Sudhir Mishra
-
‘మీటూ’ పని చేస్తోంది
‘మీటూ’ ఉద్యమం కొంచెం కొంచెంగా పని చేస్తోందనిపిస్తోంది. ఈ ఉద్యమం వల్ల స్త్రీలకు వేధింపుల పట్ల అవగాహన తీసుకురావడమే కాకుండా మగవాళ్లలో కొంచెం జాగ్రత్త కూడా తీసుకువస్తున్నట్లుగా కనిపిస్తోంది. ‘మీటూ’లో వస్తున్న ఆరోపణలు చూస్తుంటే మార్పువైపే ఉద్యమం వెళ్తోంది అనిపిస్తోందని బాలీవుడ్ మాట్లాడుకుంటోంది. అందుకు ఓ ఉదాహరణ ఏంటంటే.. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో దలీప్ తహిల్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ పరంగా ఓ రేప్ సీన్‌ను చిత్రీకరించాల్సి ఉండగా ఈ సీన్లో నటించడానికి అంగీకరించలేదట దలీప్. ఒకవేళ అందులో నటించే హీరోయిన్ లిఖిత పూర్వక అగ్రిమెంట్ ఇస్తే తప్ప చేయనన్నారట. ఏ ఇబ్బంది, ఒత్తిడి లేకుండా ఈ సన్నివేశాన్ని ఇష్టానుసారమే చేస్తున్నాను అని ఆమె లిఖితపూర్వకంగా ఇచ్చాకే ఆ సన్నివేశం షూట్లో పాల్గొన్నారట దలీప్. ఆ సన్నివేశం చిత్రీకరణ జరిగిన తర్వాత కూడా సెట్లో ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా అని అడిగి మరీ తెలుసుకున్నారట ఆయన. ఇలా పని ప్రదేశాల్లో అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేసుకోగలిగితే శుభ పరిణామమే. ‘మీటూ’ వల్ల సినీ ఇండస్ట్రీలో ఉమెన్‌కు సెట్లో సురక్షిత వాతావరణం ఇంకా మెరుగుపడనుందా? అన్న విషయానికి కాలమే సమాధానం చెప్పాలి. -
ఆ గాసిప్స్ నమ్మొద్దు...
‘‘ఉన్నదాంట్లో సంతృప్తి పడటం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. ‘అత్యాశ’ అనే పదమే నా నిఘంటువులో లేదు. అలా అత్యాశకు లోనయ్యేవారిని చూస్తే నాకు అసహ్యం’’ అన్నారు కాజల్ అగర్వాల్. బాలీవుడ్ డెరైక్టర్ సుధీర్ మిశ్రా దర్శకత్వంలో రూపొందనున్న ‘పెహలే ఆప్ జనాబ్’ చిత్రంలో నటించడానికి ఇటీవలే పచ్చజెండా ఊపారు కాజల్. ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘‘నా పారితోషికం గురించి రకరకాల గాసిప్పులు మీడియాలో వినిపిస్త్తున్నాయి. వాటిని అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే...నా కష్టానికి మించి పారితోషికం నేను తీసుకోను. పనిని బట్టే నా పారితోషికం. ఒక్కోసారి గ్లామర్‌కే పరిమితమయ్యే పాత్ర చేయాల్సి వస్తుంది. అవి చేసేటప్పుడు స్ట్రగుల్ ఉండదు. వాటికి కూడా కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలొస్తుంటాయి. అది నిజం కాదు. నేను అత్యాశకు పోను’’ అని కాజల్ చెప్పారు. ఆమె ఇంకా చెబుతూ ‘‘సౌకర్యవంతమైన సినిమాలే చేయడం నాకు మొదట్నుంచీ అలవాటు. ఏదో పెద్ద సంస్థ సినిమా తీసేస్తోందనీ, పెద్ద హీరో నటిస్తున్నాడనీ సినిమాలకు సైన్ చేయను. ముందు చేసే సినిమా సౌకర్యంగా ఉండాలి. అప్పుడే ‘ఓకే’ చేస్తా’’ అని పేర్కొన్నారు కాజల్. సుధీర్ మిశ్రా సినిమా గురించి చెబుతూ -‘‘జీవితాన్ని సాఫీగా సాగిస్తున్న ఓ అమాయకురాలి జీవితంలోకి అనూహ్యమైన పరిణామాలు వచ్చి చేరతాయి. తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో బాలీవుడ్ తెరపై కనిపించబోతున్నా. దర్శకుడు సుధీర్ మిశ్రా అద్భుతమైన ప్రతిభాశాలి. ఆయన ఈ కథ నా ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే... నటిగా నన్ను నేను నిరూపించుకునే అరుదైన అవకాశం ఇది. ఇందులోని నా పాత్రలో అంతర్లీనంగా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి’’ అని తెలిపారు. -
