నాగార్జున, జయప్రద
‘సోగ్గాడే చిన్ని నాయనా’లో బంగార్రాజుగా మంచి జోష్ ఉన్న పాత్రలో నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇది తండ్రి పాత్ర. ఇందులో తనయుడి పాత్రనూ ఆయనే చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సోగ్గాడే...’కి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందనుంది. మొదటి భాగంలో కనిపించినట్లుగానే ఇందులోనూ పలువురు కలర్‌ఫుల్ తారలు కనిపిస్తారట. వాళ్లల్లో జయప్రద ఒకరనే ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో ఉన్న ఒక కీలక పాత్రకు జయప్రదను సంప్రదించారట చిత్రదర్శకుడు కల్యాణ్‌కృష్ణ. మరి.. బంగార్రాజుకు స్నేహితురాలిగా జయప్రద కనిపిస్తారా? లేక వేరే ఏదైనా పాత్రా అనేది తెలియాల్సి ఉంది. జయప్రద ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, డేట్స్ కూడా కేటాయించారని టాక్. ‘సోగ్గాడే..’లో నాగ్‌కి జోడీగా నటించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలోనూ ఆ పాత్రను చేస్తారని తెలిసింది. నాగచైతన్య కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. షూటింగ్ ఆరంభించడమే ఆలస్యం అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment