
‘‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే మా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరి మనసుల్లో మా సినిమా నిలిచిపోతుంది. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు థ్యాంక్స్’’ అని హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) చెప్పారు.
‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్‌పై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల అవుతోంది. తెలుగులో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్ తిరుమల ముఖ్య అతిథులుగా హాజరై, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ–‘‘మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. మా డ్రాగన్ కూడా అలాంటి ఓ మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘ఇది కేవలం యూత్ మూవీ కాదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’’ అని అర్చనా కల్పాతి చెప్పారు. ‘‘ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై.రవి శంకర్. కయాదు లోహర్, నిర్మాత ఎస్‌కేఎన్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment