
సాక్షి, లక్నో: ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ, సినీతార జయప్రదను ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ నుంచి దింపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై ఆమె పోటీకి సిద్ధమవుతున్నారు. ‘ఇది నాకెంతో సంతోషకరమైన విషయం. ఈ రోజు జన్మదినం సందర్భంగా నామినేషన్ వేయబోతున్నాను. నాకు మద్దతు తెలిపిన ప్రధాని మోదీతోపాటు అభిమానులు, ప్రజలందరికీ కృతజ్ఞతల’ని జయప్రద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించిన జయప్రద తర్వాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో, ఆ పార్టీని వదిలి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అభ్యర్థిగా రామ్‌పూర్ నుంచి 2004-2009 మధ్య కాలంలో జయప్రద ఎంపీగా సేవలందించారు. 2010లో మరో ఎస్పీ నాయకుడు అమర్‌సింగ్‌తోపాటు జయప్రదను ఎస్పీ బహిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment