ఎంత పనిచేసింది?

Jun 23 2024 1:02 AM | Updated on Jun 23 2024 8:35 AM

-

గాయపడిన మహిళను తరలిస్తున్న స్థానికులు

కాలు పెట్టి భవనంపై నుంచి పడిన భార్య

కాపాడడానికి భర్త విఫలయత్నం

బనశంకరి: అనుకోకుండా సబ్బుపై కాలు పెట్టిన మహిళ మూడంతస్తుల భవనంపై నుంచి కిందికి పడింది. ఆమెను కాపాడడానికి భర్త ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన బెంగళూరులోని డీజే హళ్లి ప్రాంతంలో రెండురోజుల కిందట చోటుచేసుకోగా శనివారం ఆ వీడియో వైరల్‌ అయ్యింది.

ఎలా జరిగిందంటే..
వివరాలు... డీజే హళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కనకనగరలో ఓ భవనంపై రుబాయ్‌ (27) అనే మహిళ, ఆమె భర్త కలిసి బట్టలు ఉతుకుతున్నారు. ఆమె బట్టలు ఆరవేస్తూ సబ్బుపై కాలు పెట్టడంతో జారి కిందికి పడబోయింది. ఆమె భర్త చేయి పట్టుకుని రక్షించే ప్రయత్నం చేయగా సబ్బు వల్ల చేతులు జారుడుగా ఉండడంతో సాధ్యం కాలేదు. వారిద్దరి ఆర్తనాదాలు విని కింద రోడ్డుపై పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. 

ఆమె భర్త చేతుల నుంచి జారి కిందపడే సమయంలో ఓ కిటికీని పట్టుకుని కొన్ని క్షణాలు ఉండింది, కానీ మళ్లీ కిందకు పడిపోయింది. నేరుగా కింద రోడ్డుపై నిలిపిన బైక్‌ల మీద పడిపోయింది, జనం చేతులు అడ్డుపెట్టి పట్టుకునే యత్నం చేసినా ఫలితం లేదు. కాళ్లు, తలకు తీవ్ర గాయాలపాలైన మహిళను కొందరు వెంటనే సమీపంలోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement