Dalip tahil
-
Dalip Tahil Rare Pics: బాలీవుడ్ ప్రముఖ నటుడు దలీప్ తాహిల్ పుట్టినరోజు సందర్భంగా రేర్ (ఫోటోలు)
-
స్టార్ నటుడు చెంప చెళ్లుమనిపించిన జయప్రద? క్లారిటీ ఇచ్చిన దలీప్ తాహిల్
నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. ఇదిలా ఉంటే ఆమె స్టార్ నటుడు దలీప్ తాహిల్ చెంప చెళ్లుమనిపించిందంటూ తరచూ బాలీవుడ్లో వార్తల చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా నటుడు దలీప్ తాహిల్ స్పందించాడు. ఈ సందర్భంగా జయప్రద తనని కొట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చాడు. 1986లో అమితాబ్ బచ్చన్-జయప్రద జంటగా ‘ఆఖ్రే రాస్తా’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో దలిప్ తాహిర్ విలన్‌గా చేశాడని, ఇందులో ఆయన జయప్రదను అత్యాచారం చేసే ఓ సన్నివేశం ఉందట. ఈ సీన్ షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో జయప్రద ఆయనను చెంప దెబ్బ కొట్టినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ‘‘జయప్రదతో కలిసి ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించానని, ఆ సీన్ షూటింగ్ సమయంలో ఆమె నన్ను కొట్టినట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను నేను కూడా విన్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు అందులో ఉంది. అసలు నేను జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అంటూ దలీప్ తాహిల్ అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
స్నూకర్ కోచ్
సంజయ్ దత్ స్నూకర్ నేర్పించడానికి రెడీ అవుతున్నారు. నేర్చుకునేది ఎవరంటే దలీప్ తాహిల్. ఈ ఆటను తెరకెక్కించేది మృదు. ‘తులసీదాస్ జూనియర్’ పేరుతో ఈ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం ఉంటుంది. తండ్రి స్నూకర్ కోచ్. కొడుకు స్నూకర్ ఆటగాడు. పలు అవార్డులు, రివార్డులు పొందిన స్పోర్ట్స్ మూవీ ‘లగాన్’కి దర్శకత్వం వహించిన ఆశుతోష్ గోవారీకర్ ఈ చిత్రానికి ఒక నిర్మాత. టీ సిరీస్‌తో కలసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో సంజయ్ దత్‌ది అతిథి పాత్ర. దలీప్ తాహిల్, వరుణ్ బుద్ధదేవ్, రాజీవ్ కపూర్ తదితరులు నటించనున్నారు. -
‘మీటూ’ పని చేస్తోంది
‘మీటూ’ ఉద్యమం కొంచెం కొంచెంగా పని చేస్తోందనిపిస్తోంది. ఈ ఉద్యమం వల్ల స్త్రీలకు వేధింపుల పట్ల అవగాహన తీసుకురావడమే కాకుండా మగవాళ్లలో కొంచెం జాగ్రత్త కూడా తీసుకువస్తున్నట్లుగా కనిపిస్తోంది. ‘మీటూ’లో వస్తున్న ఆరోపణలు చూస్తుంటే మార్పువైపే ఉద్యమం వెళ్తోంది అనిపిస్తోందని బాలీవుడ్ మాట్లాడుకుంటోంది. అందుకు ఓ ఉదాహరణ ఏంటంటే.. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో దలీప్ తహిల్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ పరంగా ఓ రేప్ సీన్‌ను చిత్రీకరించాల్సి ఉండగా ఈ సీన్లో నటించడానికి అంగీకరించలేదట దలీప్. ఒకవేళ అందులో నటించే హీరోయిన్ లిఖిత పూర్వక అగ్రిమెంట్ ఇస్తే తప్ప చేయనన్నారట. ఏ ఇబ్బంది, ఒత్తిడి లేకుండా ఈ సన్నివేశాన్ని ఇష్టానుసారమే చేస్తున్నాను అని ఆమె లిఖితపూర్వకంగా ఇచ్చాకే ఆ సన్నివేశం షూట్లో పాల్గొన్నారట దలీప్. ఆ సన్నివేశం చిత్రీకరణ జరిగిన తర్వాత కూడా సెట్లో ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా అని అడిగి మరీ తెలుసుకున్నారట ఆయన. ఇలా పని ప్రదేశాల్లో అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేసుకోగలిగితే శుభ పరిణామమే. ‘మీటూ’ వల్ల సినీ ఇండస్ట్రీలో ఉమెన్‌కు సెట్లో సురక్షిత వాతావరణం ఇంకా మెరుగుపడనుందా? అన్న విషయానికి కాలమే సమాధానం చెప్పాలి. -
అక్టోబర్ 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: అభిజిత్ ఛట్టాచార్య (గాయకుడు), దలీప్ తాహిల్ (నటుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతికి సంబంధించింది. వీరి పుట్టిన తేదీ 30. ఇది కూడా బృహస్పతికి సంబంధించిన సంఖ్యే కాబట్టి వీరిపై బృహస్పతి బలమైన ప్రభావం వల్ల ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. జన్మతః నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి, సృజనాత్మకత కలిగి మేధావిగా గుర్తింపబడతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. అయితే న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకే సులు అనుకూలించకపోవచ్చు. కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. ఆపేసిన చదువును కొనసాగిస్తారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3,5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్, శాండల్; లక్కీ డేస్: సోమ, మంగళ, గురువారాలు. సూచనలు: గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్