‘ఔర్ దేవదాస్’ తెరకెక్కిస్తున్న సుధీర్ మిశ్రా
బాలీవుడ్ దర్శకుడు సుధీర్ మిశ్రా త్వరలోనే ‘ఔర్ దేవదాస్’ పేరిట తన తాజా చిత్రాన్ని రూపొందించనున్నారు. రాహుల్ భట్, రిచా ఛద్దా, విపిన్ శర్మ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రియాంకా చోప్రాతో ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ రీమేక్ చేయనున్నట్లు ప్రకటించిన సుధీర్ మిశ్రా ఆ ప్రాజెక్టు నుంచి విరమించుకున్నట్లేనని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’, ‘దేవదాస్’ వంటి పాత సినిమాలతో పాటు విలియమ్ షేక్స్పియర్ నాటకం ‘హామ్లెట్’ కథాంశాలను కలగలిపి సుధీర్ మిశ్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. -
చిత్రమైన నిశ్శబ్ద లఘు చిత్రం!
ఆ మధ్య కమల్‌హాసన్‌తో కలసి తమిళంలో ‘ఉన్నై పోల్ ఒరువన్’, తెలుగులో ‘ఈనాడు’ చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు చక్రి తోలేటి గుర్తున్నాడా? హిందీ హిట్ ‘ఎ వెడ్నెస్ డే’ను అలా రెండు భాషల్లో రీమేక్ చేసిన చక్రి చిన్నప్పుడు ‘సాగర సంగమం’ చిత్రంలో ఓ బుజ్జి కెమేరా పట్టుకొని, ‘‘భంగిమ’’ అంటూ తిరిగిన బాల నటుడు. పెద్దయ్యాక, దర్శకుడయ్యాడు. తాజాగా చక్రి ‘అన్‌రీడ్’ అనే మాటలు లేని ఓ సెలైంట్ లఘు చిత్రం రూపొందించాడు. దీన్ని బ్లాక్ అండ్ వైట్‌లో, కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండే కెమేరాతో చిత్రీకరించారు. వీధుల్లో తిరుగుతూ, తిండి కోసం కష్టపడే ఓ అబ్బాయికి ఓ రోజు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలే ఈ చిత్రం. పాతకాలం పద్ధతుల్లో లాగా కెమేరా కదలకుండా స్థిరంగా ఉంటే, నటీనటులే ఫ్రేములోకి వస్తూ వెళుతూ ఉండేలా చిత్రీకరణ జరపడం కొత్త అనుభవమని చక్రి అన్నారు. మనసుకు హత్తుకుపోయే కథతో లఘు చిత్రాలు తీయమంటూ సీగ్రామ్స్ సంస్థ ప్రసిద్ధ దర్శకులు అనురాగ్ కాశ్యప్, సుధీర్ మిశ్రా లాంటి వారితో పాటు చక్రిని కోరింది. అందులో భాగంగా చక్రి ఈ చిత్రం తీశారు. దీని చిత్రీకరణ కోసం మామూలు సినీ కళాకారులను కాకుండా, బస్తీలలోని వ్యక్తులను చక్రి ఎంచుకున్నారు. మూకీ చిత్రాల రోజుల్లో లాగా ఇందులోనూ సన్నివేశాల మధ్యలో సంభాషణల టైటిల్ కార్డులు వస్తూ, అప్పటి చిత్రాలను గుర్తుకు తెస్తుంటాయి. ‘బాక్సాఫీస్ లెక్కల ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా చిత్రీకరించే సౌకర్యం లఘు చిత్రాలకు ఉందని, ఇది మనసు పెట్టి చేసిన ప్రయత్నం అని’ చక్రి తోలేటి అన్నారు. ‘యు’ ట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ‘అన్‌రీడ్’ లఘు చిత్రం వీక్షకుల మనసుల్ని కూడా ఆకట్టుకుంటే చక్రికి అంతకంటే ఏం కావాలి!