
చెన్నైని తెలుగు చిత్ర పరిశ్రమ ఆదుకుంటుంది
తిరుమల: తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై కేంద్రంగానే ప్రారంభమైందని, వరద విపత్తులో చిక్కుకున్న చెన్నైలోని బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ చిత్ర పరిశ్రమ ముందుకొచ్చిందని సినీనటి జయప్రద అన్నారు. గురువారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
వరద కారణంగా చెన్నైలో తీవ్రమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, తమవంతు బాధ్యతగా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చిందని అన్నారు. సాధ్యమైనంత త్వరలోనే బాధితులను ఆదుకుంటామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.