Actress Jayaprada Mother Mother Neelaveni Passed Away: సీనియర్‌ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం - Sakshi
Sakshi News home page

Actress Jayaprada: సీనియర్‌ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం

Feb 1 2022 8:20 PM | Updated on Feb 2 2022 10:42 AM

Actress Jayaprada Mother Mother Neelaveni Passed Away - Sakshi

సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి నీలవేణి(85) అనారోగ్యంతో ఈ రోజు(మంగళవారం) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నేడు సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న నటి జయప్రద.. తల్లి మరణవార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు జయప్రదకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా అందం, అభినయంతో తెలుగు చిత్రసీమలో స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పిన జయప్రద ‘భూమికోసం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిశారు. తన సినీ కెరీర్‌లో జయప్రద మొత్తం(తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలి, మరాఠి) 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె రాజకియాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం జయప్రద బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement