ఇక నా దృష్టంతా సినిమాలపైనే: సీనియర్‌ నటి | i will focus more on movies, says jayaprada | Sakshi
Sakshi News home page

ఇక నా దృష్టంతా సినిమాలపైనే: సీనియర్‌ నటి

Published Sat, Sep 16 2017 7:46 PM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

i will focus more on movies, says jayaprada

సాక్షి, హైదరాబాద్‌: 'ఇక నా దృష్టంతా సినిమాలపైనే.. ' సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తెలిపారు. చెన్నై ప్రసాద్ ల్యాబ్‌లో శనివారం శరభ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో జయప్రద ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా తెలుగు మీడియాతో జయప్రద మాట్లాడుతూ కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. రాజకీయాల్లో ఉండటం వల్ల సినీ దర్శకులు మంచి కథలతో తన వద్దకు రాలేకపోయారని చెప్పారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాలుగు చిత్రాలతో నటిస్తూ బిజీగా ఉన్నానని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement