దలీప్ తహిల్
‘మీటూ’ ఉద్యమం కొంచెం కొంచెంగా పని చేస్తోందనిపిస్తోంది. ఈ ఉద్యమం వల్ల స్త్రీలకు వేధింపుల పట్ల అవగాహన తీసుకురావడమే కాకుండా మగవాళ్లలో కొంచెం జాగ్రత్త కూడా తీసుకువస్తున్నట్లుగా కనిపిస్తోంది. ‘మీటూ’లో వస్తున్న ఆరోపణలు చూస్తుంటే మార్పువైపే ఉద్యమం వెళ్తోంది అనిపిస్తోందని బాలీవుడ్ మాట్లాడుకుంటోంది. అందుకు ఓ ఉదాహరణ ఏంటంటే.. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో దలీప్ తహిల్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ పరంగా ఓ రేప్ సీన్‌ను చిత్రీకరించాల్సి ఉండగా ఈ సీన్‌లో నటించడానికి అంగీకరించలేదట దలీప్.
ఒకవేళ అందులో నటించే హీరోయిన్ లిఖిత పూర్వక అగ్రిమెంట్ ఇస్తే తప్ప చేయనన్నారట. ఏ ఇబ్బంది, ఒత్తిడి లేకుండా ఈ సన్నివేశాన్ని ఇష్టానుసారమే చేస్తున్నాను అని ఆమె లిఖితపూర్వకంగా ఇచ్చాకే ఆ సన్నివేశం షూట్‌లో పాల్గొన్నారట దలీప్. ఆ సన్నివేశం చిత్రీకరణ జరిగిన తర్వాత కూడా సెట్లో ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా అని అడిగి మరీ తెలుసుకున్నారట ఆయన. ఇలా పని ప్రదేశాల్లో అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేసుకోగలిగితే శుభ పరిణామమే. ‘మీటూ’ వల్ల సినీ ఇండస్ట్రీలో ఉమెన్‌కు సెట్లో సురక్షిత వాతావరణం ఇంకా మెరుగుపడనుందా? అన్న విషయానికి కాలమే సమాధానం చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment