- రోడ్ షోలో ఆర్‌ఎల్‌డీ ఎంపీ, సినీనటి జయప్రద
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యం.. సామాజిక హరిత తెలంగాణ కోసం ఆర్‌ఎల్‌డీ పాటుపడుతుందని ఆ పార్టీ ఎంపీ, సినీనటి జయప్రద అన్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ వరంగల్ పశ్చిమ అభ్యర్థి దిలీప్‌కుమార్ పక్షాన శనివారం జయప్రద నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హెలికాప్టర్ ద్వారా సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో దిగిన ఆమెకు కపిలవాయి దిలీప్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న జయప్రద ముందుగా మీడియాతో మాట్లాడారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన రోడ్‌షోలో అక్కడక్కడా వాహనం పైనుంచే ప్రసంగించారు. మాధవరెడ్డి హోం మంత్రిగా ఉన్నప్పటి నుంచి దిలీప్‌కుమార్ తనకు పరిచయమని చెప్పారు. సిన్సియర్ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించిన దిలీప్‌కు ప్రజాప్రతినిధిగా అంతకంటే రెట్టింపు స్థాయిలో పనిచేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
ఆమె వెంట కపిలవాయి దిలీప్‌కుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరాదిలీప్, జిల్లా అధ్యక్షుడు సంగాల ఇర్మియా, కాకిరాల హరిప్రసాద్, చెరుకూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్ షోలో గోండు, కోయగిరిజ సంప్రదాయ వేషధారణలో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.