Rampur MP
-
కోళ్లు, మేకలు చోరీ చేశానట..
లక్నో : ప్రజల కోసం పనిచేయడమే తాను చేసిన నేరమని సీనియర్ ఎస్పీ నేత ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తనపై లేనిపోని కేసులు మోపి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు తనపై కోళ్లు, మేకలు దొంగిలించిన అభియోగాలు మోపారని ఆయన మండిపడ్డారు. రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆజం ఖాన్ కేంద్ర, యూపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ‘నాపై హత్యా యత్నం అభియోగాలు మోపారు. ఇప్పుడు కోళ్లు, మేకలు దొంగిలించిన ఆరోపణలు సైతం నాపై ఉన్నా’ యని చెప్పుకొచ్చారు. రాంపూర్ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేయడం వల్లే తాను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆజం ఖాన్ ప్రస్తుతం భూ ఆక్రమణలకు సంబంధించి క్రిమనల్ అభియోగాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సిట్ ఎదుట ఆయన ఈనెల 5న హాజరయ్యారు. ఆజం ఖాన్‌పై మొత్తం 80 కేసులు నమోదవడం గమనార్హం. కాగా ఆజం ఖాన్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది పార్లమెంట్‌కు ఎన్నికవడంతో రాంపూర్ అసెంబ్లీ స్ధానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాంపూర్ నుంచి ఆయన భార్య తజీన్ ఫాతిమాను ఎస్పీ బరిలో నిలిపింది. -
జన్మదినం నాడే నామినేషన్ వేయబోతున్నా!
సాక్షి, లక్నో: ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ, సినీతార జయప్రదను ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ నుంచి దింపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై ఆమె పోటీకి సిద్ధమవుతున్నారు. ‘ఇది నాకెంతో సంతోషకరమైన విషయం. ఈ రోజు జన్మదినం సందర్భంగా నామినేషన్ వేయబోతున్నాను. నాకు మద్దతు తెలిపిన ప్రధాని మోదీతోపాటు అభిమానులు, ప్రజలందరికీ కృతజ్ఞతల’ని జయప్రద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించిన జయప్రద తర్వాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో, ఆ పార్టీని వదిలి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అభ్యర్థిగా రామ్‌పూర్ నుంచి 2004-2009 మధ్య కాలంలో జయప్రద ఎంపీగా సేవలందించారు. 2010లో మరో ఎస్పీ నాయకుడు అమర్‌సింగ్‌తోపాటు జయప్రదను ఎస్పీ బహిష్కరించింది. -
బీజేపీలోకి జయపద్ర.. ఆజంఖాన్‌పై పోటీ?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ నటి జయప్రద బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఆమె సోమవారం బీజేపీలో చేరుతారని, యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమెను కమలం పార్టీ బరిలోకి దింపే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగిన జయప్రద.. రాంపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎస్పీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ రాంపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఒకే పార్టీలో కొనసాగిన జయప్రద-ఆజం ఖాన్ మధ్య బద్ధ వైరం నెలకొని ఉంది. తనపై యాసిడ్ దాడి చేసేందుకు ఆజంఖాన్ ప్రయత్నించాడంటూ.. ఆయనపై జయప్రద గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జయప్రద.. అనంతరం చంద్రబాబునాయుడితో విభేదించి.. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అప్పటికే బాలీవుడ్ నటిగా మంచి పేరు ఉండటంతో 2004లో ఆమెకు రాంపూర్ టికెట్‌ను ఎస్పీ కేటాయించింది. దీంతో మొదటిసారి ఎంపీగా గెలుపొందిన ఆమె.. అనంతరం ఎస్పీ అధినాయకత్వంతో విభేదించి తన సన్నిహితుడైన అమర్‌సింగ్‌తో కలిసి పార్టీని వీడారు. రాజకీయాల్లో అమర్‌సింగ్‌ను తన గాడ్‌ఫాదర్‌గా జయప్రద చెప్పుకుంటారు. వీరి సన్నిహిత్యంపై పలు విమర్శలు వచ్చినా.. ఆమె పెద్దగా పట్టించుకోరు. -
బీజేపీ ఎంపీ దారుణ వ్యాఖ్యలు
-
బీజేపీ ఎంపీ దారుణ వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ వ్యాఖ్యలు కాకరేపాయి. పుల్వామా ఎన్కౌంటర్ అంశంపై స్పందిస్తూ జవాన్లపై ఆయన చేసిన కామెంట్లు తీవ్ర విమర్శకు దారితీశాయి. సరిహద్దులో జవాన్లు శత్రువులతో పోరాడుతుంటారు. చస్తుంటారు. అందులో కొత్తేముంది. ఆర్మీలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సిందే అంటూ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా... మరి సైనికుల ప్రాణాలు కాపాడే ఆయుధం ఏదైనా శాస్త్రవేత్తల దగ్గర ఉందా? అంటూ నేపాల్ సింగ్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. కాగా, రాంపూర్(యూపీ) ఎంపీ అయిన 77 ఏళ్ల నేపాల్ సింగ్ మాటలు ఒక్కసారిగా దుమారం రేపాయి. సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అయి ఉండి ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయటం ఏంటని ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ నేతలూ విమర్శించారు. దీంతో ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తానేం జవాన్లను, అమరవీరులను అవమానించలేదని.. ఒకవేళ అలా అనిపించి ఉంటే క్షమాపణలు అని తెలియజేశారు. సైనికుల ప్రాణాలు కాపాడేలా ఓ ఆయుధం కనిపెట్టాలని తాను శాస్త్రవేత్తలను కోరానని ఆయన చెప్పుకొచ్చారు. -
రేపిస్టులను చచ్చేదాకా ఉరి తీయాలి: జయప్రద
పణజి: మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని చచ్చేదాకా ఉరి తీయాలని ప్రముఖ సినీ నటి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ జయప్రద అన్నారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గోవా వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ఉదంతంపై స్పందిస్తూ మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని చచ్చే వరకూ ఉరేయాలన్నారు. ఉత్తరప్రదేశ్ సహా ముంబై, ఢిల్లీలోనూ మహిళలకు రక్షణ లేదన్నారు. యూపీలో హింస పెరిగిందని జయప్రద ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ్‌వాది పార్టీ పాలన మహిళలు, పిల్లలకే కాదు సామాన్య ప్రజలకు కూడా రక్షణ కరువయిందన్నారు. హింస కంటే అవినీతే నయమని యూపీ ప్రజలు వాపోతున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ముజాఫర్ నగర్ హింసాత్మక ఘటనలే దీనికి నిదర్శనమని జయప్రద అన్నారు. -
రాహుల్ రాంపూర్ వచ్చినందుకు సంతోషంగా ఉంది: జయప్రద
సినీ నటి, ఎంపీ జయప్రద కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా ఉన్నాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తన నియోజకవర్గాన్ని (రాంపూర్) సందర్శించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు. ఎస్పీ నుంచి దూరమైన జయప్రద ప్రస్తుతం అమర్‌సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌మంచ్ పార్టీలో ఉన్నారు. అమర్ పార్టీ త్వరలో మరో పార్టీలో విలీనంకానున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తిరిగిరావాలని భావిస్తున్న జయప్రద గత ఏప్రిల్‌లో సోనియా గాంధీని కలిశారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడించనున్నట్టు చెప్పారు.