వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేస్తా:జయప్రద | i will contest here in next elections, says jayaprada | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేస్తా:జయప్రద

Published Sat, Apr 26 2014 4:15 PM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేస్తా:జయప్రద - Sakshi

వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేస్తా:జయప్రద

వరంగల్:ఆర్‌ఎల్డీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రముఖ నటి జయప్రద మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. తాను గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయకపోవడానికి కారణం చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఆయన నిర్లక్ష్యం వల్లే తాను ఇక్కడ నుంచి పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఈ రోజు వరంగల్ కు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో తెలంగాణ, ఏపీలలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉన్నట్లు జయప్రద తెలిపారు. రెండు ప్రాంతాల ప్రజలు తనకు రెండు కళ్లువంటి వారని ఆమె తెలిపారు.
 

ఆమె గతంలో ’సాక్షి‘కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో  బీజేపీతో టీడీపీ పొత్తు దారుణమైన అంశమని పేర్కొన్నారు.  ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్పని గతంలో చెప్పి పశ్చాత్తాప పడిన ఆయన తిరిగి పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. ఆయన పశ్చాత్తాపానికి అర్థం లేదా? టీడీపీకి ఒక విధానమంటూ లేదా? అంటూ నిలదీశారు. దేశంలో మోడీ గాలి వీస్తోందని అందరూ అంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేనే లేదు. ముఖ్యంగా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్‌లో భిన్నమైన సమీకరణాలు ఉన్నాయి. గుజరాత్ రాజకీయాలు వేరు. దేశ రాజకీయాలు వేరని జయప్రద తెలిపిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement