
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ రీయూనియన్ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో అలనాటి తారలతో కలిసి చిరంజీవి ఫూల్‌గా ఎంజాయ్ చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగారు కోడిపెట్ట సాంగ్‌కు ఆయన ఖుష్భూతో డ్యాన్స్ చేశారు. మధ్యలో జయప్రద కూడా చిరుతో జత కలిశారు.
కాగా, 1980లలో నటించిన స్టార్స్ ప్రతీ ఏడాది సరదాగా కలసి రీయూనియన్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రీయూనియన్‌ను చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో జరిగింది. ఈ వేడుకకు 40మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన నటీనటులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment