
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ 25వ సినిమా కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ తల్లిగా సీనియర్ స్టార్ హీరోయిన్ జయప్రద నటిస్తున్నారు. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా యువ కథానాయకుడు అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment