సినీ నటి, ఎంపీ జయప్రద కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా ఉన్నాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తన నియోజకవర్గాన్ని (రాంపూర్) సందర్శించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు.
ఎస్పీ నుంచి దూరమైన జయప్రద ప్రస్తుతం అమర్సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్మంచ్ పార్టీలో ఉన్నారు. అమర్ పార్టీ త్వరలో మరో పార్టీలో విలీనంకానున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తిరిగిరావాలని భావిస్తున్న జయప్రద గత ఏప్రిల్లో సోనియా గాంధీని కలిశారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడించనున్నట్టు చెప్పారు.
రాహుల్ రాంపూర్ వచ్చినందుకు సంతోషంగా ఉంది: జయప్రద
Published Sat, Oct 12 2013 6:15 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement
Advertisement