సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో చేరిన సినీ నటి జయప్రదను ఊహించినట్టే యూపీలోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ బరిలో నిలిపింది. యూపీ, పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులతో కూడిన తాజా జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కాన్పూర్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీని తప్పించి కేంద్ర మంత్రి సత్యదేవ్ పచౌరీకి చోటు కల్పించారు.
ఇక కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు గతంలో వరుసగా ఫిలిబిత్, సుల్తాన్‌పూర్‌ల నుంచి పోటీ చేయగా వారి స్ధానాలను పరస్పరం మార్పు చేశారు. యూపీ మంత్రి రీటా బహుగుణ జోషికి అలహాబాద్ స్ధానం నుంచి పోటీకి నిలిపారు. 2014లో ఇక్కడి నుంచి గెలుపొందిన శ్యామ చరణ్ గుప్తా సమాజ్‌వాదీ పార్టీలో చేరడంతో జోషీ వైపు బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గుచూపింది.
Comments
Please login to add a commentAdd a comment